హీరో 'యశ్‌' కోసం వెళ్తూ మరో యువకుడు మృతి | KGF Actor Yash One More Fan Died In Road Accident, Details Inside - Sakshi
Sakshi News home page

Actor Yash Fan Death: హీరో 'యశ్‌' కోసం వెళ్తూ మరో యువకుడు మృతి

Published Tue, Jan 9 2024 11:25 AM | Last Updated on Tue, Jan 9 2024 11:59 AM

Actor Yash One More Fan Died - Sakshi

కన్నడ స్టార్‌ హీరో యశ్‌కు చెందిన మరో అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనవరి 8న ఆయన పుట్టినరోజు నాడు ఫెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) విద్యుత్‌ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.. సమాచారం తెలుసుకున్న యశ్‌ దిగ్భ్రాంతి చెందాడు. దీంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానం ద్వారా గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడకు నిన్న చేరుకున్నారు. 

(ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్‌ మృతి.. ఆ కుటుంబాల బాధ్యత నాదంటూ కన్నీరు పెట్టుకున్న యశ్‌) 

గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి తమ అభిమాన హీరో యశ్‌ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్‌ భారీ ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో అప్పటికే అక్కడ 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఆ సమయంలో నిఖిల్ కరూర్ (22) అనే యువకుడు యశ్‌ను చూసేందుకు స్కూటీలో అక్కడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం వెంటనే  ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నిఖిల్ కరూర్ అనే యువకుడు కొంత సమయం క్రితం మృతి చెందాడు. బింకడకట్టి గ్రామానికి చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జనవరి 8న సాయంత్రం గడగ్‌లోని తేజ నగర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యువకుడు పోలీసు వాహనాన్ని ఢీకొనడంతో స్కూటీ విడిభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement