KGF Movie
-
తీసిన సీన్స్ మళ్ళీ చేస్తున్న యశ్
-
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్‌లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్‌లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్‌ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్‌గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్‌లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
బుల్లితెర నటి శోభిత సూసైడ్.. కేజీఎఫ్ మూవీలో నటించిందా?
-
Archana Jois: మహాదేవి
హీరోయిన్స్ కెరీర్ తల్లి పాత్రలతో ఎండ్ అవుతుందనే అభిప్రాయం ఉంది సినీఫీల్డ్‌లో! కానీ అర్చనా జోయిస్ సినీ ప్రయాణమే తల్లి పాత్రతో మొదలైంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌కి అమ్మగా నటించి, దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. వరుస సినీ, సిరీస్ అవకాశాలతో అదరగొడుతున్న ఆమె గురించి కొన్ని వివరాలు...అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని రామనాథపురలో. నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ.. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. అర్చనకు క్రమశిక్షణతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు.చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేక నాట్యం వైపు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడింది.మామూలు డిగ్రీలో జాయిన్ అయితే బాల్యం నుంచి ప్రేమించిన నాట్యానికి దూరమవుతానేమో అని భావించి, బెంగళూరు యూనివర్సిటీ, నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది. మూడేళ్ల ఆ డిగ్రీలో పట్టా పొంది, దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చింది.బీఎఫ్ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో ఆమె పాల్గొంది. ఇచ్చిన డైలాగ్స్‌ని తడబడకుండా బ్రహ్మాండమైన ఫీల్‌తో చెప్పి, ఆ సీరియల్లో నటించే చాన్స్‌ని దక్కించుకుంది. అనుకున్నట్టుగానే అది ఆమెకు మంచిపేరే కాదు.. మరెన్నో సీరియల్స్‌లో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. అలా వరుస సీరియల్స్ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ చదివింది.సీరియల్స్ అంటే ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు. ఆ వైవిధ్యం కోసమే సమయం చిక్కినప్పుడల్లా నృత్యప్రదర్శనలిస్తూ, కవర్ సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఆ పర్ఫార్మెన్స్ చూసే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో తల్లి పాత్రను ఆఫర్ చేశాడు. అప్పటికి అర్చన వయసు 21ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ పాత్రలో అలవోకగా నటించి, మెప్పించింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’, ‘మ్యూట్’ చిత్రాలతోనూ తన ప్రతిభ చాటుకుంది. ‘మాన్షన్ 24’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అర్చన నటించిన తాజా చిత్రం ‘యుద్ధ కాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.సినిమాల్లోకి రాకముందే మా దూరపు బంధువు శ్రేయస్‌తో నాకు పెళ్లయింది. నా నాట్యం, నటనకు వైవాహిక జీవితం ఎప్పుడూ అడ్డు కాలేదు. సినిమా, సిరీస్‌ల వల్లే నాకిష్టమైన డా¯Œ ్సకు కాస్త దూరమయ్యాను. అందుకే ఇకపై నాట్యానికి, నటనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎప్పటికీ గర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను!– అర్చనా జోయిస్. -
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు)
-
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్‌ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్‌గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్‌గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
కేజీఎఫ్ 3 లోకి ఎన్టీఆర్, అజిత్.. ?
-
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
కేజీఎఫ్ భామ స్టన్నింగ్ లుక్స్.. ఆ ముక్కుపుడక అందం చూశారా? (ఫొటోలు)
-
కెజియఫ్ 3 లో అజిత్.. కోలీవుడ్ షేక్..
-
పెద్ద ప్లానే వేస్తున్న నీల్...
-
కేజీఎఫ్ హీరో సూపర్ హిట్ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్ మంచి సందేశం ఇచ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
వైఎస్సార్సీపీకే నా మద్ధతు.. 'కేజీఎఫ్' నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, నామినేషన్ల హడావుడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి వాళ్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ మద్ధతు తెలుపుతున్నారు. మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడుతున్నారు. తాజాగా 'కేజీఎఫ్' నటుడు రామచంద్రరాజు అదే చెప్పుకొచ్చారు. వైసీపీకే తన మద్ధతు అని ప్రకటించారు.(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)కన్నడ నటుడు యశ్ దగ్గర పనిచేసిన రామచంద్రరాజు.. 'కేజీఎఫ్' సినిమాలో గరుడ అనే విలన్ పాత్రతో నటుడిగా మారాడు. ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. తాజాగా ఈయన.. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా కనిపించారు. తనకు ఈయన అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. అలానే వైసీపీ పాలనపైనా తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.'నామినేషన్‌కి ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. దాదాపు 20-30 వేల మెజరిటీతో నా స్నేహితుడు ఎన్నికల్లో గెలుస్తారని అనిపిస్తుంది. జగన్ పాలన చూస్తే నాకు ముచ్చటేస్తోంది. వైసీపీకే నా మద్ధతు. విద్య, వైద్య రంగాల్లో చాలా అభివృద్ధి చేశారు. నిస్పక్షపాతంగా ప్రజాసేవ చేస్తున్నారు. దీనికి నేను హ్యాట్సాఫ్ చెబుతాను' అని నటుడు రామచంద్రరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: ఈమె స్టార్ హీరోయిన్‌కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?)Read this article in English : KGF Actor Hails CM Jagan's Rule and AP's Development -
రోడ్డు సైడ్ కిరాణా షాపులో పాన్ ఇండియా హీరో.. ఫొటోలు వైరల్
సినిమా హీరోలు బయట పెద్దగా కనిపించరు. రోడ్ సైడ్ షాప్స్‌లో అయితే వస్తువులు కొనడం, తినడం లాంటివి అస్సలు చేయరు. అలాంటిది పాన్ ఇండియా స్టార్, 'కేజీఎఫ్' హీరో యష్ హఠాత్తుగా ఓ కిరాణా దుకాణంలో ప్రత్యక్ష్యమయ్యాడు. పక్కనే అతడి భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఏం జరిగింది? 'కేజీఎఫ్' ఫేమ్ యశ్.. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఉత్తర కర్ణాటక జిల్లా భత్కల్‌లోని షిరాలీకి వెళ్లారు. అక్కడే చిత్రపుర మఠాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్య రాధిక.. ఐస్ క్యాండీ అడగడంతో దగ్గర్లోనే చిన్న దుకాణానికి వెళ్లారు. ఐస్ క్యాండీతో పాటు కొన్ని చాక్లెట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. యష్ కేరింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా భార్య కోసం ఐస్ క్యాండీ కొనడం చూసి మురిసిపోతున్నారు. ఇకపోతే 'కేజీఎఫ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'ట్యాక్సిక్'లో హీరోగా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?) -
అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు
రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అభిమానులకు సినిమా అందించాలని ఆయన కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యశ్ తనతో పాటు ఉన్న వారిని మాత్రం మరిచిపోలేదని చెప్పవచ్చు. యశ్‌కు దగ్గరైన వ్యక్తుల కుటుంబాల్లో ఏదైన వేడుక జరిగితే ఆయన ఖచ్చింతంగా హాజరవుతారు. ఒక్కోసారి తన సతీమణితో కలిసే వెళ్తారు కూడా.. తాజాగా 'టాక్సిక్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యశ్.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటికి తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. యశ్ దగ్గర చేతన్ అనే వ్యక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా యశ్ సినిమా కెరియర్ నుంచి అతను ఉన్నాడని చెప్పవచ్చు. చేతన్ 2021లో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో కూడా యష్, ఆయన సతీమణి రాధిక పండిట్లు చేతన్ పెళ్లి వేడుక జరిపించిన విషయం తెలిసిందే. (చేతన్ వివాహ సమయంలో.. యశ్, రాధిక పండిట్) చేతన్ దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించాడు. షూటింగ్ పనిలో బిజీగా ఉన్న యశ్ ఈ శుభ సమయంలో చేతన్ ఇంటికి చేరుకున్నాడు. వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దీంతో చేతన్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఆయన సింప్లిసిటీని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Ram Mandir: కేజీఎఫ్ టు అయోధ్య
కెజీఎఫ్: కోలారు జిల్లాలోని కేజీఎఫ్ పట్టణం బంగారు గనులకు, హిట్ సినిమా కథలకే కాదు, మరికొన్ని ఘనతలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎన్ఐఆర్ఎం సంస్థనే అయోధ్యలోని ప్రఖ్యాత రామమందిరం నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్లు, శిలల నాణ్యతను పరిశీలించి విలువైన సూచనలు అందజేసింది. అయోధ్య ఆలయ శిలల నాణ్యతను తనిఖీ చేసే బాధ్యతను నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా కేజీఎఫ్ సిగలో మరో కలికితురాయి చేరింది. 2021లో తనిఖీ బాధ్యతలు రామమందిరం ఎలాంటి లోహాలను, సిమెంటు వంటివి ఉపయోగించకుండా రాతితో నిర్మిస్తుండడం విశేషం. భూకంపాలు, ఉరుములు, మెరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా నిర్మాణం సాగుతోంది. ఇంత పెద్ద ఆలయ నిర్మాణానికి రాళ్లు చాలా ముఖ్యం. వాటి నాణ్యత కూడా బాగుండాలి. దశాబ్దాల తరబడి మన్నిక ఉండాలంటే శాసీ్త్రయంగా పరిశోధించి మంచి రాళ్లను ఎంపిక చేయాలి. అందుకోసం రామజన్మభూమి ట్రస్టు.. దేశంలోని పలు నిర్మాణ రంగ సంస్థలను సంప్రదించి చివరకు కేజీఎఫ్‌లోని ఎన్‌ఐఆర్‌ఎంకు 2021లో బాధ్యతను అప్పగించింది. మూడు రకాల రాళ్లు ఎన్ఐఆర్ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్– హెచ్ఓడి ఎ.రాజన్‌బాబు రాళ్ల పరీక్షలకు నేతృత్వం వహించారు. ఈయన స్వయంగా కేజీఎఫ్ వాస్తవ్యులే కావడం విశేషం. ఎన్ఐఆర్ఎం నిపుణులు రాయ్స్టన్ ఏంజలో విక్టర్, డి ప్రశాంత్ కుమార్‌లు, టెక్నీషియన్లు ఆర్. ప్రభు, బాబు.ఎస్‌లు ఈ బృందంలో ఉన్నారు. మందిరంలో ముఖ్యంగా మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. పునాదికి గ్రానైట్ రకం రాళ్లు, సూపర్ స్ట్రైకర్ రాళ్లను నిలువు, అడ్డు స్తంభాలుగా, డెకోరేటివ్ రాళ్లు అలంకారానికి అని రాజన్‌బాబు తెలిపారు. లక్షకు పైగా రాళ్ల పరీక్ష ► ఎన్ఐఆర్ఎం ఎలాంటి రాళ్లనైనా పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. మందిర నిర్మాణానికి వివిధ రకాల సుమారు లక్షకు పైగా రాళ్లను పరీక్షించారు. ► ఇందుకోసం కేజీఎఫ్‌లోని సంస్థలోను, అలాగే అయోధ్య ఆలయంలో నిపుణులు నిరంతరం పనిచేశారు. ► అంతిమంగా ఎంపిక చేసిన రాళ్లనే ఇంజినీర్లు నిర్మాణంలో ఉపయోగించారు. ► వేయి సంవత్సరాలు నిలిచే నాణ్యత కలిగిన రాళ్లను రామమందిర నిర్మాణానికి సిఫారసు చేయడం జరిగింది. ► ఇందులో గ్రానైట్ రాళ్లను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి సేకరించారు. ► ఈ రాళ్ల పరీక్షల కోసం సుమారు రూ. 8.24 కోట్లను ఖర్చు చేశారు. ► కర్ణాటకలోని సాదహళ్లి, దేవనహళ్లి, చిక్కబళ్లాపురం, తుమకూరు, శిర ప్రాంతాలలోని రాళ్లను పరిశీలించి కట్టడానికి ఆమోదించారు. ► తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఏపీలో ఒంగోలు ప్రాంతాలనుంచి రాళ్ల నమూనాలను కేజీఎఫ్‌కు తెప్పించుకుని వాటిని ఉపయోగించవచ్చని సిఫార్సు చేశారు మా అదృష్టం: రాజన్‌బాబు దేశం గర్వించదగిన ఆధునిక యుగంలో రామమందిర నిర్మాణం అనేది అద్భుత ఘట్టం. రాళ్లను పరీక్షించే మహత్తర కార్యంలో మేము పాల్గొనడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇది మాకు దక్కిన అదృష్టం. పరీక్షా కార్యంలో పాల్గొన్న అధికారుల నుంచి మొదలుకుని కూలి కార్మికుల వరకు అందరూ సిగరెట్, మద్యం వంటివాటికి దూరంగా ఉన్నారు. క్రమశిక్షణ, శ్రద్ధా భక్తులతో పనుల్లో పాల్గొన్నారు. -
హీరో 'యశ్' కోసం వెళ్తూ మరో యువకుడు మృతి
కన్నడ స్టార్ హీరో యశ్‌కు చెందిన మరో అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనవరి 8న ఆయన పుట్టినరోజు నాడు ఫెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.. సమాచారం తెలుసుకున్న యశ్ దిగ్భ్రాంతి చెందాడు. దీంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానం ద్వారా గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడకు నిన్న చేరుకున్నారు. (ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. ఆ కుటుంబాల బాధ్యత నాదంటూ కన్నీరు పెట్టుకున్న యశ్) గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి తమ అభిమాన హీరో యశ్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో అప్పటికే అక్కడ 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఆ సమయంలో నిఖిల్ కరూర్ (22) అనే యువకుడు యశ్‌ను చూసేందుకు స్కూటీలో అక్కడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నిఖిల్ కరూర్ అనే యువకుడు కొంత సమయం క్రితం మృతి చెందాడు. బింకడకట్టి గ్రామానికి చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జనవరి 8న సాయంత్రం గడగ్‌లోని తేజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యువకుడు పోలీసు వాహనాన్ని ఢీకొనడంతో స్కూటీ విడిభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానుల మృతితో కన్నీళ్లు పెట్టుకున్న హీరో యశ్
పాన్ ఇండియా స్టార్ యశ్ బర్త్ డే సందర్భంగా జనవరి 8న ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. వారందరి కుటుంబాలను హీరో యశ్ సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆపై వారికి ఆయన భరోసా ఇచ్చారు. షూటింగ్ కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్న యశ్ సంఘటన తెలియగానే ప్రత్యేక విమానంలో హుబ్లీకి వచ్చి ఆపై నేరుగా కారులో గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. తన పుట్టినరోజు నాడు చనిపోయిన యువకుల కుటుంబాలను చూసి ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యశ్ రాకతో అక్కడ రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి జనాన్ని అదుపు చేశారు. ఘటనా స్థలంలో ఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు సహా వంద మందికి పైగా పోలీసులు ఉన్నారు. ఆ కుటాంబాలను ఓదార్చిన అనంతరం మీడియాతో యష్ స్పందిస్తూ.. 'ఇలా జరిగే అవకాశం ఉంటుందనే నా పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారంటే నాకు చాలా బాధగా ఉంది. చేతికి వచ్చిన బిడ్డలు ఇక తిరిగిరారని తెలిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ యువకుల కుటుంబానికి ఏది అవసరమో అది నేను చేస్తాను. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారు. కానీ ఆ కుటుంబాల కోసం ఎప్పటికీ నేను అండగా ఉంటాను. వారి కుటుంబాలకు ఏది అవసరమో ఇక నుంచి నేను చేస్తాను. ఆ యువకులను తిరిగి పొందలేము కానీ ఆ కుటుంబాలకు నేను ఖచ్చితంగా కుమారుడి స్థానంలో ఉండి నా బాధ్యతను నెరవేరుస్తాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే మీ జీవితంలో సంతోషంగా ఉండండి, మా గురించి ఆలోచించకండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా.. మరోసారి ఇలాంటి పనులు చేయకండి.. ఇక నుంచైనా ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు వదిలేయండి. ఇంత ప్రమాదకరమైన ప్రేమను తెలపడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా బైక్‌లపై కొందరు యువకులు వెంబడిస్తున్నారు. ఇలాంటి మెచ్చుకోలు నాకు అక్కర్లేదు. అని యశ్ అన్నాడు. ఆ కుటుంబాలను చూసిన యశ్ కంటతడి పెట్టాడు.. కానీ వారందరికీ అండగా ఉంటానని ఆయన మాట ఇచ్చాడు. తన పుట్టినరోజు నాడు ఎలాంటి కటౌట్లు కట్టొద్దని ఆయన గతంలోనే ఫ్యాన్స్‌కు చెప్పాడు. అలాంటి పనులు జరిగే అవకాశం ఉంటుందని గతేడాది తన పుట్టినరోజు నాడే తెలిపాడు యశ్. 'రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే నివేదికల కారణంగా ఈసారి నా పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నేను షూటింగ్ పనిమీద గోవాలో ఉన్నాను. ఈ వార్త వినగానే నేను చాలా బాధపడ్డాను. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది కూడా ఈ ప్రమాదం జరిగింది. నా బర్త్ డే అంటేనే భయమేస్తోంది.' అని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సురంగి గ్రామం నుంచి జిమ్స్ ఆసుపత్రికి యశ్ వెళ్లారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య వివారులు అడిగి ఆయన తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఆయన తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం వారి వైద్య ఖర్చులు పూర్తిగా యశ్ చెల్లించినట్లు సమాచారం. వారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనను వ్యక్తిగతంగా కలవాలని యశ్ సూచించారట. ಕರೆಂಟ್ ಶಾಕ್ ನಿಂದ ಸಾವನ್ನಪ್ಪಿದ ಸುದ್ದಿ ತಿಳಿಯುತ್ತಿದ್ದಂತೆ ಶೂಟಿಂಗ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿ ನಟ ಯಶ್ ಕೂಡ ಗದಗಕ್ಕೆ ತೆರಳಿ ಸಾವನ್ನಪ್ಪಿದ ಮೂವರು ಅಭಿಮಾನಿಗಳ ಮನೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದರು.#yashfansdeath #yashfansgadag #happybirthdayyash #rockingstaryash #yash #starkannada #NammaSuperstars #aslamsuperstars pic.twitter.com/fiZsWED0xi — Namma Superstars (@nammasuperstars) January 8, 2024 -
కేజీఎఫ్ 'యశ్' పుట్టినరోజు.. ముగ్గురు యువకులు మృతి
కర్ణాటకలో ప్రముఖ హీరో యశ్‌కు చెందిన ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేడు (జనవరి 8) 38వ పుట్టినరోజును ఆయన జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఈ వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న లక్ష్మేశ్వర్ ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది సినిమాల పనుల కారణంగా విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ లేఖ రాసి అభిమానులకు తెలియజేశారు. ఈ సంఘటన గురించి యశ్ త్వరలో రియాక్ట్ కానున్నాడని తెలుస్తోంది. 'జనవరి 8.. నాపై మీకున్న ప్రేమను వ్యక్తిగతంగా చెప్పాలనుకునే రోజు.. పుట్టినరోజు మీతో గడపాలని ఉంది. కానీ సినిమా పనులు మాత్రం నన్ను బిజీగా ఉంచాయి. అనివార్యమైన ప్రయాణాల కారణంగా నేను ఈ జనవరి 8న మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మీ ప్రేమ వెలకట్టలేనిది.. నా పుట్టునరోజు నాడు నేను మీతో గడపలేకపోతున్నాననే బాధ నాలో కూడా ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను.. నేను ఎక్కడ ఉన్నా మీరందరూ నాతోనే ఉంటారు. మీ ప్రేమ, అభిమానమే నాకు పుట్టినరోజు కానుక.' అని యష్ నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేశాడు. -
రవి బస్రూర్ పేరు వెనుక కన్నీళ్లు తెప్పించే స్టోరీ
పాన్ ఇండియా రేంజ్లో రవి బస్రూర్ పేరు కేజీఎఫ్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ 'సలార్' సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమా బాలీవుడ్లో కూడా సూపర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులో రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు మాత్రమే కాదు, మాస్ సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని కూడా ఆయన అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా తమ సినిమాల కోసం రవి బస్రూర్ హంటింగ్ బీజీఎమ్ కోసం తహతహలాడుతున్నారు. ఆకలితో జీవనం.. రవి బస్రూర్ నేపథ్యం రవి బస్రూర్ తండ్రి గ్రామంలో కొలిమి నడుపుతున్నాడు. రవి కూడా తండ్రి దగ్గర కొలిమి పని చేస్తూ ఉండేవాడు. కానీ సంగీత రంగంలో ఏదైనా సాధించాలనే అచంచలమైన సంకల్పం అప్పటికే అతనిలో ఉండేది. కానీ ఆర్థిక స్థోమత అడ్డొచ్చి చాలా రోజుల పాటు తండ్రి వద్దే పని చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడిగా అయిన తర్వాత తాజాగా కన్నడ సరిగమప సీజన్ 10కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.ఆ సమయంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. సరిగమప షోలో రవి బస్రూర్ తన జీవితాన్ని మార్చేసిన సంఘటనను వివరించాడు. 'సంగీత ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. అప్పటికే మూడు నాలుగు రోజులు భోజనం చేయలేదు.. నీళ్లు తాగుతూనే గడిపేశాను... కానీ నా జేబులో ఒక లిస్ట్ ఉంది.. ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను సమయానికి వెళ్ళలేదు, నాకు ప్రసాదం లభించదు.' అని ఆ రోజు సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 'దేవుడా, నా పరిస్థితి ఏమిటి..? అని నా మదిలో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. అప్పుడు ఒక పెద్దాయన నన్ను చూశాడు. అతని పేరు కామత్. నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఒక దుకాణానికి తీసుకెళ్లి ఇతను ఇత్తడి, బంగారు వస్తువుల తయారి వంటి అన్ని పనులు చేస్తాడని యజమానికి పరిచయం చేశాడు .కానీ ఇతనికి సంగీతం అంటే పిచ్చి. ఎప్పుడూ చూడే అదే పనిలో ఉంటాడని తెలిపాడు. పనిలో పెట్టుకోమని కామత్ చెప్పడం.. వెంటనే అతను ఓకే చేయడం జరిగిపోయాయి. అతను ముందే చెప్పాడు.. నేను ఈ రేంజ్లో ఉంటానని కానీ నేను ఎలాంటి పని చేయనని చెప్పాను.. అప్పుడు అక్కడ ఉన్న యజమాని నాకు రూ. 5 ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు. అప్పుడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని చెప్పాడు. భవిష్యత్‌లో అతన్ని చూడటానికి 5 నెలలు అపాయింట్మెంట్ కావాలి. అంతలా అతని రేంజ్ పెరిగిపోతుందని చెప్పాడు. కానీ ఆయన మాటలు నాకు నమ్మకంగా లేవు.. ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. నాకు సంగీతం మాత్రమే కావాలని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి మీకు ఏమి కావాలి అని అడిగాడు, నాకు కీబోర్డ్ కావాలి, నాకు డబ్బు ఇస్తావా అని చెప్పాను, అతను ఎంత కావాలి అని అడిగాడు. నేను. 35 వేలు అన్నాను. క్షణం ఆలోచించకుండా వెంటనే ఇచ్చాడు.. ఆయనెవరో నాకు తెలియదు.. ఆ సమయంలో నేను, కామత్ ఇద్దరం షాక్ అయ్యాము. ఈ డబ్బు తిరిగివ్వకు. కీబోర్డ్ తీసుకో.ఈ 35వేలకు పని ఇస్తాను, పని చేసి చెల్లించు అని చెప్పాడు. ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు తొలగించి అతని పేరును నా ఊరు పేరుతో పాటు ఉంచాను. అలా రవి బస్రూర్ వెలుగులోకి వచ్చింది. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అతనే.. అతనికి క్రెడిట్ ఇవ్వడానికే నా పేరును మార్చుకున్నాను. నా అసలు పేరు కిరణ్.. కానీ రవి బస్రూర్ అని పిలుస్తేనే నాకు సంతోషం.' అని ఆయన చెప్పాడు. -
ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
సినిమా తీసే ప్రతివోడు డైరెక్టర్ కాదు! ఎందుకంటే ప్రేక్షకుడి పల్స్ తెలియాలి. ఎక్కడ ఏ సీన్ పడితే టాప్ లేచిపోద్దో తెలిసుండాలి. అయితే ఈ విషయంలో చాలామంది డిగ్రీలు చేస్తే.. మనోడు మాత్రం ఏకంగా పీహెచ్డీ చేసి పడేశాడు. లేకపోతే ఏంటి.. ఊరమాస్ చిత్రాలు తీయడంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇతడు సినిమా అంటే.. ఆయా హీరోల ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే మనోడి రేంజ్ అలాంటిది మరి. మూవీలో హీరోయిన్ ఉన్నాలేకపోయినా సరే బొగ్గు మాత్రం గ్యారంటీగా ఉండాలి. అలా బొగ్గుతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన వ్యక్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతకీ మనోడు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇన్ని హిట్స్ ఎలా కొడుతున్నాడు? డబ్బుల కోసం సినిమాల్లోకి ఎవరైనా సరే పిచ్చితో సినిమాల్లోకి వస్తారు. ప్రశాంత్ నీల్ మాత్రం అనుకోకుండా, అది కూడా డబ్బులు సంపాదిద్దామని డైరెక్షన్ కోర్స్ చేశాడు. ఇందులో డెప్త్ అర్థమయ్యేసరికి.. కొడితే కుంభస్థలం కొట్టాలని ఫిక్సయ్యాడు. డైరెక్టర్ అయిపోయాడు. ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తోళ్లకు ఛాన్సులంటే చాలా కష్టం. దీంతో మాస్టర్ స్కెచ్ వేసి.. అప్పటికే కన్నడలో హీరోగా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న తన బావ శ్రీమురళికి ఓ కథ వినిపించాడు. అనుభవం లేకపోవడం, స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోయేసరికి.. శ్రీమురళి దీన్ని లైట్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: 2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!) దీంతో ప్రశాంత్ నీల్ మనసు మారింది. శ్రీమురళిని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తూ 'ఉగ్రం' అనే మాస్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇది శ్రీమురళికి నచ్చేయడంతో సినిమా మొదలైంది. కట్ చేస్తే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 2014లో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ అంటే ఎవరబ్బా? అని అందరూ మాట్లాడుకునేలా చేసింది. దీనిదెబ్బకు మనోడికి చాలా ఛాన్సులు వచ్చినా సరే యశ్ కోసం 'కేజీఎఫ్' స్క్రిప్ట్ రెడీ చేశాడు. కోలార్ గోల్డ్ గనుల గురించి అందరూ విన్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం దానిపై ఓ సినిమా తీయాలనుకున్నాడు. అలా 'కేజీఎఫ్'కి బీజం పడింది. ఫేట్ మార్చిన 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' మూవీలో మాస్ అనే పదానికి శాంపిల్ చూపించాడు. 'కేజీఎఫ్'లో ఊరమాస్ అంటే ఏంటో డెఫినిషన్ రాసిపడేశాడు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడేవరకు ఎలివేషన్స్ ఎలా ఇవ్వొచ్చో అనే విషయంలో చాలామంది దర్శకులకు మనోడు గురువు అయిపోయాడు. సాధారణంగా మాస్ సినిమాల్లో కథకి పెద్దగా స్పేస్ ఉండదు. ఒకవేళ స్టోరీ ఉంటే ఎలివేషన్స్‌కి ప్లేస్ ఉండదు. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ప్రశాంత్ నీల్ కింగ్ అయిపోయాడు. దీని తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి గానీ 'కేజీఎఫ్'ని, ప్రశాంత్ నీల్ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు. అలానే 'కేజీఎఫ్' దెబ్బకు ప్రశాంత్ నీల్ ఫేటే మారిపోయింది. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) మందు-బొగ్గు కంపల్సరీ ప్రశాంత్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తాడబ్బా అని చాలామందికి డౌట్. అయితే మందు తాగిన తర్వాతే ఈ స్టోరీలన్నీ రాస్తుంటానని గతంలో ఓసారి ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. స్టోరీ రాయడానికి మందు ఎలా ఇంపార్టెంటో.. కథ ఏదైనా సరే బొగ్గు కూడా అంతే ఇంపార్టెంట్. 'ఉగ్రం'లో జస్ట్ శాంపిల్‌గా ఉంటే.. 'కేజీఎఫ్', 'సలార్' మొత్తం బొగ్గే కనిపిస్తుంది. అయితే తనకున్న ఓసీడీ సమస్య వల్లే ఇలా అంతా బ్లాక్ ఉంటుందని చెప్పాడు. అయితే కలర్ఫుల్గా ఉంటేనే సినిమా చూస్తారు అనే దాన్ని కూడా ప్రశాంత్ నీల్.. బొగ్గుపై తనకున్న ఇష్టంతో బ్రేక్ చేసి పడేశాడు. అలానే హీరోని చూపించాల్సిన పనిలేకుండా హీరో పిడికిలి, నీడ లాంటి వాటితోనూ ఎలివేషన్స్ ఇవ్వొచ్చనే ఆలోచన ప్రశాంత్ నీల్‌కి సాధ్యమైందని చెప్పొచ్చు. తెలుగోడు కాబట్టే? ప్రస్తుతం నార్త్-సౌత్ సినిమాల్లో తెలుగోళ్ల హవా కనిపిస్తుంది. అలానే ప్రశాంత్ నీల్ మూలాలు కూడా తెలుగు నేలపైనే ఉన్నాయి. ఉమ్మడి అనంతపురంలో మడకశిర మండలంలోని నీలకంఠాపురం ఇతడి సొంతూరు. కానీ ప్రశాంత్ నీల్ పుట్టకముందే అతడి తల్లిదండ్రులు బెంగళూరులో సెటిలైపోయారు. అలా కన్నడ వ్యక్తి అయ్యాడు. కానీ దాదాపు 25 ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాడు. ఆ ప్రభావమో ఏమో గానీ మనోడి సినిమాల్లో మాస్, ఎలివేషన్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ 'సలార్' కూడా అలాంటి మూవీనే. ఇక ప్రశాంత్ నెక్స్ట్ మూడు సినిమాలు.. ఎన్టీఆర్, ప్రభాస్, యశ్‌తోనే. ఏదేమైనా సరే ఇలా ప్రశాంత్ నీల్ మరిన్ని మాస్ సినిమాలు తీస్తూ.. ఇండియాలో థియేటర్లన్నీ ఊగిపోయేలా చేయాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) -
KGF 3, RRR 2 షాకింగ్ అప్ డేట్స్.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
యాష్ న్యూ మూవీ అప్డేట్స్
-
యష్ కొత్త చిత్రం ప్రకటన.. సాయి పల్లవికే ఛాన్స్.. డైరెక్టర్ ఎవరంటే
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు యష్.. KGF చాప్టర్ 2 విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఆయన నుంచి ఏ సినిమా గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు, కాబట్టి అభిమానులు యష్ 19 గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఈ నటుడి సినిమా కోసం దేశం మొత్తం సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో, నటుడు యష్19 గురించి ఒక అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 09:55 గంటలకు యష్ 19 టైటిల్‌ను ప్రకటించనున్నట్లు రాకింగ్ స్టార్ తెలియజేశాడు. దీని తరువాత, ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, సాంకేతిక నిపుణుల గురించి చర్చ జరుగుతోంది. దీంతో చాలా మంది నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో యష్ హీరోయిన్గా నటి సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి సాయి పల్లవిలో మంత్రముగ్ధులను చేసే డ్యాన్స్‌తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె వెనుదిరిగి చూడలేదు. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల తర్వాత ఇప్పుడు యష్‌తో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సాయి పల్లవి ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం యష్ 19కి సంతకం చేసిందని టాక్. ఆమె ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య రాబోయే చిత్రం తండేల్‌లో నటిస్తోంది. అలాగే, నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో సాయి పల్లవి, యష్ నటిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారని సమాచారం. ఈ వార్తను సాయి పల్లవి నిర్ధారించింది కానీ యష్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యష్ 19వ చిత్రం టైటిల్‌ను ఈ డిసెంబర్ 8, శుక్రవారం ఉదయం 09:55 గంటలకు విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించే అవకాశం ఉంది. గీతు మోహన్ దాస్ హిందీలో అబద్ధాల పాచికలు అనే చిత్రాన్ని 2014లో తెరకెక్కించారు. ఆ చిత్రానికి గాను రెండు జాతీయ అవార్డులు ఆమెకు దక్కాయి. సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు పొందారు. It’s time… 8th December, 9:55 AM. Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY — Yash (@TheNameIsYash) December 4, 2023 -
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్‌లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!
తెలుగు హీరో రవితేజపై 'కేజీఎఫ్' ఫేమ్ యష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ హీరోనే అలా అంటావా అని రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? రవితేజ కామెంట్స్ మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన యాక్టర్. హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ఈ దసరాకు థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం. దీంతో దేశమంతటా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో సౌత్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) యష్-'కేజీఎఫ్'పై కామెంట్స్ రామ్ చరణ్ డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే ఇష్టమని రవితేజ చెప్పాడు. కన్నడ హీరో యశ్ గురించి అడిగితే.. అతడు యాక్ట్ చేసిన 'కేజీఎఫ్' మాత్రమే చూశాను. ఆ సినిమా చేయడం అతడికి చాలా లక్కీ' అని అన్నాడు. దీన్ని తీసుకోలేకపోతున్న యష్ ఫ్యాన్స్.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 'కేజీఎఫ్' తప్పితే యష్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. రవితేజ కూడా అదే ఉద్దేశంతో ఇలా అన్నాడు. యష్ అభిమానులు మాత్రం దీన్ని అపార్థం చేసుకుని గొడవ గొడవ చేస్తున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?) -
KGF ఫ్యాన్స్ బీ రెడీ.. ఛాప్టర్-3 ఎప్పుడంటే
ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. దీంతో 2022లో రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్డేట్ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించి.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. కేజీఎఫ్- ఛాప్టర్ 2 ఎండింగ్లో పార్ట్- 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్‌క్లూజన్ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ను షేర్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) -
సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూవీ రిలీజ్ వాయిదా పడిందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకపోయినా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. సలార్‌పై తాజాగా మరో టాక్ ఊపందుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. కాగా..'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ .. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్'పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. కాగా..ఈ చిత్రంలో శృతి హాసన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సాలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #BreakingNews… PRABHAS: ‘SALAAR’ TO ARRIVE IN NOV… #Salaar is NOT arriving on 28 Sept 2023, it’s OFFICIAL now… The post-production work of this #Prabhas starrer is going on in full swing… #HombaleFilms - the producers - are bringing the film in Nov 2023… New release date… pic.twitter.com/SbOLGSobz5 — taran adarsh (@taran_adarsh) September 2, 2023 -
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్‌ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
'కేజీయఫ్'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా తర్వాత వెనుకబడిపోయింది. (ఇదీ చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శ్రీనిధి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీనిధి శెట్టి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇందులో వారి తప్పేంలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు విషయం వేరే ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో నుదుటిన పాపిట్లో సిందూరంతో బొట్టు పెట్టుకొని కనిపించడమే ఈ ప్రచారానికి బలాన్ని చేకుర్చింది. సాదారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు మాత్రమే నుదుటన పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు కాబట్టి శ్రీనిధి కూడా పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో శ్రీనిధి జన్మించింది. వారి సంప్రదాయం ప్రకారం కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారని తెలుస్తోంది. అందువల్లే శ్రీనిధి శెట్టి కూడా నుదుటన బొట్టు పెట్టుకుందని చెబుతున్నారు. కాబట్టి ఆమె పెళ్లిపై ప్రచారం చేయడం ఇంతటితోనైనా ఆపేయండని ఆమెను అభిమానించేవారు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం శాండల్‌వుడ్‌లో ఇలా టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపంతో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్‌ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రెమ్యునరేషన్ రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే అప్పట్లోనే టాక్ వినిపించేది. (ఇదీ చదవండి: అందరూ వైష్ణవినే తిడుతున్నారు: బేబీ నిర్మాత) -
'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!
'సలార్' టీజర్ అనుకున్నంతగా లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనలో చాలామందికి నచ్చలేదు. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ వాళ్లలో చాలామందికి ఓకే అనిపించింది. ప్రభాస్‌ని వేరే లెవల్లో చూపిస్తారని, ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయని వాళ్లు మెంటల్‌గా ఫిక్సయ్యారు. కానీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. అందరూ టీజర్ నచ్చలేదు, నచ్చలేదు అంటున్నారు కానీ డైరెక్టర్ని మాత్రం ఓ విషయంలో కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. కావాలనే ఇలా? 'సలార్' టీజర్ చూడగానే చాలామందికి ఇది టీజర్లా అస్సలు అనిపించలేదు. ఎందుకంటే హీరో పాత్ర, స్టోరీ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చిన వీడియోలా అనిపించింది. ఇదంతా చూస్తుంటే.. దర్శకనిర్మాతలు కావాలనే ఇలా చేశారేమో అనే డౌట్ వస్తుంది. టీజర్ లేదా ట్రైలర్ లో అన్నీ చూపించేస్తే.. థియేటర్లలోకి వచ్చినవాళ్లు భారీ అంచనాల వల్ల డిసప్పాయింట్ కావొచ్చు. అందుకే టీజర్ తో ఇలా అంచనాలు తగ్గించి, బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి సర్ప్రైజులు ఇవ్వాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) బొగ్గు.. సూపర్‌హిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడే సినిమాలు తీశాడు. అన్నింట్లోనూ యాక్షన్ మాత్రమే నమ్ముకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకులు.. గ్రాఫిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ, అవి-ఇవి అని తెగ హంగామా చేస్తున్నారు. తీరాచూస్తే తుస్సుమనిపిస్తున్నారు. 'ఆదిపురుష్' విషయంలోనూ ఇలానే జరిగింది. వీళ్లందరితో పోలిస్తే ప్రశాంత్ నీల్ మాత్రం.. ఎంచక్కా అందరికీ తెలిసిన కథ, ఎలివేషన్స్ ఇవ్వడానికి ఓ తాత.. హీరో బాడీ మొత్తం బొగ్గు పూసి.. సింపుల్‌గా హిట్స్ కొడుతున్నాడు. కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. 'సలార్'తో ఇది మరోసారి జరగొచ్చు! 'కేజీఎఫ్' రెండు పార్ట్స్ లోనూ గ్రాఫిక్స్ తక్కువే ఉంటుంది కానీ యాక్షన్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. ఇప్పుడు 'సలార్' సినిమా విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సేమ్ ఫార్ములా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడన్ని అంచనాలున్నాయి. టీజర్ లో అంటే ప్రభాస్ ని దాచేశారు. ట్రైలర్ అయితే దాయలేరుగా! ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి 'సలార్' వస్తుందిగా.. అప్పుడు మాట్లాడుకుందాం! (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) -
సలార్ టీజర్‌తో తేలిపోయింది.. ఇది నిజమేనని
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్' టీజర్‌తో బరిలోకి దిగాడు. 'కేజీయఫ్' సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఏ రేంజ్లో అయితే చూపించాలో ఏ మాత్రం తగ్గకుండా టీజర్లో చూపించాడు. డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలకు కొంచెం కూడా తగ్గకుండా టీజర్‌ను 'ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్' పేరుతో మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఓ రకంగా ఉదయం 5: 12 నుంచి యూట్యూబ్‌లో తుఫాన్ మొదలైంది. టాలీవుడ్లో ప్రభాస్‌కు ఉండేది ఫ్యాన్స్ కాదు... డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి ఈ టీజర్‌ను వారు మినిమమ్ పదిసార్లు అయినా ఇప్పటికే చూసి ఉంటారు. ఈ టీజర్‌లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వారు గుర్తించారు. దీంతో కేజీఎఫ్‌కు సలార్ కొనసాగింపు నిజమేనని తేలిపోయింది. ఇందులో రాఖీ భాయ్ కూడా ఉంటారనేందుకు మరింత బలం కూడా చేకూరింది. (ఇదీ చదవండి; Prabhas Salaar Teaser: లయన్, చీతా, టైగర్ అంటూ వేటకొచ్చిన డైనోసార్) ఇది ప్రభాస్, యష్ మధ్య అతిపెద్ద క్రాసర్ను సూచిస్తుంది. ప్రభాస్ సలార్ టీజర్ చూసిన తర్వాత కేజీఎఫ్-2 కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని తెలుస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది నిజమేనని తెలిపేలా రెండు ఫోటోలను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తించారు. సలార్, KGF-2 కు సంబంధించిన రెండు స్క్రీన్షాట్లను తీసి వైరల్ చేస్తున్నారు. దీంతో కేజీఎఫ్‌తో సలార్‌కు కనెక్షన్ ఉందిని తేలిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఈ సీన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి టీజర్లో చాలా క్లూస్ ఇచ్చాడు ప్రశాంత్. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) వాటి ద్వారా సలార్,కేజీఎఫ్‌కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని చెప్పవచ్చు. ప్రభాస్‌తో పాటు రాఖీ భాయ్ కూడా సలార్‌లో జరిగే వార్‌లో ఉండబోతున్నట్లు ఖాయమేనని తెలుస్తోంది. వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలే.. ఒకరి సినిమా విడుదలైతేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అలాంటిది వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్లు పైగా కలెక్ట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. -
సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
'సలార్' టీజర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. టెన్షన్‌తో ఫ్యాన్స్ ఇప్పటికే మెంటలెక్కిపోతున్నారు. అది వచ్చేలోపు హైప్ తోనే పోయేలా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చింది. కానీ ఘోరంగా ఫెయిలైంది. దీంతో అభిమానుల ఆశలన్నీ 'సలార్'పైనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు ఈ మూవీకి 'కేజీఎఫ్'తో కనెక్షన్ ఉందనే టాక్ ఫుల్ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'స్పై' సినిమా ఎఫెక్ట్.. సారీ చెప్పిన హీరో నిఖిల్) 'కేజీఎఫ్' రెండు పార్డ్స్తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చేస్తున్న మూవీ 'సలార్'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటిదైతే కోరుకుంటున్నారో సరిగ్గా అలానే ఉండబోతుంది. అయితే సలార్ టీజర్ ని జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామనడంపై ఫ్యాన్స్ రకరకాల థియరీలు అల్లేసుకున్నారు. 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో రాకీభాయ్ పై సరిగ్గా ఉదయం 5:12 గంటల సమయంలోనే ఎటాక్ జరిగిందని, అందుకే 'సలార్' టీజర్ ని అదే టైమ్‌కి రిలీజ్ చేస్తున్నారని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయం నిర్మాత కార్తీక్ గౌడ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. 'ఇదంతా చూస్తుంటే మా అందరి ముఖంపై స్మైల్ వస్తోంది' అని రీట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే సలార్-కేజీఎఫ్ కనెక్షన్ నిజమేనని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో? This got a smile on all our faces :) https://t.co/GqyqvS8yRg — Karthik Gowda (@Karthik1423) July 3, 2023 (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన 'ధూమమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) 'కేజీఎఫ్, కాంతార,సలార్' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్‌ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!) 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. -
తలైవా తో కేజీఎఫ్ రాకి భాయ్ అదిరిపోయే కాంబినేషన్
-
కేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..
-
గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు
టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ రీసెంట్గా వచ్చిన 'రామబాణం' గురితప్పింది. దీంతో చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు ఆయన ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రొటీన్ కథలతో వస్తున్నడంతో ఆయనకు ఏదీ సెట్ కాలేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు(జూన్ 12) తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేసి, పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. పోస్టర్లో పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నాడు. పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: Jr NTR: ఒక్క యాడ్ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!) 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్ట్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. #BHIMAA pic.twitter.com/a4R9gQb6mK — Gopichand (@YoursGopichand) June 12, 2023 (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
రష్యా లో పఠాన్ సినిమాకి పెద్ద మిస్టరీ ఉంది అట
-
జపాన్ లో కేజీయఫ్ సిరీస్ రిలీజ్
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. కెజీఎఫ్ కోటలోకి ధనుష్ ఎంట్రీ
-
కేజీయఫ్ 3 వచ్చేస్తుంది.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్
-
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్ పవర్ఫుల్ డైరెక్షన్‌తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్‌వుడ్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్‌పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
గేమ్ ఛేంజర్ అవ్వబోతున్న రాఖీ భాయ్?
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
అలా మాట్లాడటం సరైంది కాదు.. మహా కామెంట్స్‌పై నాని
ఇటీవల దర్శకుడు వెంకటేశ్ మహా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని.. అతను అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. తాజాగా దసరా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని మహా కామెంట్స్‌పై స్పందించారు. నాని మాట్లాడుతూ.. 'ఇటీవల దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని చూశా. వెంకటేశ్ మహా మాట్లాడిన విధానం సరిగా లేదు. థియేటర్లో ఒక సినిమా చూసిన తర్వాత బయటకొచ్చి మన ఫ్రెండ్స్‌తో ఒక విధంగా చెబుతాం. కానీ అదే ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే మరోలా చెబుతాం. అక్కడ చర్చలోనూ అదే జరిగింది. అందుకే అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం'. అని అన్నారు. కాగా.. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్ మహా ఓ డిబేట్లో పాల్గొన్నారు. కేజీఎఫ్‌ను ఉద్దేశించి వెంకటేశ్ మహా మాట్లాడుతూ..'తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. -
ఆ విషయంలో క్షమించండి.. కానీ నా మాటలను వెనక్కి తీసుకోను: వెంకటేశ్ మహా
‘కేరాఫ్ కంచెరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా కేజీయఫ్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. సినిమా పేరు చెప్పకుండా స్టోరీ చెబుతూ సెటైర్లు వేశాడు. దీంతో అతడిపై కామెంట్స్‌పై కేజీయఫ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెంకటేశ్ మహాకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న తీవ్ర నెగిటివిటీ, ట్రోల్స్‌కి వెంకటేశ్ మహా స్పందించాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? క్షమాపణలకు బదులుగా తన కామెంట్స్‌ని సమర్థించుకోవడం గమనార్హం. తన అభిప్రాయం సరైనదే అని అయితే తాను వాడిన భాష కరెక్ట్ కాదన్నాడు. ఇంతకీ వెంకటేశ్ మహా ఈ వీడియో ఏం చెప్పాడంటే.. ‘‘కొంతమందిని ఉద్దేశించే నా అభిప్రాయం చెప్పాను. నాలాగే చాలామంది ఆ సినిమా నచ్చలేదు. నా అభిప్రాయం నచ్చినవాళ్లు ‘మీరు చెప్పింది కరెక్ట్ సార్’ అంటూ నాకు మెసెజ్‌లు పెట్టారు. కాబట్టి వారందరి తరపున నా వాయిస్ వినిపించాను. అయితే ఈ క్రమంలో నేను వాడిన పద భాష కరెక్ట్ కాదు. దానికి నా క్షమాపణలు. కానీ, నేను సినిమాలోని కల్పిత పాత్రను మాత్రమే విమర్శించాను. రియల్ పర్సన్ కాదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ట్రెండింగ్‌లో అల్లు అర్జున్-స్నేహల ఫొటో! స్పెషల్ ఏంటంటే.. అనంతరం మాట్లాడుతూ.. ‘తాను దూషించింది కేవలం ఓ కల్పిత పాత్ర మాత్రమే. కానీ రియల్ పర్సన్ అయినా నన్ను దూషించడం ఎంతవరకు కెరెక్ట్. నాపై తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ అసభ్యంగా దూషిస్తున్నారు. ఇదేం నాకు కొత్త కాదు. చాలా సార్లు ఇలాంటివి ఎదుర్కొన్నాను. అయితే మీరంత అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ మరోసారి వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయలతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వారి సమక్షంలోనే ఈ మూవీ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి వారంత నవ్వడం యశ్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో నందిని రెడ్డిని కొందరు ప్రశ్నించగా ఆమె ట్విటర్ వేదికగా క్షమాపణలు కోరారు. pic.twitter.com/SzJ5mt07ml — Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023 -
కేజీఎఫ్.. వాడంత పిచ్చోడు ఉంటాడా?.. దర్శకుడి తీవ్ర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు బాక్సాఫీస్‌ను గడగడలాడించాయి. కేవలం కన్నడలోనే కాకుండా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా ఓ టాలీవుడ్ దర్శకుడికి అస్సలు నచ్చలేదు. దీంతో సదరు సినిమాపై ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా విమర్శలు గుప్పించాడు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా. కేజీఎఫ్ సినిమా పేరు ప్రస్తావించకుండా కేవలం కథ గురించి చెప్తూ సెటైర్లు వేశాడు. 'ఇప్పుడేవైతే వంద కోట్లు, వెయ్యి కోట్లు, లక్ష కోట్లు సంపాదిస్తున్నాయో అవన్నీ పాప్‌కార్న్ ఫిలింస్. పాప్‌కార్న్ తింటూ సినిమా చూడొచ్చు. ఏదైనా సీన్ మిస్సైనా ఏం పర్లేదు అన్నట్లుగా ఉంటుంది. ఆ సినిమాలు ఓటీటీలో చూడాల్సినవి. మేము తీసినవి అలాంటివి కావు. ఒక సినిమా పేరు చెప్పను కానీ వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఒక తల్లి.. కొడుకుని నువ్వెప్పటికైనా గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. అంటే బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడు అని! తల్లి ఓ పెద్ద వస్తువు కావాలంటుంది. ఈ హీరో వెళ్లి దాన్ని తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. వాడు ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే తనను కలవాలనుంది. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఈయన వ్యాఖ్యలు యశ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. పాన్ ఇండియా లెవల్లో హిట్టయిన సినిమా గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడేంటని మండిపడుతున్నారు అభిమానులు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా మాటలకు పడీపడీ నవ్విన డైరెక్టర్ నందినీరెడ్డి సోషల్ మీడియాలో ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు కోరింది. Every commercial film which has become a success is bec the audience hs loved something in tht effort . The conversation was nvr meant 2deride anyones work but rathr hv a positive debate on what cn diversify the narrative of “commercial cinema”. Apologies fr any offence caused 🙏🏼— Nandini Reddy (@nandureddy4u) March 6, 2023 -
ముందుంది ఎన్నికల సమరం.. బీజేపీలోకి కేజీఎఫ్ నటుడు!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యేగా, పరిషత్ సభ్యుడిగా పనిచేసిన అనంత్ నాగ్, జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అనంత్ నాగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు బీజేపీ మంత్రులు మునిరత్న, డాక్టర్ కే సుధాకర్‌లు అనంత్‌నాగ్‌ను ఒప్పించినట్లు సమాచారం. మరో వైపు రానున్న కర్టాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర నేతలు కర్ణాటకలో భారీగా ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళూరు, ఉడిపి, చక్కమగళూరు హాసన్ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొన్నారు. ప్రధాని కూడా త్వరలో షిమోగాలో పర్యటించి మహా సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. కర్టాటకలో మరో సారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి అతిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.. ఇదేమైనా ఇంగ్లాండా? సీఎం నితీష్ ఆగ్రహం -
కేజీయఫ్ స్ఫూర్తితోనే ఉపేంద్ర ‘కబ్జా’
నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. సుదీప్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహానంతరం నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత చంద్రు, నటి శ్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమని చెప్పారు. కేజీఎఫ్ చిత్రం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ చిత్ర స్ఫూర్తితోనే కబ్జా చిత్ర కథను తయారు చేసినట్లు చెప్పారు. తను ఇంతకుముందు 11 చిత్రాలు రూపొందించానని ఇది తనకు 12వ చిత్రం అని చెప్పారు. నటుడు ఉపేంద్ర అంటే అభిమానమని, ఆయన చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా సుదీప్ పాత్ర చిన్నదైనా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నటి శ్రియ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తమిళనాడు చాలా నచ్చిందని.. చెన్నై అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించడం మంచి అనుభవం అని తెలిపారు. ఆయన నటన, నిరాడంబరత, అందరితో కలిసి మెలిసి నడుచుకునే ప్రవర్తన స్పూర్తిదాయకమన్నారు. లైట్‌మ్యాన్ నుంచి అందరికీ నమస్కారం పెట్టే సంస్కారం రజనీకాంత్దే అన్నారు. అలాంటి వారితో నటించడానికి ఎవరికైనా ఇష్టమేనని తెలిపారు. తానూ మళ్లీ రజనీకాంత్‌కు జోడీగా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇప్పుడు భాష భేదం లేదని.. మంచి కథా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఈ కబ్జా చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుందని, ఇందులో నటించటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
భారీ సినిమాల లైనప్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న KGF హీరో యష్
-
సలార్‌లో కేజీఎఫ్ హీరో యశ్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ ప్లే చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రశాంత్ నీల్.. యశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. -
కేజీఎఫ్ ఫ్రాంచైజీలో యశ్ ఉండడు.. బాంబు పేల్చిన నిర్మాత!
సలాం రాకీభాయ్.. ఈ పాట వింటుంటే యశ్ రూపం కళ్లముందుకు రాకమానదు. కేజీఎఫ్ 1, 2 సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి పాన్ ఇండియా స్టార్‌గా మారాడీ కన్నడ హీరో. కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ ఫ్రాంచైజీల నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అది పూర్తైన తర్వాతే కేజీఎఫ్ 3పై దృష్టి పెట్టనున్నాడు. దాదాపు 2025లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇకపోతే కేజీఎఫ్ పార్ట్ 5 తర్వాతి సీక్వెల్లో రాకీ భాయ్ స్థానంలో యశ్‌కు బదులు మరో హీరో ఉండే అవకాశం ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో ప్రతిసారి హీరోలు మారుతూ ఉన్నట్లు ఇక్కడ కూడా వేరేవారిని తీసుకునే ఛాన్స్ ఉంది' అని పేర్కొన్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. యశ్ స్థానంలో మరొకరిని రాకీ భాయ్‌గా ఊహించుకోగలమా? యశ్‌ను రీప్లేస్ చేసే హీరో అసలు ఉన్నాడా? యశ్ లేకుండా కేజీఎఫ్ సినిమా ఆడుతుందా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించిన విజయ్ కిరంగదూర్ ఇటీవలి కాలంలో కేజీఎఫ్, కాంతార చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. రాబోయే ఐదేళ్ల కాలంలో మూడు వేల కోట్లతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించాడు. ఏడాదికి ఐదారు సినిమాలను తమ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నాడు. చదవండి: గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్.. తమ్ముడిని ముద్దాడిన శ్రీముఖి సంక్రాంతి ఫైటింగ్: వారసుడు వాయిదా -
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ కీలక ప్రకటన!
భారీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన సంస్థ హోమ్ బాలే. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి కేజీఎఫ్ పార్ట్– 1, పార్ట్–2, కాంతారా వంటి చిత్రాలు విడుదలై భారీ వసూళ్లతో సంచలన విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్లో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా హొంబాలే ఫిలింస్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ ఓ ప్రకటన చేశారు. చదవండి: వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ అలాగే రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ. 3000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది తమకు సక్సెస్‌ఫుల్‌గా గడిచిందన్నాడు. సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోందన్నారు. సినిమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను, చారిత్రిక విషయాలను చూపిస్తూ వస్తున్నామన్నారు. కాగా ఇలాంటి సినిమా రంగం కోసం తన సంస్థ రానున్న అయిదేళ్లలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యానర్లో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ చిత్రంతో పాటు పృథీరాజ్ హీరోగా టైసప్, ఫాహత్ ఫాజిల్ కథానాయకుడుగా ధూమమ్, దక్షిత శెట్టి దర్శకత్వంలో రిచర్డ్ ఆంటోనీ చిత్రాలను తెరకెక్కుతున్నాయి. On behalf of @HombaleFilms, I wish to extend my heartfelt greetings for the new year and appreciate you all for showering unwavering love and support towards us. #HappyNewYear! - @VKiragandur#HombaleFilms pic.twitter.com/h5vXMsaMWP — Hombale Films (@hombalefilms) January 2, 2023 -
కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్ డేట్.. ఆ సినిమా పూర్తయ్యాకే..!
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్ అధినేత విజయ్ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న ప్రభాస్ మూవీ 'సలార్' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్-3పై అప్డేట్ ఇచ్చారు. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్ చాప్టర్-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేజీఎఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. -
సినిమా రంగంలో భారీ పెట్టుబడి.. అన్ని భాషల్లోనూ ఎంట్రీ..!
కన్నడలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో భారతీయ వినోద పరిశ్రమలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు. అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయ్ కిరగందూర్ మామట్లాడుతూ.. 'భారత్ వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీనివల్ల ఇండియాలో వినోద పరిశ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్నాం.' అని అన్నారు. -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
కె.జి.యఫ్ హోటల్.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
కేజీఎఫ్ హీరో యశ్ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ అంటూ..!
కేజీఎఫ్ హీరో యశ్ టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. శాండల్‌వుడ్‌లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) రాధిక ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్, రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు. కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్‌తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
కేజీఎఫ్ నటుడు కన్నుమూత
కేజీఎఫ్ నటుడు కృష్ణ జి. రావు కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేజీఎఫ్ మొదటి భాగంలో విలన్లను హీరో యశ్ చితక్కొట్టే ఫైట్ సన్నివేశానికి ముందు ఈ తాత అంధుడిగా కనిపిస్తారు. ఆ సన్నివేశంతో రాఖీభాయ్ పవరేంటో అందరికీ తెలిసొస్తుంది. కేజీఎఫ్ సినిమాల్లో ఆయన నిడివి తక్కువే అయినప్పటికీ ఈ మూవీలు సూపర్ హిట్ కావడంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన్ను వెతుక్కుంటూ సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ జి రావు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, కథా రచయితగా.. ఇలా చాలా పనులు చేశారు. ఇలాంటి సమయంలో ప్రొవిజనల్ మేనేజర్ కుమార్.. కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణని కోరారు. కానీ ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండటంతో నటన తనకెందుకులే అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన కేజీఎఫ్ సినిమాకు సెలక్ట్ అయ్యారు. చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్ నన్ను చితక్కొట్టాడు, చంపేందుకు ప్రయత్నించాడు: నటి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ -
‘కేజీయఫ్’ మూవీ బ్యానర్లో నయనతార కొత్త మూవీ!
తమిళ సినిమా: వివాహానంతరం కొత్త చిత్రాలు కమిటవ్వడంలో తగ్గేదేలే అంటోంది నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేయాలంటే దక్షిణాదిలో ఈమె తరువాతే ఎవరైనా అన్నంతగా నయనతార ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు అన్ని విధాలుగా ఆలోచించే పెళ్లయిన తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయినట్లు ఉంది. వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా కొనసాగుతుందని జరిగిన ప్రచారాన్ని తలకిందులు చేసింది. వచ్చిన అవకాశాలను వదులుకునేదేలే అంటోందనిపిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె హీరోయిన్ సెంట్రింగ్ పాత్రలో నటించిన గోల్డ్, కనెక్ట్, హిందీలో షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన జువాన్ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో వరుసగా విడుదలకు సిద్ధవుతున్నాయి. తాజాగా పాన్పు, ఆటో జానీ, జయం రవి సరసన ఇరైవన్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే దర్శకుడు దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. తాజాగా నయనతార నటించిన కొత్త చిత్రం గురించి సమాచారం వెలుగు చూసింది. ఇంతకుముందు కేజీఎఫ్ పార్ట్1, పార్ట్ 2, కాంతార వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రంలో నయనతార నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా నయనతార నటిస్తుందంటే అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రమే అవుతుందని భావించవచ్చు. -
సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. (చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్ అన్నారు. ‘కేజీయఫ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్‌లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు. (చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!) -
బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!
కేజీఎఫ్ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్‌కు ప్రముఖ నిర్మాతలు యశ్‌ను సంప్రదించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్2 కోసం యశ్‌ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది. అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
మొన్న కేజీఎఫ్-2.. నేడు కేజీఎఫ్-1.. కాంతార దెబ్బకు రికార్డులన్నీ ఫట్
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కలెక్షన్లతో మోత మోగిస్తోంది. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. యశ్ నటించిన కేజీఎఫ్-1ను వెనక్కినెట్టింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది. (చదవండి: కాంతార తగ్గేదేలే.. ఆ విషయంలో కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్) అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కర్ణాటకలో పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో కేజీఎఫ్-2 రూ.1207 కోట్ల భారీ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. 2022లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కాంతార కూడా చేరింది. ఆ జాబితాలో కేజీఎఫ్- 2, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్1 , విక్రమ్, బ్రహ్మాస్త్ర -పార్ట్ 1, భూల్ భూలయ్యా -2 చిత్రాల తర్వాత ఏడో స్థానంలో కాంతార నిలిచింది. -
Kantara Movie: KGF, కాంతార మధ్య పోలిక...
-
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు
కేజీఎఫ్ చాప్టర్–1, చాప్టర్–2 చిత్రాలు కన్నడ సినీ చరిత్రను మార్చేశాయని చెప్పవచ్చు. అప్పటి వరకు లో బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన కన్నడ నిర్మాతలు కేజీఎఫ్ చిత్రం తరువాత పాన్ ఇండియాస్థాయిలో చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టారు. ఆ రెండు చిత్రాల విజయాల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం చూపింది. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ హూంబాలే ఫిలిమ్స్ అన్నది తెలిసిందే. కాగా ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా సలార్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సూరరైపోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటనను నిర్మాణ సంస్థ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందని అందులో ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల విడుదలైన వెందు తనిందదు కాడు చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శింబు ప్రస్తుతం పత్తు తల చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. అదే విధంగా దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూరరై పోట్రు చిత్ర హిందీ రీమేక్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించే భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
కేజీఎఫ్ రాకీభాయ్ స్ఫూర్తితో.. శివప్రసాద్ వరుస హత్యలు
కలకలం రేపిన సెక్యూరిటీ గార్డుల వరుస హత్యల ఉదంతాన్ని.. త్వరగతినే చేధించారు మధ్యప్రదేశ్ పోలీసులు. కన్నడ సెన్సేషనల్ చిత్రం కేజీయఫ్ స్ఫూర్తితోనే తాను హత్యలు చేశానని, రాకీ భాయ్లా పేరు సంపాదించుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిందితుడు శివ ప్రసాద్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ వరుస హత్యల ఉదంతంలో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇప్పుడు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పరిధిలో వరుసగా సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురికావడం.. సంచలనం సృష్టించింది. నిద్రిస్తున్న వాళ్లను అతికిరాతకంగా హత్య చేశాడు 19 ఏళ్ల శివ ప్రసాద్. కేజీఎఫ్ చిత్రంలో లీడ్ రోల్ రాకీ భాయ్ తరహాలో ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ హత్యలు చేసినట్లు శివ ప్రసాద్ పోలీసుల ముందు వెల్లడించాడు. ఎలా దొరికాడంటే.. నిక్కరు, షర్టులో ఉన్న హంతకుడు.. ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. మార్పుల్ రాడ్‌తో ముందుగా బాధితుడిపై వేటు వేసి.. చనిపోయాడా? లేదా? నిర్ధారించుకుని.. బతికే ఉండంతో బండ రాయితో బాది మరీ చంపడం ఆ వీడియోలో ఉంది. అయితే అంతకు ముందు చంపిన వాళ్లలో ఒకరి సెల్‌ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు నిందితుడు శివ ప్రసాద్. ఈ తరుణంలో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు శివను ట్రేస్ చేసి.. శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. రాకీభాయ్‌లా ఎదగాలనే.. కేజీఎఫ్ సినిమా స్ఫూర్తితోనే తాను ఈ హత్యలు చేశాడని, అందులో ప్రధాన పాత్ర రాకీ భాయ్లా తాను ఎదిగి.. పేరు తెచ్చుకోవాలనే హత్యలు చేశాడని, ఈ క్రమంలో పోలీసులను తర్వాతి లక్ష్యంగా చేసుకున్నట్లు శివ ప్రసాద్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తరుణ్ నాయక్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాతే పోలీసులను లక్ష్యంగా చేసుకుని తన సత్తా చూపించాలని అనుకున్నాడట. ఇదిలా ఉంటే.. భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ఏరియాలో శివ ప్రసాద్ వరుసగా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను హత్య చేసుకుంటూ పోయాడు. ఆగస్టు 28వ తేదీన సుత్తితో కళ్యాణ్ లోధీ అనే సెక్యూరిటీ గార్డును చంపాడు. ఆ మరుసటి రాత్రి శంభు నారాయణ దూబే అనే కాలేజీ సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి చంపేశాడు. ఆ మరుసటి రాత్రి ఓ ఇంటి వాచ్మెన్ అయిన మంగల్ అహిర్వర్ను చంపేశాడు. ఆపై ఒక్కరోజు గ్యాప్‌తో గురువారం రాత్రి సోను వర్మ అనే సెక్యూరిటీ గార్డును అతను కాపాలా ఉండే మార్బుల్ కంపెనీలోనే దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడం.. బాధితుల సెల్‌ఫోన్ వాడడంతో సిగ్నల్ ఆధారంగా మరుసటి రోజు ఉదయమే భోపాల్‌లో దొరికిపోయాడు శివ ప్రసాద్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk — Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022 గతంలోనూ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను శివ ప్రసాద్ హత్య చేసినట్లు తేలింది. ఈ మే నెలలో ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డును దారుణంగా చంపేసి.. అతని ముఖంపై ఓ బూట్‌ను ఉంచేసి వెళ్లిపోయాడు. అనంతరం జూన్ చివరి వారంలోనూ ఓ హత్య చేశాడు. అప్పటి నుంచి ‘స్టోన్ మ్యాన్’ భయం మొదలైంది. తాజాగా వరుస హత్యల నేపథ్యంలో హోం మంత్రి నరోత్తం మిశ్రా స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసును త్వరగతిన చేధించగలిగారు పోలీసులు. అతని దగ్గర దొరికిన ఆధార్‌కార్డ్ వివరాల ప్రకారం..శివ ప్రసాద్ స్వస్థలం సాగర్ జిల్లా కేస్లీ. తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదు. కాకపోతే ఎనిమిదో తరగతి దాకా చదువుకుని.. గోవాలో కొంతకాలం పని చేశాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. కేజీఎఫ్-2 చిత్రం చూశాక.. ఆ చిత్రంలో రాఖీలా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశాడట. అంతకు ముందు హంతకుడి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.. 30వేల రూపాయల రివార్డు ప్రకటించారు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై మాత్రం నిందితుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: నాన్నా.. వాడు అమ్మను రైలు నుంచి తోసేశాడు -
కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్, మూడేళ్లుగా దాచిపెట్టాడు!
ప్రముఖ కన్నడ నటుడు హరీశ్ రాయ్ కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా నటించి సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలువురు దక్షిణాది హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్ నాలుగో దశలో ఉంది. తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని హరీశ్ రాయ్ మొదట గుట్టుగా దాచాడు. ఈ విషయం బయటకు చెప్తే తనకు సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో దాన్ని గోప్యంగా ఉంచాడు. కానీ, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాడు. 'కొన్ని పరిస్థితులు మనకు అద్భుతాన్ని అందించవచ్చు, లేదంటే మనదగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టేలా చేయవచ్చు. విధి నుంచి మనం తప్పించుకునే ఛాన్సే లేదు. నేను మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనివల్ల మెడ దగ్గర వాచిపోయింది. నా దగ్గర డబ్బు లేకపోవడంతో శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాను. ఆ సమయంలో కేజీఎఫ్‌లో నటించే అవకాశం రావడంతో పెద్ద గడ్డంతో నా వాపు కనిపించకుండా కవర్ చేసుకున్నాను. నేను నటించిన సినిమాలు రిలీజయ్యేవరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నాను' 'ఇప్పుడు క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఓసారైతే క్లైమాక్స్‌లోని ఓ సీన్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది' అని తన దీనగాథను చెప్పుకొచ్చాడీ నటుడు. ఒకసారి తన చికిత్స కోసం డబ్బులు కావాలని కోరుతూ ఓ వీడియో చేసినప్పటికీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ధైర్యం చాల్లేదన్నాడు హరీశ్. ఇప్పుడతడికి క్యాన్సర్ ఉందన్న విషయం బహిర్గతం కావడంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారట! చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా? రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా? -
కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!
కేజీయఫ్ అనగానే కళ్లముందుకు రాఖీభాయ్ వచ్చేస్తాడు. సలాం రాఖీభాయ్ అనే కటౌట్ కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో హై వోల్డేజ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు భాగాలు వస్తే.. రెండింటినీ సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. కేజీయఫ్2 అయితే ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇదే జోష్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యశ్ మూడో భాగాన్ని తీసుకొస్తారని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కేజీయఫ్ ఫ్యాన్స్. ఈసారి రాఖీ భాయ్ మరింత రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కేజీయఫ్3 లో రాఖీభాయ్ కాకుండా మరో హీరో నటించబోతున్నాడు. పార్ట్ 3లోకి చియాన్ విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా తమిళ దర్శకుడు పా. రంజిత్ తో కొత్త సినిమాను ప్రారభించాడు విక్రమ్. త్రీడీ ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. అది సరే, ఈ సినిమాకు, కేజీయఫ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఇండిపెన్డెన్స్కు ముందు నరాచిలో జరిగిన ఆచారకాలపైనే పా.రంజిత్ దృష్టిపెడుతున్నాడని సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు స్వాతంత్య్రం రాకముందు కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది పా.రంజిత్ చూపించబోతున్నాడట. (చదవండి: పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు) మరోవైపు కేజీయఫ్ 3 పై ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 3తో తిరిగొస్తామని అభిమానులకు మాట ఇచ్చాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత టైగర్ తో ప్లాన్ చేస్తోన్న మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాతే కేజీయఫ్ 3 తీసుకొస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ లోపే విక్రమ్ కేజీయఫ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ పాప్‌కార్న్ నాచోస్కు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ... ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది? అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను. సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్‌లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్‌లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ? అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ? అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను. మీరు స్టార్‌గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు? నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్‌గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా. యష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది? యష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి. ప్రశాంత్ నీల్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు. సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా? నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు ఇటీవల కేఎఫ్‌సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్‌కు ఏ మేరకు తేడా ఉంటుంది? కేఎఫ్‌సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్‌లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు? అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'. కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ? నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి. చాలా ప్రాజెక్ట్‌లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు. ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్‌పోజర్‌ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో మీరు నటించే అవకాశం ఉందా ? పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్‌పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం. -
‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటున్న యశ్ తనయుడు, ఏమైందంటే..
కేజీయఫ్ సీక్వెల్‌తో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు కన్నడ రాక్‌స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీయఫ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 వేయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో యశ్ రాఖీ భాయ్ అనే మైనింగ్ స్మగ్లర్‌గా కనిపించాడు. ఇందులో పలు సన్నివేశాల్లో తనిన తాను బ్యాడ్ బాయ్‌గా యశ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ ఇదిలా ఉంటే తాజాగా ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటూ యశ్ తనయుడు అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యశ్ విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో పిల్లలతో సరదగా గడుపుతున్నాడు. కూతురు ఐరా, కుమారుడు యథర్వ్‌తో కలిసి సరదగా ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలను తరచూ ఆయన భార్య రాధిక పండిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. ఇప్పుడు తాజాగా తనయుడు యథర్వ్ క్యూట్ వీడియో ఒకటి పంచుకుంది. ఇందులో తనయుడిని యశ్ ఏడిపించినట్టుగా ఉన్నాడు. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు యశ్‌ను యథర్వ్ బ్యాడ్ బాయ్ అంటుంటే లేదు గుడ్ బాయ్ అంటూ కొడుకుతో వాదిస్తుంటాడు ‘రాఖీ భాయ్’. అయినా యథర్వ్ డాడీ బ్యాడ్ బాయ్ అంటుంటాడు. లేదు డాడీ గుడ్ అని యశ్ అంటుంటే ‘నో డాడీ బ్యాడ్.. మిమ్మి గుడ్’ అంటూ యథర్వ్ ఏడుస్తూ క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్ట్ నెటిజ్లను రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘యథర్వ్ అమ్మ కొడకు’, ‘యథర్వ్ సో క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కేజీయఫ్ చిత్రంలోని రాఖీ భాయ్ డైలాగ్‌ను ఈ సందర్భంగా ఈ సంఘటనకు ఆపాదిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇక యశ్ ఫ్యాన్స్ ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
Srinidhi Shetty: కేజీయఫ్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేంటి?
హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. కేజీయఫ్ బ్రాండ్ తో శ్రీనిథి శెట్టి కూడా అలానే చేయాలి అనుకుంది. అసలే కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ల ఫ్యాక్టరీలా మారిపోయింది. ఇలానే తను కూడా టాలీవుడ్ కి వచ్చి వెలుగు వెలగాలనిచూసింది. (చదవండి: టార్గెట్ సంక్రాంతి... బాక్సాఫీస్ బరిలో చిరు, పవన్, ప్రభాస్) ఇప్పటికే కన్నడ నుంచి అరడజనుకు పైగా కొత్త తారలు టాలీవుడ్ లో ఊపేస్తున్నారు. సౌందర్య, అనుష్క, ప్రేమ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ లిస్ట్ లో చేరాలని ప్రయత్నం చేసిందిశ్రీనిథి శెట్టి. కాని ఆమె అనుకున్న ఆశలకు ఆమె నిర్ణయమే గండి కొట్టినట్టు తెలుస్తోంది. కేజీయఫ్ సినిమా తరువాత పారితోషికాన్ని భారీగా పెంచింది శ్రీనిధి. కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంత వరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. కేజీయఫ్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేనని శాండల్‌వుడ్ లో టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం తో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్ ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. -
కేజీయఫ్ 3లో హృతిక్ రోషన్!
ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా,యశ్ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నా....వారిద్దరిని మాత్రం కేజీయఫ్ 3 వదలడంలేదు.ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ లేదని తెల్సినా సరే కేజీయఫ్ 3పై రూమర్స్ ఆగడం లేదు.కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడం ఆలస్యం.. చాప్టర్ 3 కి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాకీభాయ్ ఫ్యాన్స్.దాంతో కేజీయఫ్ 3 సోషల్ మీడియాలో కంటిన్యూ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రూమర్స్ కేజీయఫ్3 పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీయఫ్ 2 బాలీవుడ్ స్టార్స్ డామినేషన్ కనిపించింది.రమికా సేన్ పాత్రలో రవీనాటాండన్, అలాగే అధీరా రోల్ ను సంజయ్ దత్ పోషించాడు.వీరిద్దరి కాంబినేషన్, కేజీయఫ్ లో రాకీభాయ్ ఎలివేషన్ ఈ సీక్వెల్ కు నార్త్ లోనే 430 కోట్లను అందించింది.బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన రెండవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీయఫ్2. కేజీయఫ్ సిరీస్ పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు,ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో డైరెక్ట్ గా అక్కడి స్టార్ హీరో హృతిక్ ను రంగంలోకి దింపుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రొడ్యుసర్ విజయ్ కిరంగదూర్ మాత్రం ఈ ఏడాదిలో కేజీయఫ్-3 ఉండదని, ఈ చిత్రంలో హృతిక్ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.'సలార్' సినిమా మేకింగ్‌లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారని.. అటు యష్ కూడా కొత్త ప్రాజెక్ట్‌కు ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తామన్నారు ఈ సంగతి ఇలా ఉంటే,ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం పెంచారని శాండల్ వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా బడ్జెట్ ను 200 కోట్లు అనుకున్నారట. ఇప్పుడు కేజీయఫ్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ,సలార్ లో అంతకు మించి యాక్షన్ ఉండాలని దాదాపు 40 కోట్లు బడ్జెట్ హైక్ చేసాడట డైరెక్టర్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోంది. -
తగ్గేదేలే అంటున్న ‘కేజీయఫ్’ బ్యూటీ, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్?
కేజీయఫ్ సీరిస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్‌గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్ చిత్రం ఆఫర్ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్ ఇండియా కావడం, అది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం సౌత్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల తీసుకునే రెమ్యునరేషన్‌కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెను హోస్ట్ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. -
విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి
శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా తన కెరీర్లో సుదీర్ఘ కెరీర్లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. చెల్లాట సినిమా ఆయన కెరీర్‌కు మాంచి బ్రేక్ ఇచ్చింది. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన కేజీయఫ్, కేజీయఫ్-2 చిత్రాల్లో కూడా ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రాకీ భాయ్ ఊచకోత.. నాలుగో చిత్రంగా కేజీయఫ్ 2
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్లో అయితే ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో రూ.350 కోట్లకు పైగా రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. వెయ్యికోట్ల క్లబ్లో చేరిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్ 2’ నిలిచింది. ఇక టాలీవుడ్‌లోనూ కేజీయఫ్ 2 ఇంకా తగ్గలేదు. 15 రోజుల్లో ఈ చిత్రం 77.31 కోట్ల షేర్ని రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office.. Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie — Ramesh Bala (@rameshlaus) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం!
కేజీఎఫ్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇక దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్-2 ఇటీవలే విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు ఎంత పేరు వచ్చిందో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'హోంబలే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాగా తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించి హోంబలే ఫిలిమ్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ మనవడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా అంటూ యువరాజ్ లుక్‌తో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. యువరాజ్ ఇంట్రడక్షన్ పోస్టర్లను విడుదల చేస్తూ దానికి వారసత్వం కొనసాగుతుందని క్యాప్షన్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువరత్న' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ. ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆ The legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/c4vsklAYFj — Hombale Films (@hombalefilms) April 27, 2022 -
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన కేజీయప్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు భాషపై పట్టు సాధించానని, త్వరలోనే టాలీవుడ్ తప్పకుండా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన శ్రీనిధి కేజీయఫ్ తొలి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటింది. దీంతో కేజీయఫ్ చాప్టర్ 2పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న వచ్చిన కేజీయఫ్ 2 అంచనాలను మించి సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళు చేసి 1000 కోట్ట క్లబ్‌లోకి చేరువలో ఉంది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ వరసగా ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తోంది. దీంతో ఆమె బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యశ్.. ఫోటోలు వైరల్
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కెరీర్‌నే మలుపుతిప్పిన సినిమా ఇది. ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే మొన్నటివరకు షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపిన యశ్ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్ భార్య రాధిక పండిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్ ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధికి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానని పేర్కొంది. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని పేర్కొంది. చదవండి: సూర్యపేటలో అనుపమ సందడి, షాకిచ్చిన ఫ్యాన్స్ -
KGF ప్రశాంత్ నీల్.. మన బంగారమే
కేజీఎఫ్.. కేజీఎఫ్.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్‌వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్ నీల్ ఎవరంటే...అచ్చంగా మనోడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. తన మూడో సినిమాతోనే ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్‌నీల్ వెండితెర ప్రయాణం, జీవన గమన విశేషాలపై ప్రత్యేక కథనం. మడకశిర(అనంతపురం): ప్రశాంత్ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్–2 రిలీజ్ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. వెండితెర ప్రయాణమిలా.. ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ఉగ్రమ్‌తో విశ్వరూపం 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ‘ఉగ్రమ్’ సినీ చిత్రీకరణకు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్ నీల్.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్ రాసుకుని కోలార్ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది. నీల్ అంటే నీలకంఠాపురం.. రెండు రోజుల క్రితం వరకూ ప్రశాంత నీల్ మడకశిరవాసి అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ కుమారుడు ప్రశాంత్‌నీల్ అని తెలుసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్వగ్రామంపై ఉన్న గౌరవంతో నీలకంఠాపురం స్ఫురించేలా ప్రశాంత్ తన ఇంటిపేరును నీల్ అని పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ను ఆయన తెరకెక్కించనున్నారు. నీలకంఠాపురంలోని ప్రశాంత్‌నీల్ తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంది మా కుమారుడు సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతి గడించడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం దక్కింది. ప్రపంచస్థాయిలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తల్లిగా ఎంతో అనుభూతి పొందా. – భారతి, ప్రశాంత్‌నీల్ తల్లి నీలకంఠాపురానికి గుర్తింపు సినిమా డైరెక్టర్‌గా ప్రశాంత్‌నీల్ సాధించిన విజయం నీలకంఠాపురానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడాదికోసారి నీలకంఠాపురానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఈ గ్రామమంటే అతనికి ఎంతో ఇష్టం. ఈ నెల 14న వచ్చి తన తండ్రి సమాధికి నివాళులర్పించి వెళ్లాడు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలన్నదే నీలకంఠాపురం ప్రజల ఆకాంక్ష. – చిన్న రంగేగౌడ్, ప్రశాంత్‌నీల్ పినతండ్రి, నీలకంఠాపురం, మడకశిర మండలం చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? -
అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్
‘పేరుకు తగ్గట్టే అతను చురుకైనవాడు.. పేరుకు తగ్గట్టే అతని భవిష్యత్తు ఉంటుంది’... ‘కేజీఎఫ్ 2’ చూశాక ‘ఉజ్వల్’ గురించి చాలామంది అన్న మాటలివి. ‘కేజీఎఫ్ 2’ విడుదల తర్వాత ఉజ్వల్ ఓ హాట్ టాపిక్. మరి.. పాన్ ఇండియా సినిమాకి 19ఏళ్ల కుర్రాడు ఎడిటర్ అంటే విశేషమే కదా. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్ 2’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసినవాళ్లు ఉజ్వల్‌కి ‘ఉజ్వల భవిష్యత్తు’ ఉంటుందని ప్రశంసిస్తున్నారు. ఇక ఎడిటర్‌గా ఉజ్వల్‌కి ‘కేజీఎఫ్ 2’ అవకాశం ఎలా వచ్చింది? తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ‘సాక్షి’కి ఉజ్వల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.. ముందుగా మీ కుటుంబం గురించి? ఉజ్వల్: నార్త్ కర్నాటకలోని గుల్బర్గాలో పుట్టి, పెరిగాను. మా నాన్న గోవింద్రాజ్ కులకర్ణి ఎల్ఐసీ ఆఫీసర్. అమ్మ రమ హౌస్‌వైఫ్. అక్క అనుశ్రీ ఎల్జీలో వర్క్ చేస్తోంది. మరి.. చదువు సంగతి? పీయూసీ ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అయ్యాను. ఎడిటర్ కావడానికేనా? యాక్చువల్‌గా క్రికెటర్ కావాలనేది నా కల. మరి.. ఎడిటింగ్ వైపు రావడానికి కారణం? నా కజిన్ వినయ్ యాక్టర్. తన కోసం షూటింగ్, ఎడిటింగ్ చేసేవాణ్ణి. అలా ఎడిటింగ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాను. నా ఆసక్తి తెలుసుకుని నా ఫ్రెండ్ శశాంక్ ఎడిటింగ్ సైడ్ ప్రోత్సహించాడు. తనే నన్ను బెంగళూరు రమ్మన్నాడు. నాకు బాగా హెల్ప్ చేశాడు. బెంగళూరు వెళ్లాక కొందరు టెక్నీషియన్స్‌ని కలిశాను. కన్నడ సినిమా ‘మఫ్తీ’ ఎడిటర్ హరీష్ కొమ్మె దగ్గర రెండు నెలలు పనిచేశాను. సో.. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేదన్నమాట? లేదు.. మరి... ‘కేజీఎఫ్ 2’కి అవకాశం ఎలా వచ్చింది? యశ్ సార్, ప్రశాంత్ సార్‌కి నేను పెద్ద అభిమానిని. అలాగే ‘కేజీఎఫ్’కి కూడా. దాంతో ‘కేజీఎఫ్’ సినిమా విజువల్స్‌ని ఎడిట్ చేశాను. లక్కీగా ప్రశాంత్ సార్ ఆ విజువల్స్ చూశారు. ఆయనకు నచ్చాయి. ఆ తర్వాత నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు.. వెళ్లాను. ‘కేజీఎఫ్ 2’కి ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు. పాన్ ఇండియా సినిమా.. పెద్ద బడ్జెట్ కాబట్టి ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు టెన్షన్ పడిన రోజులేమైనా? అలాంటి రోజలు లేవు. నిజానికి అవన్నీ గోల్డెన్ డేస్ అనాలి. ఎందుకంటే నా లైఫ్‌లో నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిన రోజులవి. ఇంత పెద్ద సినిమాకి అవకాశం వచ్చినప్పుడు మీ అమ్మానాన్న ఏమన్నారు? ఈ అవకాశం రాక ముందు మా అమ్మానాన్న బాగా టెన్షన్ పడేవారు. ఎందుకంటే నేనేమీ చేసేవాణ్ణి కాదు. అందుకే ‘కేజీఎఫ్’ ఆఫర్ గురించి చెప్పగానే వాళ్లు చాలా ఆనందపడ్డారు. ఇవాళ నేను ఏం సాధించినా అది నా పేరెంట్స్‌కే దక్కుతుంది. నేను ఇంత దూరం రావడానికి కారణం వాళ్లే. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ‘కేజీఎఫ్ 2’లో యంగెస్ట్ టెక్నీయన్గా యశ్, ప్రశాంత్‌ల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? ఆ ఇద్దరితో కలిసి పని చేస్తున్నానని నమ్మలేకపోయాను. వాళ్లిద్దరూ నా ముందు కూర్చుంటే నేను వాళ్ల కోసం పని చేయడం అనే ఆ ఫీల్‌ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ‘ఇంత చిన్న వయసులో ఎడిటింగ్ నేర్చుకున్నావా?’ అని యశ్ సార్ అడిగి, చాలా ఎంకరేజ్ చేశారు. ప్రశాంత్ సార్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తారు. ఆయన కథ చెప్పే విధానాన్ని, ఆయన ఆలోచనలను అర్థం చేసుకుంటే నా పని సులువు అవుతుంది. అలాగే చేశాను. ఒకవైపు షూట్ చేయడం.. మరోవైపు ఎడిట్ చేయడం రెండూ జరిగేవి. ఈ సినిమాకి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. ‘కేజీఎఫ్ 2’కి ఎడిటింగ్ పరంగా కష్టం అనిపించిన సన్నివేశాల గురించి... ‘ఇంటర్ కట్స్’ విషయంలో కాస్త కష్టం అనిపించింది. అంతకుముందు వాటి గురించి నాకు అవగాహన లేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా చేయమని అడిగారా? ‘సలార్’కి వర్క్ చేయమని ప్రశాంత్ సార్ అన్నారు. అయితే నేను ఈ సినిమాకి సోలో ఎడిటర్‌గా చేస్తానా? అనే విషయం గురించి ఇప్పుడు నాకు తెలియదు. టెక్నికల్‌గా అప్డేట్ కావడా నికి ఇక్కడి సినిమాలు, వెబ్ సిరీ స్లతో పాటు విదేశీ చిత్రాలు కూడా చూస్తుంటారా? చూస్తాను. నాకు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ఇక టీవీ సిరీస్‌లో ‘నార్కోస్’, ‘పీకీ బ్లైండర్స్’ బాగా నచ్చాయి. ముఖ్యంగా ‘పీకీ బ్లైండర్స్’ చాలా చాలా ఇష్టం. ఎడిటర్‌గా కంటిన్యూ కావడానికి చదువుకి ఫుల్స్టాప్ పెట్టేశారా? భవిష్యత్ ప్రణాళికలు? ప్రస్తుతానికి అయితే నేను చదువు మీద దృష్టి పెట్టడంలేదు. కెరీర్ ఎలా వెళితే అలా ఫాలో అయిపోతాను. సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను. మీరు కెమెరా వ్యూ చూస్తున్న ఫొటో ఉంది... ఫొటోగ్రఫీ నేర్చుకుంటున్నారా? లేదు. కానీ సినిమాకి సంబంధించిన ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటున్నాను. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hero Yash Thanks To Fans: 'కేజీయఫ్-2' విజయంపై రాకింగ్ స్టార్ యశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ చిత్రం పై ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఇక యష్ మాట్లాడుతూ.. ''ఓ గ్రామానికి ఒకానొక సమయంలో తీవ్ర కరవు వచ్చింది. అప్పుడు ఆ గ్రామస్థులంతా దేవుడిని ప్రార్థించేందుకు ఓ చోటకు చేరారు. అయితే అందులో ఓ అబ్బాయి మాత్రం అక్కడికి ఓ గొడుగుతో వెళ్లాడు. దాంతో అక్కడున్న వారంతా ఆ అబ్బాయి చేసిన పనికి నవ్వుకున్నారు. అందులో కొందరు అతడిది మూర్ఖత్వమని, మరికొందరు అతివిశ్వాసమని అనుకున్నారు. కానీ అది ఆ అబ్బాయి నమ్మకం, విశ్వాసం మాత్రమే. అలా అప్పుడు ఆ అబ్బాయి ఏ నమ్మకంతో అయితే ఉన్నాడో 'కేజీయఫ్' చిత్రం విషయంలో నేనూ అలానే ఉన్నాను. మొత్తానికి నా నమ్మకాన్ని నిలబెట్టిన మీకు నా తరఫున, చిత్ర బృందం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై మీరు చూపిన ఆదరాభిమానాలకు 'థ్యాంక్స్' అనే పదం సరిపోదు. ఓ గొప్ప సినిమాను మీ అందరికీ ఇవ్వాలనుకున్నాం. అనుకున్నట్టుగానే మేము 'కేజీయఫ్'ను మీకు అందించాం. దానికి తగ్గట్టుగానే మీరు ఎంజాయ్ చేశారు. ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను'' అంటూ యశ్ పేర్కొన్నాడు. ఇక చివరిలో చిత్రంలోని 'యువర్ హార్ట్ ఈజ్ మై టెరిటరీ' అనే డైలాగ్ చెప్పి వీడియోను ముగించాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీయఫ్-2' చిత్రం ఏప్రిల్ 14న విడుదలై వసూళ్ల రికార్డులు సృష్టిస్తోంది. ఇక విదేశాల్లోనూ 'కేజీయఫ్' హవా కొనసాగుతోంది. యశ్ స్టైలిష్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు పలువురు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. రవి బస్రూర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. -
లేడీ డైరెక్టర్‌తో మూవీ అనౌన్స్ చేసిన 'కేజీఎఫ్' నిర్మాతలు
ఇండస్ట్రీలో అతికొద్ది మందే లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర కూడా ఒకరు. స్టార్ హీరో సూర్యతో తమిళంలో ఆమె చేసిన 'సురారైపోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్యతో పాటు సుధా కొంగరకి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ లేడీ డైరెక్టర్‌కు క్రేజీ ఆఫర్ దక్కింది. కేజీఎఫ్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ తమ కొత్త సినిమాని సుధా కొంగరతో చేస్తున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈసారి కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే ఆమె కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. కానీ సూర్యనే ఈ ప్రాజెక్టులో నటించనున్నట్లు కోలీవుడ్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭. To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K — Hombale Films (@hombalefilms) April 21, 2022 -
ఆ హీరోయిన్‌తో నటించాలనుంది : యశ్
కేజీయఫ్ 2తో రాకీ భాయ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్‌తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకొణె అని, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అంతేకాకుండా దీపిక నటన ఎంతో బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్ 2లో రాఖీభాయ్ తల్లిగా నటించిన అర్చనకు ఘన సన్మానం
సాక్షి, కోలారు (కర్ణాటక): కేజీఎఫ్ సినిమాలో నటించిన కోలారుకు చెందిన నటి అర్చనా జోయిస్ను బుధవారం నగరంలోని సపలమ్మ దేవాలయ సమితి ఘనంగా సన్మానించింది. నగరసభ సభ్యుడు మురళీగౌడ మాట్లాడుతూ అర్చనా జోయిస్ తన నటన ద్వారా జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్తీక్, సత్యనారాయణ, నవీన్‌బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాఖీభాయ్ యశ్ కథానాయకుడిగా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. చదవండి: 'కేజీఎఫ్ 2' మేనియా.. పెళ్లి శుభలేఖపై 'వయలెన్స్' డైలాగ్ రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
రాకీభాయ్ ఊచకోత.. 6 రోజుల్లో ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే
కేజీయఫ్ 2తో రాకీ భాయ్ ఇండియన్ బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్నాడు. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి రికార్డును సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అక్కడ ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 238.70 కోట్లను రాబట్టింది. మంగళవారం ఒక్క రోజే 19.14 కోట్లను వసూలు చేయడం విశేషం. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. 6 రోజుల్లో రూ.62.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో 'కేజీయఫ్ 2' చిత్రానికి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం .. మరో రెండు, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఓవర్సీస్లోనూ రాకీభాయ్ హవా కొనసాగుతుంది. యూఎస్‌లో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. అక్కడ ఈ చిత్రం ఏకంగా ఐదు రోజుల్లో 5 మిలియన్ డాలర్లను రాబట్టింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGF2 is SUPER-STRONG on Day 6... Will cross ₹ 250 cr mark today [Wed, Day 7]... AGAIN, THE FASTEST TO HIT ₹ 250 CR... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr, Tue 19.14 cr. Total: ₹ 238.70 cr. #India biz. #Hindi Version. pic.twitter.com/zSXLjNcsnU — taran adarsh (@taran_adarsh) April 20, 2022 -
కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ.. ఐదు రోజుల్లో ఎంతంటే..
రాకీ భాయ్ తీసుకొచ్చిన కేజీయఫ్ 2 తుపాన్‌కు ఇండియన్ బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతోంది. భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాకీ భాయ్ కొట్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో 625 కోట్ల రూపాయలను వసూలు.. సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క ఐదో రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం. #KGFChapter2 WW Box Office ENTERS ₹600 club in just 5 days. Day 1 - ₹ 165.37 cr Day 2 - ₹ 139.25 cr Day 3 - ₹ 115.08 cr Day 4 - ₹ 132.13 cr Day 5 - ₹ 73.29 cr Total - ₹ 625.12 cr Becomes the 9th HIGHEST grossing movie of all time. [Indian Films] #Yash #KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 19, 2022 పేరుకు కన్నడ సినిమానే అయినా.. హిందీ ఇండస్ట్రీలోనూ రికార్డులన్నింటిని బద్దలు కొడుతోంది కేజీయఫ్2. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్లు, అంతకంటే వేగంగా ఐదు రోజుల్లోనే రూ.219.6 కోట్లను రాబట్టి సౌత్ సినిమాల సత్తా ఏంటో నిరూపించింది. కేజీయఫ్ 2 స్పీడ్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం.. బాహుబలి2 రికార్డు(రూ.500 కోట్ల వసూళ్లు)ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో రూ.58.6 కోట్లను రాబట్టింది. ఐదు రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో రూ.58 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం కేజీయఫ్ 2 ఆర్ ఆర్ ఆర్ వెయ్యి కోట్ల రికార్డ్ ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #KGF2 is UNSTOPPABLE... SUPERB HOLD on a working day [Mon]... Eyes ₹ 270 cr [+/-] in *extended Week 1*... Should cross #Dangal *lifetime biz*, if it maintains the pace... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr. Total: ₹ 219.56 cr. #India biz. pic.twitter.com/MFUVWTXTJB — taran adarsh (@taran_adarsh) April 19, 2022 -
రూ. మూడు వందలతో బెంగళూరు వచ్చా: యష్
కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'కేజీఎఫ్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. యష్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తాను ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడిపాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన కెరీర్ మొదటిలో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. సినీ అవకాశాల కోసం తాను కేవలం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టాననే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి బస్ డ్రైవర్, తల్లి గృహిణి. కాగా యశ్ సినిమాల్లోకి వెల్లేందుకు వారి కుటుంబం అంగీకరించలేదు. కానీ వారు యష్ కోసం సినిమాల్లో ప్రయత్నించేందుకు తనకు కొంత సమయం మాత్రం ఇచ్చారు. ఆ సమయంలోపు అవకాశాలు దక్కించుకుంటే సరి. లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్ తన తండ్రి నుంచి తీసుకున్న మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్నాడు. ఈ విషయం గురించి యశ్ మాట్లాడుతూ.. మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్న నేను మొదట సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నాను. తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టా అని చెప్పుకొచ్చాడు. అలా యశ్ సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కన్నడ చిత్రాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. చివరకు 2008లో 'రాకీ' చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన వరుస హిట్లతో యశ్ కన్నడనాట స్టార్ హీరోగా ఎదిగాడు. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇటీవలే విడుదలైన 'కేజీఎఫ్-2'తో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా స్టార్‌గా యష్ అవతరించాడు. -
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికే డ్రగ్స్ తీసుకున్నా : స్టార్ హీరో
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చేసినా కేజీఎఫ్-2 పైనే చర్చ నడుస్తుంది. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెస్మరైజ్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా సహా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని సైతం షేర్ చేసుకున్నారు. 'అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాను. కానీ ఈ ప్రాసెస్‌లో డ్రగ్స్‌కి బానిసైన నాకు ఆ సంకెళ్లు తెంచుకోవడానిక ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడిని. నా జీవితంలో ఆ పదేళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్లో గడిపేవాడిని. షూటింగ్‌లపై ఆసక్తి ఉండేది కాదు. అయితే డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి కొంతకాలం అక్కడే గడిపాను. తిరిగి వచ్చాక అందరూ నన్ను డ్రగ్గీ అని పిలిచేవారు. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నా. దీంతో అప్పటి నుంచి అందరూ ‘క్యా బాడీ హై’అంటూ ప్రశంసించారు' అంటూ చెప్పుకొచ్చారు సంజూ భాయ్. -
కేజీయఫ్2 సెకండ్ డే కలెక్షన్స్: రికార్డ్స్..రికార్డ్స్..రికార్డ్స్
ఇండియన్ బాక్సాఫీస్‌పై కేజీయఫ్-2 హవా కొనసాగుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం(ఏప్రిల్ 14)విడుదలై, తొలిరోజు నుంచే హిట్ టాక్ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదేస్థాయిలో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.12.95 కోట్లను రాబట్టింది. రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో రూ.33 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. Thu kya main kya Hatja Hatja 🔥 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 ⚡#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd #KGF2BoxOfficeMonster pic.twitter.com/aiiuD8qttp — #KGFChapter2 - Box Office Monster 🔥 (@KGFTheFilm) April 16, 2022 ఇక బాలీవుడ్‌లోనూ కేజీయఫ్ హవా మాములుగా లేదు. అక్కడ తొలి రోజే రూ.50 కోట్లు వసూళ్లు చేసింది. రెండో రోజు దాదాపు 45 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం రెండు రోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఇక వీకెండ్ కావడంతో శని,ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ మూవీ ఎన్ని వందల కోట్లను కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. -
‘కేజీయఫ్ 2’ ఎఫెక్ట్..తెరపైకి బాహుబలి 3, రూ. 2000 కోట్లే టార్గెట్!
పాన్ ఇండియా సినిమాలు వేరు,పాన్ ఇండియా సీక్వెల్స్ వేరు. పాన్ ఇండియా సినిమా హిట్టైతే, ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు కనివిని ఎరుగని రీతిలో క్రేజ్ కనిపిస్తోంది. ముందు బాహుబలి 2, ఇప్పుడు కేజీయఫ్ 2 .. ఈ ట్రెండ్ చూస్టుంటే నెక్ట్స్ పుష్పరాజ్ కూడా బాక్సాఫీస్ ను రూల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేజీయఫ్ 2కు వచ్చిన క్రేజ్, ఈ సినిమా బద్దలు కొడుతున్న కలెక్షన్స్ గురించి విన్న తర్వాత పుష్ప టీమ్ లో మరింత జోష్ పెరగడం ఖాయం.పాన్ ఇండియా సినిమాలకు ఒక క్రేజ్ కనిపిస్తే, పాన్ ఇండియా సీక్వెల్స్ కు నెక్ట్స్ లెవల్లో క్రేజ్ కనిపిస్తోంది. అది బాహుబలి 2తో ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు రాఖీభాయ్ రూలింగ్ తో మరోసారి పాన్ ఇండియా సీక్వెల్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధమైంది. బాహుబలి 2, కేజీయఫ్ 2 రిలీజ్ హంగామాను రిపీట్ చేసే అవకాశాలు ఒక్క పుష్ప 2కు మాత్రమే ఉన్నాయి. అంతగా ఈ పుష్ప పార్ట్ 1 ఆడియెన్స్ లోకి వెళ్లింది.అందుకు తగ్గట్లే పుష్ప పార్ట్ 2ను కూడా సుకుమార్ తెరకెక్కించగలిగితే మాత్రం టాలీవుడ్ మరో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం. మరోవైపు రూ.1000 కోట్లు కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై రాజమౌళి మౌనంగా ఉన్నాడు.కాని ఫ్యూచర్ లో బాహుబలి 3ని తీసుకొస్తాను అంటున్నాడు. బాహుబలి 3 థియేటర్స్ కు వచ్చిన రోజున మాత్రం ఇండియన్ సినిమా మరో ఎత్తు ఎదగడం ఖాయం.ఈసారి రాజమౌళి సినిమా మినిమం రెండు వేల కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం కన్ ఫామ్.ఎందుకంటే నాలుగేళ్ల క్రితం విడుదలైన బాహుబలి 2 అప్పుడే 1600 కోట్లుకుపైగా కొల్లగొట్టింది. ఫ్యూచర్ లో ఈ సినిమా సీక్వెల్ కు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మినిమం 2 వేల కోట్ల మార్క్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. -
KGF2: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దాడి.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిచ చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. భారీ అంచనాల మధ్య గురువారం(ఏప్రిల్ 14) విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, విజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో విడుదలైన కేజీయఫ్‌కి తొలుత మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కాస్త వెనకపడింది. తర్వాత పబ్లిక్ మౌత్‌తో జనాల్లోకి వెళ్లి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. అయితే కేజీయఫ్‌కి ఆ గండం లేకుండా పోయింది. పార్ట్ 1 సూపర్,డూపర్ హిట్ కావడంతో...పార్ట్ 2 అంతకు మించేలా ఉంటుందని అంతా భావించారు. అందుకే విడుదల ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి..మరోసారి సౌత్ సినిమాల సత్తా ఏంటో యావత్ భారత్‌కు తెలియజేసింది. బాలీవుడ్లోనే దాదాపు రూ.50 కోట్లను వసూళ్లు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో 2.O’(రూ.12.45 కోట్లు) ఉండేది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిసి మరో రూ.50 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా తొలిరోజు రాకీభాయ్ విధ్వంసమే సృష్టించాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ) -
KGF-2: ‘సలాం రాఖీ భాయ్’అదిరిపోయిన స్టిల్స్
-
కేజీఎఫ్-2 ఎడిటర్ 19ఏళ్ల టీనేజర్ అని మీకు తెలుసా?
కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ గురువారం(ఏప్రిల్14)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్టార్ మీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా విడుదలైన ఈసినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించడంలో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు స్టార్ ఎడిటర్ పనిచేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదు. ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు. అవును.. మీరు చదివింది నిజమే. ఉజ్వల్ కుల్కర్ణి అనే ఈ కుర్రాడు గతంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు. అయితే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌కి అతను చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ ప్రశాంత్ నీల్‌కు బాగా నచ్చాయి. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్-2కి ఎడిటింగ్ బాధ్యతలను అప్పగించాడు. అందుకు తగ్గట్లే ఉజ్వల్ కూడా హాలీవుడ్ రేంజ్లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్‌లో ఉజ్వల్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఇంత తక్కువ వయస్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిటర్‌గా పనిచేయడం నిజంగా ఉజ్వల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు నెటిజన్లు. చదవండి: ‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ -
'కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా?
యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2' ఎట్టకేలకు గురువారం (ఏప్రిల్ 14) విడుదలైంది. కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. అయితే 'కేజీఎఫ్2'కి చివరిలో కొనసాగింపుగా 'కేజీఎఫ్3' కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలానే అందులో ఈ సారి స్టోరీ ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పేశారనే చెప్పాలి. ఇంతవరకూ ఇండియాలోనే జరిగిన 'కేజీఎఫ్' కథ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని సమాచారం. అందుకే 'కేజీఎఫ్ 2' చిత్రం చివరిలో రాకీభాయ్ వస్తుంటే.. అతడి షిప్‌ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడుతున్నట్టు చూపించారు. రాకీభాయ్ సామ్రాజ్యం విదేశాలలో కూడా విస్తరించినట్లు చూపించారు. దాంతో పాటు రాకీ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్లు ఉంటుంది. వీటిని చూసిన సిని ప్రేక్షకులు 'కేజీఎఫ్'కి పార్ట్ 3 కూడా రాబోతోందని నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్' రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చిన తరవాత 'కేజీఎఫ్' పార్ట్ 3 పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది. -
సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ
కేజీఎఫ్.. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సీక్వెల్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కేజీయఫ్ 2' అనే చెప్పవచ్చు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది.. కేజీఎఫ్ సీక్వెల్‌గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్టర్2`గురువారం(ఏప్రిల్14)న ప్రేక్షకుల మందుకు వచ్చింది. స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. మరి ఈ చిత్రం 'కేజీఎఫ్' రేంజ్లో సక్సెస్ సాధించిందా? లేక అంతకుమించి ఆకట్టుకుందా? `కేజీఎఫ్ ఛాప్టర్2`పై ఆడియెన్స్ ఓపీనియన్ ఏంటి అన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూలో తెలుసుకుందాం. -
‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : కేజీయఫ్ చాప్టర్ 2 నటీనటులు : యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, ఈశ్వరీరావు, రావు రమేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్ నిర్మాత:విజయ్ కిరగందూర్ దర్శకుడు: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫి: భువన్ గౌడ విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్ 2 ఒకటి. 2018లో వచ్చిన ‘కేజీయఫ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే..భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్ . దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు కల్లల్లో ఒత్తులు వేసుకొని వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్ 2 అనే చెప్పవచ్చు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడం, పార్ట్2 టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో ‘కేజీయఫ్ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్ 1 స్థాయిని కేజీయఫ్2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేజీయఫ్ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్ వాసిరాజు(అనంత్ నాగ్) చెబితే.. పార్ట్ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్ రాజ్) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్‌ను రాకీ భాయ్ (యశ్) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్’ సృష్టికర్త సూర్యవర్ధన్ సోదరుడు అధీరా(సంజయ్ దత్) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్(రవీనా టాండన్)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?. శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటంటే.. 2018లో చిన్న సినిమాగా విడుదలై అతి భారీ విజయం సాధించిన చిత్రం ‘కేజీయఫ్’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదగడం.. ఇలా కేజీయఫ్ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కేజీయఫ్ చాప్టర్ 2లో చూపించారు. కేజీయఫ్ మాదిరే పార్ట్2లో హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 2లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో రాకీభాయ్ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్, ఇయత్ ఖలీల్‌తో జరిపిన డీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ‘కేజీయఫ్’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో మలచుకోలేకపోయాడు. కేజీయఫ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్, అధిరాకు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. అలాగే అతని నేపథ్యం కూడా సినిమాలో చూపించలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్ సెంటిమెంట్ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు.ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్ చెబుతాడు. కేజీయఫ్2లో యశ్ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు యశ్ తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అధీరగా సంజయ్ దత్ ఫెర్పార్మెన్స్ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్ దత్‌కి కేన్సర్ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రకి రవీనా టాండన్ న్యాయం చేసింది. రావు రమేశ్, ఈశ్వరి భాయ్, ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రవి బస్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కేజీయఫ్ 2’ ట్విటర్ రివ్యూ
‘కేజీఎఫ్ చాపర్ట్ 2’ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ మొదటి పార్ట్ ‘కేజీఎఫ్’ భారీ విజయం సాధించడమే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం.. భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. ప్రేక్షకులను అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అందుకు తగ్గట్టే కేజీఎఫ్ 2 తెరకెక్కించానని దర్శకుడు ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో కేజీఎఫ్ 2పై మరింత హైప్ క్రియేట్ అయింది. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #KGFChapter2 The best Don movie in recent times. Masssss... Action packed. A pinch of sentiment and love. @TheNameIsYash stylish look and acting wowww. Worth watching. — Abhi (@abhi_tommi) April 14, 2022 #KGFChapter2 Overall a Superb Action Entertainer that delivers! Neel is the best at giving goosebumps and he delivers once again. The BGM is one of the best in recent years. Apart from a off track 20 minutes in the 2nd half, it delivers as hoped. Rating: 3.5/5#KGF2 — Venky Reviews (@venkyreviews) April 13, 2022 హీరో ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని ట్వీట్ చేస్తున్నారు. #KGF2 is ABSOLUTE FIRE UNTIL INTERVAL! #Yash aka. #RockyBhai is MEANER, LEANER & STRONGER!!! #KGFChapter2 If this pace continues in 2nd half, this will be an UNSTOPPABLE Monster at the Box Office. Solid set up for the premise until the interval block. — Himesh (@HimeshMankad) April 13, 2022 #KGFChapter2 Interval: Fine first half. The intro, Toofan song and the pre-interval sequence provide the much needed goosebumps, with #Yash in terrific form. The BGM by Ravi Basrur is simply superb! — Siddarth Srinivas (@sidhuwrites) April 14, 2022 బయట ప్రచారం చేసినంతగా కేజీయఫ్ 2 లేదని, రెగ్యులర్ మాస్ మూవీలాగే ఉంది. కేజీయఫ్ 2 మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ విఫలమయ్యాడని చెబుతున్నారు. #KGFChpater2Review RATING - 2/5 ⭐#KGFChpater2 DOESN'T LIVE Up To The HYPE . REGULAR MASALA STYLE OUTDATED, PREDICTABLE PLOT & Just The INTENSITY is the Only GOOD Thing. #PrashanthNeel FAILS To RECREATE The MAGIC of #KGF Part 1. #KGF2#KGF2InCinemas pic.twitter.com/qaSHCRoiHE — Himesh Mankadman. (@HimeshMamkad) April 13, 2022 కేజీఎఫ్ మూవీ ఫస్టాఫ్ అదిరిపోయిందని, యశ్ ఎంట్రీ, ఇంటర్వెల్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #KGF2 1 HALF அய்யய்யோ Ovvoru Scene Goosebumps 🔥🔥 சும்மா பக்கு பக்குன்னு இருக்கு படம் பயங்கரம் 🔥🔥 @TheNameIsYash@prashanth_neel #KGFChapter2 #KGF2onApr14 #KGFChpater2 pic.twitter.com/THa5BUP3bp — VîMãŁ Remo🔥 (@VimalRemoN2) April 14, 2022 #kgf2 1st Half Rocky Rocks BGM🔥 Interval Block 🔥 Not too much Mass loaded for 1st half Some Lag in mid of 1st half#SanjayDutt intro on Fire bridge 👎 Overall decent as expected 1st half 3.25/5#KGF2review #KGFChpater2 #KGFChapter2review #YashBOSS𓃵 #yash #KGFreview #kgf pic.twitter.com/pH7H11MFwz — Shani Sree (@FilmFocus_Live) April 13, 2022 -
కె.జి.యఫ్కు ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా?
తీసింది రెండే రెండు సినిమాలు. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరడంతోనే ప్రశాంత్ నీల్ ఆగిపోలేదు. కె.జి.యఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాన్ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. కేవలం డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీయాలనే ఆలోచనతో ఫిల్మ్‌మేకింగ్ కోర్సులో చేరాడు ప్రశాంత్. అయితే.. సినిమా అనే సముద్రం యొక్క లోతు అతని ఆలోచనని మార్చేసింది. ఎలాగైనా కన్నడ సినిమాను ఏలేయాలన్న కసితో అడుగులు వేయించింది. మొదట్లో రెండు, మూడు చిన్న సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పని చేశాడు. ఆ టైంలోనే సొంతంగా ఓ కథ రాసుకుని సినిమా తీయాలనుకున్నాడు. కొత్తవాడు.. పైగా ‘రొటీన్’ కథ. అందుకే హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. దీంతో తన బావ, హీరో శ్రీమురళిని పెట్టి సినిమా తీశాడు ప్రశాంత్. రిజల్ట్.. ‘ఉగ్రం’(2014) హిట్ టాక్‌తో కన్నడనాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే ఊరమాస్ డైరెక్టర్‌గా ప్రశాంత్‌కి పేరొచ్చింది. షోలే ఇన్స్పిరేషన్తో.. ‘ఉగ్రం’ తరువాత ప్రశాంత్‌తో సినిమా చేస్తామని అడిగినోళ్లంతా కన్నడ స్టార్ హీరోలే. కానీ, ఈ సైలెంట్ డైరెక్టర్ మాత్రం హీరోల బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లే కథ రాసుకుంటాడు. అందుకే అప్పటికే యశ్ కోసం కె.జి.యఫ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఈ కథకి ప్రశాంత్‌కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది బాలీవుడ్ కల్ట్‌క్లాసిక్ ‘షోలే’. 70వ దశకంలో హిందీ సినిమాలు తనలో ఎంతో మార్పులు తీసుకొచ్చాయని, సినిమాను చూసే విధానంలో తనలో మార్పులు తీసుకొచ్చాయని, కె.జి.యఫ్ కథ తయారు చేసుకోవడంలో స్ఫూర్తి ఇచ్చిందని నీల్ అంటున్నాడు. ప్రత్యేకించి ఆ టైంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న అమితాబ్ బచ్చన్ స్ఫూర్తితోనే యశ్ రాకీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దానని నీల్ తెలిపాడు. భారీ బడ్జెట్.. అయినా వెనకడుగు వేయలేదు నిజానికి మొదట ఒక ఫ్యామిలీ స్టోరీతో ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్(హోంబల్ ఫిల్మ్స్)ని అప్రోచ్ అయ్యాడు ప్రశాంత్. ఫైనల్‌గా భారీ బడ్జెట్ కథ కె.జి.యఫ్తో కన్విన్స్ అయ్యారు. కన్నడలో కోలార్ బంగారు గనుల మీద ఇంతదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ‘కాంట్రవర్సీల’ భయాన్ని లెక్కచేయకుండా డేర్‌గా ప్రశాంత్–విజయ్–యశ్‌లు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఐదు భాషల్లోనూ భారీ సక్సెస్‌తో కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. అంతేకాదు అప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్ల కరువుతో ఉన్న శాండల్‌వుడ్ దాహాన్ని కె..జి.యఫ్ ఛాప్టర్–1తో తీర్చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. #KGF first look @NimmaYash #HombaleFilms #PrashanthNeel #Massssss pic.twitter.com/xWjXR0Apfg — Karthik Gowda (@Karthik1423) May 3, 2017 సగం బలం అతనే! అమ్మ సెంటిమెంట్, పవర్ఫుల్ డైలాగులు, హీరో ఎలివేషన్, సినిమాకు తగ్గట్లు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, నటన, టేకింగ్.. ఇవన్నీ ఒక వైపు ఉంటే.. సంగీతం ఈ సినిమాకు మిగతా సగం బలం. ప్రశాంత్ నీల్ తీసిన మూడు సినిమాలకు(కె.జి.యఫ్ ఛాప్టర్–2తో కలిపి).. ప్రభాస్‌తో తీయబోయే ‘సలార్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే. అతని పేరు రవి బస్రూర్. రవికి తన రెండో మూవీ ‘ఉగ్రం’తోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొచ్చింది. అయితే వీళ్లిద్దరి కాంబో మూవీస్ సక్సెస్‌లో మ్యూజిక్ మామూలు రోల్ పోషించదు. ప్రత్యేకించి సీన్ ఎలివేషన్ కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాణం పెడతాడు రవి. ఆ అవుట్ఫుల్ జనాలను సీటు అంచుకి తీసుకొస్తుంది కూడా. కె.జి.యఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ సందర్భంగా.. సాక్షి వెబ్ ప్రత్యేకం -
'కెజిఎఫ్' హీరో యష్‌కు అవమానం!
గత కొంత కాలంగా యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కెజిఎఫ్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాకింగ్ స్టార్ యశ్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు చాలా అవమానింపబడ్డానని తెలిపాడు. స్కూల్లో తన స్నేహితులంతా భవిష్యత్తులో నువ్వేం అవుతావు అని ప్రశ్నించిన సమయంలో వారంతా డాక్టర్, ఇంజనీర్, లాయర్ అంటూ చెప్పేవారు. కానీ నేను మాత్రం సినిమా యాక్టర్ అవుతానని చెప్పేవాడిని. ఇక దాంతో అందరూ నన్ను చూసి నవ్వేవారు. వారంతా నన్ను అవమానించినట్లుగా మాట్లాడేవారు. అయితే ఆ సమయంలో తనను అలా ఎవరు అవమానించి మాట్లాడినా నేను మాత్రం అనుకున్నట్లుగానే నటుడిని అయ్యేందుకు ప్రయత్నాలు చేశాను. చివరికి మీ ముందు ఇలా నటుడిగా ఉన్నానంటూ హీరో యశ్ చెప్పుకొచ్చాడు. -
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)
-
శ్రీ వినాయక టెంపుల్లో కేజీఎఫ్ మూవీ టీం ప్రత్యేక పూజలు, వీడియో వైరల్
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఈ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: మెసేజ్‌లు చేస్తూ డబ్బులు అడుగుతున్న అనుపమ!, హీరోయిన్ క్లారిటీ ఈ నేపథ్యంలో ఏప్రిల్14న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా టెంపుల్, ఉడిపిలోని అనెగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ మూవీని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? Yash and KGF team in anegudde temple#KGFChapter2 #KGF2 #KGF2onApr14 #Yash @TheNameIsYash pic.twitter.com/HJigcajUpi — K.G.F ANALYST🕵🏼♂️ (@KGFAnalyst) February 1, 2022 -
'కేజీఎఫ్' రికార్డును బద్దలు కొట్టిన 'పుష్ప'
Pushpa Movie Collection Bollywood: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ది రైజ్ గతేడాది డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అటు బాలివుడ్లో కూడా పుష్ప రాజ్ తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా అక్కడ 'కేజీఎఫ్' రికార్డును ‘పుష్ప’ బద్దలు కొట్టినట్టు సమాచారం. బాలివుడ్ హీరోల సినిమాకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే పుష్పకు వసూళ్ళు రావడం గమనార్హం. ఇలా బన్ని తన మొదటి పాన్ ఇండియా చిత్రంతోనే తిరుగులేని రికార్డు సృష్టించి ఇక తగ్గేదేలే అంటున్నాడు. -
ఊ అంటావా.. ఊహూ అంటావా .. కరోనా
ఊ అంటావా కరోనా.. ఊహూ అంటావా కరోనా... రమ్మంటావా కరోనా.. రావొద్దంటావా కరోనా.. రెండేళ్లుగా సినిమాల విడుదల విషయంలో కరోనా ఇలానే దోబూచులాడుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, తెరపై ప్రత్యక్షమవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కరోనా విజృంభించి ‘ఊహూ’ అంటోంది... ‘రావద్దంటోంది’. కరోనా ఎఫెక్ట్‌తో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాలు ఏప్రిల్‌కి వాయిదా పడ్డాయి. అయితే ఆరేడు సినిమాల వరకూ పెద్దవే కావడంతో డేట్ల సర్దుబాబు, థియేటర్ల సర్దుబాటు... ఇలా ఎన్నో సర్దుబాట్లు అవసరం. మరి.. అన్ని సర్దుబాట్లూ చేసుకుని తీరా రిలీజ్ టైమ్‌కి కరోనా ‘ఊ’ అంటుందా... ‘రావొద్దు’ అంటుందా అనేది సమ్మర్లో తెలుస్తుంది. ఇక సమ్మర్లో మెయిన్ సీజన్ అయిన ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం. ఏప్రిల్ ఎండలు పుంజుకునే టైమ్‌కి నెల తొలి రోజే రావడానికి రెడీ అవుతున్నాడు ‘ఆచార్య’. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్‌కు ప్రకటించక ముందే ఇదే తేదీని ముందుగా బుక్ చేసుకుంది ‘సర్కారువారి పాట’ చిత్రం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల మహేశ్ కాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కరోనా బారిన పడటం, అలాగే ఈ చిత్రానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్ బారిన పడటంతో ‘సర్కారువారి పాట’ చిత్రం విడుదల ఆగస్టుకు వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1నే విడుదల చేసే సాధ్యాసాధ్యాలను ఈ చిత్రం యూనిట్ పరిశీలిస్తోందని తెలిసింది. మరి.. ఏప్రిల్ 1నే ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ విడుదలవుతాయా? ఏదైనా చిత్రం వాయిదా పడుతుందా? మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు ‘కేజీఎఫ్ 2’ ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ వస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇదే నిర్మాత నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం ‘సలార్’ కూడా ఏప్రిల్ 14 విడుదల జాబితాలో ఉంది. ఈ తేదీని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. అయితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ చిత్రాలకు ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు కాబట్టి, పైగా ‘కేజీఎఫ్ 2’తో పోల్చితే ‘సలార్’ షూటింగ్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. ‘సలార్’ దసరాకు విడుదలయ్యే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఏప్రిల్ 14నే నాగచైతన్య తెరపై కనిపించనున్నారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన చిత్రంతో కాదు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇంకోవైపు సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా çపడిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 3’. వెంకీ–వరుణ్–అనిల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న థియేటర్స్‌కు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా ఇదే తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఎమ్ఎస్ రాజశేఖర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్. ఇక సమంత నటించిన తొలి మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కూడా సమ్మర్ లిస్ట్‌లోనే ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమ గుణ తేదీలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇవే కాదు.. మరికొన్ని మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా ఏప్రిల్ రిలీజ్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. మరి.. సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ మంచి సీజన్ కదా. ఏప్రిల్ వైపు ‘ఆర్ఆర్ఆర్’ చూపు? ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై అన్ని ఇండస్ట్రీస్‌లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని ఏప్రిల్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంటే ‘ఎఫ్ 3’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల విడుదల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. వేసవిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ వేసవికి కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముందుగా విజయ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ‘విక్రమ్’ కూడా ఏప్రిల్‌లోనే రానున్నట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి పార్ట్ వేసవిలోనే రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. -
దటీజ్ యశ్.. ఒకప్పుడు తిండిలేదు.. బస్టాండ్‌లో నిద్ర.. అదే చోట భారీ కటౌట్
యశ్.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన హీరో. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కేజీఎఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్క సినిమాతో యశ్‌కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఈ రోజు యశ్ 36వ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. కేజీఎఫ్ సినిమాలో ఎలా అయితే రాకీ భాయ్ ఒక్కో మెట్టు ఎక్కి డాన్ అయ్యాడో.. అచ్చం అలానే యశ్ కూడా సామాన్యుడి నుంచి స్టార్ దాకా ఎదిగాడు. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. అభిమానులు ముద్దుగా రాకింగ్ స్టార్ అని పిలుసుకుంటారు. జనవరి 8, 1986 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు యశ్.అతని తండ్రి కేఎస్ ఆర్టీసీ రవాణా సేవలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే యశ్‌కి పిచ్చి. మైసూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత వెంటనే సినీమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించి మూడు వందల రూపాయలతో బెంగళూరు వచ్చాడట. బంధువులు ఇంటికి వెళ్లలేక కెంపెగౌడ బస్టాండ్‌లో చాలా రాత్రులు గడిపాడట. ఏదో ఒకరోజు అక్కడ తన కటౌట్ ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సీరియల్స్ అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేక ఆదు యశ్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డును సంపాదించింది. ఇక 2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం. ఐరా అనే కూతురు, యథర్వ్ అనే కొడుకు ఉన్నారు. కూతురు ఐరా 2018 డిసెంబర్లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంట యథర్వ్ కు జన్మనిచ్చింది. కేజీఎఫ్ మూవీతో తిరుగులేని హీరోగా అవతరించాడు యశ్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ నటుడుగా నిలిచాడు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు..తను ఏ బస్టాండ్‌లో అయితే ఆకలితో నిద్రలేని రాత్రులు గడిపాడో.. అదే బాస్టాండ్(కెంపెగౌడ బస్టాండ్)లో యశ్‌కు 216 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. యశ్ 34వ బర్త్‌డే సందర్భంగా ఈ భారీ కటౌట్లో పాటు.. ఏకంగా 5వేల కేజీల భారీ కేకును తీసుకొచ్చారు. అప్పట్లో అది రికార్డుకెక్కింది. ఇండియా వరల్డ్ రికార్ట్స్ యష్ బర్త్ డే కేకును ‘వరల్డ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ బర్త్ డే కేకు’ప్రకటించింది. ఇక గతేడాది విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. తక్కువ సమయంలో మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబడుతూ రికార్డులు కొల్లగొడుతుంది.దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా యశ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో యశ్ సీరియస్ గా కన్పిస్తుండగా, ఆయన ముందు “కాజన్, డేంజర్ ఎహెడ్” అనే బోర్డు కన్పిస్తోంది. మా రాఖీభాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. -
KGF Chapter 2: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే..
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ రికార్డ్సు సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ విడుదలైన టీజర్, పోస్టర్స్‌తో సినిమా ఏ రెంజ్లో అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. కేజీఎఫ్ చాప్టర్ 2 సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. దీని కోసం జీ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తది తరులు కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 locks its official worldwide satellite destination for South languages on ZEE 📺@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7#KGF2SouthOnZee@ZeeKannada @ZeeTVTelugu @ZeeTamil @ZeeKeralam pic.twitter.com/DZ2ROyddc7 — Hombale Films (@hombalefilms) August 20, 2021 -
కేజీఎఫ్-2 : పవర్ఫుల్ లుక్‌లో సంజయ్ దత్
HBD Sanjay Dutt: కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కేజీఎఫ్ ఘన విజయంతో ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం(జులై29)న సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా 'కేజీఎఫ్ 2'లో అధీరాగా విలన్ పాత్ర చేస్తున్న సంజయ్ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. చేతిలో ఖడ్గం పట్టుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న సంజయ్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. యష్, సంజయ్ దత్ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని, ఇది ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురి చేస్తుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై పాన్ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే వెల్లడి కానుంది. "War is meant for progress, even the vultures will agree with me" - #Adheera, Happy Birthday @duttsanjay sir.#KGFChapter2 @TheNameIsYash @VKiragandur @hombalefilms @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @VaaraahiCC @PrithvirajProd @DreamWarriorpic @LahariMusic pic.twitter.com/VqsuMXe6rT — Prashanth Neel (@prashanth_neel) July 29, 2021 -
‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన మేకర్స్
‘కేజీఎఫ్’ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేనవసరం. ఎలాంటి అంచనాలు లేకుండా 2018 విడుదలైన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి సిక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. దీంతో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటనపై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 శాతం ఆక్యూపెన్సితో థియేటర్ల ఓపెనింగ్‌కు ప్రభుత్వాలు అనుమనితిని ఇచ్చాయి. అయినప్పటికీ మేకర్స్ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనే అనుమానంతో సినిమాల విడుదలపై వెనకడుగు వేస్తున్నారు. అంతేగాక థర్డ్‌వేవ్ కూడా పొంచి ఉండటంతో మేకర్స్ డైలామాలో పడుతున్నారు. ఈ క్రమంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ మేకర్స్ తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ‘గ్యాంగస్టర్స్‌తో హాల్ ఎప్పుడైతే నిండిపోతుందో అప్పడే మాన్స్టర్ వస్తాడు. ఆయన వచ్చే తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అంటూ తమదైన శైలిలో మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. కాగా ప్రశాంత్ నీల్‌దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
తెలుగు సినిమా టార్గెట్ @ ఆల్ ఇండియా
తెలుగు సినిమా టార్గెట్ మారిపోయింది. టార్గెట్ ఆల్ ఇండియా అయిపోయింది. పరభాషలకు హాయ్ చెబుతోంది. అన్ని భాషలకూ సరిపోయే కథలతో సినిమాలు తీస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఆన్ సెట్’ మీద డజనుకి పైగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రకటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. భవిష్యత్తు అంతా ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగు పరిశ్రమ ‘ప్యాన్మయం’ కానుంది. ప్రభాస్ ‘బాహుబలి’కి ప్రేక్షకులు భళా అన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజైన ‘బాహుబలి’ బాక్సాఫీస్ రికార్డ్స్ కూడా భళా అనిపించాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇటు తెలుగు ‘బాహుబలి’ అటు కన్నడ ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో దర్శక–నిర్మాతలు, హీరోల టార్గెట్ మారింది. సినిమాల ప్లానింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో జరగడం మొదలైంది. తెలుగులో తొలి ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అంగీకరించిన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. భవిష్యత్‌లో కూడా ప్రభాస్ సినిమా అంటే ఇక అది ప్యాన్ ఇండియన్ మూవీయే అన్నట్లుగా సీన్ మారింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక పవన్ కల్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మూవీ లైన్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానుంది. విదేశీ భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కానుండటం విశేషం. మరో హీరో అల్లు అర్జున్‌కు ఆల్రెడీ మలయాళ పరిశ్రమలో మల్లు అర్జున్ అని పేరు ఉంది. ఇలాంటి క్రేజ్‌నే ఇండియా లెవల్లో సంపాదించుకోవాలని అల్లు అర్జున్ ‘పుష్ప’ అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అంతేకాదు.. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండో భాగం ఆరంభమైంది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, హీరోగా ఎదిగి ‘అర్జున్‌రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి హిట్స్‌తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయిపోయారు. యూత్‌లో విజయ్‌కు ఉన్న ఫాలో యింగ్ మరో ప్లస్. ప్యాన్ ఇండియా సినిమాల ఖాతాలో విజయ్ దేరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ కూడా ఉంది. మరో హీరో అడివి శేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శేష్ ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసిన హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఓ పెద్ద హీరో, ఓ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ అనే ట్రెండ్ నడుస్తోంది. రానున్న రోజుల్లో బహు భాషా చిత్రాల నిర్మాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా... మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కనుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయేది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కమిట్ అయినవి కూడా ప్యాన్ ఇండియన్ మూవీసే. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు శంకర్‌తో ప్యాన్ ఇండియన్ మూవీ కమిటయ్యారు రామ్‌చరణ్. దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్, వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ప్యాన్ ఇండియన్ అప్పీల్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. రానాతో ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు గతంలో ప్రకటిం చారు. దర్శకులు ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్‌లతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని ప్యాన్ ఇండియన్ సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కొన్ని రానున్నాయి. -
KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్’
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ బర్త్‌డే సందర్భంగా జనవరి 7న విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ రోజుల్లోనే 10 లక్షలకు పైగా మంది ఈ టీజర్‌పై కామెంంట్స్ చేశారు. అలాగే 188 మిలియన్స్ వ్యూస్‌ని, 8 మిలియన్స్‌కి పైగా లైకులు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్వీటర్ వేదికగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. ప్రశాంత్ నీల్‌దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా లెంగ్త్ మూడు గంటలకు పైనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ స్టార్ కాస్ట్ ఉండటం కంటెంట్ పరంగానూ ఎక్కువ స్కోప్ ఉండటంతో సినిమాను కాస్త లెంగ్తీగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. -
KGF Chapter 2: రావు రమేశ్ లుక్ వచ్చేసింది
కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. 2018లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన‘కేజీఎఫ్’సినిమాకు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను కేజీఎఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ద్వారా మేకర్స్ అభిమానులతో పంచుకుంటున్నారు . Wishing our #KannegantiRaghavan, #RaoRamesh sir a very Happy Birthday.#KGFChapter2. pic.twitter.com/3iFBNK4EFx — Hombale Films (@hombalefilms) May 25, 2021 తాజాగా టాలీవుడ్ నటుడు రావు రమేశ్ పుట్టినరోజు(మే 25) సందర్భంగా తన రోల్‌పై స్పెషల్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది కేజీఎఫ్ టీమ్. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం . ఈ చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నారు. రాకీ కేసును డీల్ చేసే సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ 'అధీరా' పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. -
దిల్ రాజుకు హ్యాండ్ ఇచ్చిన బన్నీ..నెక్స్ట్ ఆ డైరెక్టర్‌తోనే!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ ఏడాది ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారు? అంటే మొన్నటివరకు కొరటాల శివ పేరు వినిపించింది. కానీ ఎన్టీఆర్ కొత్త సినిమాకు కొరటాల షిఫ్ట్ కావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త ఆలోచనలో పడ్డారట. అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఆల్రెడీ ‘ఐకాన్: కనబడుట లేదు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకంటే ముందు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో బన్నీ సినిమా చేయనున్నారని టాక్. ప్రశాంత్ నీల్, బన్నీ మధ్య ఓ కథ గురించి చర్చలు కూడా జరిగాయని, కాంబినేషన్ కుదిరిందని సమాచారం. ‘ఐకాన్’ కంటే ఈ సినిమాయే ముందు సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వినికిడి. మరి.. అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు దర్శకుడు ఎవరు? అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చదవండి : అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! -
కే జి ఎఫ్ రియల్ చాప్టర్
-
బాప్రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్‌కి అన్ని కోట్లా?
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు భాషల రైట్స్‌కు కూడా నిర్మాతలకు భారీగానే ధరలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ కేజీఎఫ్ చాప్టర్ 2 తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు ఈ వార్త సారాంశం. మొదట కేజీఎప్ 1 తెలుగు హక్కుల్ని దక్కించుకున్న వారాహి సంస్థ .. కేజీఎఫ్ 2 హక్కులను కూడా అడిగిందట. అయితే నిర్మాతలు ఎక్కువ చెప్పడంతో వారాహి సంస్థ తప్పుకుందట. దీంతో దిల్ రాజు రంగంలోకి దిగి తెలుగు హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా రూ.65 కోట్ల భారీ ధరను వెచ్చించినట్లు టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే! -
హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక
సాక్షి,బెంగళూరు : కేజీఎఫ్ హీరో యశ్ వీరాభిమాని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. కర్నాటక మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతేకాదు తాను కేజీఎఫ్‌స్టార్ తోపాటు, కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఇద్దరికీ విపరీతమైన అభిమాననని చెప్పుకున్నాడు. అందుకే వారిద్దరూ తన అంత్యక్రియలకు హాజరుకావాలని, అదే తన చివరి కోరిక అని పేర్కొన్నాడు. ఈ మేరకు రామకృష్ట రాసిన సూసైడ్ నోట్ (కన్నడ)కంటతడి పెట్టిస్తోంది.‘తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేక పోయాను. చివరికి ప్రేమను గెలవడంలో కూడా విఫలమయ్యాను. ఇక జీవితంలో సాధించడానికి ఏమీలేదు’ అంటూ నోట్లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విషయం తెలిసిన సిద్ధరామయ్య రామకృష్ణ మృతదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తన అభిమానిని కలుసుకోవడం బాధగా ఉందన్నారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని సూచించారు. ఫ్యాన్స్ అభిమానమే జవం.. జీవం.. మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది అంటూ హీరో యశ్ ట్విటర్లో స్పందించారు. ఈలలు, చప్పట్లు, ప్రేమను మాత్రమే తాము ఇష్టపడతాం కానీ అభిమానులనుంచి తాము ఆశించేది ఇది కాదంటూ రామకృష్ణ మరణంపై యశ్ సంతాపం ప్రకటించారు. ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನವೇ ನಮ್ಮ ಬದುಕು.. ಜೀವನ.. ಹೆಮ್ಮೆ.. ಆದರೆ ಮಂಡ್ಯದ ರಾಮಕೃಷ್ಣನ ಅಭಿಮಾನಕ್ಕೆ ಹೆಮ್ಮೆಪಡಲು ಸಾಧ್ಯವೇ... ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಕ್ಕೆ ಇದು ಮಾದರಿಯಾಗದಿರಲಿ.. ಕೋಡಿ ದೊಡ್ಡಿ ರಾಮಕೃಷ್ಣನ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ಸಿಗಲಿ... ಓಂ ಶಾಂತಿ... — Yash (@TheNameIsYash) February 18, 2021 -
కేజీఎఫ్ 2 బిజినెస్ అన్ని కోట్లా?
ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ సినిమాగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం బిజినెస్‌కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం ఉంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెజిఎఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా 250 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మాత్రం కేజీఎఫ్ 2 బిజినెస్ భారీగానే జరుగుతుంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
యశ్ కన్నా రాజమౌళే ఎక్కువ సంతోషిస్తారేమో!
నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం.. ఒక రాజులాగా, పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. ‘‘మాటివ్వు.. రాఖీ!’’అమ్మ ఒట్టేయించుకుంది. ‘అలాగే అమ్మా..’ అన్నట్లు చూస్తాడు పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కె.జి.ఎఫ్. చాప్టర్ 1లో హీరో రాఖీ (యశ్).రెండేళ్లయింది ఆ సినిమా వచ్చి. కన్నడ చిత్రం. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లోకి డబ్ అయింది. డబ్బాల కొద్దీ డబ్బు. 80 కోట్లు ఖర్చుపెట్టి తీస్తే 250 కోట్లు వచ్చాయి. సిల్వర్ స్క్రీన్‌ని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ని (కె.జి.ఎఫ్.) తవ్వినట్లుగా తవ్వుకున్నాడు నిర్మాత. హీరో యశ్‌కి అంతకన్నా ఎక్కువే లభించింది. ఫ్యాన్స్! ఫ్యాన్స్ ఉన్నవాడే నిజమైన సూపర్ స్టార్, మెగాస్టార్. రోరింగ్ స్టార్. యశ్ ‘రాకింగ్ స్టార్’ అయ్యాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న 35 ఏళ్ల నవీన్ కుమార్ గౌడ (యశ్) కె.జి.ఎఫ్. కన్నా ముందు పందొమ్మిది సినిమాల్లో కనిపించాడు. 2018 లో వచ్చిన కె.జి.ఎఫ్. 1 అతడి ఇరవయ్యవ సినిమా. అందులో కంటెంట్ ఉంది. ఆ కంటెంటే అతడిని సరికొత్త హీరోగా నిలబెట్టింది. చాప్టర్ 1 తర్వాత ఇప్పుడు చాప్టర్ 2. అక్టోబర్‌లోనే రిలీజ్ కావలసింది. కరోనాతో బ్రేక్ పడింది. త్వరలోనే థియేటర్స్‌కి రాబోతోంది. టీజర్ జనవరి 7న యశ్ బర్త్‌డేకి ఒకరోజు ముందు రిలీజ్ అయింది. 48 గంటల్లో యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్! యశ్‌కి ఎలాగుందో గానీ, ఫ్యాన్స్ కరోడ్పతుల్లా ఫీల్ అయ్యారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడొచ్చాడు మరి హీరో. రెగ్యులర్ హీరోలు, హీరోయిన్లు ఇంకా ఉన్నారు ఈ సినిమాలో. సంజయ్ దత్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రవీనా టాండన్, శ్రీనిధీ శెట్టీ, మాళవికా అవినాశ్. కథలో వీళ్లంతా యశ్ చుట్టూ అల్లబడినవారు. యశ్ అమ్మ చుట్టూ అల్లుకున్నవాడు. అందుకే కె.జి.ఎఫ్..2 టీజర్ అమ్మతో మొదలైంది. ఎ ప్రామిస్ వాజ్ వన్స్ మేడ్.. అని మొదలౌతుంది. అమ్మ తీసుకున్న ప్రమాణం. ‘‘నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు. కానీ చచ్చిపోటప్పుడు మాత్రం.. ఒక రాజులాగా, పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. మాటివ్వు.. రాఖీ!’’. ∙∙ ‘హిస్టరీ టెల్స్ అజ్ ది పవర్‌ఫుర్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. హిస్టరీ వాజ్ రాంగ్. పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్’. టీజర్లో.. పవర్ఫుల్ వాయిస్ ఓవర్. స్థానబలిమి బాహుబలిని చేస్తుందని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెప్పింది తప్పు.బాహుబలులే స్థానానికి బలిమిని తెస్తారు.. అనే గొంతొకటి టీజర్ వెనుక నుంచి యశ్ ఎంతటివాడో చెబుతూ ఉంటుంది.కె.జి.ఎఫ్. సీక్వెన్స్లకీ, వాటి చిత్రీకరణలకు రాజమౌళి భారీ ప్రాజెక్టు బాహుబలితో పీరియడ్ డ్రామా యాక్షన్ పోలికలు తెచ్చాలా టీజర్లో కొన్ని షాట్స్ కంటి నిండుగా కనిపిస్తున్నాయి. యశ్‌కు ఇన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు కదా.. యశ్ పర్సనల్‌గా రాజమౌళి ఫాలోవర్! కెజిఎఫ్ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో యశ్ స్టేజీ మీద మాట్లాడుతూ ఒక కథ చెప్పారు. ఒక రైతు ఉంటాడు. తన పొలంలో మొక్క జొన్న పండిస్తుంటాడు. మేలు రకం పంట అది. విరగబడి కాస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆయనకే ఉత్తమ రైతు అవార్డు వస్తుంటుంది. మీడియా వాళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఆయన ఉన్న పొలం దగ్గరికి వెళ్తారు. ‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’ అని అడుగుతారు. ‘‘నా పంట విత్తనాలను నా ఇరుగు పొరుగు పొలం రైతులకు ఇస్తుంటాను’’ అంటాడు ఆ రైతు. ‘‘అది విజయ రహస్యం ఎలా అవుతుంది? మీరిచ్చిన విత్తనాలతో అంతా మేలు రకం పంటనే పండిస్తారు కదా. అప్పుడు మీ ప్రత్యేక ఏముంటుంది?’’అని ఆశ్చర్యంగా అడుగుతారు. అప్పుడు ఆ రైతు.. ‘‘వాళ్లు నాసిరకం విత్తనాలు వేస్తే పక్షులు వాటిని తీసుకొచ్చి నా పొలంలో వేస్తాయి. అప్పుడు నా పంట కూడా నాసిరకంగా వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు వారికి నేను నా విత్తనాలు ఇస్తున్నాను’’ అని చెప్తాడు. ‘‘మరి మీకు పోటీ అవరా మీ పొరుగు రైతులు’’ అని మీడియా వాళ్లు అడుగుతారు. ‘‘పోటీ అనుకోను. అందరూ బాగా పండిస్తే మంచిదే కదా..’’ అని ఆ రైతు అంటాడు. యశ్ ఈ కథను చెబుతూ.. ‘‘రాజమౌళి గారి గురించే ఆ కథ చెప్పాను. పొరుగు రైతులతో విత్తనాలు పంచుకునే ఆ రైతు రాజమౌళి గారే. ఇండస్ట్రీలో తన ప్రతిభను ఆయన మాలాంటి వాళ్లందరికీ పంచుతున్నారు’’ అన్నారు! కె.జి.ఎఫ్. చాప్టర్ 2 టీజర్ రిలీజ్ అయి, రికార్డు స్థాయిలో వ్యూస్ రాగానే.. ‘కె.జి.ఎఫ్’ మరో ‘బాహుబలి’ అవుతుందా అని రివ్యూలు వచ్చాయి. కొన్ని వెబ్ సైట్లయితే ‘బాహుబలిని మించిపోతుందా?’ అని కూడా రాశాయి. నిజంగానే మించిపోతే యశ్ కన్నా రాజమౌళే ఎక్కువ సంతోషిస్తారేమో. ‘మొక్కజొన్న రైతు’ కదా ఆయన. -
రికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్
కన్నడ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్‌ను యశ్ బర్త్ డే స్పెషల్‌గా గురువారం రాత్రి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ షాట్స్ తో పిచ్చిలేపుతోంది ఈటీజర్. ఇలా విడుదల అయిందో లేదో అలా ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతోంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ టీజర్ చరిత్ర సృష్టిస్తుంది. అత్యదిక వేగంగా 2 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది. వాస్తవానికి జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది. దీంతో జనవరి 7 రాత్రి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన 16 గంటల్లోనే దాదాపు 23 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు దిశగా పయనిస్తోంది. జోరు చూస్తుంటే కచ్చితంగా 50 మిలియన్ క్రాస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక టీజర్ విషయానికొస్తే.. మదర్ సెంటిమెంట్ తో మొదలైంది. చాప్టర్ వన్ లో సీన్స్ ని మరోసారి గుర్తుచేశారు. ‘హిస్టరీ టెల్స్ హజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. అన్ని కుదిరితే మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కే జి ఎఫ్ 2 ఒకేరోజు విడుదల కానుంది. -
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ఈ విషయాలు తెలుసా?
యశ్.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన హీరో. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కెజిఎఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్క సినిమాతో యశ్‌కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఈ రోజు యశ్ 35వ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. అభిమానులు ముద్దుగా రాకింగ్ స్టార్ అని పిలుసుకుంటారు. జనవరి 8, 1986 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు యశ్.అతని తండ్రి కెఎస్ ఆర్టీసీ రవాణా సేవలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. మైసూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత వెంటనే సినీమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తొలూత కొన్ని సీరియల్స్‌లో అవకాశం కొట్టేసిన యశ్.. తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేక ఆదు యశ్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డును సంపాదించింది. ఇక 2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం. ఐరా అనే కూతురు, యథర్వ్ అనే కొడుకు ఉన్నారు. కూతురు ఐరా 2018 డిసెంబర్లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంట యథర్వ్ కు జన్మనిచ్చింది. కేజీఎఫ్ మూవీతో తిరుగులేని హీరోగా అవతరించాడు యశ్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ నటుడుగా నిలిచాడు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక యశ్బర్త్ డే సందర్భంగా విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. తక్కువ సమయంలో మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబడుతూ రికార్డులు కొల్లగొడుతుంది. -
కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!
కేజీఎఫ్ చిత్రం కన్నడ పరిశ్రమతో పాటు.. భారతీయ సినీ చరిత్రలో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాతో రాకీ భాయ్ యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు, అభిమానులను సంపాదించుకున్నారు. యశ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు లభించింది. ఇక సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే హీరోకి అంత ఎక్కువ గుర్తింపు దక్కుతుందనే విషయం ఈ సినిమాతో మరో సారి రుజువయ్యింది. రాకీ పాత్రకు ధీటుగా మెయిన్ విలన్ ‘గరుడ’ పాత్ర కూడా అంతే బాగా ఫేమస్ అయ్యింది. ఇక చిత్రంలో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తికి సంబంధించి ఆసిక్తకర విషయం ఒకటి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్ 1లో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తి పేరు రామ్. వాస్తవానికి అతడు నటుడు కాదు. యశ్‌కు బాడీగార్డ్.. ఎంతో కాలం నుంచి సన్నిహితుడు. ఇక వీరిద్దరూ ఏదైనా చిత్రంలో కలిసి నటించాలని భావించారట. కేజీఎఫ్‌తో ఇద్దరి కల ఒకేసారి నెరవేరింది. (చదవండి: ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర చేయడం లేదు!) ఇక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ గురించి యశ్‌తో చర్చిండానికి వెళ్లినప్పుడు అక్కడ రామ్‌ని చూశారు. ‘గరుడ’ పాత్రకు సరిపోతాడని భావించి.. ఆడిషన్స్‌కి రావాల్సిందిగా కోరారు. సెలక్ట్ కావడంతో గరుడ పాత్రకు తగ్గట్టు మారడం కోసం ఇక రామ్ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాడట. అతడి డెడికేషన్‌కి ముచ్చటపడిన ప్రశాంత్ ‘గరుడ’ పాత్రకి రామ్‌నే ఫైనల్ చేశారు. ఇక ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ 1లో నేను కూడా నటించానని గుర్తుకు వస్తే ఎంతో థ్రిల్లవుతాను. ఈ సినిమాకి నేను సెలక్ట్ అవుతానని కానీ.. ఇంత మంచి పాత్ర చేస్తానని కానీ కల్లో కూడా ఊహించలేదు. సినిమా విడుదలయ్యాకే నా పాత్ర ఎంత కీలకమైందో తెలిసింది’ అన్నారు. ఇక కేజీఎఫ్ సక్సెస్‌తో రామ్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటిలో కార్తి సుల్తాన్ సినిమా ప్రధానమైంది. అలానే ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. (థాంక్యూ డియర్ హజ్బెండ్: రాధిక) ఇక 2018లో విడుదలైన కేజీఎఫ్ కన్నడ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీలో డబ్ అయిన కన్నడ చిత్రాల్లో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగానే కాక పాకిస్తాన్లో విడుదలైన తొలి కన్నడ చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుగుతుంది. ఇక రెండవ భాగంలో సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 8న కేజీఎఫ్2 టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. -
కేజీఎఫ్-2; యశ్ అభిమానులకు సర్ప్రైజ్
కన్నడ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్-2’. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. తాజాగా యశ్ అభిమానులకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బిగ్ సర్ప్రైజ్ అందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న కేజీఎఫ్-2 నుంచి స్టన్నింగ్ లుక్‌ను సోమవారం విడుదల చేశాడు. ‘సామ్రాజ్యం తలుపు తెరవడానికి కౌంట్‌డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని ఒక చేతిలో కర్ర పట్టుకొని హీరో యశ్ చీకట్లో దర్జాగా కూర్చున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. దీనితోపాటు టీజర్ విడుదల తేదిని ప్రకటించారు. జనవరి 8న కేజీఎఫ్2 టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. యశ్ ఫోటో నెట్టింటా వైరలవుతోంది. అంతేగాక కేజీఎఫ్ చాప్టర్2 హ్యష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. చదవండి: కేజీఎఫ్2 సర్ప్రైజ్ : యశ్ బర్త్‌డే గిఫ్ట్ కాగా కేజీఎప్ 2 చిత్రాన్ని వారాహి చలన చిత్రం తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా 2018లో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్1కు సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఇందులో రాఖీ భాయ్‌గా యశ్.. పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మాళవిక అవినాష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న కేజీఎఫ్-2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హీరో యశ్, సంజయ్ దత్‌లపై చిత్రీకరించే భాగం పూర్తి చేసుకోగా ఫైనల్ షెడ్యూల్ జనవరిలో పూర్తి కానుంది. ఇందుకు రామోజీ ఫిల్మీ సిటీలో భారీ సెట్ వేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి సంచలనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ చిత్రం రూ. 200 కోట్ల వసూళ్ళు రాబట్టి చరిత్ర సృష్టించడంతోకేజీఎఫ్ 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. The countdown to the opening of the empire door begins now!#KGFChapter2TeaserOnJan8 at 10:18 AM on @hombalefilms@VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84 @Karthik1423 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC pic.twitter.com/nbGU2mrR1M — Prashanth Neel (@prashanth_neel) January 4, 2021 -
కేజీఎఫ్2 సర్ప్రైజ్ : యశ్ బర్త్‌డే గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: మోస్ట్ ఎవైటెడ్ మూవీ కేజీఎఫ్-2 నుంచి మరో సర్ఫ్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. సోమవారం ఈ సినిమాకు సంబంధించి గ్లింప్లెస్ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా జనవరి 8న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. జనవరి 8 ఈ మూవీ హీరో యశ్ పుట్టిన రోజు కూడా. ఆయన బర్త్ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అందించనున్నారన్నమాట. కేజీఎఫ్ సినిమా భారీ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, హీరో యశ్ కేజీఎఫ్ చాప్టర్2 ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కేజీఎఫ్2 పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు కేజీఎఫ్-2 ద్వారా సమాధానం దొరకనుందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి కీలక ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు. -
కేజీఎఫ్2 : స్పెషల్ సర్ప్రైజ్ ఆ రోజే
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియన్ చిత్రం ‘కేజీఎఫ్’. 2018 డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. యశ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ‘కేజీఎఫ్-2’ నుంచి యశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్రబృందం.. మరోసారి కూడా అదే సెంటిమెంట్‌ను రీపీట్ చేసేందుకు సిద్దమవుతోంది. తమకి ఎంతో కలిసొచ్చిన డిసెంబర్ 21న ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఓ ట్వీట్ పెట్టారు. ‘‘కేజీఎఫ్-2’ ముగింపునకు మేము చేరువలో ఉన్నాం. ప్రతిఏడాది డిసెంబర్ 21న అభిమానుల్ని సర్ప్రైజ్ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నాం. మా అధికారిక సోషల్‌మీడియా ఖాతాల వేదికగా.. డిసెంబర్ 21న ఉదయం 10.08 గంటలకు మేము స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని చిత్రబృందం పేర్కొంది. రాకీభాయ్ ఇచ్చే స్పెషల్ సర్ప్రైజ్ఏంటో తెలియాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. Here's the much anticipated news of the year! The wait is over! This is for all our crazy fans out there. #KGFChapter2@VKiragandur @TheNameIsYash @prashanth_neel @hombalefilms @duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @Karthik1423 pic.twitter.com/Z7EdeXkzjG — Prashanth Neel (@prashanth_neel) December 19, 2020 -
కేజీఎఫ్ కాంబినేషన్లో ప్రభాస్ ‘సలార్’
హీరో ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు పేరు ఖరారు అయింది. ఈ సినిమాకు ‘సలార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ (కేజీఎఫ్ మూవీ ప్రొడ్యూసర్) నిర్మించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో’ఆదిపురుష్’, తెరకెక్కబోతుంది. సలార్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. (బిగ్ ఎనౌన్స్మెంట్: కేజీయఫ్ కాంబినేషన్లో ప్రభాస్) -
ప్రయాణం మళ్లీ మొదలైంది
కన్నడ యాక్షన్ చిత్రం ‘కేజీయఫ్ – ఛాప్టర్ 1’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంత అలరించిందో తెలిసిందే. దాంతో ఈ సినిమా రెండో భాగంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలు అందుకునే రీతిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యష్ ముఖ్య పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజీయఫ్’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ఈ సినిమా రెండో భాగం ‘ఛాప్టర్ 2’ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు యష్. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘అలల్ని ఆపలేం. కానీ వాటి మీద ఎదురీదడం నేర్చుకోవచ్చు. చిన్న విరామం తర్వాత రాకీ భాయ్ ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు’ అని ట్వీట్ చేశారు యష్. ఈ సినిమాలో రాకీ భాయ్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. -
అధీరా ఆగయా.. భయానకంగా సంజు గెటప్
కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ ఎంటర్టైనర్లో యశ్ కథానాయకుడిగా నటించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఈ మూవీలో విలన్ అధీరా పాత్రను బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విలన్ అధీరా ఫస్ట్ లుక్ విడుదలైంది. బుధవారం సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అధీరా ఎంత క్రూరుడో.. ఈ లుక్‌లోనే చెప్పేసింది చిత్రబృందం. అత్యంత పాశవికంగా, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ కూడా అలాగే ఉంది. (సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?) ముఖం మీద టాటూ, డిఫరెంట్ హెయిర్ స్టైల్, చేతిలో పెద్ద కత్తిలో సంజయ్ దత్ లుక్ భయానకంగా ఉంది. ఈ లుక్‌ను విడుదల చేసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు. తదుపరి షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం’అన్నారు. యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్ ఈ సినిమాలో రవీనా టండన్ హీరోయిన్గా నటిస్తోంది. రవీ బస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. -
ఎల్లుండి కేజీఎఫ్ 2 నుంచి సర్ప్రైజ్
యంగ్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ చిత్రం 'కేజీఎఫ్'. ఈ సినిమాతో అతను పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాను అద్భుతంగా మలిచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం "కేజీఎఫ్: చాప్టర్ 2"ను తెరకెక్కిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో రాకీ భాయ్ (యశ్) సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. ఈ సినిమా నుంచి అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ బయటకొచ్చింది. (రవీనా ఆగయా) క్రూరత్వాన్ని పరిచయం చేయబోతున్నాం.. అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అరివీర భయంకర రాక్షసుడు 'అధీర' లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా జూలై 29న ఉదయం 10 గంటలకు నరనరాన రాక్షసత్వం నింపుకున్న అధీర లుక్‌ను లేదా కొన్ని సెకండ్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవేళ అన్‌లాక్ 3.0లో ప్రభుత్వం థియేటర్లకు అనుమతిస్తే, చెప్పిన తేదీకే కేజీఎఫ్ 2 థియేటర్లలో సందడి చేయనుంది. (ఇన్నాళ్లకు కొడుకును చూపించిన హీరో) -
మిస్సైల్
ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘న్యూక్లియర్’ లేదా ‘మిస్సైల్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో రామ్‌చరణ్ మరో హీరో. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసే సినిమా ఆరంభమవుతుందని తెలిసింది. -
కేజీఎఫ్–2 చైల్డ్ స్టార్.. సేవకు సలాం
మనం బతకడానికి సమాజం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనకంటూ ఒక స్థాయిని ఇస్తుంది. అలాంటి సమాజం రుణం తీర్చుకునే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే సాధారణ జీవితం.. సార్థకం అవుతుంది. చిన్న వయసులోనే ఆ ఘనత సాధించగలిగాడు సిటీ కుర్రాడు భాను ప్రకాష్(7). సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపుతెచ్చుకుంటూ కేజీఎఫ్–2 లాంటి పెద్ద సినిమాలోనూకనిపించబోతున్న ఈ చైల్డ్స్టార్.. టాలెంట్ చూపించడంలో మాత్రమే కాదు సమాజానికి తిరిగి ఇవ్వడంలో కూడావయసుకు మించిన పరిణితి చూపిస్తున్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నార్థులకు, అభాగ్యులకుఆసరాగా నిలుస్తున్నాడు. ఈ కుర్రాడికి తోడుగా నిలిచిన సేవాహృదయాలు కలిసి టీమ్ ఎఫ్ఎమ్గా ఏర్పడటంతో సిటీలో విభిన్న రూపాల్లో సేవా స్ఫూర్తిని పంచుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయంలో సిటీలో 53 రోజులుగా నిత్యాన్నదానాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. టీమ్ ఎఫ్ఎమ్ పేరుతో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలకు తండ్రి సురేష్ అమాస అండగా నిలుస్తున్నారు. ‘లాక్‌డౌన్‌తో పాటే మొదలైన దినసరి కూలీలు, నిరుపేదల ఆకలి ఆర్థనాదాలు నన్ను టీమ్‌ని కదిలించాయి. సాటి మనుషులు ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడటాన్ని జీర్ణించుకోలేకపోయా’ అంటున్న తండ్రి సురేష్.. అనూహ్యంగా సక్సెస్ అయిన తన చిన్నారి ద్వారా వచ్చిన ప్రతిపైసా సద్వినియోగం చేయడానికి ఇదే సమయం అనుకున్నారు. ఈ విషయం భాను ప్రకాష్‌కి కూడా అర్థమయ్యేలా చెప్పి.. అన్నార్తుల ఆకలి తీర్చే ఒక ఫుడ్ మొబైల్ వ్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 53 రోజులుగా సిటీలో ఎక్కడ ఆకలి ఉందని తెలిస్తే అక్కడికెళ్లి భోజనం అందించారు. అలా ప్రతిరోజు దాదాపు 500 మందికి పైగా కడుపునింపారు. వీరికి తోడయ్యారు ఔత్సాహిక సినీనటులు మణికంఠ వారనాసి, ఎస్ఎమ్ఎస్ సురేష్‌లు. సేవల్ని విస్తరిస్తూ.. ఈ బృంద సభ్యులు టీమ్ ఎఫ్ఎమ్(ఫ్రీ మీల్స్) పేరుతో ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లోని సినిమా కార్మికులకు (నాన్ కార్డ్ హోల్డర్స్) ప్రతిరోజూ మీల్స్‌ని అందించారు. సోమాజిగూడ, నందినీహిల్స్, బోరబండ ప్రాంతాల్లో అన్నార్థులకు స్వయంగా వండిన ఆహారాన్ని అందించారు. సోమాజిగూడ పార్క్ హయత్ దగ్గరలోని బస్తీ వాసులకు ఈ 50 రోజుల్లో నిత్యావసర సరుకులు నింపిన 1500 కిట్స్ అందించారు. అంతేగాకుండా మేడ్చల్, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలోని వలస కూలీలకు ఫుడ్ వండి వడ్డించారు. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులకు పండ్లు, మజ్జిగ, భోజనాలను సమకూర్చారు. ప్రతినిత్యం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన తమ స్నేహితులు కొందరు ఆర్థికంగా సహకారం అందించారని బృంద సభ్యులు తెలిపారు. వలస కూలీలకు బాసటగా.. ఈ విపత్కర పరిస్థితుల్లో సొంత ఊరికి చేరాలనుకున్న ఎంతో మంది వలస కూలీలకు ఆ మార్గంలో ఆకలి అవరోధంగా మారింది. చిన్నపిల్లలతో కలిసి వందల కిలోమీటర్లు నడిచి వివిధ ప్రాంతాల్లోని తమ గ్రామాలకు చేరుకున్న కుటుంబాలు ఎన్నో.. అలాంటి వారికి కూడా సాయం అందించాలనే తపనతో, పోలీసువారి అనుమతితో ఎన్నో కుటుంబాలను వారి ప్రాంతాలకు చేరుకునేందుకు వాహనాలు సమకూర్చారు. ఈ విధంగా నగరం నుంచి కర్నూలు, ఖమ్మం, మహబూబ్‌నగర్, రాజమండ్రిలాంటి తదితర ప్రాంతాలకు ఎంతో మందిని తమ వ్యాన్ సహాయంతో చేరవేసి వారధులుగా నిలిచారు. వెండితెరపై ప్రకాశిస్తున్న ‘భాను’డు ఈ మధ్య వచ్చిన సరిలేరునీకెవ్వరు, వెంకీమామ, కథానాయకుడు, మిస్టర్ మజ్ను, ఒక్క క్షణంలాంటి 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు భానుప్రకాష్. ప్రస్తుతం కేజీఎఫ్–2, నాగచైతన్య లవ్‌స్టోరిలో కూడా మెరవనున్నాడు. సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు, సీరియల్స్, నాటకాలు, తదితర రంగాల్లో తన నటనతో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తన తండ్రి సురేష్ కూడా సినిమా రంగానికి చెందినవాడే.. సురేష్ 30కి పైగా షార్ట్ మూవిస్ చేశాడు. హార్ట్ బీట్ అనే ఇండిపెండెంట్ సినిమా చేశాడు. -
'కేజీఎఫ్' అభిమానులకు షాక్! వచ్చే ఏడాదికి..
కరోనా వైరస్ దేశ వాసుల ప్రాణాలపై ఏమాత్రం కనికరం చూపడంలేదు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ ఈ మహమ్మారి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం సినిమా షూటింగ్‌లపై మాత్రమే కాకుండా.. విడుదల తేదీలపై కూడా పడింది. దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కేజీఎఫ్-2 సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. (ఫైట్స్ బ్యాలెన్స్ గురూ) ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకున్న 'కేజీఎఫ్: చాప్టర్2'ను 2021కి వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో కేజీఎఫ్-2 సినిమా షూటింగ్ సైతం ఆగిపోయింది. దీంతో తిరిగి చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది తెలియకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ చిత్రానికి సీక్వెల్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ('ఆయన మరణం తీరని లోటు') -
ఫైట్స్ బ్యాలెన్స్ గురూ
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 2’. 2018లో వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. యశ్ ఈ చిత్రంలో రాMీ భాయ్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాకు సంబంధించి రెండే రెండు ఫైట్స్ మినహా టాకీ పార్టు ఆల్మోస్ట్ పూర్తయిందని శాండిల్‌వుడ్ సమాచారం. ఇక కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఈ బ్యాలెన్స్ షూట్లో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించాల్సి ఉంది. ఒక ఫైట్ యశ్, సంజయ్‌దత్‌ల మధ్య ఉంటుంది. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా ‘కేజీఎఫ్:చాప్టర్’ 2 చిత్రాన్ని అక్టోబరు 23న విడుదల చేయాలనుకుంటున్నారు. -
కేజీఎఫ్ @ డ్రోన్
కేజీఎఫ్: ఒకనాటి బంగారు సీమ కేజీఎఫ్‌లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రజలు ఏ మూలన సంచరిస్తున్నా పసిగట్టేలా డ్రోన్‌ను ఆకాశంలో తిప్పుతూ పర్యవేక్షిస్తున్నారు. బంగారుపేట తాలూకా, కేజీఎఫ్ తాలూకా మొత్తం డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు ఎస్పీ సుజీత మహమ్మద్ తెలిపారు. లాక్డౌన్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో పోకిరీలు గుమిగూడకుండా డ్రోన్‌తో పరిశీలించారు. -
శానిటైజర్ వేసి సీట్లను తుడిచిన స్టార్ నటి!
-
శానిటైజర్‌తో సీట్లను తుడిచిన స్టార్ నటి!
ముంబై: కరోనా భయాల నేపథ్యంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె ఇటీవల బాంద్రాకు రైల్లో వెళ్తున్న సమయంలో.. ట్రైన్‌లోని క్యాబిన్‌ను శానిటైజర్ వేసి శుభ్రం చేశారు. ముఖానికి ఫేస్ మాస్కు ధరించి సీట్లను క్లీన్ చేస్తున్న వీడియోను ఆమె అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. విచారం వ్యక్తం చేయాల్సిన అవసరమండదని ఆమె పేర్కొన్నారు. ‘మేం కూర్చుండే చోటును.. శానిటైజర్ వేసి శుభ్రం చేశా. సౌకర్యంగా అనిపించింది. చాలా అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీకు మీరే అతి ప్రధానం, అది గుర్తుంచుకోండి’ అని అన్నారు. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో వచ్చే వారమంతా పనులను తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. రోజూవారి పనులను సాకుగా చూపుతూ పరిశుభ్రతకు దూరంగా ఉండొద్దని చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి కరోనా బారిన పడకుండా.. జాగ్రత్త చర్యల్లో మాస్కులు ధరించండి. వాటిని ముందునుంచి తాకకుండా.. తొలగించండి. వీలైతే చేతులకు గ్లౌవ్స్ కూడా ధరిస్తే మంచిది. ఎందుకంటే డోర్ నాబ్స్, హ్యాండిల్స్‌కు చాలా బాక్టీరియా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉండి ఇతరులకు ఇబ్బంది కలగించొద్దు’అని మరో పోస్టులో ఆమె పేర్కొంది. కాగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘కేజీఎఫ్-2’లో రవీనా నటిస్తోంది. -
దసరాకు రాకీ భాయ్ వస్తున్నాడు
రెండేళ్ల క్రితం వెండితెరపై రాకీ భాయ్ సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు తెలిసింది. ఇప్పుడు రాకీ భాయ్ మళ్లీ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 2’. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో రాకీ పాత్రలో నటించారు యష్. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘అధీర పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్, రవీనాటాండన్, యశ్‌లపై చిత్రీకరించిన సన్నివేశాలతో ఈ సినిమా మేజర్ షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ గౌడ కెమెరామేన్. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. -
కేజీఎఫ్ 2 : డేట్ గుర్తుపెట్టుకోండి
కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్-2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘అధీరా’ పాత్రలో నటిస్తుండగా, రవీనాటండన్ ‘రమికా సేన్’ అనే పాత్రలో కనిపించనుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం శుక్రవారం వెల్లడించింది. కేజీఎఫ్-2ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2018లో వచ్చిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) తొలి భాగం సూపర్ డూపర్ హిట్టైన విషయం తెలిసిందే. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులు సృష్టించి బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దక్షిణాది పరిశ్రమ ఖ్యాతిని సగర్వంగా చాటిచెప్పింది. అమెజాన్ ప్రైమ్‌లోనూ అత్యధికులు వీక్షించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇందులో యశ్ చేసిన రాకీభాయ్ పాత్రకు విశేష ఆదరణ దక్కింది. ఈ చిత్రంతో యువ హీరో యశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మొదటి దాన్ని మించిపోయేలా కేజీఎఫ్ రెండో భాగాన్ని రూపొందిస్తున్నామని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు రవిబాసుర్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మరిన్ని భారీ అంచనాల్ని నెలకొల్పాయి. (వరల్డ్ రికార్డు సృష్టించిన హీరో బర్త్ డే కేకు!) -
‘నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు’
కేజీఎఫ్ స్టార్ యశ్, ఆయన భార్య రాధికా పండిట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ఈ స్టార్ కపుల్ తమకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటారు. కాగా బుధవారం మైసూరు జిల్లాలోని నంజనగూడిలోని శ్రీకంఠేశ్వర ఆలయంలో యశ్ దంపతులు తమ కూతురు ఐరాకు కేశ ఖండన చేయించారు. ఈ క్రమంలో యశ్ ఐరాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. గుండుతో ఉన్న ఐరా తండ్రిని కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోకు... ‘‘ ఐరా: నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు.. కానీ ఇది సమ్మర్ కట్ కాదని కచ్చితంగా చెప్పగలను!!! డాడ్: పర్లేదు.. నాన్నా!!’’అంటూ క్యాప్షన్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ తండ్రీ, కూతుళ్ల ‘సంభాషణ’కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘ఐరా కూడా మీలాగే ఎంతో క్యూట్‌గా ఉంది. తనలా ముద్దుముద్దుగా మాట్లాడితే వినాలని ఉంది’’అని అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కేజీఎఫ్ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ప్రస్తుతం కేజీఎఫ్: చాప్టర్ 2తో బిజీగా ఉన్నాడు. ప్రాణాంతక వైరస్ కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన ఈ కన్నడ హీరో.. వ్యక్తిగత శుభ్రత పాటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో ఇటీవల తన భార్య రాధిక 35 పుట్టినరోజు సందర్బంగా వేడుకలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాడు. కాగా వివిధ సినిమాల్లో కలిసి నటించిన యశ్- రాధిక 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, ఓ కొడుకు సంతానం. View this post on Instagram Ayra : Dad I know its summer... but I'm damn sure THIS is NOT summer cut!!! Dad : Well... ahem!! 😬 A post shared by Yash (@thenameisyash) on Mar 11, 2020 at 2:43am PDT -
ఆర్ఆర్ఆర్తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ
హైదరాబాద్ : మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీతో కేజీఎఫ్-2 ఢీకొంటుందన్న ఊహాగానాలపై రాకింగ్ స్టార్ యష్ స్పందించారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోవని స్పష్టం చేశారు. ‘అలాంటి పిచ్చిపని తాము చేయబోమని, ఆర్ఆర్ఆర్ టీంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో వారి సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో ముందుగానే తముకు ఆ విషయం చెప్పారని, అదే సమయంలో మీరు కేజీఎఫ్ 2ను రిలీజ్ చేయదల్చుకుంటే రిలీజ్ షెడ్యూల్ మార్చుకోవాలని సూచించారని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిన క్రమంలో ఆ విషయం వారు తమకు తెలిపారని, తమ రిలీజ్ ప్రణాళికలను తెలుసుకున్నారని వెల్లడించారు. రెండూ పాన్ ఇండియా సినిమాలేనని, హిందీలో ఈ రెండు మూవీలకు హిందీలో అనిల్ తడానీ డిస్ర్టిబ్యూటర్‌గా ఉన్నారని చెప్పారు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి తలపడవని, ఈ రకమైన ప్రచారం మీడియా ఊహాగానమేనని తేల్చిచెప్పారు. ఇలాంటి వార్తలను చూసి తాము నవ్వుకుంటామని అన్నారు. చదవండి : ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే.. -
‘కేజీఎఫ్-2’ కీలక పాత్రలో రావు రమేష్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సౌత్ ఇండస్ట్రీలో సంచనలం సృష్టించి బాక్సాఫిక్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో యశ్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వేల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో అందరి చూపు రెండవ భాగం చాప్టర్-2 పైనే ఉంది. దీంతో సెంకడ్ పార్టులో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్లు మెరవబోతున్నారు. ఇప్పటికే పవర్‌పుల్ యాక్టర్ సంజయ్‌దత్ విలన్ అధీర పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్లో బాలీవుడ్ యాక్టర్ రవీనా టాండన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రవీనా టాండన్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. (రవీనా ఆగయా) Welcome on board Rao Ramesh sir. We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen. Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm — Prashanth Neel (@prashanth_neel) February 10, 2020 కాగా ప్రస్తుతం కేజీఎఫ్-2లో టాలీవుడ్ వర్సటైల్ నటుడు రావు రమేష్ నటిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘కేజీఎఫ్-2 షూటింగ్‌కు స్వాగతం. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. కేజీఎఫ్-2లో భాగస్వామ్యమైనందుకు రావు రమేష్‌కు థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన పాత్ర తెరపై ఎలా ఉంటుదనేది ఆసక్తి కరంగా మారింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాసుర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
రవీనా ఆగయా
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్ :2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. ‘కేజీయఫ్’ చిత్రం తొలి భాగం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. రెండో భాగంలో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవీనాటాండన్ ‘రమికా సేన్’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ∙రవీనా, ప్రశాంత్ నీల్ -
హీరో బర్త్‌డే: 5 వేల కిలోల కేకు..భారీ కటౌట్!
కన్నడ రాకింగ్ స్టార్, కేజీఎఫ్ హీరో యష్ జనవరి 8న 34వ పుట్టినరోజును జరుపుకొన్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యష్ అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం బెంగుళూరులో భారీగానే సన్నాహాలు చేశారు. తమ అభిమాన రాక్‌స్టార్ బర్త్ డే కోసం ఏకంగా 5వేల కేజీల భారీ కేకు, 216 అడుగుల కటౌట్‌తో నగరం నడిబొడ్డున ఓ పండుగలా సందడి చేశారు. మొత్తం 20వేల మంది అభిమానుల మధ్య ఈ భారీ కేకును యష్... యష్ రాకింగ్ ఫ్యాన్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 7వ తేది అర్థరాత్రి తన భార్య రాధికతో కలిసి కట్ చేశారు. కాగా ఈ అతిపెద్ద కేకును యష్ అభిమాని వేణు గౌడ బెంగుళూరులోని నయందహళ్లి నందిలిక్స్ గ్రౌండ్స్‌లో తయారు చేయించాడు. ಆಯ್ತು ಕಣ್ಣ್ರೋ!! We did it!! A world record for Namma Boss na birthday!! Happy birthday #RockingStar @TheNameIsYash! ಈ ದಶಕ ಗೆಲವು ನಿಮ್ಮದೆ!!#rockinghabba2020 #happybirthdayyash pic.twitter.com/s4bTFwGAS3 — Worldwide Yash Fans (@OfficialYashFc) January 8, 2020 ఇక ఈ కేకు కోసం 1800 వందల కేజీ మైదా పిండి, 1150 కేజీ చక్కెర, 1750 కిలోల క్రీమ్, 22,500 గుడ్లు, 50కేజీల డ్రై ఫ్రూట్స్, మరో 50 కేజీ నెయ్యి పదార్థాలను ఉపయోగించారు. బేకరి వర్కర్స్, అభిమానులు దాదాపు 50 గంటలపాటు శ్రమించి దీనిని తయారు చేశారు. అదేవిధంగా అన్ని భాషల్లో సూపర్ హిట్టు అయిన.. కేజీఎఫ్ సిరీస్ ‘కేజీఎఫ్-2’లో రాకీభాయ్‌గా గొడ్డలి పట్టుకుని కోపంగా చూస్తున్న యష్ పోస్టర్‌ను 216 అడుగుల కటౌట్ రూపొందించారు. ఈ సందర్భంగా ఇండియా వరల్డ్ రికార్ట్స్ యష్ బర్త్ డే కేకును ‘వరల్డ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ బర్త్ డే కేకు’ గా ప్రకటించినట్లు అభిమానులు తెలిపారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా యష్ పుట్టిన రోజున ఆయన భార్య రాధిక, కూతురు అయిరా స్పెషల్ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కూతురితో కలిసి కేకును తయారు చేసిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram Boss Birthday Cake Preparations😍🔥 Location :- NANDI LINKS GROUND NAYANDAHALLI Time :- TUESDAY 7 JANUARY MIDNIGHT TO JANUARY 8 EVENING. . . #yash #thenameisyash #yashboss #birthdaycake #birthdaytime #sandalwood #kfiofficial #kfi #kannadacinema #radhikapandit #zeekannada #starsuvarna #colorskannada #zeemusiccompany #laharimusic #yashika #ayrayash #kgf2 #kgfchapter2 #prashanthneel #ayrayash #ayra #radhikayash #yashradhika #gandhinagar #mysore #mandya #hubli A post shared by Rocky Bhai Yash (@rockybhaiyash) on Jan 7, 2020 at 6:22am PST -
రాకీ భాయ్ ఈజ్ బ్యాక్
‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం అందించింది. రెండో పార్ట్‌కోసం ఈ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదలైన మొదటి వార్షికోత్సవానికి సెకండ్ పార్ట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కైకాల సత్యనారాయణ సమర్పణలో విజయ్ కిర గందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. యష్ చేసిన రాకీ భాయ్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ‘సామ్రాజ్యాన్ని సరికొత్తగా నిర్మిస్తూ’ అనే క్యాషన్‌తో విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది. -
అదిరిపోయిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఫస్ట్‌లుక్
సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కేజీయఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో కన్నడ స్టార్ యశ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వేల్‌గా కేజీయఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కేజీఎఫ్ మొదటి భాగం (21 డిసెంబర్ 2018) విడుదలైన సరిగ్గా ఏడాదికి గుర్తుగా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘సామ్రాజ్యం పునర్నిర్మితమవుతుంది’ అంటూ కేజీయఫ్‌లో పనిచేసేవారితో పెద్ద స్తంభాన్ని లాగుతూ యశ్ కనిపించారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేదిగా ఉంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి రవి బాసుర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.