సుప్రీం కోర్టుకు ఓ మహిళ అభ్యర్థన
న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న పోర్న్ (అశ్లీల) వీడియోలను తొలగించాలంటూ ఓ మహిళ సుప్రీం కోర్టుకు విన్నవించింది. తన భర్త బాగా చదువుకున్నప్పటికీ.. పోర్న్ వీడియోలు, చిత్రాలకు బానిసగా మారటంతో వైవాహిక జీవితంలో, కుటుంబలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఓ మహిళ (కెమికల్ ఇంజనీర్) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోలుండే సైట్లను పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ బాధిత మహిళకు పెళ్లై 32 ఏళ్లు పూర్తవగా.. ఇద్దరు పిల్లలున్నారు.
రెండేళ్లుగా తన భర్త ఇలాంటి వీడియోలకు అలవాటు పడ్డారని.. విలువైన సమయాన్ని ఇలాంటి వీడియోలు చూసేందుకు వ్యర్థం చేస్తున్నారని ఆవేదనగా కోర్టుకు వెల్లడించారు. ‘నా భర్త అశ్లీల వీడియోలు, చిత్రాలకు అలవాటు పడ్డారు. దీంతో ఆయన ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. దీంతో మా వైవాహిక జీవితం నాశనమైంది. అందరికీ అందుబాటులో ఉంటున్న ఈ వీడియోలు చాలా ప్రమాదకరం. భారతదేశంలోని కుటుంబ విలువలకు ఈ సైట్లు తీరని నష్టం కలగజేస్తున్నాయి. యువత దీనివల్ల ఎంతలా చెడిపోతున్నారో ఆలోచించాలి. వయసుకు అతీతంగా చాలా మంది ఈ సైట్లకు బానిసలు అవుతున్నారు’ అని ఆ మహిళ పిటిష¯ŒSలో పేర్కొన్నారు.