Drone camera
-
నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్‌స్టర్ పారిస్‌కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. -
డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
సాక్షి, అమరావతి: ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి, ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారి చేసి.. వాటిని చంపేసే వ్యవస్థను 2019కి ముందు ఉపయోగించాం. మళ్లీ అదే వ్యవస్థను తీసుకు వచ్చి డ్రోన్లతో దోమలను చంపేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. తొమ్మది మంది డయేరియాతో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు 2014 నుంచి 2019 మధ్య అనుసరించిన విధానాలను మళ్లీ అనుసరించాలని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోక పోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. రక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించబోనన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో మూడు శాఖలు సమన్వయంతో పని చేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, మూడు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు సమయం లేదు మళ్లీ వింటా.. రాష్ట్రంలో త్వరలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫీజులు ఖరారు చేయడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభం, ఇతర అంశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రస్తుతం సమయం లేదని, మళ్లీ వింటానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, ఆదోని, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయా వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టడంతో పాటు, తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దోమలు అధికంగా ఉన్న 20 వేల ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో మందును పిచికారి చేస్తూ దోమలు లేని ప్రాంతాలను సున్నాకు తీసుకుని రావాలని ప్రణాళిక రచించామని చెప్పారు. -
ఏఐతో పనిచేసే పక్షులు వచ్చేస్తున్నాయ్!
రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్ టాయ్ కంపెనీ ‘జింగ్’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్ కంట్రోల్ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! -
వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని టోక్మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు. వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. Ukrainian drone footage captures Russian soldiers fleeing near Tokmak. They are in such a hurry that they leave behind a small child and a rifle. pic.twitter.com/yUgML9jJ8J — Visegrád 24 (@visegrad24) August 27, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని.. భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం -
ఆకాశమే హద్దు..!
సత్యసాయి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపుతున్నారు. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవమే తీసుకురావచ్చని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ను 2018 నవంబరులో ఏర్పాటు చేశారు. ఎం.మధుసూదన్‌రెడ్డి దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, నిర్వహణ రంగంలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. డీజీసీఏ నిబంధనల మేరకు డ్రోన్ల నిర్వహణను క్రమబద్ధం చేయటంతో పాటు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం.. రానున్న కాలంలో రైతులంతా డ్రోన్లను వినియోగించే నైపుణ్యం సాధిస్తారని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోందని చెప్పారు. పరిపాలన, పోలీస్, వ్యవసాయం, గనులు, ఇన్సూరెన్స్, మీడియా, వినోద రంగాల్లో డ్రోన్లను వినియోగించటం ద్వారా మానవ వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతోందని, కచ్చితత్వం ఉంటోందని చెప్పారు. డ్రోన్ వినియోగ నిబంధనలను పౌర విమానయాన శాఖ సడలించినందున డ్రోన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేతో ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కిసాన్ డ్రోన్లను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే నెలలో మరో 500 కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నారు. పంటలకు ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లడం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టటం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు రైతులను ప్రమాదకర పురుగుమందుల బారి నుంచి రక్షించవచ్చు. నిబంధనలు సరళతరం.. డ్రోన్లు లేదా యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల నిర్వహణను చట్టబద్ధం చేస్తూ 2021 ఆగస్టు 26న పౌర విమానయాన శాఖ కొత్త పాలసీని ప్రకటించింది. 2022లో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ పాలసీలో సవరణలు తీసుకువచ్చింది. 2 కిలోల లోపు బరువు ఉన్న వినోదం కోసం ఉపయోగించే డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఎలాంటి రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ అవసరం లేదు. డ్రోన్లను ప్రభుత్వం అయిదు కేటగిరీలుగా వర్గీకరించింది. 250 గ్రాములలోపు బరువు ఉండేది నానో డ్రోన్. 250–2 కిలోల మధ్య బరువు ఉంటే మైక్రో డ్రోన్. 2 కిలోల నుంచి 25 కిలోల మధ్య బరువు ఉండేవి చిన్న డ్రోన్లు. 25–150 కిలోల మధ్య బరువు ఉండే డ్రోన్లను మధ్యస్థ డ్రోన్లుగానూ 150 కిలోల పైగా బరువు ఉండేవాటిని పెద్ద డ్రోన్లుగానూ వర్గీకరించారు. అనుమతులు తప్పనిసరి.. నానో, మైక్రో కేటగిరీల్లోని నాన్ కమర్షియల్ డ్రోన్లను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల డ్రోన్ల ఆపరేషన్‌కు డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ ఫాం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిందే...డ్రోన్ల ద్వారా సరుకుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక కారిడార్లను నిర్దేశిస్తుంది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందాలంటే అధీకృత సంస్థలో నిర్దేశిత కాలం పైలెట్ శిక్షణ పొంది ఉండాలి. శిక్షణ సంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్తో పాటు నైపుణ్య పరీక్ష తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే డీజీసీఏ(సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం) పైలెట్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం టెన్త్ పాసై 18 ఏళ్లకుపైబడి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొందిన ఎవరైనా రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులే. డ్రోన్ల వేగంపై పరిమితులు.. మైక్రో డ్రోన్ భూమికి 60 మీటర్ల ఎత్తుకుపైన, సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. చిన్న డ్రోన్ 120 మీటర్ల ఎత్తుకుపైగా...సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. మధ్యరకం, పెద్ద డ్రోన్లు డీజీసీఏ అనుమతుల మేరకు ఆ పరిధిలోనే ప్రయాణించాలి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేయటం నేరం. పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌లోని మ్యాప్‌లో ఆకుపచ్చ రంగు కలిగిన ప్రాంతంలో డ్రోన్లు ప్రయాణించవచ్చు. పసుపురంగు ప్రాంతంలో నిబంధనల మేరకు ప్రయాణించాలి. ఎరుపురంగు సూచించిన ప్రాంతంలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, ఇతర ఎయిర్‌పోర్టులకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ఆపరేషన్‌కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సెక్రటేరియట్ కాంప్లెక్సుకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. వీటితో పాటు నిషేధిత, ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
టెక్ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?!
స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు తీసుకోవడం అందరికీ తెలిసిన సంగతే! స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితమైన భంగిమల్లోనే ఫొటోలు తీసుకోవడం సాధ్యమవుతుంది. సెల్ఫీలను మరింత చక్కగా, స్పష్టంగా తీసుకునేందుకు వీలైన డ్రోన్ కెమెరాను అమెరికన్ కంపెనీ ‘హోవర్’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉండే ఈ డ్రోన్ కెమెరా చాలా తేలికగా కూడా ఉంటుంది. దీని బరువు 125 గ్రాములు మాత్రమే. దీనిని అరచేతి నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా దీని కదలికలను నియంత్రించవచ్చు. ఇందులో క్విక్షాట్ మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, వెంట వెంటనే సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఫాలో మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, మనం కోరుకున్న చోటుకు అనుసరిస్తూ వీడియోలు చిత్రిస్తుంది. ఇది తీసే ఫొటోలను, వీడియోల ప్రీవ్యూలను మొబైల్లో లైవ్‌లో చూసుకోవచ్చు. ‘హోవర్ కెమెరా ఎక్స్1’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కెమెరా వీడియో బ్లాగర్లకు, ఔత్సాహిక ఫిలిమ్ మేకర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 389 డాలర్లు (రూ.31,924) మాత్రమే! -
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్ సింగ్ జాడ కోసం పంజాబ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్‌ను రంగంలోకి దించారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్‌పాల్ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ఎదుటకు వస్తానని అమృత్‌పాల్ వెల్లడించాడు. ఈ మేరకు గురువారం మరో వీడియో తెరపైకి వచ్చింది. చావంటే తనకు భయం లేదని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. -
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం...డ్రోన్ విజువల్స్
-
‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు
సాక్షి, అమరావతి: డ్రోన్ల రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లోని 116 ఐటీఐల్లో ఆరు స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. డ్రోన్ల తయారీ, టెక్నీషియన్, పర్యవేక్షణ, నిర్వహణ, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ తదితర కోర్సులకు అనుమతిచ్చినట్లు తెలిపింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐటీఐల్లో డ్రోన్లకు సంబంధించిన నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా.. ఏపీలోని 10 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులకు కేంద్రం అనుమతిచ్చింది. అలాగే అసోం, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. -
65శాతం గ్రామాల్లో.. డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేలో మొదటి ఘట్టమైన డ్రోన్ సర్వే దాదాపు 65 శాతం గ్రామాల్లో పూర్తయింది. రాష్ట్రంలోని 17,460 గ్రామాలకుగాను 13,481 గ్రామాల్లో ఈ డ్రోన్ సర్వే చేయాల్సి వుండగా.. ఇప్పటివరకు 8,804 గ్రామాల్లో పూర్తయింది. విస్తీర్ణపరంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 1,12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలను సర్వే చేయాల్సి వుండగా ఇప్పటివరకూ 65,866 చ.కి.మీ.లలో (59 శాతం) ఈ సర్వే పూర్తయింది. డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్లతో దేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్రంలో ఈ డ్రోన్ సర్వేను నిర్వహిస్తున్నారు. మిగిలిన 4,677 గ్రామాల్లో (46,134 చ.కి.మీ.) ఏప్రిల్ 23కల్లా పూర్తిచేయడానికి సర్వే, రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే 1,500 గ్రామాల్లో దీనిని పూర్తిచేయగలిగారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయిలో సర్వే పూర్తిచేయడాన్ని బట్టి ఎంత వేగంగా జరుగుతుందో అర్థంచేసుకోవచ్చు. అత్యాధునికంగా.. శరవేగంగా.. డ్రోన్ సర్వేను తొలుత సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. సర్వేను అనుకున్న గడువులోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో మళ్లీ ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించి వాటితో చేయిస్తున్నారు. దీంతోపాటు సర్వే, సెటిల్మెంట్ శాఖ సైతం స్వయంగా ఈ సర్వే చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసింది. తమ సర్వేయర్లకే డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇప్పించి మరీ సర్వే చేయిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలు, ప్రభుత్వం కలిసి శరవేగంగా ఈ డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నాయి. అక్కడక్కడా ఆలస్యమవుతుందనుకున్న ప్రాంతాల్లో ఏరియల్‌గా (విమానాలు, హెలీకాప్టర్లతో) చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం భూముల రీసర్వే చేయడం దేశంలో ఇదే మొదటిసారి దీన్నికూడా ఇంత అత్యాధునికంగా, పెద్దఎత్తున డ్రోన్లు, విమానాలతో చేస్తుండడాన్ని మిగిలిన రాష్ట్రాలు ఆశ్చర్యంతో పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర బృందాలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న భూముల సర్వే, డ్రోన్ సర్వే తీరును పరిశీలించి వెళ్లాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏప్రిల్ నాటికి డ్రోన్లతో సర్వే పూర్తికి రెవెన్యూ, సర్వే శాఖలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. 2,079 గ్రామాల్లో తుది రెవెన్యూ రికార్డులు రెడీ.. ఇక డ్రోన్ సర్వే పూర్తిచేసిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించిన డ్రోన్ చిత్రాలను సర్వే యంత్రాంగానికి ఇవ్వాల్సి వుంటుంది. ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేసిన 8,804 గ్రామాలకుగాను 5,264 గ్రామాల డ్రోన్ చిత్రాలను సర్వే బృందాలకు అందాయి. 4,006 గ్రామాలకు చెందిన ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లను జారీచేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్థారణ (గ్రౌండ్ ట్రూతింగ్) సర్వే చేయాలి. ఇప్పటివరకు 3,191 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వేను పూర్తిచేశారు. 2,464 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్‌ను పూర్తిచేయగా, 2,242 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. 2,079 గ్రామాలకు సంబంధించిన తుది రెవెన్యూ రికార్డుల తయారీ పూర్తయింది. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్‌ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్‌ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేలో డ్రోన్లతో భూమిని కొలిచే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. 15 రోజుల్లోనే 700 గ్రామాల్లో సర్వేను పూర్తి చేయడం విశేషం. సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డ్రోన్లు 4,769 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా.. ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లు 3,652 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 807 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్, ఏరియల్ సర్వే చేసేందుకు.. సర్వే బృందాలు విస్తృతంగా పని చేస్తున్నాయి. మరోవైపు డ్రోన్ సర్వే పూర్తయిన 4,006 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్(చాయాచిత్రాలు)ను ఇప్పటికే విడుదల చేశారు. వీటితోనే సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా ఇప్పటికే 3,031 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజ నిర్థారణ(గ్రౌండ్ ట్రూతింగ్)ను పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని 3.58 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యింది. 975 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రస్తుతం జరుగుతోంది. చివరిగా నిర్వహించే గ్రౌండ్ వ్యాలిడేషన్‌ను కూడా 2,409 గ్రామాల్లో పూర్తి చేశారు. 622 గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తయిన గ్రామాల్లో 19,355 అభ్యంతరాలు రాగా.. వాటిలో 19,299 అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మొత్తంగా ఇప్పటివరకు అన్ని దశల్లో రీ సర్తే పూర్తయిన గ్రామాలు 2,913 ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 1,800 గ్రామాల్లో కూడా నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ యంత్రాంగం కృషి చేస్తోంది. -
తిరుమల: ‘అందుకే డ్రోన్లు ఎగురవేశారు!’
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డుపై నుంచి డ్రోన్లను ఎగురవేశారు. దీంతో, వీటిని ఎవరు ఎగురవేశారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, డ్రోన్లను ఎగురవేస్తున్న సమయంలో స్థానికులు డ్రోన్ దృశ్యాలను చిత్రీకరించారు. డ్రోన్లతోనే శ్రీవారి ఆలయ దృశ్యాల చిత్రీకరణ జరిగింది. కాగా, కాకులకోన వద్ద సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలు తీసేందుకే డ్రోన్ ఆపరేటర్ అక్కడకు వచ్చినట్టు గుర్తించారు. మూడు నెలల ముందు సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ చిత్రీకరించారు. దీంతో, డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయం బయటకు వచ్చింది. -
ఏందిరా నీలొల్లి.. నీటిలో నుంచి ఒక్కసారిగా ఎగిరి డ్రోన్‌ను..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు దర్శనమిస్తాయి. అయితే, కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చాటుకుని తమ ప్రతిభను నిరూపించుకుని రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక, కేటగిరిలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, వన్యప్రాణుల ఫొటోలను, వీడియోలను తీసేందుకు ఇప్పటి వరకు ఎంతో మంది వినూత్నంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఫొటోగ్రాఫర్స్ విజయవంతంగా అయ్యారు. మరికొందరు ఫేయిల్ అయ్యారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి డ్రోన్ సాయంతో స్పెషల్ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం ఓ నదిలో ఉన్న ఎలిగేటర్‌ను ఎందుకున్నాడు. దీంతో, రంగంలోకి దిగిన ఫొటోగ్రాఫర్‌కు చేదు అనుభవమే ఎదురైంది. కాగా, వీడియో ప్రకారం.. నీటిలో ఉన్న ఎలిగేటర్ కదిలికపై ఫొటోగ్రాఫర్ ఫోకస్ పెట్టాడు. ఓ డ్రోన్ సాయంతో ఎలిగేటర్‌కు సమీపం వరకు వెళ్లి వీడియో తీయడం ప్రారంభించాడు. డ్రోన్ కాసేపటి వరకు వీడియో తీసింది. దీంతో, డ్రోన్ సౌండ్‌కు చిర్రెత్కుకుపోయిన ఎలిగేటర్.. డ్రోన్ తన వద్దకు రాగానే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. డ్రోన్‌ను నోటితో పట్టుకుని నీటిలోకి దూకింది. ఎలిగేటర్ దాడిపై ఒక్కసారిగా షాకైన ఫొటోగ్రాఫర్.. చూస్తూ నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022 -
డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!
సాక్షి, ముంబై: ఆన్లైన్ షాపింగ్ సైట్లలో షాపింగ్ అంటే కత్తి మీద సామే అనిపిస్తోంది. పార్సిల్ వచ్చి దాన్ని విప్పి, వస్తువు క్వాలిటీ చెక్ చేసే దాకా ఎలాంటి గ్యారంటీ లేదు. కట్ చేస్తే ..ఆన్లైన్లో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే..అలుగడ్డలతో వచ్చిన ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. ఇదీ చదవండి: పీకల్లోతు కష్టాల్లో వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ వివరాల్లోకి వెళితే బిహార్‌కు చెందిన చేతన్ కుమార్ అనే వ్యాపారవేత్త, ఆన్లైన్లో డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేశాడు. ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో గానీ, ప్యాకెట్ డెలివరీ చేస్తున్న బాయ్ ద్వారానే దాన్ని ఆన్‌బాక్స్ తీస్తూ వీడియో తీశాడు. దీంతోకస్టమర్తోపాటు,డెలివరీ బాయ్ తెల్లముఖం వేశాడు. ఎందుకంటే అందులో గుండ్రటి బంగాళా దుంపలు వెక్కిరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తూ, లేదా బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఆన్లైన్ కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. (28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!) ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb — UnSeen India (@USIndia_) September 26, 2022 -
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు..
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ -
కిటికీలన్నా తెరుచుకుంటాం మహాప్రభో!
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని, జీరో కోవిడ్ విధానం పేరిట చైనా అనుసరిస్తున్న నమూనా షాంఘై నగర ప్రజల ప్రాణాలమీదకు వచ్చింది. ఒకపక్క ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కంట్రోల్ కాకపోవడంతో నగరంలో ఆంక్షలు సడలించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో కలుగుల్లో చిట్టెలుకల్లా మాడిపోతున్నాం మహాప్రభో అని ప్రజలు మూకుమ్మడి విజ్ఞాపనలు చేస్తున్నారు. చాలా అపార్ట్మెంట్లలో నీళ్లు, ఆహారం వంటి నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్లు కథనాలు వస్తున్నాయి. అయినా బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో చాలామంది తమ తమ బాల్కనీల్లో, కిటికీల వద్ద మనసు సాంత్వన పడేదాకా ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫీలైన ప్రభుత్వం ‘స్వాతంత్య్రం కోసం మీ ఆత్మలు పడే తపనను నియంత్రించుకోండి’ అని హెచ్చరించింది. దీంతో మనసారా ఏడ్చే అవకాశమూ ఇవ్వరా, కిటికీల్లో కుమిలే ఛాన్సు లేదా అంటూ ఇంట్లోనే గొల్లుమంటున్నారు షాంఘై వాసులు. డ్రోన్ పడగ నీడలో.. నగరంలో ప్రభుత్వ ఆంక్షలు సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తున్నాయి. పొరపాటున బాల్కనీల్లో, కిటికీల్లో ఎవరైనా తల బయటపెట్టగానే ‘కంట్రోల్ ద సోల్ డిజైర్ ఫర్ ఫ్రీడం అండ్ డోంట్ ఓపెన్ విండో’ అని బ్యానర్లున్న డ్రోన్లు ముఖం ముందు ప్రత్యక్షమవుతున్నాయని ప్రజలు సోషల్ మీడియాలో వాపోతున్నారు. ప్రభుత్వం మరీ నిర్భంధంగా వ్యవహరిస్తుండడంతో షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి తిరుగుబాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయినా పెద్ద పెద్ద ప్రజాందోళనలనే లెక్కచేయని చైనా ప్రభుత్వానికి ఈ చిన్నపాటి తిరుగుబాట్లు ఏపాటి అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ నిర్బంధానికి తోడు ప్రజలకు కరోనా టెస్టులు తలనొప్పిగా మారాయి. సింగిల్ టెస్ట్ అని, డబుల్ టెస్టులని ప్రభుత్వం ఎడాపెడా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తోంది. మరి ఎంతమంది రోగులు తేలారో, వారేమయ్యారో, మిగిలినవారి పరిస్థితేంటో ఎవరికీ తెలీదు! ఎక్కడైనా కరోనా పాజిటివ్ అని తేలితే చాలు, చిన్నా పెద్దా అని తేడా లేకుండా తీసుకుపోయి క్వారంటైన్ కేంద్రంలో పారేస్తున్నారు. కొన్నిచోట్ల చిన్న పిల్లలను సైతం తల్లిదండ్రుల దగ్గర్నుంచి లాక్కెళ్లి క్వారైంటైన్ పాలుచేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా ఫ్యామిలీ క్వారంటైన్ అమలు చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గగనతలం నుంచి గస్తీ...రహదారులపై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లు సమీకరించుకుని వాటి సహాయంతో గస్తీ నిర్వహించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అనుమతితో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక పరిశీలన సంతృప్తికర ఫలితాలు ఇచ్చింది. దీంతో త్వరలో తొలి దఫా మూడింటిని సమీకరించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో.. తిప్పలెన్నో.. సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం–సాయంత్రం పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ సమయాల్లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువ. ఆయా చోట్ల ఉండే అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, బాటిల్ నెక్స్ కారణంగా ఈ ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి. వీటిని నిరోధించడానికి ప్రస్తుతం స్థానిక ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలతో పాటు తేలికపాటి వాహనాల పైనా గస్తీ నిర్వహిస్తుంటారు. ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించే వాటిని గుర్తించి సరి చేస్తుంటారు. దీనికోసం పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులను వినియోగించాల్సి వస్తోంది. ప్రముఖుల పర్యటనల నేపథ్యంలోనూ.. నగరంలో అనునిత్యం ప్రముఖుల పర్యటనలు సాగుతుంటాయి. రాష్ట్రంలో ఉన్న వీవీఐపీలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏటా వందల సంఖ్యలో ముఖ్యులు వస్తుంటారు. వీరి రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాల్లో మళ్లింపులు విధించడంతో పాటు గస్తీ నిర్వహించడం పరిపాటి. కీలక సభలు, సమావేశాలతో పాటు గణేష్, బోనాలు వంటి పండగలు, ఉత్సవాల సమయంలోనూ రహదారులపై ట్రాఫిక్ పోలీసుల కదలికలు ఎక్కువగా ఉంటేనే సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ విధులను స్థానిక ట్రాఫిక్ ఠాణాలకు చెందిన సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ నిర్వర్తిస్తున్నారు. టీసీసీసీతో అనుసంధాని వినియోగం... ఈ డ్రోన్లను బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (టీసీసీసీ) అనుసంధానించనున్నారు. డ్రోన్ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఇక్కడి సిబ్బంది అనునిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వీళ్లు గమనించిన అంశాల ఆధారంగా రహదారిపై అవసరమైన ప్రాంతానికి క్షేత్రస్థాయి సిబ్బందిని పంపిస్తారు. డ్రోన్ కెమెరా అందించిన విజువల్స్ ఆధారంగా ఇతర విభాగాలను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న సీసీ కెమెరాలు సైతం ఈ సెంటర్‌తోనే అనుసంధానించి ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను అనుసంధానిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గరిష్టంగా రెండు నెలల్లో నగర ట్రాఫిక్ విభాగంలో మూడు డ్రోన్లు సేవలు అందించనున్నాయి. తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా.. ఇలా రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో బృందం ఒక సమయంలో కేవలం ఓ రహదారిపై మాత్రమే పని చేయగలుగుతోంది. దాన్ని క్లియర్ చేసిన పోలీసులు మరో చోటుకు వెళ్లేసరికి ఇక్కడ మళ్లీ అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దీనికి పరిష్కారంగా డ్రోన్ల సాయంతో గగనతల గస్తీ నిర్వహణకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లు ఖరీదు చేస్తున్నారు. రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోకుండా తలెత్తే నిరసనల సందర్భంలోనూ వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రోన్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన దాని నుంచి ఖరీదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రెండుసార్లు డ్రోన్లను వాడి చూశారు. ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: అంతా ఆ తాను ముక్కలే!) -
చురుగ్గా భూ సర్వే
సాక్షి, అమరావతి: రెండో దశ సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు) పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాల్లో వచ్చే జనవరికల్లా రీ సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల శాఖాధికారులు పనిచేస్తున్నారు. 646 గ్రామాల డ్రోన్ చిత్రాలు ఇప్పటికే అధికారులకు అందాయి. వాటి ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు. 92 గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే చివరి దశకు చేరుకొంది. వీటికి కొత్త సరిహద్దులు నిర్ణయిస్తూ ఇచ్చే 13 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయనున్నారు. ఈ గ్రామాల తుది భూ రికార్డులను తయారు చేస్తున్నారు. 44 గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 140 గ్రామాల్లో భూముల పట్టాదార్ పాస్ పుస్తకాలు, వెబ్‌ల్యాండ్ అడంగల్ తదితరాల పరిశీలన జరుగుతోంది. 439 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజనిర్థారణ) జరుగుతోంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా కొత్తగా తయారు చేసిన సరిహద్దులతో ఆ సర్వే నెంబర్ల భూమిని భూ యజమానుల సమక్షంలో కొలతలు వేస్తారు. గ్రామాల్లోని సచివాలయ సర్వేయర్లతో ఈ పని చేయిస్తున్నారు. మరో నాలుగు గ్రామాల డ్రోన్ చిత్రాలు త్వరలో అందనున్నాయి. ఇవికాకుండా 5,500 గ్రామాల్లో అడంగల్, ఆర్ఎస్ఆర్తో సరిదిద్దడం, భూయజమానుల రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు జరుగుతున్నాయి. -
వినువీధి వి‘చిత్రం’.. సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయం
పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్ సేవల్ని సిక్కోలు వాసులు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పదుల సంఖ్యలో మనుషులు చేయాల్సిన పనిని విహంగ నేత్రం చేసేస్తోంది. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం దగ్గర్నుంచి పొలాల్లో పురుగుమందుల పిచికారీ వరకు.. పోలీస్ నిఘా నుంచి వరద ప్రాంతాల్లో పరిస్థితుల సమీక్ష వరకూ.. డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్లను వినియోగిస్తున్న రంగాలు ఏమిటి.. సేవలు.. ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం. – పాలకొండ రూరల్/ఆమదాలవలస వినువీధి వి‘చిత్రం’ వివాహమైనా.. వేడుకైనా..రాజకీయ పార్టీల మీటింగైనా.. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం డ్రోన్ కెమెరా వాడకం సాధారణమైపోయింది. చిత్రీకరించాల్సిన ప్రదేశాన్ని బట్టీ వేర్వేరు రకాల డ్రోన్లను ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్న డ్రోన్ల ఖరీదు రూ.రెండు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. వీటి బరువు 350 గ్రాముల నుంచి 450 గ్రాముల వరకు ఉంటుంది. 250 అడుగుల ఎత్తు వరకు వీటిని ఎగురవేస్తున్నారు. ఒక సారి బ్యాటరీ చార్జ్ చేస్తే 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. డ్రోన్లతో పెట్రోలింగ్.. ఎక్కడెక్కడ.. ఎవరెవరున్నారు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారెవరు.. ర్యాలీలు, ధర్నాలు జరిగేటప్పుడు సంఘ విద్రోహక శక్తులు ఏమైనా పాల్గొంటున్నాయా వంటి విషయాల్ని తెలుసుకునేందుకు పోలీస్ విభాగం నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. లాక్డౌన్లో ఎస్పీ అమిత్‌బర్దార్ స్వయంగా డ్రోన్‌ను వినియోగించి నగరంలో పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఎస్ఈబీ అధికారులు కూడా డ్రోన్ వినియోగాన్ని పెంచారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో వీటి సేవల్ని వినియోగించుకుంటున్నారు. సారా అమ్మకాలు సాగించే స్థావరాలను గుర్తించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రకృతి విపత్తుల అంచనాలో.. ప్రకృతి విపత్తులు సంభవించే వేళ వాటి తీవ్రత ఇతర అంశాలను అంచనా వేసేందుకు అధికారులు డ్రోన్లపై ఆధారపడుతున్నారు. తాజాగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వంగర మండలంలోని మూడు గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రజల పరిస్థితులు, వరదనీటి ఉద్ధృతి ఇతర విషయాల్ని పర్యవేక్షించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఈ డ్రోన్లపైనే ఆధారపడ్డారు. గుర్తించిన ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మీ పొలంలో పిచికారీ కోసం.. వ్యవసాయ పనుల్లో రైతన్నకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కూడా సిద్ధమంటోంది డ్రోన్. ఇటీవలే ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పొలానికి పురుగు మందులు పిచికారీ చేసే అంశంపై డెమో జరిగింది. ఈ డ్రోన్ సాయంతో ఎకరా పొలానికి 10నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని సులభంగా పిచికారీ చేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించారు. ఇలాంటి సేవల్ని రైతులకు అందించేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. సమగ్ర భూ సర్వేలో కీలకంగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆధునిక డ్రోన్‌ను వినియోగిస్తోంది. సగటున రోజుకు 700 ఎకరాల వరకు సర్వే చేయొచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మూడు సబ్ డివిజన్లలో సర్వే కోసం ఒక డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. ప్రత్యేకతలివే.. బరువు: 5 కిలోలు కెమెరా బరువు: 6.5 గ్రాములు 120 మీటర్ల ఎత్తుకు ఎగురవేస్తారు. చార్జింగ్ ఒక గంట వరకు ఉంటుంది. ధర: రూ.25 లక్షలు విహంగ నేత్రం విశేషాలివే.. డ్రోన్ బరువును బట్టి వాటిని విభజించారు. నెనో డ్రోన్ (250 గ్రాములు బరువు) మ్యాకో (250 గ్రాముల నుంచి 2.5 కిలోలు) మినీ (2.5 కిలోల నుంచి 25 కేజీల వరకు) స్మాల్(25 కిలోల నుంచి 250 కిలోలు) లార్జ్ (250 కిలోలకు పైబడి) రకాలున్నాయ్... ప్రొపెల్లర్స్(ఫ్యాన్లు లాంటి రెక్కల) సాయంతో డ్రోన్లు పైకి ఎగురుతాయి. మూడు రెక్కలుంటే ట్రైకాప్టర్, నాలుగుంటే క్వాడ్ కాప్టర్, ఆరుంటే హెక్స్ కాప్టర్, ఎనిమిది ఉంటే ఆక్టో కాప్టర్ అని పిలుస్తారు. అనుమతి తప్పనిసరి.. డ్రోన్లను వినియోగించాలంటే యూఏవోపీ అనుమతితో పాటు స్థానిక పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. n అధికారులు నిర్దేశించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. వాడకం పెరిగింది.. వివాహ, రాజకీయ, ఇతర శుభకార్యాల చిత్రీకరణలో డ్రోన్ల వినియోగం పెరిగింది. జిల్లాలో దాదాపు 50 మంది వరకు ఫొటోగ్రాఫర్లు డ్రోన్ వాడకానికి సంబంధించి లైసెన్స్ కలిగి ఉన్నారు. వీటిని వాడాలంటే పోలీసు అనుమతి తప్పనిసరి. – మండపాక శ్రీధర్,సీనియర్ ఫొటోగ్రాఫర్, పాలకొండ శాఖాపరంగా ఎన్నో సేవలు.. డ్రోన్ కెమెరాలతో శాఖాపరంగా చాలా ఉపయోగాలున్నాయి. జిల్లా కేంద్రంలో డ్రోన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైనప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించి వాటి సేవలు పొందుతున్నాం. ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు, వీఐపీల పర్యటన సమయంలో వీటిని వినియోగిస్తున్నాం. లాక్డౌన్ సమయంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. – మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ పనితీరు అద్భుతం.. సమగ్ర భూ సర్వేలో ఈ డ్రోన్ పనితీరు అద్భుతం. కచ్చితత్వం ఉంది. ప్రకృతి విపత్తులు అంచనా వేయటంలో మా సిబ్బంది డ్రోన్పైనే ఆధారపడుతున్నారు. – టీవీఎస్‌జీ కుమార్, ఆర్డీవో, పాలకొండ -
Huzurabad Bypoll: 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టివేత
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికపై నిఘా కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ కాకుండా 24 గంటలు రెండు సైబర్ క్రైమ్ టీమ్స్ నిఘా ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదయ్యాయి. 12 రోజుల్లో కోటి 27 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 75 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1,900 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. త్వరలోనే హుజూరాబాద్‌కు కేంద్ర బలగాలు రానున్నాయి. నిరంతరం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 406 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌లో 110, జమ్మికుంటలో 169, వీణవంకలో 87, ఇల్లందకుంటలో 36 కెమెరాలు ఏర్పాటు చేశారు. -
ఫుల్‌గా తాగేసి.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు..!
ముంబై: అసలే కోతి, ఆపై కల్లు తాగినట్లు అనే నానుడి గుర్తుండే ఉంటుంది. మామూలుగానే కోతి చంచలమయిన జంతువు. ఇక అటుపై కల్లు తాగితే.. దాని ప్రవర్తన అత్యంత విచిత్రంగా, చుట్టు పక్కల విధ్వంసకరంగా ఉంటుంది. తాజాగా మద్యం తాగిన ఓ వ్యక్తి పోలీసులను ముని వేళ్లపై నిలబెట్టినంత పని చేశాడు. మద్యం మత్తులో ఏకంగా 300 అడుగుల ఎత్తున్న బీఎస్ఎన్ఎల్ టవర్‌పైకి ఎక్కేశాడు. వివారాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో సోమవారం సాయంత్రం సంజయ్ జాదవ్ అనే తాగుబోతు బీఎస్ఎన్ఎల్ 300 అడుగుల ఎత్తైన టవర్ పైకి ఎక్కాడు. అతను టవర్ ఎక్కినప్పుడు ఆ వ్యక్తిని ఎవరూ గమనించలేదు. కానీ అతను ఎత్తుకు చేరుకునే సమయానికి ఆ ప్రదేశంలో జనం గుమిగూడడం ప్రారంభించారు. కొంతమంది అతడిని క్రిందికి దించడానికి ప్రయత్నించారు. కానీ అతను వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. పైగా ఓ వైర్‌ను మెడకు చుట్టుకుని, చొక్కా తీసేసి హల్చల్ చేశాడు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సంజయ్ జాదవ్ బీఎస్ఎన్ల్ టవర్ పైకి ఎక్కేశాడు. అంత ఎత్తులో అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో అతడిని గుర్తించడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగించారు. డ్రోన్ కెమెరా సహాయంతో.. కొంతమంది అతడిని మిలింద్ నగర్ నివాసి అయిన సంజయ్ జాదవ్‌గా గుర్తించారు. దాదాపు నాలుగున్నర గంటల తర్వాత అతడిని కిందకు దించడంలో పోలీసులు విజయం సాధించారు. సంజయ్ జాదవ్ కిందకు దిగిన తర్వాత అతడిని అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. కాగా తన తల్లితండ్రులు దురుసుగా ప్రవర్తించినందుకు అతను అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రులు అతన్ని వేధించడంతో టవర్ పైకి ఎక్కినట్లు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్‌ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు. డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జిల్లాల్లో ఇష్టానుసారంగా.. జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. 90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం... వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది. నెదర్లాండ్స్ స్ఫూర్తితో... డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు.