కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై శుక్రవారం స్టే విధించింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను పరిశీలించాలని హైకోర్టుకు ఉన్నత ధర్మాసనం సూచించింది.
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను పరిశీలించాలని హైకోర్టుకు ఉన్నత ధర్మాసనం సూచించింది. మరోవైపు దీనిపై మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేజ్రీవాల్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించిన ఉదంతాన్ని గతంలో ఎప్పుడూ వినలేదని ఆప్ నేత సోమ్నాథ్ భారతి వ్యాఖ్యానించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వంతో పాటు, ప్రజలకు తీరని అవమానమని పేర్కొన్నారు.