ముంబై: దేశంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేస్తు బుధవారం తీర్పును వెల్లడించింది. డిజిటల్, ఆర్థిక లావాదేవీలను భద్రపరిచే సాధనంగా క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. పర్చుల్ కరెన్సీపై సరైన నియంత్రణ చేయలేమని 2018 అక్టోబర్‌లో ఆర్‌బీఐ క్రిప్టో కరెన్సీని నిషేధించింది. అయితే, ఈ నిషేధాన్ని సవాలు చేస్తు ఇంటర్‌నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పలు క్రిప్టో కరెన్సీలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నారిమన్ నేతృత్వంలో అనిరుద్ బోస్, వి. సుబ్రహ్మణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆర్‌బీఐ నిర్ణయాన్ని సమీక్షించి తాజా తీర్పును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment