అందుకు సమయం లేదంటున్న నటి | Shilpa Shinde Gives Strong Reply To Her Haters Rocky And Hina | Sakshi
Sakshi News home page

అందుకు సమయం లేదంటున్న నటి

Published Mon, Apr 23 2018 10:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

Shilpa Shinde Gives Strong Reply To Her Haters Rocky And Hina - Sakshi

ముంబై : ‘బిగ్‌ బాస్‌ 11’ విజేత శిల్పా షిండే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనతో విరోధం ఉన్న హీనా ఖాన్‌కు అలానే ఆమె ప్రియుడైన రాకీ జైస్వాల్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ భామ తన ఫొటోతో పాటు తనను ద్వేషించేవారిని ఉద్దేశించి.. ‘నన్ను ద్వేషించేవారిని తిరిగి ద్వేషించేంత సమయం నాకు లేదు, నన్ను ప్రేమించేవారిని ప్రేమించే పనిలో మునిగిపోయాను’ అంటూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే.. కొన్ని నెలల కిందట ఎవరో సోషల్ మీడియాలో ఒక పోర్న్‌ వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న యువతికి, శిల్పకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దాంతో అందరూ ఆ వీడియోలో ఉన్న యువతిని శిల్పగా భావించి ఆమెను చాలా అవమానించారు. ఈ విషయం గురించి శిల్ప బిగ్‌బాస్‌ 11 లో ఉన్నప్పుడు కూడా చర్చించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి శిల్ప ఆ వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశారు. కానీ ఈ విషయంలో ఆమె విమర్శల పాలయ్యారు. ఇది జరిగి చాలా కాలం అవుతుంది. కానీ ప్రస్తుత వివాదానికి కారణం బిగ్‌ బాస్‌ 11 సభ్యుడైన రికీ ఇప్పుడు ఈ విషయాన్ని తన ట్విటర్‌లో ప్రస్తావిస్తూ శిల్పను మరోసారి విమర్శించాడు. 

వీడియోలో ఉన్న స్త్రీ అనుమతి లేకుండా నువ్వు వీడియోను ఎలా పోస్టు చేస్తావ్‌,  ఒక సెలబ్రిటీవి అయినా.. ఇంతా బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తిస్తావ్‌ అంటూ రికీ ప్రశ్నించారు. అంతేకాక ఆ వీడియోలో ఉన్నది నీవు కానప్పుడు న్యాయపరంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది తప్ప ఇలా సోషల్‌ మీడియాలో పోర్న్‌ను ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని శిల్పను విమర్శించారు. ఈ సందర్భంగా శిల్ప తనను విమర్శిస్తున్న వారికి చాలా గట్టి సమాధానమే చెప్పింది. తాను చేసిని పనిని విమర్శిస్తున్న వారు, మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్‌ అవుతున్నప్పుడు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తూ చురకలు అంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement