ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’కు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కోలం చెప్పే వ్యక్తిగా రిషబ్ శెట్టి నటన అదిరిపోయింది. బ్యాగ్రౌండ్‌లో ‘వరాహ రూపం’అనే పాట.. దానికి తగ్గట్టుగా రిషబ్ శెట్టి నృత్యం.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి.. తాజాగా భారీ ఎదురుదెబ్బ తగిలింది.
(చదవండి: రజనీకాంత్‌కి ‘కాంతార’ హీరో పాదాభివందనం.. ఇంట్రెస్టింగ్ ట్వీట్)
సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ‘వరాహ రూపం’పాటని ప్రదర్శించకూడదని కేరళలోని కోజ్‌కోడ్ జిల్లా సేషన్స్ కోర్టు ఆదేశించింది. ‘వరాహ రూపం’ అనే పాటను తమ నుంచి కాపీ కొట్టారిన తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది. అనుమతి తీసుకోకుండా పాటను తీసుకోవటం వారు కోర్టు కెక్కారు. కేసుని పరిశీలించిన కోజికోడ్ సెషన్స్ కోర్టు ‘కాంతార’ మేకర్స్‌కి ‘వరాహ రూపం’ అనే పాటను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారి అనుమతి లేకుండా థియేటర్స్‌లోనే కాకుండా యూట్యూబ్‌తో పాటు ఇతర ఏ మ్యూజిక్ యాప్స్‌లో కూడా ఈ పాటను ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. కోర్టు ఆర్డర్స్‌తో మెయిన్ ఫ్లాట్ ఫామ్స్‌లో వరాహ రూపం పాటను నిలిపి వేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment