obscenity
-
నగ్న చిత్రం ప్రతిదీ అసభ్యకరం కాదు
ముంబై: నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జూలైలో ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఎస్ సొనక్, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. నగ్నంగా అగుపించేంది ఏదైనా సరే అశ్లీలమైనదనే వ్యక్తిగత అవగాహన ఆధారంగా మాత్రమే ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారని, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని పేర్కొంది. ముంబై వ్యాపారవేత్త ముస్తాఫా కరాచీవాలాకు చెందిన బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2022లో లండన్‌లో జరిగిన రెండు వేర్వేరు వేలాల్లో ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన ఏడు పెయింటింగ్‌లను సొంతం చేసుకుంది. వీటిని 2023 ఏప్రిల్‌లో ముంబైకి తీసుకురాగా కస్టమ్స్ విభాగం స్పెషల్ కార్గో కమిషనరేట్ వీటిని అసభ్యకర వస్తువులని అభ్యంతరం చెబుతూ స్వాధీనం చేసుకుంది. 2024లో అసిస్టెంట్ కమిషనర్ వీటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతోపాటు ఆ కంపెనీకి రూ.50వేల జరిమానా సైతం విధించారు. ఈ చర్యలను బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది. -
రైల్వే ప్లాట్‌ఫారమ్ టీవీల్లో యాడ్స్‌కు బదులుగా ..
నిర్లక్ష్యమో, కావాలని జరిగిన ఘటనో తెలియదుగానీ.. స్టేషన్లో ప్రయాణికులను బిత్తర పోయేలా చేసింది ఓ ఘటన. అడ్వర్టైజ్మెంట్ల ప్లేస్‌లో మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్రదర్శితమైంది. ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం బీహార్ రాజధాని పాట్నా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న కొందరు ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న టీవీల్లో పో* వీడియో ప్లే కావడంతో ఇబ్బందిపడ్డారు. కొందరు ఆకతాయిలు అరుస్తూ.. ఆ వీడియోను తమ సెల్ఫోన్లతో బంధించారు. ఈలోపు కొందరు ప్రయాణికులు.. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ), ఆర్పీఎఫ్ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేసే ఏజెన్సీకి ఫోన్ చేయడంతో.. వీడియో ఆగిపోయింది. ఇక ఈ ఘటనకు సదరు ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్స్ ఘటనకు కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు మరెప్పుడూ కాంట్రాక్ట్ దక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చారు. అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధించారు. మరోవైపు రైల్వే విభాగం ఈ ఘటనపై విడిగా విచారణ చేపట్టింది. అయితే ప్రత్యేకించి ప్లాట్‌ఫాం నెంబర్ 10పైనే టీవీల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైల్వే అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియో: ఇలాంటి షాపింగ్‌ను మీరు కచ్చితంగా ఊహించి ఉండరు! -
‘బిగ్‌బాస్’లపై చర్యలు తీసుకోరా?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ వంటి షోల విషయంలో ఏం చర్యలు తీసుకోరా? అంటూ ఏపీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి షోలను కట్టడి చేసేందుకు ఏదైనా చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా.. సామాజిక సమస్యలపై స్పందించే ఉద్దేశం మీకుందా? అంటూ నిలదీసింది. ప్రజలు చైతన్యవంతంగా లేరని భావించవద్దని, ఈ రోజు చైతన్యంగా లేకపోయినా, రేపు ఓ రోజు ప్రజలు తమ చైతన్యాన్ని కచ్చితంగా చూపుతారని పేర్కొంది. ఈ విషయాన్ని విస్మరించవద్దని సూచించింది. బిగ్‌బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ 2019లోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసినా ఇప్పటివరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. బిగ్‌బాస్ వంటి షోల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రసార, సమాచారశాఖ కార్యదర్శి, కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బిగ్‌బాస్ వంటి షోల ద్వారా వాటి నిర్వాహకులు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. బిగ్‌బాస్ షోను నిలిపేసేలా ఆదేశాలివ్వండి.. అశ్లీల, అసభ్య, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంతోపాటు యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ శేషసాయి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహిస్తోందన్నారు. సెన్సార్షిప్ లేకుండానే ఈ షోను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం బిగ్‌బాస్ 6వ సీజన్ జరుగుతోందని, ఇలాంటి షోల విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. మంచి సందేశాలిచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటుందా? ధర్మాసనం స్పందిస్తూ.. ‘సమాజంలో ఏం జరుగుతోంది? టీవీల్లో గతంలో దేశభక్తుల చరిత్రలు ప్రసారం చేసేవారు. ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ప్రజలకు మంచి సందేశాలిచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటోందా? ఏ కార్యక్రమంలో కూడా సృజనాత్మకత ఉండటం లేదు. ఇలాంటి షోల విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి..’ అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. శివప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బిగ్‌బాస్ షోలో పాల్గొనేవారు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి షోల విషయంలో ఎలా వ్యవహరించాలో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయంటూ వాటిని చదివి వినిపించారు. ఈ మార్గదర్శకాలను పరిశీలించిన ధర్మాసనం.. ‘పాతకాలంలో గొప్ప సినిమాలొచ్చేవి. సందేశాత్మక చిత్రాలొచ్చేవి. ఇప్పుడు కుటుంబసభ్యులంతా కలిసి చూసేలా సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉంటున్నాయా? ఇప్పుడు బూతులు తప్ప ఏముంటున్నాయి? కొట్టుకోవడం, తిట్టుకోవడం, విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప సినిమాల్లో ఏముంటోంది? ఇలాంటివాటికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజంలో ఉన్నతవర్గం మౌనంగా ఉంటోంది. సమస్యల విషయంలో వారేమీ మాట్లాడటం లేదు. ఏం జరిగినా స్పందించడం లేదు. మేము, మా కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఇది సరైన వైఖరి కాదు..’ అని వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ షో విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కేంద్ర ప్రభుతాన్ని ధర్మాసనం ఆదేశించింది. చదవండి: బిగ్‌బాస్ 16కు రూ. 1000 కోట్ల పారితోషికం! సల్మాన్ ఖాన్ క్లారిటీ -
అశ్లీల వేషాలు కుదరవు! బ్యాంకుల షాక్..
కంటెంట్ క్రియేషన్ కోసం స్వేచ్ఛను ఇస్తే.. కొందరు దానిని మితిమీరి ఉపయోగించుకుంటున్నారు. అశ్లీల కంటెంట్ పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రీమియం మెంబర్షిప్ వెబ్సైట్.. ‘ఓన్లీఫ్యాన్స్’ తమ అడల్ట్ క్రియేటర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై అశ్లీల కంటెంట్‌కు తమ సైట్లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అక్టోబరు 1 నుంచి యూకేకు చెందిన సబ్‌స్రి్కప్షన్ సర్వీస్.. ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్ వైడ్‌గా యూజర్లు(భారత్‌లో సుమారు మూడున్నర లక్షలు) ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం, సైట్లకు.. పేమెంట్ ద్వారా బ్యాకింగ్ పార్ట్నర్స్కు కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో డీసెంట్ సైట్‌గా పేరున్న ఓన్లీఫ్యాన్స్.. ఆ తర్వాతి కాలంలో అడల్ట్ కంటెంట్ , ఆశ్లీలతకు మధ్య సన్నని గీతను చెరిపేసింది. పూర్తి అశ్లీల వెబ్‌సైట్‌గా మారింది. దీంతో ఓన్లీఫ్యాన్స్పై విమర్శలు పెరిగాయి. త్వరలో ఇలాంటి కంటెంట్‌పై నిషేధం విధించనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని, ఈ మేరకు రాబోయే రోజుల్లో పూర్తి అప్డేట్లను యూజర్లకు అందుబాటులో ఉంచుతామని ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. కారణం ఇదే.. విచ్చలవిడిగా అశ్లీల కంటెంట్ సైట్లో కనిపిస్తుండడంపై బ్యాంకింగ్ పార్ట్నర్స్, పేఅవుట్ ప్రొవైడర్స్ ఓన్లీసైట్కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. అశ్లీల కంటెంట్‌తో పాటు యాక్టివిటీస్ కూడా ఉండకూడదని స్పష్టం చేస్తోంది. అయితే గత నెలలో ఈ చర్యల్లో భాగంగా మొదటి అడుగు వేసింది ఓన్లీఫ్యాన్స్. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ఆరోపణలపై 15 అకౌంట్లను డీయాక్టివ్ చేసింది. ఇకపై మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని యూజర్లను హెచ్చరించింది కూడా. ఇక NCOSE నైతిక విలువల పేరిట.. మాస్టర్‌కార్డ్(పేమెంట్ జరగకుండా) ఇలాంటి కంటెంట్‌ను చూడకుండా బ్యాన్ విధించింది. ‘సురకక్షితమైన పేమెంట్ కాద’ని పేర్కొంటూ.. ఓన్లీఫ్యాన్స్తో పాటు మైఫ్రీకామ్స్ ఇతరత్ర సైట్లకు వీలు లేకుండా చేసింది. నో పేమెంట్స్ మాస్టర్‌కార్డ్, వీసా ఇదివరకే పోర్న్‌హబ్‌తో డీల్ రద్దు చేసుసుకున్నాయి. కారణం.. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రొత్సహించడం. అయితే ఈ ఆరోపణలను ఖండించిన పోర్న్ హబ్.. వెరిఫై లేని యూజర్ల కంటెంట్‌ను అప్లోడ్ కానివ్వకుండా చూసుకుంటోంది. తాజాగా మాస్టర్‌కార్డ్.. ఓన్లీఫ్యాన్స్పైనా నిషేధం విధించింది. 2016 నుంచి లండన్ బేస్డ్గా పని చేస్తున్న ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌ను టిమ్ స్టోక్లే 2016లో స్థాపించాడు. మొదలట్లో కుకింగ్, ఫిట్ ద్వారా పేరు సంపాదించుకుంది. ఆపై పోర్నోగ్రఫీ ద్వారా పేరు మోసింది. సెక్స్ వర్కర్స్ వీటి ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్‌కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్ ఉందని యాక్సియోస్ సర్వే వెల్లడించింది. లియోనిడ్పై ఎఫెక్ట్ ఓన్టీఫ్యాన్ వెబ్సైట్ ద్వారా సాలీనా 300 క్రియేటర్లు మిలియన్ డాలర్ల దాకా సంపాదిస్తుంటే.. 16 వేలమంది సంవత్సరానికి కనీసం యాభై వేలు సంపాదిస్తున్నారు. ఓన్లీఫ్యాన్స్‌లో ఎక్కువ వాటా ఉక్రెయిన్-అమెరికాకు చెందిన పోర్న్ ఎంట్రప్రెన్యూర్ లియోనిడ్ రాడ్వింస్కీ పేరిట ఉంది. ఇందులో ఆయన వాటా వన్ బిలియన్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్లీ కంటెంట్ బ్యాన్.. ఈ షేర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి : Facebook Horizon Workroom: ఈ టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
లైవ్‌లో బూతులు.. భార్యతో సహా పబ్జీ మదన్ అరెస్ట్
సాక్షి, చెన్నై: యూ ట్యూబ్ చానల్ గేమ్స్ పేరిట పబ్జీ మదన్ సాగించిన వ్యవహారం గురించి తెలిసిందే. నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు.. మహిళల పట్ల ఆసభ్య పదజాలంతో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మదన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడిని చెన్నై పోలీసులు శుక్రవారం ధర్మపురిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఛానల్‌కు అడ్మిన్‌గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కృతికను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వీరి చానల్‌కు 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని, వారిలో మైనర్లే అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేగాక మదన్ చానల్ వేదికగా గేమ్స్ ఆడిన వారిలో సంపన్నుల పిల్లలే ఉన్నట్టు విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ మణిక్కం అలియాస్ మదన్.. మదన్, టాక్సిక్ మదన్ 18+, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. ఇందులో గేమింగ్ ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. నిషేధిత పబ్జీ గేమ్ గురించి వీడియోలు చేశాడు. ఆ తర్వాత దానిని అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలు చేయడానికి ఉపయోగించాడు. భారత్‌లో బ్యాన్ చేసిన పబ్జీ గేమ్ ఆడుతూ ఇటీవల బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం చేలరేగింది. దీంతో ఛానల్‌ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో చెన్నై వాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం మదన్ కోర్టును ఆశ్రయించాడు. జడ్జి దండపాణి మాట్లాడుతూ.. చానల్ వేదికగా మదన్ మహిళలను అసభ్యపద జాలంలో దూషించిన ఆడియోను విన్న తర్వాత బెయిల్ కోసం వాదించండి అంటూ మదన్ న్యాయవాదికి హితవు పలికారు. మదన్ వాయిస్ రికార్డులు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు షాక్‌కు గురయ్యింది. జూన్ 17న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మదన్ అశ్లీల పదజాలంతో కూడిన గేమింగ్ వీడియోస్ ద్వారా అతను నెలకు రూ. 3 లక్షలకు పైగా సంపాదించేవాడని పోలీసులు తెలిపారు. మదన్ వద్ద మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: లైవ్‌లో మదనుడి బూతులు, రాసలీలల స్క్రీన్ షాట్స్ -
చిన్నారికి అశ్లీల వీడియో చూపి..
పూణే : పాఠశాల విద్యార్థికి అశ్లీల వీడియోను చూపిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్టు పూణే పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండాలని బాధితుడికి సూచించిన స్కూల్ మహిళా కౌన్సెలర్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 14 సంవత్సరాల పాఠశాల విద్యార్థికి ప్రిన్సిపల్ అశ్లీల వీడియోను చూపుతూ లైంగికంగా వేధించాడని, దీనిపై స్కూల్‌కు చెందిన మహిళా కౌన్సెలర్‌కు బాలుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. అయితే ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె బాధిత బాలుడిని ఈ ఘటనపై ఎక్కడా నోరువిప్పరాదని కోరారని తెలిసిందన్నారు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు సైతం తమ కుమారుడి చదువు దెబ్బతింటుందనే భయంతో మౌనంగా ఉన్నారని, ఘటనపై తమకు సమచారం అందడంతో తాము కలుగచేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్, కౌన్సెలర్లపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
అదిరిపోయే ట్విస్ట్: రాసలీలలపై మరో సాక్ష్యం!
ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్(46).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో రాసలీలలు నడిపారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ట్రంప్ తనతో లైంగిక సంబంధం కొనసాగించినట్లు ఆమె ఆరోపించటమే కాదు.. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొని కలకలమే రేపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటకు రావటం చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్: ట్రంప్.. తన మాజీ అటార్నీ మైకేల్ కోహెన్‌తో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్ కుదుర్చుకోవాలని కోహెన్‌కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ‘ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్‌ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’.. అని ట్రంప్ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్ బదులిచ్చినట్లు క్లిప్‌లో ఉన్నట్లు సదరు కథనం సారాంశం. ట్రంప్ టవర్లోనే ఈ సంభాషణ జరగ్గా.. 90 సెకన్ల ఆ సంభాషణను కోహెన్ ముందు జాగ్రత్తగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోహెన్‌పై ఎన్నికల అవినీతి, అక్రమాస్థుల కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏజెంట్లు కోహెన్ కార్యాలయాల నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కథనం వివరించింది. నిజమే కానీ... ఇక ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ స్పందించారు. ఆ సంభాషణ నిజమే అయినప్పటికీ.. ఆమెతో ఎలాంటి ఒప్పందం జరగలేదని రూడీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోవని రూడీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2006లో ట్రంప్ తనతో అఫైర్ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ ఆరోపణలు చేశారు.. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. -
పోర్న్ వీడియో చూసి ఐదుగురు బాలురు..
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాహస్పూర్ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బస్సుపై పోర్న్ స్టార్స్ ఫొటోలు.. ఫుల్ గిరాకీ!
త్రివేండ్రం: కస్టమర్స్‌ను ఆకర్షించడానికి వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదులుకోవట్లేదు వ్యాపారస్థులు. ఇటీవల రూపాయి పతనాన్ని కూడా తమ బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించుకుంది డ్యూరెక్స్ ఇండియా కండోమ్ కంపెనీ. ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తరహాలోనే కేరళకు చెందిన ఓ ట్రావెల్ కంపెనీ వినూత్నంగా ఆలోచించి కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఏకంగా బస్సుపై పోర్న్స్టార్ల చిత్రాలను పెట్టేసింది. త్రివేండ్రంకు చెందిన చీకూస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ.. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్స్టార్ల ఫొటోలను అతికించింది. అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ వ్యక్తి ఈ బస్సుల ఫొటోలు తీసి ‘కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు’ అని ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్ స్టార్ కీరన్ లీ స్పందిస్తూ ‘ఆకట్టుకునేలా’ ఉందనడం ఇక్కడ విశేషం. Impressive — Keiran Lee (@KeiranLee) 30 June 2018 చదవండి: రూపాయి పతనం.. కండోమ్ యాడ్ వైరల్ -
పోర్న్ వీడియోలు.. చెల్లెలిపైకి ఉసిగొల్పాయి
సాక్షి, నర్సీపట్నం : పోర్న్ వీడియోల ప్రభావం ఓ బాలుడిని నిందితుడిగా మార్చాయి. అతనికి వరుసకు సోదరి అయిన బాలికపై లైంగికదాడి చేసేందుకు పురిగొల్పాయి, ఆపై హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో ఆ బాలిక ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి(బీకే పల్లి) గ్రామంలో గత ఆదివారం ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం విశాఖపట్నం జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. పోర్న్ వీడియోల ప్రభావంతో సోదరిపైనే అత్యాచారానికి తెగబడ్డాడని చెప్పారు. బాధితురాలు, నిందితుడిది ఒకే ఇంటి పేరు. పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. నిందితుడు ఇటీవల పదో తరగతి పాస్ అయ్యాడు, బాధితురాలు ఏడు నుంచి 8వ తరగతిలోకి వస్తోంది. పక్కపక్క ఇళ్లు కావడంతో ఎప్పుడు సరదాగా ఆడుకుంటారు. ఎప్పుడూ మాదిరిగానే 10వ తేదీన ఐదుగురు పిల్లలు ఆడుకున్నారు. వర్షం వస్తుండడంతో ముగ్గురు పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. తమ ఇంటి నిర్మాణానికి తీసుకువచ్చిన సిమెంట్ బస్తాలు వర్షానికి తడవకుండా ఉండేందుకు కవర్ కప్పేందుకు బాధితురాలు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు పాకలో ప్రవేశించి వెనుక నుంచి ఒక్కసారిగా బాలికను పట్టుకున్నాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక పెద్దగా కేకలు పెట్టింది. నలుగురు వస్తే పరువుపోతుందని భావించిన నిందితుడు బాలిక మెడలో ఉన్న చున్నీతో పాక రాటకు గట్టిగా బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక స్పృహతప్పడంతో, పాకలో సిమెంట్ బస్తాలు అమ్మాయిపై పడినట్టు సీన్ క్రియేట్ చేశాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్లి చెల్లెలు సిమెంట్ బస్తా కిందపడి ఉందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు ఆరోజు నుంచి ఊరిలో కనిపించలేదు. అతనిని పట్టుకుని విచారించగా వీడియోల ప్రభావంతో ఎవరైనా అమ్మాయితో అలా ప్రవర్తించాలని అనిపించేదని, కళ్లెదురుగా సోదరి కనిపించడంతో అలా ప్రవర్తించానని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి, మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ రేవతమ్మ తెలిపారు. ఈ సమావేశంలో కోటవురట్ల ఎస్ఐ మధుసుధన్‌రావు పాల్గొన్నారు. -
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారా?
మీ పిల్లలు కౌమార దశలో ఉన్నారా? స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. కొందరు యుక్త వయసుకు వచ్చిన విద్యార్థులు స్మార్ట్ఫోన్లలోని ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌లో తేటతెల్లమైంది. వీరే అధికంగా కళాశాలల్లో ఈవ్‌టీజర్లుగా మారుతున్నారని తెలిసింది. వీరిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంచకపోతే చెడుదారి పట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 445 ఉన్నత పాఠశాలల్లో 60 వేల మంది పదోతరగతి, 108 ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 45 వేల మంది ఇంటర్, 180కిపైగా ప్రభుత్వ/ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మూడు సంవత్సరాల్లో కలిపి లక్షకి మందిపైగా డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారే అధికం. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు మాత్రం వీటికి కొంచెం దూరంగా ఉన్నా తల్లిదండ్రులు, అన్మదమ్ములు, అక్కాచెల్లెలు, ఇతర స్నేహితుల ద్వారా వీక్షణలో ఉంటారు. ఫేస్బుక్, యూట్యూబ్‌లలో కనిపించే కోన్ని అశ్లీల దృశ్యాలు, చిత్రాలు పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థుల భావోద్వేగాలపై ప్రభావం చూపుతున్నాయి. చదువుపై ధ్యాస ఉన్నా ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఫోన్లలో వీక్షిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణుల బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడడంతో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడాలని అనిపిస్తున్నట్లు వారు చెప్పారు. మరోవైపు తాము చూసిన వీడియోలు తల్లిదండ్రులుగాని, ఇతరులుకాని చూడకుండా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అనుబంధం తగ్గి.. యుక్త వయసుకు వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధం తగ్గిపోతుందని మానసిక నిపుణులు విశ్లేషించారు. ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూడకపోవడం, దీర్ఘకాలం హాస్టళ్లలో ఉండడంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమ తల్లిదండ్రులు కేవలం చదువుకోవడానికి మాత్రమే డబ్బులు ఇస్తారని, తాము ఏమి చుదువుకుంటున్నామో, ఏమి చేస్తున్నామో చూడడం లేదని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈవ్‌టీజింగ్ అంటే తమకు తెలియదని, సహ విద్యార్థుల సందడిలో తోటి విద్యార్థినులను ఏడిపించడం బాధగా ఉంటుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు చేయాల్సిన పని.. ♦ స్నేహితులతో చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడూ తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో గమనించాలి. ♦ కొందరు ఇంట్లో డబ్బు తీసుకొని తమతోపాటు చదువుకుంటున్న అమ్మాయిలతో కలసి విందుల్లో పాల్గొంటున్నారు. వీరు పుస్తకాలు, ప్రాజెక్టుల కోసమే నిజంగా ఖర్చు చేస్తున్నారా అని పరిశీలించారు. క్రీడలు ఆడించాలి వేధింపుల పాల్పడుతున్న విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. 90 శాతం మంది మానసికోల్లాసం లేకపోవడం పోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. ఇలాంటి వ్యసనాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి సకాలంలో క్రీడలు.. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే మంచిది. – శిరిగిరెడ్డి జయారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు -
దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడి
ఈ నినాదం ఇప్పుడు దక్షిణ కొరియాను ఊపేస్తుంది. దాదాపు 20 వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి దేశంలో మహిళల పట్ల జరుగుతున్న ‘రహస్య లైంగిక దోపిడి’కి వ్యతిరేకంగా నినాదించారు. ప్రస్తుతం కొరియా దేశాల వైపే ప్రపంచం మొత్తం చూస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భేటీ కాగా మరొకటి దక్షిణ కొరియాలో రహస్య లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం. వివరాలు.. 2010 నుంచి దక్షిణ కొరియాను పోర్న్ భూతం పట్టిపిడిస్తుంది. రహస్య కెమెరాలలో నగ్నంగా చిత్రికరించబడి సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కినవారు కోకొల్లలు. బస్సుల్లో, బస్ స్టాపుల్లో, పబ్లిక్ టాయిలెట్లలో ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు పెట్టి మహిళల జీవితాలను ఆన్లైన్ పాలు చేస్తున్నారు. ఈ రహస్య పోర్న్ భూతానికి బలైంది కేవలం మహిళలే కాదు, ఈ జాబితాలో మగవారు కూడా ఉండటం గమనార్హం. గత నెల ఓ ప్రముఖ యూనివర్సిటీలో 25 ఏళ్ల యువకుడి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రీకరించిన యువతి వాటిని సామాజిక మాధ్యమాల్లో, పోర్న్ సైట్లలో పెట్టింది. ఆ యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినా పూర్తి స్థాయి దర్యాప్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో దేశంలో పెరిగిపోతున్న ‘స్పై కెమెరా పోర్న్’ను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ప్రజలు ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ భారీ ర్యాలీ నిర్వహించిన సంస్థ ‘కరేజ్ టూ బీ అన్‌కంఫర్టబుల్’ గతంలో కూడా ఇలాంటి ర్యాలీని చేపట్టింది. ఈ రహస్య పోర్న్‌ను దక్షిణ కొరియాలో ‘మోల్కా’ గా పేర్కొంటారు. దాదాపు 6000 మందికి పైగా ఈ మోల్కా కేసులలో అరెస్ట్ అయ్యారు. ఇందులో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. ఈ రహస్య పోర్న్ వీడియోల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఈ ఆధునిక టెక్నాలజీనే అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. -
నీలి చిత్రాలే.. బాలుడిని ప్రేరేపించాయ్!
వజ్రపుకొత్తూరు : నీలి చిత్రాలే బాలుడిని లైంగికదాడి వైపు నడిపించాయి. సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన వెనుక నీలిచిత్రాల కథ ఉందని తెలియగానే పోలీసులు అవాక్కయ్యారు. లోతుగా విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గ్రామంలో రెండేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో వజ్రపుకొత్తూరు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పలాసలో మొబైల్ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్, బెండి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కె.మల్లేసును వజ్రపుకొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నీలి చిత్రాలను బాలుడికి చూపించడం వల్లే అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ కేవీ సురేష్ చెప్పిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెల కాపరి మల్లేసు తన మొబైల్లో ఉన్న అశ్లీల చిత్రాలను బాలుడుకు ప్రతి రోజూ చూపించడంతో ఆ బాలుడు అశీల చిత్రాల్లో ఉన్న విధంగా తాను కూడా ఎవరికైనా అలా చేయాలని భావించుకుని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలిందని చెప్పారు. గొర్రెల కాపరి సెల్ ఫోన్లోకి నీలి చిత్రాలు అప్లోడ్ చేసి, బాలుడుని నీలి చిత్రాల వైపు మళ్లించినందుకు మొబైల్ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్‌ను సైతం విచారించామని, విషయాలు రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు. బాలుడితో పాటు గొర్రెల కాపరి, సెల్ షాపు యజమానిని అరెస్టు చేసి పాతపట్నం సబ్ జైలుకు తరలించామన్నారు. -
అశ్లీల చిత్రాలతోనే మహిళలపై దాడులు
ఖమ్మంమయూరిసెంటర్ : అశ్లీల చిత్రాలు, అశ్లీల సాహిత్యం, మద్యం వల్లనే మహిళలు, యువతుల పై దాడులు జరుగుతన్నాయని, యువత పెడదారి పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి సీహెచ్ శిరోమణి ఆరోపించారు. ఆదివారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పసిమొగ్గలపై అత్యాచారాలు జరిపి హత్యగా చిత్రీకరించడం పెరిగిపోయిందన్నారు. కతువా, ఉన్నావ్‌లలో బాలికలపై జరిగిన దారుణాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే బాలికపై అత్యాచారం చేశారని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలు, యువతులు, బాలికలపై అత్యాచార దాడులు పెరిగాయని ఆరోపించారు. బాలికలపై అత్యాచారాలు చేస్తే ఉరిశిక్ష వేస్తే నేరాలు ఆగవని, శిక్షను అమలు చేయడంతోపాటు సమాజంలో యువతను పెడదారి పట్టిస్తున్న అశ్లీల చిత్రాలను నిలిపివేయాలని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.ఝాన్సీ, శిరీష, స్వరూప, సరోజిని, కోటమ్మ, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వాట్సప్ గ్రూప్‌లో లెక్చరర్ అశ్లీల పోస్టులు
భాగ్యనగర్‌కాలనీ: బ్రిగ్గింగ్ టు గెదర్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో చిన్నారుల పట్ల అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్న ఓ వ్యక్తిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుషాల్ అలియాస్ పవర్ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతను క్రియేట్ చేసిన గ్రూపులో చిన్నారులను అశ్లీల పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే కుషాల్పై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పోస్ట్‌లు పెట్టినట్లు లె లియటంతో కుషాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మానవత్వానికే మచ్చలాంటి ఘటన..
అహ్మదాబాద్ : మానవత్వానికే మచ్చలాంటి ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అశ్లీలతకు అలవాటు పడిపోయిన ఓ యువకుడు కన్నతల్లినే చెరపట్టాడు. దిగ్భ్రాంతికి గురి చేసే అ ఘటన గుజరాత్‌లోని బనసకాంత జిల్లా పలన్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ టౌన్లో రాకేశ్(22) కుటుంబం నివసిస్తోంది. రాకేశ్ తండ్రి తాపీ మేస్త్రీ. పనుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతుంటాడు. సోదరుడు అహ్మదాబాద్‌లో స్థిరపడగా కాగా, రాకేశ్.. తన తల్లి, సోదరి(20)లతో స్థానికంగా జల్ చౌక్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రాకేశ్ పోర్న్‌కు బానిసయ్యాడు. గత గురువారం రాత్రి మంచి నీళ్ల వంకతో తల్లి గదిలోకి వెళ్లిన యువకుడు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె అరుస్తూ అతన్ని ప్రతిఘటించింది. అయితే వారిద్దరి మధ్య గతంలో తరచూ గొడవలు చోటు చేసుకోవటంతో.. కూతురు, చుట్టు పక్కల వాళ్లు ఆ అరుపులను పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఈ దారుణాన్ని భర్తకు వివరించిన మహిళ.. కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ‘ రాకేశ్ ఒక్కోసారి తమ ముందే బూతు వీడియోలు చూసేవాడని.. కోరిక తీర్చమంటూ వేధించేవాడని’ ఆ తల్లికూతుళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని ఫోన్, ల్యాప్ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దారుణానికి తెగబడే ముందు వరకు యువకుడు అశ్లీల వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. ఐపీసీ సెక్షన్లు 376, 507 ప్రకారం రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పఠాన్ టౌన్ పోలీసులు -
అందుకు సమయం లేదంటున్న నటి
ముంబై : ‘బిగ్ బాస్ 11’ విజేత శిల్పా షిండే ఇన్స్టాగ్రామ్ వేదికగా తనతో విరోధం ఉన్న హీనా ఖాన్‌కు అలానే ఆమె ప్రియుడైన రాకీ జైస్వాల్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ భామ తన ఫొటోతో పాటు తనను ద్వేషించేవారిని ఉద్దేశించి.. ‘నన్ను ద్వేషించేవారిని తిరిగి ద్వేషించేంత సమయం నాకు లేదు, నన్ను ప్రేమించేవారిని ప్రేమించే పనిలో మునిగిపోయాను’ అంటూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. కొన్ని నెలల కిందట ఎవరో సోషల్ మీడియాలో ఒక పోర్న్ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న యువతికి, శిల్పకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దాంతో అందరూ ఆ వీడియోలో ఉన్న యువతిని శిల్పగా భావించి ఆమెను చాలా అవమానించారు. ఈ విషయం గురించి శిల్ప బిగ్‌బాస్ 11 లో ఉన్నప్పుడు కూడా చర్చించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి శిల్ప ఆ వీడియోను తన ట్విటర్లో పోస్టు చేశారు. కానీ ఈ విషయంలో ఆమె విమర్శల పాలయ్యారు. ఇది జరిగి చాలా కాలం అవుతుంది. కానీ ప్రస్తుత వివాదానికి కారణం బిగ్ బాస్ 11 సభ్యుడైన రికీ ఇప్పుడు ఈ విషయాన్ని తన ట్విటర్లో ప్రస్తావిస్తూ శిల్పను మరోసారి విమర్శించాడు. వీడియోలో ఉన్న స్త్రీ అనుమతి లేకుండా నువ్వు వీడియోను ఎలా పోస్టు చేస్తావ్, ఒక సెలబ్రిటీవి అయినా.. ఇంతా బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తిస్తావ్ అంటూ రికీ ప్రశ్నించారు. అంతేకాక ఆ వీడియోలో ఉన్నది నీవు కానప్పుడు న్యాయపరంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది తప్ప ఇలా సోషల్ మీడియాలో పోర్న్‌ను ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని శిల్పను విమర్శించారు. ఈ సందర్భంగా శిల్ప తనను విమర్శిస్తున్న వారికి చాలా గట్టి సమాధానమే చెప్పింది. తాను చేసిని పనిని విమర్శిస్తున్న వారు, మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తూ చురకలు అంటించారు. -
పర్సనల్ కంటే పోర్న్ చాలా ముఖ్యం...
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో.. ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలా మట్టుకు స్టోరేజీ సమస్యతో సతమతమవుతున్నారంట. అలాంటి తరుణంలో ఏం చేయాలో తెలీక తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను ఫోన్ నుంచి తొలగించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు అశ్లీల డేటా జోలికి వెళ్లకపోవటం ఇక్కడ విశేషం. ప్రముఖ కంపెనీ సాన్‌డిస్క్ భారత దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మొత్తం లక్ష మందిపై ఈ సర్వేను చేపట్టింది. ఇందులో 29 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారానికొకసారి.. 62 శాతం మూడు నెలలకొకసారిగా తమ ఫోన్లోని మెమొరీని ఫ్రీ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తంలో 65 శాతం మంది మాత్రం అందుకోసం తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను తొలగించేస్తున్నట్లు వెల్లడించారు. వాటిని తొలగించాక చాలా బాధపడుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు. అయితే తమ ఫోన్లలోని పోర్న్.. అసభ్య ఫోటోలను జోలికి మాత్రం వాళ్లు వెళ్లట్లేదంట. వాటికి బదులు.. తమ వ్యక్తిగత సమాచారాన్నే త్యాగం చేసేందుకు మొక్కు చూపుతున్నారని సర్వేలో తేలింది. అయితే డేటాను తొలగించుకునే బదులు వాటిని స్టోర్ చేసుకునే మార్గాలు ఉన్నాయి కదా అని శాన్డిస్క్ డైరెక్టర్ ఖలీద్ వానీ వినియోగదారులకు సూచిస్తున్నారు. ‘ఆ సమయంలో కంగారుపడి మెమొరీని తొలగించేస్తున్నారే తప్ప.. వాటిని మరో డివైస్‌లోకి బదిలీ చేయాలన్న ఆలోచన వారికి తట్టడం లేదని’ ఆయన అంటున్నారు. ఇక సర్వేలో పాల్గొన్న వాళ్లలో 23-40 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా ఉండగా.. పోర్న్ ప్రస్తావన తెచ్చిన వాళ్లు 60 శాతం ఉండటం విశేషం. -
21 ఏళ్లకే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా
... అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సన్నీ లియోన్. ‘కరణ్ జీత్ కౌర్– ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరుతో సన్నీ లియోన్ లైఫ్ స్టోరీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. శృంగార తారగా పేరొందిన మీరు తొలిసారి భారత్‌కు వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి కదా? అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ– ‘‘నిజానికి ఇక్కడికి రాకముందే 21 ఏళ్ల వయసులోనే నేను ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పట్లో నన్ను ద్వేషిస్తూ ఎన్నో మెయిల్స్ పంపేవారు. లోలోన ఎంతో కుంగిపోయిన నేను నా ఫ్యామిలీ సపోర్ట్‌తో ధైర్యంగా నిలబడగలిగా. నేను పడిన బాధలు నా పిల్లలు పడకూడదు. నేను ఎదుర్కొన్న అవమానాలు వాళ్లు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నా’ అని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఓ మధ్యతరగతి సిక్కు కుటుంబానికి చెందిన కరణ్‌జీత్ కౌర్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌గా ఎలా మారింది? ఇప్పుడున్న స్థాయికి ఎలా చేరింది? అనే విషయాలను ‘కరణ్ జీత్ కౌర్– ది అన్‌టోల్డ్ స్టోరీ’లో చూడొచ్చని పేర్కొన్నారు సన్నీ లియోన్. -
టీవీలో ఆమె రచ్చ.. 1600 కి.మీ దూరంలో ట్రంప్
న్యూయార్క్ : తనపై ఆరోపణలు వచ్చిన కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో లేకుండా పోయారు. తనకు ట్రంప్‌కు శారీరక సంబంధం ఉందని చెప్పడమే కాకుండా.. ఆ విషయం బయటకు చెబితే ట్రంప్ తనను చంపేస్తానని బెదిరించారంటూ పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్ చెప్పే సందర్భంలో ఆ లైవ్ చూడకుండా మిస్సయ్యారు. దాదాపు 60 నిమిషాలు ప్రత్యక్ష ప్రసారం అయిన ఆ ఇంటర్వ్యూను ట్రంప్‌గానీ, ఆయన భార్య మిలానియా ట్రంప్‌గానీ చూడలేదని, ఆ సమయంలో వారు వెయ్యి మైళ్ల (1609.34 కిలోమీటర్ల) దూరంలో ఉన్నారని శ్వేతసౌదం ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోగల మార్ ఏలాగో ఎస్టేట్‌లో ట్రంప్ గత వారం రోజులుగా సేద తీరుతున్నారని, వేసవి విడిదిలో భాగంగా అక్కడికి వెళ్లినట్లు వెల్లడించింది. మిలానియా ట్రంప్ కూడా కూడా శుక్రవారం ఫ్లోరిడా వెళ్లారని, ఆమె కూడా అక్కడే ఉన్నారని, ప్రస్తుతం వారు వచ్చే సమయానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. స్టామీ ఇంటర్వ్యూ జరిగిన చోటుకు ప్రస్తుతం ట్రంప్ వాళ్లు ఉన్న ప్రదేశానికి సరిగ్గా 1600 కిలోమీటర్ల పైనే ఉంటుందట. సేద తీరే సమయం అయినందున ఎలాంటి అంశాలు వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్‌కు తనకు శారీరక సంబంధం ఉందని, అది బయటపెట్టొద్దని నన్ను బెదిరించారని, చంపుతామన్నారని పోర్న్‌స్టార్ స్టామీ 60 నిమిషాలపాటు ఆదివారం ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. -
పోర్న్‌స్టార్‌ను చంపేస్తానన్న ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంటి పోరుకంటే వీధిపోరు ఎక్కువవుతోంది. ఆయనతో తమకు శారీరక సంబంధం ఉందంటూ ఆరోపిస్తున్న మహిళలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం చెబుతున్నారు. మొన్నటికి మొన్న తమది పది నెలల బంధం అని పెళ్లి వరకు వెళుతుందని ఆశపడ్డానని ప్రముఖ మేగజిన్ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా.. తాజాగా పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విషయం మరిచిపోవాలని, లేదంటే చంపేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారని ఆమె వెల్లడించారు. తొలిసారి సీబీఎస్ చానెల్లో ప్రముఖ జర్నలిస్టు ఆండర్సన్ కూపర్‌కు ఆమె 60 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ప్రత్యక్ష ప్రసారం అయింది. అందులో పలు విషయాలు వెల్లడించారు. ‘ డోనాల్డ్ ట్రంప్‌కు నాకు ఉన్న శారీరక సంబంధం బయటపెట్టొద్దని నన్ను బెదిరించారు. చంపుతామని హెచ్చరించారు. ఆ అనుభవం నేనిప్పటికీ మరిచిపోలేదు. వాస్తవానికి మా సెక్సువల్ రిలేషన్ సీక్రెట్‌గా ఉంచాలని ట్రంప్ ఎప్పుడూ నాకు చెప్పలేదు. కానీ, ఈ విషయంలో మార్పు వచ్చింది మాత్రం 2011లో. ఓ మేగజిన్కు మా స్టోరీని నేను 15వేల డాలర్లకు అమ్మేయాలని నిర్ణయించుకొని దానితో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ విషయంలో ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. ఆ రోజు నేను పార్కింగ్ లాట్లో ఉన్నాను. నా చంటిబిడ్డతో ఫిట్నెస్ క్లాస్‌కు వెళుతున్నాను. వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ట్రంప్ విషయం వదిలేయ్. ఆ స్టోరీ మొత్తాన్ని మర్చిపో అన్నాడు. నా కూతురును చూస్తూ చాలా చక్కగా ఉంది నీ పాప. ఆ పాప తల్లికి (డానియెల్కే) అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ పాపకు షేమ్‌గా ఉంటుంది.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఆ సమయంలో నేను ఎంత వణికిపోయానో. క్లాస్‌కు కూడా వెళ్లకుండా బిడ్డను తీసుకొని భయపడుతూ ఇంటికెళ్లాను. ట్రంప్‌ను ఎప్పుడు కలిశానంటే..? ‘2006లో తొలిసారి నేను ట్రంప్‌ను కలిశాను. అప్పుడు ఆయన ఓ హోటల్లో సూట్‌తో ఉన్నారు. ఆ రోజే మేం తొలిసారి శారీరకంగా దగ్గరయ్యాం. ట్రంప్ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. మీరు అసలు అతడిని ఊహించలేరు. ఆ రోజు హోటల్‌ను నన్ను చూసి.. వావ్ నువు చాలా అందంగా ఉన్నావ్.. తెలివైనదానిలా ఉన్నావ్ అన్నాడు. ఆ రోజు అతడు అసురక్షిత శృంగారంలో పాల్గొన్నాడు. వాస్తవానికి నాకంటే అప్పటికే 30 ఏళ్లు పెద్దవాడైన ట్రంప్ నన్ను పెద్దగా ఆకర్షించలేకపోయారు.. కానీ, నేను కాదనలేకపోయాను.. అయితే, బాధితురాలిగా మిగల్లేదు. ఆ తర్వాత కూడా నేను అతడితో టచ్‌లో ఉన్నాను. సరిగ్గా ఎన్నికలకు 11 రోజుల ముందు 2016లో ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని ఒప్పందం చేసుకున్నారు’ అంటూ పలు విషయాలను డానియెల్ చెప్పింది. -
సీక్రెట్ స్టార్
ఎవరైనా వాళ్ల జీవితం గుట్టుగా ఉండాలి అనుకుంటారు.ఎంత పాపులర్ అయినా పర్సనల్ లైఫ్‌ని ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకుంటారు.ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినాగుట్టుగా ఉంచకూడదనుకునేది ఒకటి ఉంటుంది.అదే ఫ్యాన్స్.ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే ఇండస్ట్రీలో అంత సక్సెస్ఫుల్.షకీలాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.కానీ ఒక్కరూ బయటపడరు.అందుకే ‘సీక్రెట్ స్టార్’. చాలా రోజుల తర్వాత ‘శీలవతి’ సినిమా చేస్తున్నారు. ఇది మీకు 250వ సినిమా. వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మూవీ కూడా లేదేమో? ఎగ్జాట్లీ. ఇన్ని సినిమాలు చేసినా ఆర్టిస్ట్‌గా నాకు తృప్తి లేదు. నటిగా నేను చాలా కేపబుల్. మంచి అవకాశాలిస్తే బాగా చేయగలను. కానీ రాలేదు. ఇలా చెబితే కొంతమంది డైరెక్టర్స్ ఫీలవుతారేమో. ‘మేం మంచి చాన్సులే కదా ఇచ్చాం’ అని వాళ్లనుకోవచ్చు. కానీ చేసినప్పుడు, భవిష్యత్తులో నా క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు నాకు శాటిస్ఫ్యాక్షన్ ఉండాలి కదా. ‘శీలవతి’లో మంచి పాత్ర చేశా. ఈ చిత్రదర్శకుడు సాయిరామ్ దాసరిని ఒక ఆడియో ఫంక్షన్లో కలిశాను. ‘మంచి రోల్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెబితే ‘వెయిట్ చేయండి. మంచి స్క్రిప్ట్‌తో వస్తా’ అన్నాడు. అన్నట్లుగానే మంచి పాయింట్‌తో వచ్చాడు. అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా. నేను డబ్బు సంపాదించడానికే వచ్చాను. నా ఫ్యామిలీ కోసం ఆర్టిస్ట్ అయ్యాను. సంపాదించాను. ఫ్యామిలీ అంటే ఎంతమంది? ఇద్దరు అక్కలు, ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలు, ఆ తర్వాత మరో అక్క (ఆవిడ చిన్నప్పుడే చనిపోయింది), తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, చెల్లెలు. అమ్మానాన్న. లార్జ్ ఫ్యామిలీ. మా అక్క పెళ్లి చేసుకున్నాక కూడా మా ఇంట్లోనే ఉండేది. ఒక అన్న డ్రగ్ అడిక్ట్. తమ్ముడు టెన్త్ ఫెయిల్. ఎవరూ సెటిల్ అయ్యే పరిస్థితి లేదు. మా కష్టాలు పోగొట్టడానికి ఇంటి బాధ్యతను మోశాను. మీకన్నా పెద్దవాళ్లు ఉండగా మీరే ఎందుకు బాధ్యత తీసుకున్నారు? నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఒకసారి అమ్మ çపప్పుచారు పలచగా చేస్తే.. ‘ఏంటి? ఇలా ఉంది’ అనడిగాను. ‘నువ్వు సరిగ్గా చదువుకుని ఉంటే నర్స్ అయ్యేదానివి. ఇదిగో ఇలా కష్టపడుతున్నాం’ అనేసరికి బాధగా అనిపించింది. నిజానికి నాకు చదువు అబ్బలేదు. కష్టాలన్నీ నా వల్లే అని అమ్మ అనడంతో ఏదైనా చేయాలనుకున్నాను. ఆ టైమ్‌లో ఎదురింటి వాళ్ల ద్వారా సినిమా ఆఫర్ వచ్చింది. డబ్బులు ఇస్తారా అని అడిగితే? ‘సెలెక్ట్ అయితే ఇస్తాం’ అన్నారు. సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో (1990లలో) ఏడువేల ఐదువందల రూపాయలు ఇచ్చారు. మా ఇంటి అద్దె 700. అప్పటికి ఇంటి అద్దె కట్టి 23 నెలలైంది. అంత కష్టాల్లో ఉండేవాళ్లం. షూటింగ్లో ఇచ్చే డ్రెస్సుల గురించి అభ్యంతరం చెప్పిన సందర్భాలున్నాయా? నాన్న నాతో పాటు షూటింగ్‌కి వచ్చినా, లొకేషన్లోకి వచ్చేవారు కాదు. నేను లోపలికి వెళ్లగానే కాస్ట్యూమ్స్ ఇచ్చేవారు. ‘ఇదేంటి ఇలా ఉన్నాయ్?’ అని అడిగితే.. ‘మీ నాన్నతో మేం మాట్లాడాంలే’ అనేవారు. డాడీతో మాట్లాడాక నేను మాట్లాడ్డానికి ఏముంటుంది? నోరు మూసుకుని ఆ బట్టలేసుకుని వాళ్లెలా చెబితే అలా చేసేదాన్ని. షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికెళ్లేటప్పుడు ‘డాడీ.. మీతో వాళ్లు హిందీలో మాట్లాడుతున్నారు. మీరేమో అర్థం కాకుండా అన్నింటికీ తలూపుతున్నారు. నా దగ్గరేమో మీతో మాట్లాడానంటున్నారు. ఒకసారి నా కాస్ట్యూమ్స్, క్యారెక్టర్ గురించి అడగండి’ అనేదాన్ని. ‘సరే’ అనేవారు. అయితే మళ్లీ మామూలే. చివరికి ‘ఇది తప్పదు’ అని నా మైండ్ ప్రిపేర్ అయిపోయింది. పోనీ మీకు వచ్చిన ‘ఇమేజ్’ తెలిశాక ‘సినిమా లు మానెయ్’ అని మీ అమ్మానాన్న అనలేదా? అమ్మ ఎప్పుడూ అనలేదు. డాడీ మాత్రం రెండు సందర్భాల్లో అన్నారు. ‘కడవుళ్’ అనే తమిళ సినిమా కోసం ఓ మామిడి తోటలో పాములతో డ్యాన్స్ చేస్తున్నా. ‘ఒకవేళ ఆ పాములు కరిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?’ అని ఎవరో డాడీతో అన్నారట. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక డాడీ, నేనూ వెళుతున్నప్పుడు ‘ఇక సినిమాలు వద్దమ్మా’ అన్నారు. అప్పటికి నా సిస్టర్స్‌కి పెళ్లయింది. ‘నీక్కూడా పెళ్లి చేస్తాను. నువ్వూ సెటిల్ అయిపో’ అన్నారు. ఇది జరిగిన నెలకు మరో సాంగ్ షూట్లో పాల్గొంటూ పై నుంచి జారి పడ్డా. అప్పుడు కూడా డాడీ సినిమాలు మానేయమన్నారు. అయితే అప్పటికే ఇంట్లోవాళ్లకు కొన్ని కంఫర్ట్స్ చూపించేశాను. మళ్లీ వాళ్లను కష్టాల్లోకి దించడమా? అనిపించింది. అదే రోజు రాత్రి డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో సినిమాలు ‘వదలకూడదు’ అని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాను. మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డారు. మరి వాళ్లు మీ ఫ్రొఫెషన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు? కుటుంబం కోసమే కష్టపడుతున్నాను కాబట్టి నన్నెంతో అభిమానిస్తారని నమ్మాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక మలయాళం మేగజీన్ కోసం ఫ్యామిలీ ఫొటో అడిగితే.. మా అక్క వాళ్ల పిల్లలు వద్దని రాలేదు. మా తమ్ముడూ రాలేదు. నాకు దగ్గరగా ఉండే నా చెల్లెలూ రాలేదు. ఫొటోగ్రాఫర్ ఇంటికొచ్చిన పరిస్థితిలో నాకెలా ఉంటుందో ఊహించండి. ఫ్యామిలీ ఫొటో అంటే చివరికి నేను, మా అన్నయ్య కూర్చున్నాం. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నేను, నా పేరు కావాలి. కానీ నాకు ఫొటో అవసరం అయినప్పుడు వాళ్లు రాలేదు. మీవాళ్లు మిమ్మల్ని ఓన్ చేసుకోకపోవడంతో పాటు మనీ వైజ్‌గా మోసం చేశారా? అవును. ఒకానొక దశలో సినిమాలు మానేసి, హ్యాపీగా సెటిలవుదామనుకున్నా. మా అమ్మగారు సరిగ్గా చదువుకోలేదు. చిన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్పించింది మా అక్కే. తనంటే నమ్మకం. నా ఆర్థిక లావాదేవీలన్నీ మా అక్క చూసుకునేది. ఇక బ్రేక్ తీసుకోవాలనుకున్నాక డబ్బు గురించి అడిగితే.. ‘నో బ్యాలెన్స్’ అంది. నా డబ్బులన్నీ ఎవరికో ఇచ్చిందట. వాళ్లు ఇవ్వలేదట. అలా అనే చెప్పింది. అప్పుడు మళ్లీ జీరోతో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడైతే దయనీయ స్థితిలో లేను కానీ, కొన్నేళ్లు పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని నా బాధ. షకీలాను ట్రెడిషనల్‌గా చూపించాలని ఒక్కరూ అనుకోలేదా? లేదా మీరూ రెడీగా లేరా? నేనెప్పుడూ రెడీ. ఫుల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ ఇచ్చి చూడమనండి. అప్పుడు తెలుస్తుంది.. ఆర్టిస్ట్‌గా నేనేంటో. అందుకే నేను ‘శీలవతి’, ‘కొబ్బరిమట్ట’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. షకీలాని గ్లామర్‌గానే చూస్తామని ఆడియన్స్ ఎప్పుడైనా అన్నారా? వాళ్లు ఏ పాత్ర చేసినా చూస్తారు. నా ఇండస్ట్రీయే నన్ను వేరే రకంగా చూస్తే నేనేం చేయాలి? ఇప్పటివరకూ చాలాసార్లు ప్రేమలో పడ్డారట. షకీలాని లవర్‌గా చూస్తారు కానీ వైఫ్‌గా అంగీకరించడానికి ఎవరూ ఇష్టపడటంలేదా? తప్పంతా నాదే. నన్ను ప్రేమించినవాళ్లంతా ఫ్యామిలీని వదిలేసి నాతో వచ్చేయ్ అనేవారు. కానీ మా ఫ్యామిలీలో సంపాదించేవాళ్లు లేరు. నా స్వార్థం చూసుకుంటే మావాళ్లను ఎవరు చూస్తారు? ఇదొక్కటే నాకు ప్రాబ్లమ్‌గా ఉండేది. ఒకటే చెప్పేదాన్ని ‘ఐ లవ్ మై మదర్’ అని. అందుకోసం ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. అమ్మ చనిపోయాకా సెటిల్ కాలేకపోయాను. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కోసం ఇంతగా ఆలోచిస్తారు? నేను ఆలోచించానని గర్వంగా చెప్పుకుంటాను. నేను తల్లి కాలేదు. నా తల్లిని బాగా చూసుకున్నాను. తోడబుట్టినవాళ్లను అమ్మలా చూసుకున్నా. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో హాయిగా ఉండాలని మీకు ఉండదా? ఎందుకుండదండి? నేను ఆడదాన్ని కాదా? ముఖ్యంగా మూడేళ్లుగా చాలా ఒంటరితనం ఫీలవుతున్నా. ఇప్పుడైతే డిప్రెషన్లోనే ఉన్నాననాలి. ఒంటరిగా నిద్రపోవాలంటే భయమేస్తోంది? ఏదైనా జరిగితే ఎవరుంటారు? హాస్పిటల్‌కి వెళ్లాలంటే తోడు ఎవరొస్తారు? అని ఆలోచన వస్తుంది. నాకు ఓదార్పు కావాలి. తనివి తీరా ఏడవడానికి ఒక ‘భుజం’ కావాలి. ఒక భరోసా కావాలి. ప్రేమను షేర్ చేసుకోవటానికి ఒక పార్టనర్ కావాలి. నేనెవర్నీ మోసం చేయలేదు. అబద్ధాలు ఆడలేదు. నేనే నేరం చేయలేదు. నాకెందుకీ ఒంటరితనం? నా బాధలో న్యాయం ఉంది కదండీ. ఎగ్జాట్లీ.. మీ నుంచి ఇంత విన్నాక మీకో ‘సోల్‌మేట్’ దొరికితే బాగుండు అని మాకూ అనిపిస్తోంది. మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారట.. మిగతా ప్రేమల్లా ఇది కూడా రహస్యమేనా? అది జరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? మీవైపు నుంచి ఆలోచిస్తే మీరు చేసిన క్యారెక్టర్స్ మీకు కరెక్ట్‌గా అనిపించవచ్చు. కానీ గతంలో మీరు చేసిన కొన్ని సినిమాలు యంగ్‌స్టర్స్ చెడిపోయే విధంగా ఉన్నాయి. ఏమంటారు? ఇలాంటి సినిమాలు స్టార్ట్ చేసిన మొదటి ఆర్టిస్ట్‌ని నేను కాదు కదా. సెక్స్ అన్నది ఎవరండి మొదలుపెట్టారు. షకీలాతో మొదలైందా? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కదండి. గ్లామర్ సినిమాలు నాతోనే మొదలయ్యాయా? అంతకుముందు లేవా? నా చిన్నప్పుడు నేను కూడా చూశాను. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక కొన్ని చోట్ల ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని అలాంటి సినిమాలు చూపించడంలేదా? నా తమ్ముడు చూశాడని తెలిసి, ఒక్కసారి తన్నాను కూడా? నేనేం ఓపెన్‌గా చూపించలేదు కదా. నేను న్యూడ్‌గా కనిపించానా? నేను మెసేజ్ ఇచ్చానని చెప్పి ఎవరినైనా మోసం చేశానా? ఇప్పుడు నేనలాంటి సినిమాలు చేస్తున్నానా? మరి.. యూట్యూబ్‌లో ఎన్నో ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను యంగ్‌స్టర్స్‌ని చెడగొట్టానని ఎలా అనగలరు? నేను నా కోసం చేసుకున్నాను. నా ఖర్మ ఏంటంటే నాకన్నీ అలాంటి సినిమాలే ఇచ్చారు. నాకు సినిమాకు లక్ష రూపాయలు ఇస్తుంటే మా అమ్మానాన్న గురించి స్వార్థంగా ఆలోచించాను తప్పితే సమాజం గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. నా కడుపు నింపుకుని, మావాళ్ల కడుపు నింపాలనుకున్నాను. కష్టాలు పోగొట్టుకోవడానికి ‘శృంగార తార’ అని పేరు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరంలేదు కదా.. వేరే పాత్రలు చేసి ఉండొచ్చేమో? ఫస్ట్ మూవీ ‘ప్లే గర్ల్స్’ చేసినప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నాను. ఆ సినిమా పేరు, నా క్యారెక్టర్ నాకు చెప్పలేదు. సిల్క్ స్మిత చెల్లెలి క్యారెక్టర్ చేయించారు. ఫలానా క్యారెక్టర్ చేస్తే కెరీర్ ఇలా టర్న్ అవుతుంది, ఇలాంటి ఇమేజ్ వస్తుందని ఊహించేంత వయసు లేదు. పరిస్థితులూ ఆలోచించనివ్వలేదు. అమ్మానాన్న చేయమన్నారు. చేశాను. శరీరాన్ని బయటపెట్టే దుస్తులు వేసుకుని నలుగురిలో నటించడం, శృంగార సన్నివేశాలు చేయడం బిడియం అనిపించలేదా? ఇలా చెబితే ‘ఛ.. నిజమా?’ అని నమ్మరేమో. నాకిప్పటికీ సిగ్గేనండి. శరీరాన్ని ప్రదర్శించాలని ఏ ఆడదీ అనుకోదు. నా దురదృష్టమో ఏమో నాకలాంటి చాన్సులే వచ్చాయి. అందుకే నేను సెకండ్ టేక్ తీసుకోను. ఒకేసారితో సీన్ బాగా చేసేస్తే ‘పీడ వదిలిపోతుంది’ అనుకుంటూ కెమెరా ముందుకెళ్లేదాన్ని. ఒక్క టేక్‌లో చేయడం కోసం నేను గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే దాన్ని. రెస్ట్ ఉండేది కాదు. నేను పని చేసిన డైరెక్టర్స్, కెమెరామేన్ ఎవరినైనా అడగండి.. నా లైఫ్‌లో నేను రెండో తీసుకున్నానా? అని. దేవుడి మీద కోపంగా ఉందా? అప్పుడప్పుడు. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక బంధువు ఆ దేవుడే. అందుకే కోపం, ప్రేమ.. రెండూ తన పైనే. ‘నన్ను చూసుకో దేవుడా’ అని మొరపెట్టుకుంటుంటాను. ఇలాంటి ప్రొఫెషన్ ఇచ్చినందుకేనా దేవుడంటే కోపం? ఆ విషయంలో దేవుడి మీద కోపం లేదండి. నేను డాక్టర్ అయినా కూడా నంబర్ వన్ డాక్టర్ అయ్యుండేదాన్నేమో. నేనేం చేసినా నంబర్ వన్‌గా ఉండాలని ముందే బలంగా మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. నాకు డబ్బు కావాలి. పాపులార్టీ కావాలి. ఈ రెండూ సంపాదించుకోవడం కోసం ఆ దేవుడు ఒక రూట్ ఇచ్చాడు. దానికి నేను చాలా హ్యాపీ. నా బాధంతా ఫ్యామిలీ కోసం ఇంత చేశామే, వాళ్లెందుకు నన్ను ఓన్ చేసుకోలేదని. ‘షకీలా ఏం తప్పు చేసింది’ అని వాళ్ల కళ్లు ఆ దేవుడు తెరిపించలేదు ఎందుకు? అనుకుంటాను. – డి.జి. భవాని -
వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ : వాట్సాప్, స్కైప్ లలో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.! మీ పర్సనల్ చాట్స్, వీడియో కాల్స్ హ్యాక్ అవుతున్నాయి. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి అశ్లీల వెబ్సైట్లలలో అప్లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత వీడియోలను హ్యాక్ చేయడం రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఓ పాతికేళ్ల యువతి నవంబర్‌లో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడిన వీడియోను హ్యాక్ చేసి అశ్లీల సైట్లో అప్లోడ్ చేశారంటూ సైబర్ సెల్లో ఫిర్యాదు చేసింది.యూఆర్ఎల్లను తెలుపుతూ తన వీడియోలను సైట్నుంచి తొలగించాలని కోరింది. రెండు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి గతంలో తాను మాట్లాడిన వీడియో కాల్‌ను అశ్లీల సైట్లో పెట్టారంటూ సైబర్ సెల్లో ఫిర్యాదు చేసిందని సైబర్ సెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో వీడియోకాల్స్‌ను రికార్డు చేయడం, వాట్సాప్, స్కైప్ వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి అశ్లీల సైట్లల్లో పెట్టే కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఎక్కువగా భార్యాభర్తలు మాట్లాడుకున్న వీడియో కాల్స్ హాకింగ్‌కు గురవుతున్నాయని తెలిపారు. వాట్సాప్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు ఎక్కువగా హ్యాక్‌కు గురవుతున్నాయని అన్నారు. ఐపీ అడ్రస్ ద్యారా సులభంగా హ్యాకర్లు వీడియో కాల్స్‌ను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. ఎన్జీవో ఇండియన్ సైబర్ ఆర్మీ చైర్మన్ కిస్లే చౌదరి మాట్లాడుతూ... వీడియో కాల్స్ అంత సురక్షితం కాదని అన్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతోంది. ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియో కాల్స్‌ను హ్యాక్ చేసి శృంగార సైట్లలో అప్లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్లలో కొన్ని రహస్య యాప్‌లు ఉంటాయని, వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే అవి ఫోన్లలోని డేటాను సంగ్రహిస్తాయని తెలిపారు. స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ కూడా ఆన్లైన్లో అందుబాటు ఉన్నట్లు చెప్పారు. అవి వ్యక్తుల వీడియో కాల్స్‌ను రికార్డు చేసి హ్యాక్ చేస్తాయని చౌదరి వివరించారు. ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్స్ ఎక్కువగా హ్యాకింగ్‌కు గురవుతున్నట్లు వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటున్నారని, తమ వీడియోలు హ్యాక్‌కు గురయ్యాయని తెలిసినా భయంతో వారు ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. ఓపెన్‌గా దొరికే వైఫైలను వాడకపోవడమే ఉత్తమమని చెప్పారు. అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడమే సురక్షితమని తెలిపారు. -
వాట్సప్ కిడ్స్‌పోర్న్ రాకెట్.. 66 మంది ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వాట్సప్ గ్రూప్ పేరు ’కిడ్స్ త్రీబుల్ఎక్స్’. ఈ గ్రూప్ లో అన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకుంటారు. 40 దేశాలకు చెందిన వారు ఇందులో సభ్యులు. దురదృష్టకరం ఏమిటంటే ఎక్కువ మంది ఇండియా కు చెందిన వారే. 66 మంది ఇండియా వారు, 56 మంది పాకిస్తాన్‌కు చెందిన వారు, 29 మంది అమెరికాకు చెందిన వారు. ఈ గ్రూప్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వర్మ అనే యువకుడు నిర్వహిస్తూన్నట్టు, అతడ్ని అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఫోన్‌ను తిరువనంతపురం లోని ఫోరెన్సిక్ ఎగ్జామ్ ఆఫ్ ఎలక్ర్టానిక్ గ్యాట్జెట్స్ (సీ డీఏసీ)లో పరీక్షించి నిజాలను బట్ట బయలు చేశారు. ముంబాయికి చెందిన సత్యేంద్ర చౌహాన్, ఢిల్లీకు చెందిన నఫీస్ రాజా, జాహిద్, నోయిడాకు చెందిన ఆదర్శ్‌లను గ్రూప్ అడ్మిన్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లలను ఈ గ్రూప్‌లో చేర్చుకొని పోర్న్ చిత్రాలు, వీడియోలు పంపడానికి వర్మ డబ్బును డిమాండ్ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. అసభ్యకర చిత్రాలు, వీడియోలు ఇతరులకు పంపడం తీవ్ర నేరం అని, ఐటీ చట్టం ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమాన పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ట్రంప్‌ను కోర్టుకీడ్చిన పోర్న్‌స్టార్
లాస్ఏంజెల్స్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్‌స్టార్ దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయరాదన్న (నాన్డిస్క్లోజర్) ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది. లాస్ఏంజెల్స్లో బుధవారం దాఖలు చేసిన దావాలో ఈ ఒప్పందంపై ట్రంప్ స్వయంగా సంతకం చేయనందున ఇది చెల్లుబాటు కాదని ఆమె వాదించింది. పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ తాను ట్రంప్‌తో ఒకసారి లైంగికంగా కలిశానని, ఏడాది పాటు తాము సన్నిహితంగా ఉన్నా తమ మధ్య శారీరక సంబంధం లేదని తెలిపింది. అయితే ఒప్పందం ప్రకారం పోర్న్‌స్టార్‌కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించారని, ఆమెతో ఆయనకు ఎప్పుడూ ఎఫైర్ లేదని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కొహెన్ చెప్పారు. మరోవైపు ట్రంప్‌తో సంబంధాలపై తనను నోరు మెదపకుండా ఆయన న్యాయవాది కోహెన్ ఒత్తిడి చేస్తున్నారని పోర్న్‌స్టార్ న్యాయమూర్తికి నివేదించారు. పలువురు మహిళలతో ట్రంప్ కొనసాగించిన లైంగిక సంబంధాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.