కంగారెత్తిస్తున్న పాక్‌ కొత్త ఆయుధం | Pak Purchase Wing Loong from China | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 28 2018 11:24 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

Pak Purchase Wing Loong from China - Sakshi

వింగ్ లూంగ్-1 చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యాన్ని కలవరపాటుకు గురిచేసే వార్త. దాయాది పాకిస్థాన్ అమ్ములపొదిలో శక్తివంతమైన ఓ ఆయుధం వచ్చి చేరింది. వింగ్‌ లూంగ్‌-1 అనే యుద్ధ విమానాలు(డ్రోన్‌లు) పాక్‌ వైమానిక దళంలో చేరినట్లు సమాచారం. చైనా నుంచి పాక్‌ వీటిని కొనుగోలు చేసుకుంది. 

వింగ్‌ లూంగ్‌ సామర్థ్యం.. మానవ రహిత విమానాలైన 'వింగ్ లూంగ్' ను చైనా తయారు చేస్తోంది. లక్ష్యాలను నిర్దేశిస్తే చాలూ శత్రు స్థావరాలను వాటంతట అవే వెతుక్కుని వెళ్లి బాంబు దాడులు చేసి రాగలవు. పైగా తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో వీటిని కనుగొనటం రాడార్లకు కూడా కష్టమే. సుమారు 280 కిలోమీటర్ల వేగంతో 5 వేల కిలోమీటర్ల దూరం వరకు ఇవి ప్రయాణించగలవు. మెరుపు వేగంతో ఇవి దాడి చేయటంతో ప్రత్యర్థులకు వీటిని గుర్తించే సమయం కూడా ఉండదు. అంతటి విశేషాలున్న వింగ్‌ లూంగ్‌ను పాక్‌ తన అమ్ములపొదిలో చేర్చుకుంది.  

సుమారు 14 మీటర్ల పొడవుండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేస్తాయి. తేలికపాటి మిసైల్స్ తోపాటు 200 కిలోల బరువైన బాంబులను మోసుకుంటూ వెళతాయి. వారం క్రితమే చైనా వీటిని పాక్ కు చేరవేసిందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం వింగ్ లూంగ్ సిరీస్‌లో నాలుగో తరం డ్రోన్ ల కోసం చైనా పరిశోధనలు చేస్తోంది. ఈ తరహా డ్రోన్ లు భారత్‌ వద్ద లేవని.. భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement