సలాం రాకీభాయ్.. ఈ పాట వింటుంటే యశ్ రూపం కళ్లముందుకు రాకమానదు. కేజీఎఫ్ 1, 2 సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి పాన్ ఇండియా స్టార్‌గా మారాడీ కన్నడ హీరో. కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ ఫ్రాంచైజీల నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అది పూర్తైన తర్వాతే కేజీఎఫ్ 3పై దృష్టి పెట్టనున్నాడు. దాదాపు 2025లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇకపోతే కేజీఎఫ్ పార్ట్ 5 తర్వాతి సీక్వెల్‌లో రాకీ భాయ్ స్థానంలో యశ్‌కు బదులు మరో హీరో ఉండే అవకాశం ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో ప్రతిసారి హీరోలు మారుతూ ఉన్నట్లు ఇక్కడ కూడా వేరేవారిని తీసుకునే ఛాన్స్ ఉంది' అని పేర్కొన్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. యశ్ స్థానంలో మరొకరిని రాకీ భాయ్‌గా ఊహించుకోగలమా? యశ్‌ను రీప్లేస్ చేసే హీరో అసలు ఉన్నాడా? యశ్ లేకుండా కేజీఎఫ్ సినిమా ఆడుతుందా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
కాగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించిన విజయ్ కిరంగదూర్ ఇటీవలి కాలంలో కేజీఎఫ్, కాంతార చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. రాబోయే ఐదేళ్ల కాలంలో మూడు వేల కోట్లతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించాడు. ఏడాదికి ఐదారు సినిమాలను తమ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నాడు.
చదవండి: గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత
బర్త్‌డే సెలబ్రేషన్స్.. తమ్ముడిని ముద్దాడిన శ్రీముఖి
సంక్రాంతి ఫైటింగ్: వారసుడు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment