న్యూఢిల్లీ: ఇంటర్‌నెట్‌లో భావప్రకటనా స్వేచ్ఛపై గతంలో సెక్షన్ 66ఏపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై కేంద్రాన్ని సోమవారం వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఈ సెక్షన్‌ను ఉపయోగించి అరెస్టులు జరుగుతున్నాయన్న పిల్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 2015 మార్చి 24న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులను అరెస్టుచేసి జైలుకు పంపాలని, జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. 2015లో సుప్రీంకోర్టు రద్దుచేసిన ఈ సెక్షన్ ఆధారంగా ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారని, పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది సంజయ్ పారిఖ్ న్యాయస్థానానికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment