కన్నక హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో వరాహ రూపం పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరంగదూర్‌కు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ పాటను సినిమా నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, హీరో రిషబ్ శెట్టికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాకుండా కేసు విచారణకు హాజరైనప్పుడు వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే ?
కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్‌లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అనంతరం కోర్టును ఆశ్రయించి పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత థియేటర్లలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పాటను ప్లే చేయడాన్నినిలిపివేయాలని స్థానిక న్యాయస్థానం మేకర్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాత కేరళలోని కోజికోడ్ జిల్లా న్యాయస్థానం అధికార పరిధి లేకపోవడంతో 'వరాహ రూపం' పాటపై నిషేధాన్నిఎత్తివేసింది.
Comments
Please login to add a commentAdd a comment