reply
-
నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం..
ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ చేసిన తరువాత.. సుశాంత్ మెహతా తన ఎక్స్ ఖాతాలో కార్ల డిజైన్ గురించి, సర్వీస్ క్వాలిటీ వంటి వాటిపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. మీరు ఇప్పటికే ఉన్న కార్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల సమస్యలు, ఉద్యోగుల ప్రవర్తనలకు సంబంధించిన.. గ్రౌండ్ లెవల్ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని అన్నారు.మీ కార్ల డిజైన్స్ విషయానికి వస్తే.. అవన్నీ హ్యుందాయ్ కార్లకు సమీపంలో కూడా ఎక్కడా నిలబడలేవు. బీఈ 6ఈ కారు లుకింగ్ కూడా వింతగానే ఉందని పేర్కొన్నాడు. మీ డిజైన్ టీమ్ ఇలాగే ఆలోచిస్తోందా? లేదా మీకు డిజైన్ మీద సరైన అవగాహనా లేదా? అని విమర్శించాడు. అంతే కాకుండా మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా.. టాటా కంపెనీ కూడా ప్రపంచ స్థాయి కార్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ నిరాశే మిగిలిందని అన్నాడు.దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే సుశాంత్. మనం చాలా దూరం వెళ్ళాలి. అయితే మనం ఎంత దూరం వచ్చామన్న విషయాన్ని కూడా ఆలోచించండి. నేను 1991లో కంపెనీలో చేరాను. అప్పుడే భారత్ ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి అడుగుపెట్టే కార్లు.. గ్లోబల్ బ్రాండ్లతో పోటీపడలేవని, ఈ రంగం నుంచి తప్పకోవాలని ఓ సంస్థ సలహా ఇచ్చింది. అయినప్పటికీ మేము మూడు దశాబ్దాలుగా కార్లను తయారు చేస్తూ.. అనేక ప్రపంచ బ్రాండ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాము. ఎటువంటి ఆత్మసంతృప్తికి మేము ఆస్కారం లేదు. నిరంతర అభివృద్ధి మా మంత్రంగా కొనసాగుతుంది. మమ్మల్ని మరింత రగిల్చినందుకు ధనవ్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఆనంద్ మహీంద్రా సానుకూల ప్రతి స్పందనను కొనియాడారు. దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్ కార్ల కంటే మహీంద్రా, టాటా కార్లు చాలా సురక్షితమైనవి పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా స్పందనకు సుశాంత్ మెహతా సైతం ఫిదా అయిపోయాడు. నేను చేసిన విమర్శను కూడా స్వీకరిస్తూ.. సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ట్వీట్ చూసి మీ టీమ్ కాల్ చేసింది. వారు బహుశా హర్ట్ అయ్యి ఉంటారని నేను భావించాను. అందుకే ట్వీట్ డిలీట్ చేశా అని మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.OMG this is so sweet.I am glad you took the criticism constructively, I had to delete the tweet after a call from yiur team because I thought they are unhappy with the harsh words.— Sushant Mehta (@SkyBarrister) December 1, 2024 -
ముందు మీ దేశం సంగతి చూసుకోండి: కేజ్రీవాల్ స్ట్రాంగ్ రిప్లై
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు, భారత్‌లో ప్రస్తుత రాజకీయాలపై జోక్యం చేసుకున్న పాకిస్థాన్ మాజీ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు రిప్లై ఇచ్చారు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండని చురకంటించారు. మీ సపోర్ట్ ఏమీ అవసరం లేదని తిప్పికొట్టారు. లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శనివారం(మే25) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన ఫొటోను తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేజ్రీవాల్ చేసిన ఈ పోస్ట్‌ను పాకిస్థాన్ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేశారు.ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ను జత చేశారు. ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. చౌధరి కామెంట్లకు అరవింద్ కేజ్రీవాల్ తిరిగి వెంటనే స్పందించారు.‘చౌధరి సాహిబ్ మా దేశంలో సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఇందుకు మీ సలహాలు మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. -
ఎన్నికల బాండ్లు: ‘ఆర్టీఐ’ కింద రిప్లైకి ‘ఎస్బీఐ’ నో
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) తెలపాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఒక పిటిషన్ దాఖలైంది. ఎస్ఓపీ వివరాలు ఇవ్వడానికి ఎస్బీఐ నిరాకరించింది. హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్ కోసం బ్యాంకు బ్రాంచ్‌లకు జారి చేసిన ఎస్ఓపీ అనేది తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని ఎస్బీఐ పిటిషనర్‌కు సమాధానమిచ్చింది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు వెల్లడించకుండా కమర్షియల్ కాన్ఫిడెన్స్ కింద ఆర్టీఐ చట్టంలో మినహాయింపులున్నాయని తెలిపింది. ఎస్బీఐ సమాధానంపై అంజలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందని, వీటికి సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ఎస్బీఐ ఎస్ఓపీ వివరాలు దాచడం సరికాదన్నారు. కాగా, రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ప్రకటించిన విషయం తెలిసిందే. స్కీమ్‌ను ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందజేయాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. దీంతో ఎస్బీఐ ఈసీకి వివరాలు అందించిన వెంటనే ఈసీ వాటిని తన వెబ్సైట్లో బహిర్గతం చేసింది. ఇదీ చదవండి.. వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై మరో కేసు -
విజయ్ దేవరకొండపై అమ్మాయిల వీడియో.. స్పందించిన హీరో!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే యూత్‌లో విజయ్‌కు ఉన్న మామూలు క్రేజ్ లేదు. రౌడీ హీరోగా అభిమానుల్లో గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అంతే కాదు.. మన హీరో గ్లామర్‌కు అమ్మాయిలు సైతం ఫిదా అవుతుంటారు. అలాంటి గ్లామర్ మనోడి సొంతం. తాజాగా ఈ జాబితాలో విద్యార్థినిలు కూడా చేరిపోయారు. అదేంటో ఓ లుక్కేయండి. తాజాగా ఇద్దరు విద్యార్థినిలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను విజయ్ దేవరకొండ చూసి కామెంట్ చేస్తేనే మేము పరీక్షలకు ప్రిపేర్ అవుతాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది కాస్తా నెట్టింట పెద్దఎత్తున వైరలవడంతో ఏకంగా విద్యార్థినిలు చేసిన వీడియోకు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. 'మీరు పరీక్షల్లో 90 శాతం మార్కులు తెచ్చుకుంటే.. కచ్చితంగా మిమ్మల్ని కలుస్తా' అంటూ ఫ్యామిలీ స్టార్ హీరో కామెంట్ చేశారు. విద్యార్థినిలు అభిమానంతో వీడియో చేసినా.. విజయ్ స్పందించిన తీరు చూస్తే ఆయన సింప్లీసిటీ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harshitha reddy (@harshithaareddy__) -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
పాకిస్తాన్ కు షాక్...పంతం నెగ్గించుకున్న బీసీసీఐ
-
నన్ను జైల్లో పెట్టాలని చూశారు.. కానీ ఇది అంతకంటే: కంగనా
కంగనా రనౌత్ పేరు వింటేనే చాలు ఆమె ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎంతటి వారికైనా తనదైన స్టైల్లో దిమ్మదిరిగే కౌంటర్ ఇస్తుంది. ఎలాంటి విషయం అయినా సరే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ ఒకరు. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి వైరలవుతోంది. టెస్లా దిగ్గజం ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌కు తనదైన స్టెల్లో బదులిచ్చింది బాలీవుడ్ భామ. ఎలన్ మస్క్ ట్వీట్లో ఏముందంటే? ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. వారితో ప్రేమలో పడటం విభిన్నమైన అనుభూతి’ అంటూ ఎలాన్ మస్క్ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు.. కంగనా ప్రేమ గురించే ఆయన మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. తాజాగా కంగనా ట్వీట్ చేస్తూ... ' నా కంటే నాటకీయ జీవితాన్ని ఎవరూ కలిగి ఉండరు. ప్రేమ వ్యవహారంలో నన్ను జైలులో పెట్టాలని చూస్తున్న మొత్తం సినిమా మాఫియా కంటే ఇది చాలా ఆసక్తిగా అనిపిస్తోంది.' అంటూ బదులిచ్చింది. అయితే కంగనా రనౌత్ గతంలో బాలీవుడ్ నటుడు హృతిక్‌తో ప్రేమలో ఉన్నసంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆమె పెట్టిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారడంలో పలువురు నెటిజన్లు.. కంగనా లవ్‌స్టోరీపై కామెంట్స్ పెడుతున్నారు. -
స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వీటిపై ఫిబ్రవరి 15లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారించనున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో వాదనలు విన్పించే పరిస్థితి లేకపోతే.. వారు ఉన్న చోటు నుంచే వర్చువల్‌గా అయినా వాదించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు, కేంద్రం చర్చించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పింది. పిటిషన్లలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నింటీని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. భారత్‌లో స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దత లేదు. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు పెళ్లి చేసుకుంటే చట్టపరంగా చెల్లదు. అయినా చాలా మంది స్వలింగసంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. భారీఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఒక్కటైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని దేశంలోని వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటన్నింటిని కలపి సుప్రీంకోర్టే విచారిస్తానని చెప్పింది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
కవిత లేఖకు సీబీఐ రిప్లై ..
-
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్‌కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'నువ్ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్. ఈ ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ (సినిమా) రంగంలో నువ్ ఎలా ఉన్నావ్' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్ వర్క్, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్. (నా మైండ్, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మసాబా గుప్తా. చదవండి: 'అవును, ఆ రూమర్ నిజమే' అంటున్న రష్మిక.. అతడితో.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! మసాబా గుప్తా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'మోడ్రన్ లవ్ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్ చేసింది. ఈ సిరీస్‌ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్‌గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్‌కు రెండో సీజన్ కూడా రానుంది. 'ఎమ్‌టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్ రిచర్డ్‌ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా!
సాక్షి, ముంబై: ఫన్నీ విడియోలు, విభిన్న ఫోటోలు, పోస్ట్‌లతో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. అంతేకాదు యూజర్ల ప్రశ్నలకు అంతే చమత్కారంగా బదులివ్వడం కూడా వ్యాపార దిగ్గజానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని వాయిస్ తనదేనా కాదా అని తెలుసుకోవాలనుకునే ట్విట్టర్ వినియోగదారుడికి ఆయనిచ్చిన సమాధానం నెటిజనులను ఆకట్టుకుంటోంది. విషయం ఏమిటంటే..ది మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ గురించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో టైటిల్స్‌లో వాయిస్ ఆనంద్ మహీంద్రఅని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆయన నేరేషన్లో ఈ వీడియో కథనం సాగుతుంది. అయితే “సార్, ఇది మీ వాయిస్?” అని ఒకరు సంభ్రమాశ్చర్యాలతో అడిగారు. దానికి సమాధానంగా మీకు నచ్చితే నా వాయిస్సే.. నచ్చకపోతే నాది కాదు..(ఊరికే సరదాగా అంటున్నా..అది నా వాయిస్సే) అంటూ రిప్లై ఇచ్చారు మహీంద్ర. దీంతో కమెంట్లు వెల్లు వెత్తాయి. “చివరికి మనం రోజూ చూసే ముఖానికి వాయిస్‌ని లింక్ చేయడం అద్భుతం. మీ డిక్షన్ వాయిస్ క్లారిటీ భలే ఉంది సార్ శుభాకాంక్షలు” ఒకరు "వావ్ మీరు వాయిస్ ఆర్టిస్ట్ కావచ్చు సార్" అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా అట్లాంటాలోని వరల్డ్ ఆఫ్ కోకా కోలా , స్టుట్గార్ట్లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియం వంటి కార్పొరేట్ మ్యూజియంలు 1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే గత దశాబ్దంలో అనేక భారతీయ వారసత్వ సంస్థలు, టాటా, అరవింద్ లిమిటెడ్ ఇలాంటి మ్యూజియంలను ప్రారంభించాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ పేరుతో మహీంద్ర కూడా చేరింది. జీవితం స్థిరంగా లేనట్లే, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో మహీంద్రా గ్రూప్‌కు సంబంధించి ఒక సజీవమైన, శ్వాసించే సంస్థ మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ " అని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ముంబైలోని మహీంద్ర ప్రధాన కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ముందస్తు అనుమతితో దీన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. If you’re happy with it, it is my voice and if you don’t like it, it isn’t! ( Just kidding; yes it’s my voice) https://t.co/TG1yczLSrk — anand mahindra (@anandmahindra) July 11, 2022 Presenting The Museum of Living History, where #PurposeMeetsDesign. It celebrates the philosophy, DNA, core values, and culture of the @MahindraRise Group and is a collection of stories that define us. Located at our HQ in Mumbai, it’ll soon be open for viewing by appointment pic.twitter.com/c5ew7YaEsZ — anand mahindra (@anandmahindra) July 11, 2022 -
ఆ సీక్రెట్ చెప్పమన్న నెటిజన్.. నటి రిప్లైకి నోట మాట రాలేదు!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్ బజ్వా. టాలీవుడ్లో ‘మొదటి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాస్ , పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో తెలుగు తెరపై నెమ్మదిగా కనుమరుగైంది ఈ బ్యూటీ. దీంతో తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. అడపా దడపా ఈ భాషల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది పూనమ్. సాధారణంగా ఫోటోలతో తన ఫాలోవర్లకు పిచ్చేక్కించే ఈ బ్యూటీ.. ఈ సారి ముచ్చటించాలని అనుకుంది. దీంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నుంచి ఓ చిలిపి ప్రశ్న పూనమ్‌కు ఎదురైంది. అతను.. "మీ సెక్సీ స్ట్రక్చర్ వెనుకు దాగున్న రహస్యం ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి "పూనమ్" ఏమాత్రం తడబడకుండా, కూల్‌గా... నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేస్తాను అని బదులిస్తూ తాను యోగ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో అమ్మడు ఇచ్చిన రిప్లేకి సదరు నెటిజన్‌కు నోట మాట రాలేదు. చదవండి: Bigg Boss 5 Telugu: ఆ వైరల్ వీడియోపై షణ్ముఖ్ క్లారీటీ -
ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు.. నెటిజన్‌పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్
‘బాయ్స్’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’తో టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించాడు నటుడు సిద్దార్థ్. ప్రత్యేకంగా బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్‌తో యూత్‌లో విపరీతంగా ఫాలోయింగ్ వచ్చేసింది మనోడికి. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. దీంతో కొన్నాళ్లుగా ఈ హీరోకి తెలుగులో సినిమా ఆఫర్స్ తగ్గడంతో తమిళ ఇండస్ట్రీకి పరిమితం అయ్యాడు. తాజాగా సిద్దార్థ్ వయసు పై ఓ నెటిజన్ ట్రోలింగ్ చేయగా, దానికి ఘటుగానే బదులిచ్చాడు. వయసు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ఏ అంశం అయినా, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఈ నటుడు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా సిద్ధార్థ్ మరో వివాదాస్పద ట్వీట్‌తో నెట్టింట వార్తల్లో నిలిచాడు. ఓ నెటిజన్ సిద్ధార్థ్ వయసుకు సంబంధించి.. ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసి అతనికే ట్యాగ్ చేశాడు. ఈ టీట్‌పై సిద్ధార్థ్ కూడా ఘాటుగానే జవాబిచ్చాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ టీట్ వైరల్‌గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ లుక్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. Ee hero vayasu topic lo neeku firstu nene gurthochana ra? Tag kuda chesav? Super ra daridram. Ekkadninchi ostharraa meelantollu? 🥲#Telugu #Daranam #NaaVayasuNaakuTelusu https://t.co/yjTFpzCMsI — Siddharth (@Actor_Siddharth) July 16, 2021 -
ఎస్ఈసీ నోటీసు: వివరణ ఇచ్చిన కొడాలి నాని
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఆయన తరఫున తన న్యాయవాది తానికొండ చిరంజీవి శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో కమీషన్ కార్యదర్శి కన్నబాబుని కలిసి షోకాజ్ నోటీసుపై మంత్రి కొడాలి నాని వివరణను అందించారు. అనంతరం న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ప్రెస్మీట్లో ఎన్నికల కమీషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 లోపు సమాధానం ఇవ్వాలని తెలిపింది. ఎస్ఈసీ షోకాజ్ నోటీస్‌కి సమాధానం ఇచ్చాం’’ అన్నారు. ‘‘కొడాలి నాని ఎస్ఈసీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంత్రికి చెడు కలిగించాలని ఈ నోటీసు ఇచ్చారు. నిమ్మగడ్డ, చంద్రబాబుల మధ్య ఉన్న బంధంపై ప్రజలు అనుకున్నదే మాట్లాడారు. ఒక పార్టీకి ఎస్ఈసీ కొమ్ము కాయడం వ్యక్తిగతమే. షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని రిప్లై ఇచ్చాం. మంత్రి మొదటి విడత ఎన్నికల ఫలితాల గురించి మాత్రమే ప్రేస్‌మీట్‌లో మాట్లాడారు. ఒకవేళ ఎస్ఈసీ వాటిని అసంబద్ధమైన, దురదృష్టకరమైన వ్యాఖ్యలుగా భావిస్తే మేం లీగల్‌గా ఎదుర్కొంటాం. అందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాం’’ అని తెలిపారు. ఎస్ఈసీ అంటే నాకు గౌరవం ఉంది: కొడాలి నాని రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల కమిషన్‌పై నాకు గౌరవం ఉంది అన్నారు మంత్రి కొడాలి నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇచ్చాను. ఎన్నికల కమిషన్ మా పట్ల ఒక రకంగా, టీడీపీ పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉంది. తప్పు చేయని మాకు నోటీసులిచ్చి, ఎస్ఈసీని విమర్శించిన బాబుకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. జరిగిన పరిణామాలపై ప్రశ్నిస్తే నోరు నొక్కాలని చూస్తున్నారు. ప్రజల్లో ఎస్ఈసీపై ఉన్న భావనను తొలగించుకోమని సూచించాను. ఎస్ఈసీ అంటే నాకు గౌరవం ఉంది. నా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా నోటీసులు ఇచ్చారు. నా భావాన్ని అర్థం చేసుకొని నోటీసులు వెనక్కి తీసుకోవాలి. తొలిదశ తరహాలోనే అన్నివిడతల్లో ఫలితాలు రాబోతున్నాయి. ప్రజా తీర్పుని అడ్డుకోవటం ఎవరితరమూ కాదు. ఏపీలో టీడీపీ భూస్థాపితం కాబోతోంది’’ అన్నారు కొడాలి నాని. చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి -
అందుకు సమయం లేదంటున్న నటి
ముంబై : ‘బిగ్ బాస్ 11’ విజేత శిల్పా షిండే ఇన్స్టాగ్రామ్ వేదికగా తనతో విరోధం ఉన్న హీనా ఖాన్‌కు అలానే ఆమె ప్రియుడైన రాకీ జైస్వాల్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ భామ తన ఫొటోతో పాటు తనను ద్వేషించేవారిని ఉద్దేశించి.. ‘నన్ను ద్వేషించేవారిని తిరిగి ద్వేషించేంత సమయం నాకు లేదు, నన్ను ప్రేమించేవారిని ప్రేమించే పనిలో మునిగిపోయాను’ అంటూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. కొన్ని నెలల కిందట ఎవరో సోషల్ మీడియాలో ఒక పోర్న్ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న యువతికి, శిల్పకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దాంతో అందరూ ఆ వీడియోలో ఉన్న యువతిని శిల్పగా భావించి ఆమెను చాలా అవమానించారు. ఈ విషయం గురించి శిల్ప బిగ్‌బాస్ 11 లో ఉన్నప్పుడు కూడా చర్చించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి శిల్ప ఆ వీడియోను తన ట్విటర్లో పోస్టు చేశారు. కానీ ఈ విషయంలో ఆమె విమర్శల పాలయ్యారు. ఇది జరిగి చాలా కాలం అవుతుంది. కానీ ప్రస్తుత వివాదానికి కారణం బిగ్ బాస్ 11 సభ్యుడైన రికీ ఇప్పుడు ఈ విషయాన్ని తన ట్విటర్లో ప్రస్తావిస్తూ శిల్పను మరోసారి విమర్శించాడు. వీడియోలో ఉన్న స్త్రీ అనుమతి లేకుండా నువ్వు వీడియోను ఎలా పోస్టు చేస్తావ్, ఒక సెలబ్రిటీవి అయినా.. ఇంతా బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తిస్తావ్ అంటూ రికీ ప్రశ్నించారు. అంతేకాక ఆ వీడియోలో ఉన్నది నీవు కానప్పుడు న్యాయపరంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది తప్ప ఇలా సోషల్ మీడియాలో పోర్న్‌ను ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని శిల్పను విమర్శించారు. ఈ సందర్భంగా శిల్ప తనను విమర్శిస్తున్న వారికి చాలా గట్టి సమాధానమే చెప్పింది. తాను చేసిని పనిని విమర్శిస్తున్న వారు, మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తూ చురకలు అంటించారు. -
నటికి అసభ్య సందేశం.. స్ట్రాంగ్ రిప్లై
సాక్షి, సినిమా : ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33). అయితే పెద్దగా సక్సెస్ రాకపోవటంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్రిటీష్ సింగర్ ఆ మధ్య సన్యాసం స్వీకరించి ఆమె వార్తల్లో నిలిచారు. మళ్లీ ఏమనిపించిందో ఏమో బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసి అతన్ని వివాహం చేసుకుంది. తర్వాత భర్తతో తరచూ హాట్ ఫోటోలు పెడుతూ.. చీప్ ట్రిక్స్ చేస్తోందంటూ ఫాలోవర్స్ నుంచి ఛీత్కారాలను ఆమె ఎదుర్కున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం చేశాడు. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఆమె అందుకు ప్రతిగానే బదులు ఇవ్వగా.. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిషేక్ సింగ్ అనే వ్యక్తి సోఫియాతో ఒక రాత్రి తనతో గడపాలని.. అందుకు రూ. 20 లక్షలు ఇస్తానంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. అంతే ఆమెకు కోపం తెప్పించింది. ఆపై దానిని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వ్యక్తికి సరైన సమాధానం ఇచ్చావ్ శభాష్.. అంటూ సోఫియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోఫియా చేసిన పోస్ట్ -
‘బ్యాంకు’ పరిశీలనలోనే రుణ దరఖాస్తు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన రుణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తు ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. రాజధాని నగరం అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు రూ.3.324 కోట్ల రుణం కోరుతూ ఏపీ ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకుందన్నారు. రుణం మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రారంభించిన అధ్యయనం, మదింపు ప్రాథమిక దశలో ఉందన్నారు. ప్రాజెక్టు మదింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రుణానికి సంబంధించిన సంప్రదింపులు ప్రారంభమవుతాయని, ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాకనే రుణాన్ని మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబు ఇచ్చారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జనరల్ కేటగిరీ రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకు వంటి బహుముఖ ఆర్థిక సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం మించకూడదన్నారు. మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచే సమకూర్చుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగే ఖర్చును రుణంలో భాగంగా ప్రపంచ బ్యాంకు నియమిత కాలపరిమితి ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తుందని వివరించారు. ప్రపంచ బ్యాంకు రుణం ఇంకా ఆమోదం పొందనందున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు, వాటి వినిమయ పత్రాల సమర్పణ ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు జైట్లీ సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చాం అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్ తదితర సదుపాయాల నిర్మాణం కోసం గత మూడేళ్ళ కాలంలో రూ.1500 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఏపీ విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నూతన రాజధాని నగరంలో సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక సహాయం కింద కేంద్రం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. రాజ్‌భవన్, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం 2014-15లో రూ.500 కోట్లు, 2015-16లో నూతన రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లు, 2016-17లో రూ.450 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన రూ.1500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు సమర్పించిందని, ఆయా నిర్మాణాల కోసం రూ.1,583 కోట్లు ఖర్చు చేసినట్లు నీతి అయోగ్‌కు వినిమయ పత్రాలు సమర్పించినట్లు మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. -
అరెరె.. పొరపాటున కొత్త ఫీచర్ ప్రత్యక్షం!
లండన్: వాట్సాప్ మొబైల్ యాప్ రిప్లై ప్రైవేట్లీ అనే సదుపాయాన్ని పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ విధానంలో గ్రూపులో ఉంటూనే ఓ సభ్యుడికి గ్రూప్ నుంచి ఇతర సభ్యులకు తెలియకుండా సందేశం పంపొచ్చు. వాట్సప్ బీటా ఆప్డేట్లో ఈ సదుపాయం కనిపించిన కాసేపటికే మాయమైందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్లీని విడుదల చేస్తారని వెల్లడించింది. డెవలపర్లు పొరపాటును దీనిని యాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్‌ను తమ యూజర్లకు తెచ్చే పనిలో యాజమాన్యం బిజీగా ఉండగా ఓ యూజర్ మొబైల్లో పొరపాటున ఈ ఫీచర్ కనిపించడం గమనార్హం. -
మన్ కీ బాత్ తరహా ప్రోగ్రాం చేయనున్న సీఎం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై సందుదొరికిన ప్రతీసారీ తీవ్ర విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి తన పంథా మార్చుకున్నారు. ఈ సారి ప్రధాని మోదీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీ రేడియోలో ప్రసంగించే 'మన్ కీ బాత్' కార్యక్రమం అథ్యదిక ప్రజాధరణ పొందిన విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమం తరహాలోనే కేజ్రీ ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు. 'టాక్ టు ఏకే' పేరుతో నెలకొక సారి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. www.talktoak.com లోకి లాగాన్ అయి తనతో ఆలోచనలు పంచుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జులై 17 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను పరిశీలించాలని హైకోర్టుకు ఉన్నత ధర్మాసనం సూచించింది. మరోవైపు దీనిపై మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేజ్రీవాల్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించిన ఉదంతాన్ని గతంలో ఎప్పుడూ వినలేదని ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యానించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వంతో పాటు, ప్రజలకు తీరని అవమానమని పేర్కొన్నారు.