KGF Chapter 2 Movie: Meet 19 Year Old Boy Ujwal Kulkarni Who Turns KGF2 Editor, Details Inside - Sakshi
Sakshi News home page

KGF Chapter2: కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ 19ఏళ్ల టీనేజర్‌ అని మీకు తెలుసా?

Published Fri, Apr 15 2022 8:42 AM | Last Updated on Fri, Apr 15 2022 9:35 AM

KGF Chapter2: Meet 19 Year Old Boy Ujwal Kulkarni Who Turns KGF2 Editor - Sakshi

కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ గురువారం(ఏప్రిల్‌14)న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  స్టార్‌ మీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈసినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. చదవండి: సాక్షి ఆడియన్స్‌ పోల్‌.. 'కేజీఎఫ్‌-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ

కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించడంలో మేకర్స్‌ ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు స్టార్ ఎడిట‌ర్ ప‌నిచేసి ఉంటాడ‌ని అంతా అనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదు. ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు. అవును.. మీరు చదివింది నిజమే. ఉజ్వల్ కుల్‌కర్ణి అనే ఈ కుర్రాడు గ‌తంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు.

అయితే కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌కి అతను చేసిన కొన్ని ఫ్యాన్‌ ఎడిట్స్‌ ప్రశాంత్‌ నీల్‌కు బాగా నచ్చాయి. దీంతో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2కి ఎడిటింగ్‌ బాధ్యతలను అప్పగించాడు. అందుకు తగ్గట్లే ఉజ్వల్‌ కూడా హాలీవుడ్‌ రేంజ్‌లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్‌లో ఉజ్వల్‌ పాత్ర చాలా కీలకంగా మారింది. ఇంత త‌క్కువ వ‌య‌స్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిట‌ర్‌గా ప‌నిచేయ‌డం నిజంగా ఉజ్వ‌ల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు నెటిజన్లు. చదవండి: ‘కేజీయఫ్‌ 2’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement