ఆ సీరియల్‌ నిండా పోర్న్‌ బాగోతమే! | French made series has the most graphic sex scenes ever on British TV | Sakshi
Sakshi News home page

ఆ సీరియల్‌ నిండా పోర్న్‌ బాగోతమే!

Published Sun, Mar 13 2016 5:10 PM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

ఆ సీరియల్‌ నిండా పోర్న్‌ బాగోతమే! - Sakshi

ఆ సీరియల్‌ నిండా పోర్న్‌ బాగోతమే!

దాదాపు రూ. రెండు వందల కోట్ల (21 మిలియన్ పౌండ్ల) ఖర్చు. అత్యంత భారీ తారాగణం.

దాదాపు రూ. రెండు వందల కోట్ల (21 మిలియన్ పౌండ్ల) ఖర్చు. అత్యంత భారీ తారాగణం. చరిత్రను కళ్లకు కట్టే కథనం. కానీ ఆ సీరియల్‌లో దుస్తుల కోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టనట్టు కనిపిస్తోంది. సీరియల్‌ నిండా నగ్న, శృంగార దృశ్యాలు, స్వలింగ సంపర్కం. ఇది 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా బీబీసీలో ప్రసారమవుతున్న 'వర్సల్లెస్‌' సీరియల్‌ వ్యవహారం. ప్రైమ్‌టైమ్‌లో బీబీసీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌పై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఈ సీరియల్‌ నిండా నగ్న దృశ్యాలు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంపై బ్రిటన్‌ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. బీబీసీ మాత్రం ఫ్రాన్స్‌లో నిర్మితమైన ఈ సీరియల్‌ వీక్షకులకు మాంఛి కనువిందు ఇస్తుందని పేర్కొంటున్నది.

ఇప్పటికే ఈ సీరియల్‌లోని దృశ్యాలపై బ్రిటన్‌ ఎంపీలు, కుటుంబ హక్కుల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక కథనాన్ని అందించే పేరుతో పోర్న్‌ దృశ్యాలను వండివారుస్తున్నారని మండిపడుతున్నారు. సన్‌ కింగ్‌గా పేరొందిన లూయిస్‌ -14 జీవితంలోని ఉత్థానపతనాలు చిత్రీకరించే ఈ సీరియల్‌ బ్రిటన్‌లోనే తొలి సెక్సువల్ గ్రాఫిక్‌ డ్రామాగా పేరొందింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్‌లోనే గే సెక్స్‌, రాజకుమారుడి క్రాస్ డ్రెసింగ్‌, రాకుమారి విపరీతమైన వ్యామోహం వంటి దృశ్యాలను చూపించారు.

ఈ సీరియల్‌ను ఫ్రాన్స్‌లో నిర్మించినప్పటికీ ఇంగ్లిష్ భాషలో రూపొందించారు. దీంతో ఫ్రాన్స్ వీక్షకులు దీనిని ఫ్రెంచ్‌ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. ప్రముఖ ఫ్రెంచి చక్రవర్తి అయిన లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఫ్రాన్స్‌లో ఈ సీరియల్‌పై వివాదం రేగుతోంది. ఇటు బ్రిటన్‌లోనూ ఈ సీరియల్‌లో చూపించే విపరీతమైన దృశ్యాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సీరియల్‌ని నిలిపివేయాలని బ్రిటన్ ఎంపీలు, హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement