
కేజీఎఫ్ పట్టణం విహంగ వీక్షణం
కేజీఎఫ్: ఒకనాటి బంగారు సీమ కేజీఎఫ్‌లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రజలు ఏ మూలన సంచరిస్తున్నా పసిగట్టేలా డ్రోన్‌ను ఆకాశంలో తిప్పుతూ పర్యవేక్షిస్తున్నారు. బంగారుపేట తాలూకా, కేజీఎఫ్ తాలూకా మొత్తం డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు ఎస్పీ సుజీత మహమ్మద్ తెలిపారు. లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో పోకిరీలు గుమిగూడకుండా డ్రోన్‌తో పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment