బెంగళూరు : సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత‍్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యశ్‌ను ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సిక్వేల్‌గా కేజీఎఫ్-2 నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడు అధిరా పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. డిసెంబర్ 21న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. అంటే కేజీఎఫ్ మొదటి భాగం (21 డిసెంబర్ 2018) విడుదలైన సరిగ్గా ఏడాదికి గుర్తుగా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయననున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. యశ్‌కు జోడిగా శ్రీనిది శెట్టి నటిస్తున్న ఈ మూవీలో రవినా టండన్, అనంత్ నాగ్, మాళవిక అవినాష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
Perfect time for celebrations!!!!
We are absolutely elated to unveil the #KGFChapter2 First Look on Dec 21st.#KGFChapter2FirstLook @TheNameIsYash @prashanth_neel@duttsanjay @VKiragandur @SrinidhiShetty7 @bhuvangowda84 @BasrurRavi @hombalefilms pic.twitter.com/vKSFrWRjEM
— Prashanth Neel (@prashanth_neel) December 14, 2019
Comments
Please login to add a commentAdd a comment