ఆ సీరియల్ తొలి ఎపిసోడ్‌కే షాక్‌ తిన్నారు! | BBC saucy period drama Versailles gets viewers hot under the collar | Sakshi
Sakshi News home page

ఆ సీరియల్ తొలి ఎపిసోడ్‌కే షాక్‌ తిన్నారు!

Published Thu, Jun 2 2016 11:00 AM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

ఆ సీరియల్ తొలి ఎపిసోడ్‌కే షాక్‌ తిన్నారు! - Sakshi

ఆ సీరియల్ తొలి ఎపిసోడ్‌కే షాక్‌ తిన్నారు!

17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా బీబీసీలో ప్రసారమవుతున్న 'వర్సల్లెస్‌' సీరియల్‌ బుధవారం బ్రిటన్ వాసులను షాక్‌ గురిచేసింది. బుధవారం ప్రసారమైన తొలి ఎపిసోడ్‌లోనే ఏడు శృంగార సన్నివేశాలు ఉండటంతో వీక్షకులు బిత్తరపోయారు. ఈ ఏపిసోడ్‌లో పూర్తిస్థాయి నగ్న సన్నివేశాలను కూడా చూపించారు.

ప్రైమ్‌టైమ్‌లో బీబీసీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌పై గత కొంతకాలంగా నిరసన వ్యక్తమవుతున్నది. ఈ సీరియల్‌ నిండా నగ్న దృశ్యాలు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంతో.. ఈ సీరియల్‌ ప్రారంభానికి ముందే బ్రిటన్‌ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీబీసీ మాత్రం ఫ్రాన్స్‌లో నిర్మితమైన ఈ సీరియల్‌ వీక్షకులకు మాంఛి కనువిందు ఇస్తుందని పేర్కొంటున్నది.

దాదాపు రూ. రెండు వందల కోట్ల (21 మిలియన్ పౌండ్ల) ఖర్చు.. అత్యంత భారీ తారాగణం.. చరిత్రను కళ్లకు కట్టే కథనంతో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌పై ఇటు వీక్షకులు కూడా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఎంత ఖర్చుపెట్టి.. అట్టహాసంగా నిర్మించినా సీరియల్‌లో డైలాగ్‌లు నాసిరకంగా ఉన్నాయని, తొలి ఎపిసోడ్‌ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని పలువురు వీక్షకులు ట్విట్టర్‌లో పెదవి విరిచాడు. అనేక అంచనాలు రేపిన ఈ సీరియల్‌లో లూయిస్ గా కనిపించిన జార్జ్‌ బ్లాగ్డెన్‌ కూడా ఏమాత్రం ఈ పాత్రకు సరిపోలేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

సన్‌ కింగ్‌గా పేరొందిన లూయిస్‌ -14 జీవితంలోని ఉత్థానపతనాలు చిత్రీకరించే ఈ సీరియల్‌ బ్రిటన్‌లోనే తొలి సెక్సువల్ గ్రాఫిక్‌ డ్రామాగా పేరొందింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్‌లోనే గే సెక్స్‌, రాజకుమారుడి క్రాస్ డ్రెసింగ్‌, రాకుమారి విపరీతమైన వ్యామోహం వంటి దృశ్యాలను చూపించారు. ఈ సీరియల్‌ను ఫ్రాన్స్‌లో నిర్మించినప్పటికీ ఇంగ్లిష్ భాషలో రూపొందించారు. దీంతో ఫ్రాన్స్ వీక్షకులు దీనిని ఫ్రెంచ్‌ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. ప్రముఖ ఫ్రెంచి చక్రవర్తి అయిన లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఫ్రాన్స్‌లో ఈ సీరియల్‌పై వివాదం రేగుతోంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement