ఆ హెలికాప్టర్‌ ఎందుకు తిరుగుతోంది! | Why is turning the helicopter! | Sakshi
Sakshi News home page

ఆ హెలికాప్టర్‌ ఎందుకు తిరుగుతోంది!

Published Tue, Feb 7 2017 11:54 PM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

ఆ హెలికాప్టర్‌ ఎందుకు తిరుగుతోంది! - Sakshi

ఆ హెలికాప్టర్‌ ఎందుకు తిరుగుతోంది!

మైదుకూరు టౌన్‌ :  మైదుకూరు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది రోజులుగా ఓ హెలికాప్టర్‌ ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో అతి తక్కువ ఎత్తులో తిరుగుతున్న ఆ హెలికాప్టర్‌ కిందకు జల్లెడ ఆకారంలో ఉన్న డ్రోన్‌లను వేలాడదీస్తోంది. దీని ద్వారా భూమిలో నిక్షిప్తమై ఉన్న ఖనిజాల ఆచూకీ తెలుసుకుంటున్నారేమో అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని చాపాడు, దువ్వూరు మండలాల్లో తిరిగిన ఈ హెలికాప్టర్‌ ప్రస్తుతం మైదుకూరుపై దృష్టి సారించింది. సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలోనూ ఇలాగే చక్కర్లు కొట్టింది. అయితే ఈ సర్వే నిర్వహిస్తున్నది ఏ శాఖకు చెందిన వారు అనేది స్థానిక అధికారులకు సైతం తెలియడం లేదు. అసలు ఈ హెలికాప్టర్‌ ఎక్కడి నుంచి వస్తోంది.. తిరిగి ఎక్కడ ల్యాండ్‌ అవుతోంది అనేది సస్పెన్స్‌గా మారింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement