
జమ్మూ: భారత్ విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడంలేదు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులకు తెగబడిన పాక్‌కు భారత్ తగిన సమాధానం చెప్పింది. ఈ ఘటనలో పలువురు పాకిస్తాన్ సైనికులు మరణించారని భారత భద్రతా అధికారులు తెలిపారు.
ఈ ఉదంతంలో పాకిస్తాన్‌కు ఎంతంటి ప్రాణనష్టం జరిగిందో తెలియకపోయినా, శత్రు దళాలు భారీ నష్టాలను చవిచూశాయని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుడులో కెప్టెన్‌తో సహా ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది మరణించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత కృష్ణ ఘాటి సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిదని అధికారులు తెలిపారు.
2021, ఫిబ్రవరి 25న భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుండి ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు తక్కువగా నమోదయ్యాయి. అయితే తాజాగా తార్కుండి సెక్టార్‌లోని ఫార్వర్డ్ పోస్ట్‌పై పాకిస్తాన్ దళాలు ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరిపి, కాల్పుల విరమణను ఉల్లంఘించాయని, దీనికి భారత సైన్యం తగిన సమాధానం చెప్పిందని అధికారులు పేర్కొన్నారు. కాగా గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి శత్రుదేశపు కార్యకలాపాలు పెరిగాయి. దీంతో ఎల్‌ఓసీ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment