Vijay Kiragandur
-
వాళ్లకు డబ్బులు తిరిగిచ్చేసిన 'సలార్' నిర్మాత.. అదే కారణమా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్'.. బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ వరకు చాలామంది సందేహపడ్డారు. కానీ థియేటర్లలోక వచ్చిన తర్వాత వసూళ్ల మోత మోగించింది. అలాంటి ఈ సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాలొచ్చాయట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) 'కేజీఎఫ్' లాంట ఊరమాస్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడనేసరికి అందరూ అంచనాలు పెంచుకున్నారు. ఇందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. మంచి లాభాల్ని కూడా చూసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ 'సలార్' రైట్స్‌ని ఎక్కువ ధరకి కొనడం కొంపముంచిందట. పెట్టిన పెట్టుబడి తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో వసూలు కాలేదని, దీంతో 'సలార్' నిర్మాత విజయ్ కిరగందూర్.. సదరు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన మొత్తాన్ని తాజాగా తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగపర్వం' షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే 'సలార్' రెండో పార్ట్.. వచ్చే ఏడాది థియేటర్లలో రావడం గ్యారంటీ. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
సలార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత..!
-
కీర్తి సురేశ్ లేడీ ఒరియంటెడ్ ఫిలిం.. గ్లింప్స్ చూశారా?
వరుస విజయాలతో మంచి హుషారులో ఉంది హీరోయిన్ కీర్తి సురేశ్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అందులో ఒకటి సైరన్.. హీరో జయం రవితో జోడీ కట్టిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆమె నటించిన మరో చిత్రం రఘుతాత. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. దీన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించడం విశేషం. ఇది పిరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. సుమన్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని తాజాగా విడుదల చేసిన చిత్ర గ్లింప్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఇంతకు ముందు తోపుడు బండ్లు, రిక్షాలలో చిత్రాలను ప్రచారం చేసేవారు. ఈ చిత్ర గ్లింప్స్‌లోనూ.. తోపుడు బండిపై కీర్తి సురేశ్ పోస్టర్ అంటించి ప్రచారం చేస్తున్నట్లు చూపించారు. నటుడు ఎంఎస్.భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనందసామి, రాజేశ్ బాలకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ సంగీతాన్ని, యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాతో కీర్తి సురేశ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి! చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
Vijay Kiragandur: సలార్ అందరి అంచనాలు అందుకుంటుంది
‘‘ప్రభాస్ సూపర్ స్టార్. ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అని అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథ చెబుతున్నారు? ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారు? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి అంచనాలను ‘సలార్’ అందుకుంటుంది’’ అని నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్’ మూవీ తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ... ► ‘సలార్’ ని 2021లో ్ప్రారంభించాం. కోవిడ్ కారణంగా 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ్ప్రారంభించి, 2023 జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. ఐదు భాషల్లో(తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ) సినిమాను విడుదల చేయాలనుకోవడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పోస్ట్‌ప్రొడక్షన్‌కి కూడా సమయం పట్టింది. మా హోంబలే ఫిలింస్ తొలిసారి తెలుగులో హీరో ప్రభాస్‌గారితో పనిచేశాం. ప్రభాస్‌గారు చాలా మంచి వ్యక్తి. అందువల్లే ఈ ప్రయాణం మాకు మధురమైన అనుభూతినిచ్చింది. ► ‘సలార్: సీజ్ఫైర్’ 90 శాతం షూటింగ్‌ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిత్రీకరించాం. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడలేదు. ‘కేజీఎఫ్’తో కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్లోనూ మాకు మంచి గుర్తింపు దక్కింది. మా పై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి. అందువల్ల వాళ్లకి నచ్చేలా మంచి సినిమాలు చేయాలని ముందుకు వెళుతున్నాం. ► మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభి్ప్రాయం. అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించటం లేదు. నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రశాంత్ నీల్ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో కల్పించుకోడు. మా మధ్య మంచి అనుబంధం, అవగాహన ఉంది. ‘సలార్’ లో రెండు భాగాలుగా చేసేంత కథ ఉంది.. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం. ► నాకు కథ, డైరెక్టర్ ముఖ్యం. బడ్జెట్‌కి ఎక్కువ ్ప్రాధాన్యత ఇవ్వను. అవసరం మేరకు ఎంతైనా ఖర్చు పెడతాను. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ. ఓ వైపు ప్రభాస్‌గారు, మరోవైపు ప్రశాంత్ నీల్ గారు బిజీగా ఉండటంతో ‘సలార్’ మూవీ నుంచి గ్రాండ్ ఈవెంట్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తాం. -
రెండు సినిమాలు బరిలో ఉన్నా సలార్ రిలీజ్.. ఎందుకంటే?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్(పార్ట్ -1). ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ తేదీ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరికి ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో పది రోజుల్లోనే సినిమా రిలీజ్ కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ సలార్ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలీజ్ తేది విషయంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తతో షాకయ్యా!) సలార్ చిత్రం 2014లో వచ్చిన ఉగ్రమ్ చిత్రానికి రీమేక్ కాదని విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. ఉగ్రమ్ మాదిరిగానే ఈ చిత్రం రీమేక్ అని చాలామంది భావించారని.. అలాంటిదేం కాదని కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్.. ఉగ్రమ్‌తో పాటు కేజీఎఫ్ తెరకెక్కించాడని.. ప్రతిసారి భిన్నంగా ఏం చేయాలో అతనికి తెలుసని అన్నారు. సలార్ రీమేక్ అనే వార్తలు కేవలం రూమర్స్ అని అన్నారు. అంతే కాకుండా సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 నిర్ణయించడంపై విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందని అన్నారు. మాకు జాతకాలపై ఉన్న నమ్మకం ప్రకారమే ఆ తేదీని ఎంపిక చేశామని తెలిపారు. డంకీ, అక్వామన్ పోటీలో ఉన్నప్పటికీ.. దశాబ్దం కాలంగా తాము అనుసరిస్తున్న పద్ధతినే సలార్ విషయంలోనూ కొనసాగిస్తున్నట్లు విజయ్ కిరంగదూర్ వివరించారు. (ఇది చదవండి: పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!) సెన్సార్ పూర్తి కాగా.. ఇటీవలే సలార్ పూర్తి కాగా.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదని సెన్సార్ బోర్ట్ చెబుతోంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కాంతార వరాహ రూపం సాంగ్.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కన్నక హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో వరాహ రూపం పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరంగదూర్కు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ పాటను సినిమా నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, హీరో రిషబ్ శెట్టికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాకుండా కేసు విచారణకు హాజరైనప్పుడు వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అసలేం జరిగిందంటే ? కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అనంతరం కోర్టును ఆశ్రయించి పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత థియేటర్లలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పాటను ప్లే చేయడాన్నినిలిపివేయాలని స్థానిక న్యాయస్థానం మేకర్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాత కేరళలోని కోజికోడ్ జిల్లా న్యాయస్థానం అధికార పరిధి లేకపోవడంతో 'వరాహ రూపం' పాటపై నిషేధాన్నిఎత్తివేసింది. -
అందుకే కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాలేదు: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌కు షాట్లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ నేపథ్యంలో కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథ నేపథ్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్ కొత్త రకం కంటెంట్‌నే ఆదరిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం కూడా అదే. కాంతార, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్‌ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం’ అన్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న బాలయ్య వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! ఇక కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. ‘కాంతార సినిమా సప్టెంబర్ రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయాం. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
కేజీఎఫ్ ఫ్రాంచైజీలో యశ్ ఉండడు.. బాంబు పేల్చిన నిర్మాత!
సలాం రాకీభాయ్.. ఈ పాట వింటుంటే యశ్ రూపం కళ్లముందుకు రాకమానదు. కేజీఎఫ్ 1, 2 సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి పాన్ ఇండియా స్టార్‌గా మారాడీ కన్నడ హీరో. కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ ఫ్రాంచైజీల నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అది పూర్తైన తర్వాతే కేజీఎఫ్ 3పై దృష్టి పెట్టనున్నాడు. దాదాపు 2025లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇకపోతే కేజీఎఫ్ పార్ట్ 5 తర్వాతి సీక్వెల్లో రాకీ భాయ్ స్థానంలో యశ్‌కు బదులు మరో హీరో ఉండే అవకాశం ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో ప్రతిసారి హీరోలు మారుతూ ఉన్నట్లు ఇక్కడ కూడా వేరేవారిని తీసుకునే ఛాన్స్ ఉంది' అని పేర్కొన్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. యశ్ స్థానంలో మరొకరిని రాకీ భాయ్‌గా ఊహించుకోగలమా? యశ్‌ను రీప్లేస్ చేసే హీరో అసలు ఉన్నాడా? యశ్ లేకుండా కేజీఎఫ్ సినిమా ఆడుతుందా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించిన విజయ్ కిరంగదూర్ ఇటీవలి కాలంలో కేజీఎఫ్, కాంతార చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. రాబోయే ఐదేళ్ల కాలంలో మూడు వేల కోట్లతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించాడు. ఏడాదికి ఐదారు సినిమాలను తమ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నాడు. చదవండి: గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్.. తమ్ముడిని ముద్దాడిన శ్రీముఖి సంక్రాంతి ఫైటింగ్: వారసుడు వాయిదా