BBC
-
ముఖాముఖి సంభాషణల్లో మేటి
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్‌టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్‌ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.‘హార్డ్‌టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్య క్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్ టాక్‌ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చు అవు తోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా. నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలో యర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్‌టాక్ కేవలం ఒక టాక్‌షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు.అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.సరే... ఏంటి హార్డ్‌టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసు కున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్టాక్లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది. బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విష యాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్‌టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాక పోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒక సారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్‌టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యా తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరా«ధన పొందిన హార్డ్‌టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించు కున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్‌ను ఇష్టపడ లేదన్నది బహిరంగ రహస్యం.2005 నుంచి హార్డ్‌టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వ హిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవ తలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్ లు ఎవరైనా సరే... నిష్టూర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు. నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్‌నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్‌గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్నైట్లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్ ్స ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ. అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్ ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే! విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్‌టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భు తమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’హార్డ్‌టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్‌టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్‌టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’
అంతరిక్ష ప్రయోగంలో (Chandrayaan-3) భారత్ విజయంపై బ్రిటీష్ మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేని భారత్‌కు అంతరిక్ష ప్రయోగాల కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అవసరమా? అంటూ డిబెట్లు పెట్టి ప్రశ్నిస్తున్నాయి. అలా ప్రశ్నించిన బీబీసీ యాంకర్‌కు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా గూబ గుయ్యిమనేలా కౌంటర్ ఇచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డుకెక్కింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించి.. 140 కోట్ల మంది భారతీయల హృదయాలను ఆనందంతోనూ ఒకింత విజయగర్వంతోనూ నింపింది. అయితే, భారత్ విజయాన్ని దాయాది దేశం పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు అభినందనలతో ముంచెత్తుతుంటే బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ తన అక్కసు వెళ్లగక్కుకుంది. మరుగుదొడ్లే లేవు 700 మిలియన్ల మందికి కనీస మరుగదొడ్డి సదుపాయాలు లేవని.. అంతటి పేదరికంతో ఉన్న భారతదేశం.. అంతరిక్ష ప్రయోగానికి ఇంత మొత్తంలో ఖర్చు చేయాలా? అని ప్రశ్నిస్తూ బీబీసీ డిబేట్లు పెడుతోంది. అలా ఓ బీసీసీ యాంకర్ భారత్ విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహినూర్ డైమండ్‌ను దోచుకొని బీబీసీ యాంకర్ డిబెట్‌ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇలా ట్వీట్ చేశారు. నిజం ఏంటంటే? పేదరికం దశాబ్దాల వలస పాలన ఫలితం. మా నుంచి అత్యంత విలువైన ఆస్తి కోహినూర్ వజ్రమే కాదు, మా నమ్మకాన్ని, శక్తి సామర్ధ్యాల్ని దోచుకున్నారు. అలాంటి మీరు మరుగుదొడ్లు, అంతరిక్ష అన్వేషణ పెట్టుబడులపై ప్రశ్నించడం మీ వైఖరికి అద్దం పడుతోంది. మేం చంద్రునిపైకి వెళ్లడం అంటే ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. పరిశోధనా రంగంలో పురోగతిని సాధించేందుకు మాపై మాకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పేదరికం నుండి బయటపడేయాలనే ఆకాంక్షను ఇస్తుంది. అసలు పేదరికం ఏంటంటే ఆకాంక్షల్లో కూడా పేదరికాన్ని కలిగి ఉండటమే’ అంటూ ఆనంద్ మహీంద్రా ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ — anand mahindra (@anandmahindra) August 24, 2023 చదవండి👉‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్‌గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్‌గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
నా దేశం నగ్నదేహమా?
అర నిమిషం నిడివి కూడా లేని ఆ వీడియో అణు విస్ఫోటనాన్ని తలపించింది. కోటానుకోట్ల మనసుల్ని షాక్‌కు గురిచేసిన ఆ విద్యుదావేశాన్ని కొలవడానికి వోల్టేజీ లెక్కలు సరిపోకపోవచ్చు. క్రోధం, దుఃఖం, అవమానం, అసహ్యం, భయం వగైరాలన్నీ సునామీ కెరటాల్లా గుండెల లోతుల్లోంచి దూసుకొస్తున్నాయి. మణిపురలో జరిగిన బర్బర క్రీడను కోట్ల గొంతుకలు ఖండిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థలన్నీ ఈ అమానుషాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఒక్క బీబీసీని అయితే బెదిరించగలిగాం కానీ ఇంతమందిని బెదిరించడం సాధ్యం కాలేదు. కనుక ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది. మూకదాడులు చెలరేగిన ప్రతిచోటా మహిళల దేహాలు శత్రువుల చేతుల్లో ఆయుధాలుగా మారుతూనే ఉన్నాయి. చిత్రవధల రచనకు క్యాన్వాస్లవుతూనే ఉన్నాయి. ఈ ధోరణి మణిపురలో మాత్రమే ప్రారంభం కాలేదు. మణిపురతో అంతమూ కాదు. మూకదాడుల్లో తమ ప్రాబల్య విస్తరణ పరమార్థమున్న రాజకీయ శక్తులున్నంతకాలం మణిపురలు మండుతూనే ఉంటాయి. మానవత్వం కాలు తూనే ఉంటుంది. మణిపుర అల్లర్లను కేవలం మైతేయ్ (ఓబీసీ), కుకీ (ఎస్టీ)ల ఘర్షణగానే చూడాలా? అంతకు మించిన వృత్తాంతమున్నదా? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మణిపుర జనాభాలో 53 శాతం మంది మైతేయ్ తెగవారు. వీరు ప్రధానంగా సారవంతమైన ఇంఫాల్ లోయభూముల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీ జాతులవారు 40 శాతం వరకు ఉంటారు. మిగిలినవారు చిన్నచిన్న గిరిజన తెగలు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులు, ముస్లింలు. గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. మైతేయ్ల్లో అత్యధికులు హిందు వులు. మహాభారతంలోని బభ్రువాహనునికి వారసులమని వారి విశ్వాసం. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకొని రాజకుమారి చిత్రాంగద ప్రేమలో పడతాడు. వీరికో కుమారుడు. వాళ్లనక్కడే వదిలేసి అర్జునుడు తన మానాన తాను వెళ్లిపోతాడు. యుద్ధం ముగిసి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వాన్ని మణిపుర ప్రాంతం రాజకుమా రుడు బభ్రువాహనుడు బంధిస్తాడు. రక్షణగా వెళ్లిన అర్జు నుడిని కూడా ఓడించి గాయపరుస్తాడు. అదే ప్రాంతంలో ఉండే అర్జునుడి మరో భార్య ఉలూచి అనే నాగినికి విషయం తెలిసి నాగమణి ప్రభావంతో అర్జునుడిని కాపాడుతుంది. కథ సుఖాంతమై ఇద్దరు భార్యలతో అర్జునుడు హస్తినకు చేరుకుంటాడు. ఈ కథ యథాతథంగా వ్యాసభారతంలో లేదట! రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక నాటకంలో ఈ ఉదంతం ఉన్నదట! తెలుగు, కన్నడ భాషల్లో ‘బభ్రువాహన’ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఇందులో ఆసక్తిక రమైన విషయమేమిటంటే చిత్రాంగదది మైతేయ్ (మణి పురి) తెగ. ఉలూచిది నాగా తెగ. ఇప్పుడీ రెండు తెగలవారు అక్కడ గణనీయంగా ఉన్నారు. చిత్రాంగద గొప్ప యోధ. ఆమె తండ్రి చిత్రవాహనుడికి మగ సంతానం లేనందువలన ఆమెకు యుద్ధ విద్యల్లో తర్ఫీదునిస్తాడు. ఆమె శిక్షణలోనే రాటుదేలిన బభ్రువాహ నుడు తండ్రినే ఓడిస్తాడు. నిన్న మొన్నటి ఈరోమ్ షర్మిల వరకు మణిపురి మహిళల సాహస స్వభావం మనకు కనిపి స్తూనే ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 16 సంవత్సరాల పాటు ఈరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఒక దశలో ఇంఫాల్ లోయ ప్రాంతాన్ని (ఎక్కువగా మైతేయ్‌లు నివసించే ప్రాంతం) చట్ట పరిధి నుంచి మినహాయించి ఈరోమ్ను దీక్ష విరమించాలని ప్రభుత్వం కోరింది. కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఇంకా చీకటి చట్టం మాటున మగ్గుతుండగా తాను ఎట్లా ఉద్యమాన్ని విరమిస్తానని ఈరోమ్ ప్రశ్నించింది. ఆమె మైతేయ్ తెగ మహిళ. స్వభావ సిద్ధంగా ప్రజల మధ్య విభజన లేదు. చీకటి చట్టం మాటున మన సాయుధ జవాన్లు అన్ని తెగల మీద తమ దాష్టీకాన్ని ప్రయోగించారు. మహిళల మీద అత్యా చారాలు ఒక అలవాటుగా మార్చుకున్నారు. థాంజోమ్ మనోరమ అనే మహిళను పారా మిలటరీ జవాన్లు సామూహిక అత్యాచారం చేసి చంపేయడం అన్ని తెగల మహిళల్నీ కదిలించింది. కొందరు మహిళలు నగ్నంగా వీధుల్లోకి వచ్చి ‘ఇండియన్ ఆర్మీ... రేప్ అజ్’ అనే బ్యాన ర్తో ప్రదర్శన చేసిన ఘటన, ఇరవయ్యేళ్లు గడిచినా ఇంకా వెన్నాడుతున్న పీడకలగానే మిగిలిపోయింది. తెగల మధ్య సహజంగా ఉండే చిన్నచిన్న వైరుద్ధ్యాలు సెగలు గక్కే శత్రు వైరుద్ధ్యాలుగా పరిణమించవలసిన అవ సరం లేదు. ఆ అవసరం కొన్ని సంకుచిత శక్తులకున్నది. మంటల్లో చలికాచుకునే రాజకీయ శక్తులకున్నది. సంఘాన్ని మెజారిటీ – మైనారిటీలుగా విడగొట్టి మెజారిటీ పక్షాన పేటెంట్ హక్కు రాసుకొనే స్వార్థ వర్గాలకున్నది. మైనారిటీల మీద మూకదాడులకు మెజారిటీలను ఉసిగొలిపే వ్యూహ కర్తలకున్నది. ఈ మూకదాడులు క్షణికావేశాలు కావనీ, ప్రణాళికాబద్ధమేనని బిల్కిస్ బానో ఉదంతం మనకు చాటి చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులందరినీ అల్లరిమూక చంపేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ధైర్యంగా పట్టుదలతో హంతకుల మీద కేసు నడిపింది. వారికి శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తి కాకముందే స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆ హంతకులు రాచమర్యాదలతో విడుదలయ్యారు. వారికి స్వాతంత్య్ర సమరయోధుల కంటే మిన్నగా స్వాగత సత్కారాలు లభించాయి. ఈ ఘటన నేర్పుతున్న పాఠమేమిటి? మణిపుర ఘటనలు ‘డబుల్ ఇంజన్’ సర్కార్ నిర్వాకమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అది తప్పు. అక్కడున్నది ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించే ఇంజన్లయితే కనిపించని ఆ మూడో ఇంజనే పరివార్... సంఘ్ పరివార్! ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో క్రైస్తవ ప్రాబల్యం పెరుగుతుండడంతో పరివార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి వ్యూహం ఫలించడం మొదలైంది. కాషాయ పార్టీ అక్కడ బలం పుంజుకున్నది. మణిపుర అల్లర్లు ఎలా మొదల య్యాయి? ఒక మైతేయ్ మహిళను కుకీ తెగవారు రేప్ చేశారని ఒక ఫేక్ వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో అటువంటి వార్తలను ప్రచారంలో పెట్టగల ప్రావీణ్యం ఎవరికి ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఎవరి అధీనంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. వార్త ప్రచారమైందే తడవుగా వేల సంఖ్యలో మైతేయ్ ప్రజలు గుంపులు గుంపులుగా కుకీ గ్రామాల మీద పడ్డారు. ఒక్కరోజులోనే ఒక వర్గానికి చెందిన వందకు పైగా ప్రార్థనాలయాలు ధ్వంస మయ్యాయంటే, ప్రార్థనలు చేయించేవారిని వెతికి పట్టుకొని దాడులు చేశారంటే మనకు బోధపడుతున్న వాస్తవమేమిటి? అదే వరసలో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి దిగంబరంగా పరేడ్ చేయించారు. వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఒక అమ్మాయి సోదరుని, తండ్రిని చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్మీ జవాన్ భార్య. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. దేశాన్ని కాపాడాడు. తన భార్యను మాత్రం కాపాడుకోలేక పోయానని విలపిస్తున్నాడు. దేశాన్ని మెజారిటీ, మైనారిటీలుగా విడగొట్టడంలో మన పరివారం గణనీయమైన విజయాలే సాధించింది. మెజారిటీ వర్గాన్ని రంజింపజేయగల చక్కెరపూత భావ జాలాన్ని అది సృష్టించగలిగింది. అదే నేటి ఆధిపత్య భావజాలం. దేశం మీద పెత్తనం చేస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలానికి మైనారిటీల మీద, నిమ్న జాతుల మీదనే చిన్నచూపు కాదు. జనాభాలో సగభాగమైన మహిళల మీదా చిన్నచూపే! దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికల మీద జాతీయ పతాకాల్లా ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ దేశం గమనించింది. వాళ్లను అవమానించి వేధించినవాడు దర్జాగా పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. ఆధిపత్య భావజాలంతో రెచ్చిపోతున్న నికృష్ట మూకలు నగ్నదేహాలతో ఆటలాడటాన్ని కూడా దేశం చూసింది. నేటి మన ఆధిపత్య భావజాలపు ప్రధాన వ్యూహం టార్గెట్ వర్గాలపై అసత్య ప్రచారాలు చేసి ఏకాకుల్ని చేయడం, వారంతా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనే భయాన్ని సమాజంలో కలిగించడం! చేతబడి అనే సాకు చూపి ఒక కుటుంబాన్ని ఊరంతా కలిసి చంపేయడాలు మనకు తెలిసిందే కదా! అదిగో ఆ మూఢత్వానికే మన వాళ్లు జాతీయ హోదా కల్పించారు. ఇప్పుడా చేతబడి ప్రచారాన్ని కుకీల మీద చేస్తున్నారు. వారంతా పరాయి దేశం వాళ్లట. లవ్ జిహాద్, గోహత్య వగైరా వగైరా చేతబడి వ్యూహాలతో ఎల్లకాలం నెట్టుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన గుర్తున్నది కదా! నాటి యూపీఏ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలోకి విసిరేయడంలో చోదకపాత్ర పోషించిన ఉదంతం. మణిపుర మహిళల నగ్న పరేడ్ అంతకంటే చిన్న విషయమేమీ కాదు. దాని ప్రకంపనలు ఇప్పుడప్పుడే సద్దుమణగవు. నా దేశం నగ్న దేహం కాదు. అది నవచైతన్య పతాకం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా..
లండన్: బీబీసీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ ఒకరు 17 ఏళ్ల యువతి వ్యక్తిగత ఫోటోలను కోరుతూ అందుకు ప్రతిఫలంగా 35 వేల పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) దఫాలుగా చెల్లించిన ఉదంతంలో బీబీసీ ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీబీసీ ఉద్యోగిని విధుల నుండి తప్పించినట్లు తెలిపింది. 37 లక్షలు ఎర.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా ఛానల్ అయిన బీబీసీలో ఒక న్యూస్ ప్రెజెంటర్ సంస్థ ప్రతిష్టను దిగజార్చే పనికి పాల్పడ్డాడు. 2020లో పరిచయమైన ఓ అమ్మాయిని తన వ్యక్తిగత చిత్రాలను పంపించవలసిందిగా కోరాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 17 ఏళ్ళు కాగా ఇప్పుడు 20 ఏళ్ళు. అలా పంపించినందుకుగాను ఆమెకు 35 యూకే పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) కూడా ఎరగా చూపించాడు. సున్నితమైన అంశం కాబట్టి.. ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలియడంతో బిబిసి ప్రెజెంటర్ విషయాన్ని సన్ మీడియా దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. బీబీసీ ఛానల్ ప్రతిష్ట దిగజారుతుందేమోనన్న భయంతో సంస్థ యాజమాన్యం సంఘటనపై జాప్యంగా వ్యవహరించింది. చివరికి ఛానల్ పై ఒత్తిడి అధికం కావడంతో సదరు ప్రెజెంటర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బీబీసీ.. సంక్లిష్టమైన సమస్య కావడంతో సత్వరంగా చర్యలు తీసుకున్నాము. అయినా కూడా ఈ సంఘటనపై దర్యాపు చేసి నిజాలు వెల్లడించాలని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను కోరింది. కల్చర్ సెక్రెటరీ లూసీ ఫ్రేజర్ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీతో ఈ విషయంపై మాట్లాడానని ఆయన దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నట్లు హామీ ఇచ్చారని ట్విట్టర్లో షేర్ చేసింది. I have spoken to BBC Director General Tim Davie about the deeply concerning allegations involving one of its presenters. He has assured me the BBC are investigating swiftly and sensitively. — Lucy Frazer (@lucyfrazermp) July 9, 2023 ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది? -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు..
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 (FEMA) నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ గురువారం పేర్కొంది. ఫెమా నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. కొంతమంది బీబీసీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి స్టేట్మెంట్ల రికార్డింగ్‌ను కోరినట్లు ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీబీసీ డాక్యుమెంట్ భారత్‌లో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించింది. దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఆ తరువాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు బీబీసీ ఉద్యోగులను విచారించారు. అయితే ఇవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు పేర్కొన్నారు. క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. చదవండి: కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు! -
చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం!
నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ ఎవరో ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటున్నారా.. అయితే మీరు గోనెసంచిలో కాలు వేసినట్లే. చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్. చార్లెస్ రాస్ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చాడు. ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం. ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేసేవాడు. వీటన్నింటినీ నాటింగ్‌హామ్‌లోని హాంటెడ్ మ్యూజియంలో ప్రదర్శించేవాడు. చార్లీ ఈ జార్జ్ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే బీబీసీ చానెల్లో ప్రసారమయ్యే ‘బార్గైన్ హంట్’కు ఆహ్వానం కూడా అందుకున్నాడు. అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ జార్జ్ బొమ్మను చూస్తుంటే సినిమాల్లోని అనాబెల్, చూకీ బొమ్మల కంటే భయంకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. -
బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన
బీబీసీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీ పెనుదుమారమే రేపింది. తదనంతర నాటకీయ పరిణామాల నడుమ.. ఆ సంస్థ కార్యాలయాలపై ఐటీ పరిశీలనలు కొనసాగాయి. ఐటీ లెక్కల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది భారత ఐటీ శాఖ. ఈ పరిణామంపై యూకే ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది. పైగా బీబీసీ సంపాదకీయ స్వేచ్ఛను సమర్థించింది కూడా. ఈ మేరకు హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేవనెత్తిన అత్యవసర ప్రశ్నకు విదేశాంగ కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం(ఎఫ్సీడీఓ) జూనియర్ మంత్రి డేవిడ్ రూట్లీ స్పందిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ చేసిన ఆరోపణల గురించి అక్కడి(భారత) ప్రభుత్వంపై వ్యాఖ్యనించలేమన్నారు. కానీ మీడియా స్వేచ్ఛ, వాక్ స్వాంతంత్య్రం గురించి నొక్కి చెప్పారు. పైగా బలమైన ప్రజాస్వామ్యానికి అవే ముఖ్యమైన అంశాలన్నారు. అంతేగాదు భారతదేశంతో ఉన్న విస్తృతమైన లోతైన సంబంధాల గురించి ప్రస్తావించారు. అలాగే భారత ప్రభుత్వంతో అనేక సమస్యలను నిర్మాణత్మాకమైన పద్ధతిలో చర్చించేందుకు యూకేకు వీలు కల్సిస్తుందని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు తాము బీబీసీ కోసం నిలబడతాం, నిధులు సమకూరుస్తాం అని రూట్లీ కుండబద్ధలు కొట్టారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ అత్యంత ముఖ్యమైనదని భావిస్తున్నామని తేల్చి చెప్పారు. అందుకే బీబీసీకి సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని రూట్లీ ధృఢంగా చెప్పారు. బీబీసీ మా ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష లేబర్ పార్టీని కూడా విమర్శిస్తుంది, దానికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఆ స్వేచ్ఛ చాల కీలకమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన స్నేహితులకు అంటే భారతదేశంలోని ప్రభుత్వంతో సహా దీని ప్రాముఖ్యతను తెలియజేయగలగాలన్నారు. నాలుగు భారతీయ భాషలతో సహా.. బీబీసీ సంపాదకీయంగా స్వతంత్రంగా ఉంటుందని నొక్కి చ్పెప్పారు. ఈ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ముఖ్యమైన పాత్ర పోషించడమే గాక నాలుగు భారతీయ భాషలతో సహా మొత్తం 12 భాషల్లో సేవలందిస్తుందన్నారు.ఎందుకంటే ఇది మన స్వరం మాత్రమే గాదు బీబీసీ ద్వారా మన స్వతంత్ర స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చూసుకోవడం అతి ముఖ్యమని చెప్పారు. ఇదిలా ఉండగా, ఉత్తర ఐర్లాండ్ ఎంపీ జిమ్ షానన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అత్యవసర ప్రశ్నను లేవనెత్తారు. ఆయన ఈ చర్యను దేశ నాయకుడి గురించి పొగడ్త లేని డాక్యుమెంటరీ విడుదల చేయడంతో ఉద్దేశపూర్వకంగా సాగిన బెదిరింపు చర్యగా ఆరోపణలు చేశారు. ఈ సమస్యపై స్పందించడంలో విఫలమైనందుకు యూకే ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అంతేకాదు బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు గురించి ప్రస్తావించారు కూడా. ఈ విషయంలో విదేశీ కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం కూడా నిశబ్దంగా ఉందని అందువల్లే దీన్ని ఖండించేలా ప్రభుత్వాన్ని పోత్సహించడానికీ ఈ ప్రశ్నను తాను లేవనెత్తినట్లు డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) పార్లమెంటు సభ్యుడు షానన్ అన్నారు. దీన్ని ఆయన పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఐతే ఇది సంభాషణలో భాగంగా లేవనెత్తిన ప్రశ్న అని, అయినా తాము ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి రూట్లీ తెలిపారు. మరోవైపు బ్రిటీష్ సిక్కు లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. బీబీసీ దర్యాప్తుపై ఎంక్వైయిరీ భారతదేశంలోని అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలపై దాడులు చేపట్టడం ఇదేమి మొదటిసారి కాదని లేబర్‌పార్టీ ఎంపీలు విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, భారత్‌లోని ఐటీ అధికారులు ఏడేళ్లుగా బీబీసీని దర్యాప్తు చేస్తున్నారో లేదో నిర్ధారించాలని మంత్రిని రూట్లీని కోరారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మంత్రి నిరాకరించారు. కాగా, ఫిబ్రవరి 14న ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత ఇది రైడ్ కాదు సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది. అంతేగాదు సర్వే తదనంతరం బీబీసీ లావాదేవీలు భారత్ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం. -
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్‌లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్‌లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
బీబీసీలో సర్వేపై ఐటీ శాఖ ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఆఫీసుల్లో జరుగుతున్న సర్వేపై ఐటీ శాఖ శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం సేకరించామని పేర్కొంది. అవి ఐటీ దాడులు, సోదాలు కాదని.. కేవలం సర్వేనే అని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీబీసీ పేరును ప్రస్తావించకుండానే.. ఓ ప్రముఖ మీడియా సంస్థ అని పేర్కొంటూ సదరు సంస్థ లావాదేవీలపై సర్వే చేసినట్లు, అకౌంటింగ్ పుస్తకాల్లో అక్రమాలను గుర్తించినట్లు తాజాగా భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ముంబై, ఢిల్లీ కార్యాయాలల్లో చేసిన ఈ సర్వేల్లో ప్రధానంగా లావాదేవీల డాక్యుమెంట్స్ పరిశీలించామని.. ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో వివిధ విభాగాలు వెల్లడించిన ఆదాయం, లాభాలు భారతదేశంలో వాళ్ల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు అని ఆదాయపు పన్ను శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మీడియా సంస్థలోని ఉద్యోగుల స్టేట్మెంట్లు, డిజిటల్ ఫైల్లు, డాక్యుమెంట్లను పరిశీలించే ప్రక్రియలో ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. తమ దర్యాప్తును ఆలస్యం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు కూడా ఆరోపించింది ఐటీ శాఖ. అయితే ఈ ఆరోపణలపై బీబీసీ ఇంకా స్పందించాల్సి ఉంది. సదరు వార్తా సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఈ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇంకా ఏమైనా ఉందా? అనే కోణంలోనే సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీబీసీ ఆఫీసుల్లో మొదటి రెండు రోజులపాటు.. లోపలికి ఉద్యోగులను అనుమతించలేదు. లోపల ఉన్నవాళ్లను బయటకు పంపలేదు. మూడవ రోజు నుంచి ఉద్యోగులకు కార్యకలాపాలకు అనుమతించింది. అయితే అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మాత్రం ఐటీ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆయా విభాగాల్లో వాళ్లను ప్రశ్నించడంతో పాటు పత్రాలతో పాటు కంప్యూటర్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లను కూడా ఐటీ శాఖ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీబీసీ భారత ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ గుజరాత్ అల్లర్ల ప్రధానాశాంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించగా.. అది దుమారం రేపింది. ఈ తరుణంలో బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలపై రాజకీయంగానూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన బీబీసీ
-
మూడో రోజూ ఐటీ సోదాలు.. 2 రాత్రులుగా ఆఫీసులోనే బీబీసీ ఉద్యోగులు
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ఇండియా కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. సర్వే ఆపరేషన్ పేరుతో ఐటీ అధికారులు చేపట్టిన దాడుల కారణంగా ఢిల్లీలోని బీబీసీలో పనిచేసే దాదాపు 10 మంది సీనియర్లు ఉద్యోగులు రెండు రోజుల నుంచి ఆఫీస్‌లోనే ఉంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లలేదు. బీబీసీ కార్యాలయ ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు తమకు కావల్సిన ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని, డాక్యుమెంట్లు, మెయిల్స్, ఇతర వివరాల్ని సేకరించారు. కాగా 2002 గుజరాత్ జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇటీవల ఓ డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా ది మోదీ క్వశ్చన్ పేరుతో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా వివాదస్పదమైంది. దీనిని భారత్‌లో ప్రసారం చేయనీయకుండా కేంద్రం బ్యాన్ చేసింది. సోషల్ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్, ట్విటర్ వంటి వాటిల్లో సంబంధిత లింక్‌లను తొలగించింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఈ ఐటీ దాడులు ప్రారంభమవడం గమనార్హం. ఐటీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని బీబీసీ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ఐటీ సోదాలు జరుగుతున్న కూడా తాము వార్తలను ఎప్పటిలాగే ప్రసారం చేస్తున్నామని తెలిపారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పన్నుల ఎగవేత ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఐటీ సోదాలు 44 గంటలు గడిచినా ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడులు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమని.. తమకు లభించే ఆధారాల్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలపై ఐటీ సర్వే బృందాలు సమాధానాలు రాబడుతున్నాయి. సాక్ష్యాలను సేకరించే పనిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటాను కాపీ చేస్తున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రతికారంతోనే బీబీసీ కార్యాలయాలపై కేంద్రం ఐటీ దాడులు జరిపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
బీబీసీపై ఐటీ నజర్
-
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించిన తర్వాత ఈ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. విపక్షాలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఈ వ్యవహారంపై స్పందించింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం లేదా విశ్వాసపరమైన స్వేచ్చ మానవహక్కులుగా దోహదపడుతాయన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కూడా ఇవే బలోపేతం చేశాయని చెప్పారు. ఈ విషయాలను తాము ఎప్పుడు హైలైట్ చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలకు పునాది అని నొక్కి చెప్పారు. అయితే బీబీసీపై ఐటీ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమా ? అని అడిగిన ప్రశ్నకు నెడ్ ప్రైస్ ఆచితూచి సమాధానమిచ్చారు. ఈ సోదాలపై నిజానిజాల గురించి తమకు తెలుసునని, అయితే దీనిపై తీర్పు చెప్పే స్థితిలో తాను లేనని వ్యాఖ్యానించారు. చదవండి: ‘లేఆఫ్స్’ తాత్కాలికమే.. అమెరికాలో భారీగా ఉద్యోగాలు..! -
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు..ఇది కేవలం సర్వేనే!
బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ పెను వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. సోదాలు నిర్వహించి..ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను తీసుకువెళ్లడమే కాకుండా కార్యాలయంలోని డెస్క్‌టాప్‌లను కూడా తనిఖీ చేశారు. ఐతే ఆదాయపు శాఖ మాత్రం పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే చేస్తున్నమని, సోదాలు కాదని పేర్కొంది. కార్యాలయం లావాదేవీలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లు, ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా బీబీసీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ని కోరినట్లు ఆదాయపు శాఖ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీలు ముగిసిన తర్వాతే ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ఐటీ అధికారలు అనుమతించినటట్లు సమాచారం. కాగా, బీబీసీ ఈ ఘటనపై స్పందిస్తూ.."ఆదాయపు శాఖ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. మా ఉద్యోగులందరూ క్షేమంగానే ఉన్నారు. బీబీసి వారికి అన్నివిధాలుగా సహకరిస్తుంది. ఈ వివాదం తొందరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నా." అని తెలిపింది. ఇదిలా ఉండగా..గత నెలలో బీబీసీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 2002 గుజరాత్ అల్లర్లుపై ఒక డాక్యుమెంటరీ తీసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిడమే గాక వలవాద విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది కూడా. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! సీఎం స్టాలిన్ సెటైర్లు) -
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై స్పందించిన కేటీఆర్
-
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులు
-
పాలనా రథానికి ప్రజలే రక్ష!
భారతీయులు 140 కోట్ల మంది తనకు రక్షా కవచంగా ఉన్నారని ప్రధాని అన్నారు. మరి అలాంటప్పుడు ఒక డాక్యుమెంటరీని ఎందుకు అంతగా ప్రభుత్వం వ్యతిరేకించింది? భారత సమాజ పరిస్థితులు, ప్రభుత్వ చర్యల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని ఇది కాలరాయడం కాదా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమని నమ్మిన నాయకులున్నారు. కానీ జాతీయోద్యమ నాయకుడైన మహావీర్ త్యాగి ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని వాదించారు. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే హక్కును ప్రజలకు దఖలు పరచాలన్నారు. ‘‘నా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను దేశ ప్రజలు నమ్మ బోరు. 140 కోట్లమంది భారతీయులూ నాకు రక్షణగా, సురక్షితమైన కవచంగా ఉన్నారు.’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (8 ఫిబ్రవరి 2023) గుజరాత్లో 2002లో మైనారిటీలపై జరిగిన మూకుమ్మడి హత్యా కాండ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన చేస్తూ– గుజరాత్ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఆ తర్వాత వారాల తరబడి సాగిన హింసాకాండను అదుపు చేయలేక పోయిందనీ నిశితంగా విమర్శించింది. అంతేగాదు, గత 20 సంవత్సరాలుగానూ దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతాయుత సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల నాయకులు ఈ విపరిణామాన్ని ఖండిస్తూ వచ్చారు. అయినా 2002 నాటి గుజరాత్ హింసాకాండను ప్రోత్సహించిన బాధ్యు లెవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గుజరాత్ ఊచ కోతలపై ‘ఇండియా – ది మోదీ క్వశ్చన్’ మకుటం కింద ఒక డాక్యు మెంటరీని ‘బీబీసీ’ విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని, నిజాయితీని అవమాన పరుస్తోం’దన్న పేరిట సామాజిక మాధ్యమాలన్నిటి నుంచి ప్రభుత్వం తొలగించింది. భారత సమాజ పరిస్థితుల గురించి, ప్రభుత్వ చర్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని కాలరాయడం పట్ల శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తదితర విద్వత్ సంపన్నులు 500 మందికి పైగా విస్మయం వ్యక్తం చేశారు. పరిణామాలకు అద్దం నిజానికి ‘బీబీసీ’ డాక్యుమెంటరీ వచ్చింది గుజరాత్ మారణకాండ అనంతరం 20 సంవత్సరాలకు. అంతకుముందే 2010 నాటికే రాణా అయూబ్ ‘గుజరాత్ ఫైల్స్’ పేరిట గుజరాత్ బీజేపీ పాలకవర్గ ‘మాలోకా’న్ని ప్రత్యక్షరబద్ధంగా నమోదు చేసింది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రాసింది మరెవరో కాదు, సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ. ‘ఈశావాప్యోపనిషత్’లో కళ్లు తెరిపించే ఒక సూక్తి ఉంది: ‘‘నిజం అనే ముఖాన్ని కనపడనివ్వకుండా ఓ బంగారు కుండీలో దాచి ఉంచుతారు. అసలా జలతారు కుండీలో దాగిన నిజమేమిటి?’’ అలాగే నిజమనేది కట్టుకథకు అందని వాస్తవం! అలాంటి ‘గుజరాత్ వాస్తవాల’ను రాణా అయూబ్ సాహసంతో బహిర్గతం చేసిందని శ్రీకృష్ణ కితాబిచ్చారు. ‘అయూబ్ రచన పరి శోధనాత్మక పాత్రికేయ విధి నిర్వహణలో ఒక సాహస యాత్ర. పాలనా రంగంలో నానాటికీ పెరిగిపోతున్న నిజాయితీకి పాతరేసి, దొంగచాటు రాజకీయ కుట్రలకు మార్గం తీస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ రచనా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అంబేడ్కర్, భారత ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనందున అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అభిప్రాయంతో జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన మహావీర్ త్యాగి(1899–1980) విభేదిస్తూ, అంబేడ్కర్ లాగా ఇలాంటి అభిప్రాయాలు కల నాయకులెవరైనా ఉంటే వారు అలాంటి ప్రకటనలు చేయబోయేముందు కొన్నాళ్లు జైలులో ఉండొస్తే మంచిదని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు! ఆ పిమ్మట త్యాగి, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘానికి సవాలుగా ఒక ప్రతిపాదన చేస్తూ, ప్రజలకు ఆమోదించిన ప్రాథమిక హక్కుల్ని ముందుముందు ఏర్పడబోయే ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే లేదా మార్చేసే హక్కును ప్రజలకు దఖలు పరిచే అంశాన్ని చర్చించారా లేదా అని ప్రశ్నించారు. ప్రజలకున్న అలాంటి సహజమైన హక్కుకు మీరు గ్యారంటీ ఇవ్వలేదని త్యాగి విమర్శిస్తూ ప్రభుత్వ హక్కులతోపాటు ప్రజల హక్కుల్ని గురించి కూడా ఆలోచించా లన్నారు. ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని త్యాగి వాదించారు. అందుకు పూర్తిగా సమ్మ తిస్తూ డాక్టర్ అంబేడ్కర్, ఉత్తరోత్తరా ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు ఊహపై ఆధారపడి) పైన వ్యక్తుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే స్వేచ్ఛను భావిప్రభుత్వాలకు అనుమతించే ప్రసక్తి ఉండరాదని పలుమార్లు స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికల మాటున ‘ఓటు’ ఎరలోనూ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నికల పేరిట సంపన్న వర్గాలు, కుల, మత, రాజకీయ పక్షాలూ చేసిందీ, చేస్తున్నదీ – అన్ని కులా లలోని పేదలు, అణగారిన ప్రజలు చైతన్యం పొందకుండా జాగ్రత్త పడటం మాత్రమే. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని వెలుగు చూడకుండా రాజ్యాంగ రచనా సంఘంలోని కొందరు సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డదారులలో ఎన్నికల పేరిట కుల, మత సంపన్న వర్గాల సభ్యులు హెచ్చుమంది ఎలా అనతికాలంలోనే ‘కుబేర సంతానం’గా మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే, తారుమారు చేయడానికి వెనుదీయడం లేదో ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. రాజ్యం కార్పొరేట్ ఎస్టేట్ వ్యాపారంగా ఎలా మారిపోయిందో రుజువై పోయింది. స్వతంత్రంగా వ్యవహరించాలి 1951 మేలోనే కేంద్ర, రాష్ట్ర శాసన వేదికల్లోకి ప్రవేశించడానికి ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలో ‘ప్రజా ప్రాతినిధ్య బిల్లు’ను అంబేడ్కర్ ప్రవేశపెడుతూ అవసరమైన సవరణలను కూడా ప్రతి పాదించారు. వాటిలో ప్రధానమైనవి – పార్లమెంట్, ఎన్నికల చట్టం పార్లమెంట్ సభ్యుల స్వేచ్ఛను ప్రభుత్వ స్వేచ్ఛను భిన్నమైనవిగా భావించాలి. మొత్తం పార్లమెంట్‌ను అవినీతికి ‘పెద్ద బిడ్డ’గా మార్చ కుండా ఉండే విధంగా సభనూ, ఎన్నికల చట్టాన్నీ రూపొందించాలి. పార్లమెంట్ సభ్యులకు రాజకీయ పదవులను కట్టబెట్టడం ద్వారా లేదా ఇతర ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మొత్తం పార్లమెంట్‌ను లేదా శాసన వేదికలను అవినీతిపాలు చేసేలా ప్రభుత్వానికి అవకాశం కల్పించకూడదు. దానికి తగిన విధంగా మన శాసన వేదికలు, పార్ల మెంట్, ఎన్నికల చట్టమూ ఉండాలని అంబేడ్కర్ అభిలషించారు. పార్లమెంట్ లేదా శాసన వేదిక అనేది నిర్భీతిగా, ప్రభుత్వం నుంచి ఏ ప్రలోభాన్ని ఆశించకుండా స్వతంత్రంగా వ్యవహరించలేని నాడు అలాంటి శాసన వేదికలు నిష్ప్రయోజనకరం. శాసన వేదికలు ప్రభు త్వాలు చెప్పే మాటలకు డూడూ బసనన్నలుగా, నట, గాయక వందిమాగధులుగా వ్యవహరించరాదని కూడా అంబేడ్కర్ (1951 మే 9) నిర్మొహమాటంగా పేర్కొన్నారని మరచి పోరాదు. పార్లమెంట్ ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా (వ్యాపార లావాదేవీల కేంద్రం) ఇప్పటికే (1951 నాటికే) మారిపోయిందని పండిట్ లక్ష్మీకాంత మైత్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయానికి 75 ఏళ్లకు కూడా ‘కళ్లెం’ వేయడానికి పాలకులకు ఇష్టం లేదు. దీనివల్ల పాలకులు ప్రయోజనం పొందడం సహజం. కనుకనే న్యాయ వ్యవస్థ తన జడత్వాన్ని క్రమంగా వదిలించుకుని చైతన్యావస్థలోకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల సత్తాను సంతరించుకుంటోంది. అందుకే కవి కుమారుడు ఎంతటి కమ్మని సూక్తిని విడిచి వెళ్లాడో గదా – ‘‘బలవంతపు రాజ్యకాంక్షా ఒక పాపము జూచునే ఈశ్వరా?’’! తన ‘బీదతనం’ దేశ దారిద్య్రమనీ, తన మరణం లోక ప్రళయమనీ భావించి సంచరించే అహంకారుల గురించి సుమతీ శతకకారుడు హెచ్చరించలేదూ?! abkprasad2006@yahoo.co.in -
డాక్యుమెంటరీపై మాటల సెల్ఫ్ గోల్
గుజరాత్లో 2002లో జరిగిన హింసపై ‘బీబీసీ’ నిర్మించిన తాజా డాక్యుమెంటరీని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఖండించారు. తాను దాన్ని చూడలేదని పేర్కొంటూనే, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, తప్పుడు వాదనతో, ప్రచార యావతో తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు... బీబీసీ తాజా డాక్యుమెంటరీపై కనీసపాటి ఆలోచన కూడా లేకుండా తీవ్ర ధోరణిలో మాట్లాడారు. భారతదేశ సార్వభౌమత్వాన్నీ, సమగ్రతనూ ఆ డాక్యుమెంటరీతో కించపర్చారంటూ వారు ఆరోపించారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? వారు వ్యక్తం చేసిన ఆందోళన బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశ మనుగడ పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టుగా తయారైంది. తప్పుగా మాట్లాడటం ద్వారా వారు తమ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించేకొద్దీ, నిజానికి సమస్య మనలోనే ఉందని చెబు తాను. సాధారణంగా రాజకీయ నాయకుల వద్ద ప్రతి సమస్యకూ పరిష్కారం ఉండాలనీ, ప్రతి సమ స్యపై వారు వ్యాఖ్యానించాలనీ, ప్రతి వ్యక్తికి సంబంధించి అర్థవంతమైన, కచ్చితమైన అభిప్రా యాన్ని కూడా కలిగి ఉండాలనీ, అన్ని పరిస్థితు లనూ వారు అర్థం చేసుకోవాలనీ మనం భావిస్తుంటాం. కాని వారు అలా చేయలేరు. అది వారికి సాధ్యం కూడా కాదు. అలాగని తాము దేన్నయినా సరే... చేయగలమని వారు నటించినట్లయితే దానిని మనం వారిని అగౌరవించాల్సిన పని లేదు. సూటిగా చెప్పాలంటే, రాజకీయ నాయకులు వారి పట్ల మనకు ఉందనుకుంటున్న గౌరవాన్ని కోల్పో వలసిన అవసరం లేదు. అయితే వారు గుర్తించనిది ఏమిటంటే, మన అంచనాలు వారికి ఒక ఉచ్చు లాంటివి. ఆ సంగతి వారు స్పష్టంగా గ్రహిస్తూనే, గర్విస్తూనే మనం ఏర్పరచిన ఉచ్చులో చిక్కుకుంటూ ఉంటారు. ఇవాళ ఆలోచనాత్మకమైన, మేధాసహితమైన స్పందనల కంటే ఆకట్టుకునేలా అభిప్రాయాలు వెల్లడించడమే ఎక్కువ అవసరమని రాజకీయ నాయకులు భావించే దశకు మనం చేరుకున్నాం. ఎందుకంటే, వీటిలో ఆకర్షణీయమైన స్పందనే పతాక శీర్షికలకు ఎక్కుతుంది. అది వారికి ప్రచా రాన్ని కల్పిస్తుంది. మరోవైపున ఆలోచనతో కూడిన స్పందన మరింత అర్థవంతంగానూ, సహాయకారి గానూ ఉండవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్త ఏకాగ్రత అవసరమవుతుంది. కాబట్టి పునః పరిశీలనకు అది పిలుపునిస్తుంది. పైగా ఆకర్షణీయ మైన స్పందనకు సరిసమానమైన ప్రభావాన్ని మేధాసహితమైన స్పందన కలిగించనే కలిగించదు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు? అతడి గురించి నాకేమీ తెలీదు’ అని అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇటీవల చేసిన ప్రకటన దీనికి అత్యుత్తమ మైన ఉదాహరణ అని నేను చెబుతాను. గౌహతిలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్య అత్యంత వివాదాస్పద మైంది. అంతేకాదు. ఆయన మాటల్లో అసలు నిజం లేదు. ఒకవేళ ఆయన వ్యాఖ్య గనక నిజమే అయితే... మన దేశంలోని ప్రజల గురించి ఏ మాత్రం తెలియని స్థితిలో సదరు అస్సామ్ ముఖ్య మంత్రి ఉన్నారని చెప్పక తప్పదు. నిజానికి ఆయన చేసిన ఆ ప్రకటన అమితాబ్ బచ్చన్ స్వయంగా ‘నరేంద్ర మోదీ ఎవరు? ఆయన గురించి నాకేమీ తెలీదు’ అని చెప్పినట్టు ఉంది. ప్రముఖ హిందీ సినీ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఎవరో తెలియని భారతీయులు ఎవరైనా ఉంటారా అని నాకు సందేహం. అలాగే, భారతీయ జనతా పార్టీ నేత – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా తెలియనివారు ఉన్నారంటే కూడా సందేహించాల్సి ఉంటుంది. అందుకనే అస్సామ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యను జనం దృష్టిని ఆకర్షించడానికి, జనం తమను ఏదో ఒకలా గుర్తుంచుకునేలా చేసే తప్పుడు ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో అన్నీ తప్పుడు అంశాలే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. విషాదం ఏమిటంటే, కనీసపాటి ఆలోచన కూడా లేకుండా షారుఖ్ ఖాన్ గురించి అలా మాట్లాడటం వల్ల అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దేశవ్యాప్తంగా మూర్ఖుడిగా మారిపోయారు. 2002 నాటి గుజరాత్ హింసపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని విమర్శించి, ఖండించాలన్న ఉద్దేశంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. ఆ డాక్యుమెంటరీని తాను చూడలేదని ఒప్పుకుంటూనే, నిర్దిష్టంగా ఒక తప్పుడు వాదనను జనంలోకి తీసుకుపోవడానికి, ప్రచారమే పరమావధిగా తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. పైగా అది పక్షపాతంతో కూడుకున్నదనీ, దాంట్లో నిష్పా క్షికత లోపించిందనీ నిందించారు. అయితే బీబీసీ తాజా డాక్యుమెంటరీని చూడ నప్పుడు దాంట్లోని విషయాలను ఆయన ఎలా ప్రస్తావించారు? అది కూడా తానొక అధికారిక ప్రతి నిధి అయ్యుండి, తాను చూడని విషయంపై ఎలా వ్యాఖ్యానించారు అనే ప్రశ్న వస్తుంది. అయితే తాను దేని గురించి మాట్లాడుతున్నదీ తనకు స్పష్టంగా తెలుసన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వర్ణనలు ఉన్నాయి. అధికారిక ప్రతినిధి చేసే ప్రక టన సాధికారికంగా ఉంటుందనీ, విశ్వసించదగిన దనీ ఎవరైనా భావిస్తారు. వాళ్ళూ వీళ్ళూ చెబుతుంటే విని చెబుతున్నట్టుగా, వేరెవరి అభిప్రాయాలో మళ్లీ ప్రస్తావించినట్టుగా ఉంటాయనీ, ఉండాలనీ ఎవరూ అనుకోరు. కానీ ఆయన తాజా వ్యాఖ్య లన్నీ అచ్చంగా అలాగే ఉన్నాయని గ్రహించాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలకూ, సంస్థలకూ చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారులు దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలతో మాట్లాడారు. బీబీసీ తాజా డాక్యుమెంటరీపై తమ వాదనను బలంగా వినిపించడం కోసం కనీసపాటి ఆలోచన అయినా కూడా లేకుండా వారు తీవ్ర ధోరణితో మాట్లాడారు. ఆ తొందరలో చివరకు భారతదేశం గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలు పొడసూపేలా చేశారు. ఆ డాక్యుమెంటరీలో భారత సార్వభౌమత్వాన్నీ, సమ గ్రతనూ కించపర్చారంటూ వారు ఆరోపించారు. నిజమా? నిజంగానే అలా జరిగిందా? ఇంతకూ వారు గుర్తించని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే – తాము ఏం మాట్లాడు తున్నాం అనే విషయం గురించి వారు కనీసం ఒక్కసారి కూడా ఆగి, నింపాదిగా ఆలోచించలే పోయారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? పైగా యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్రచార, ప్రసార వేదికలను వాడేవారు మన జనాభాలో అతి తక్కువమంది అని తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ కొద్దిమంది ఆ డాక్యుమెంటరీ చూసినంత మాత్రాన మన జాతీయ చట్రమే కదిలి పోతుందా? విచ్ఛిన్నమవుతుందా? చివరకు వచ్చేసరికి వారు వ్యక్తం చేసిన ఆందోళన అంతా బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశంలోని పరిస్థితి పైనా, దేశ మనుగడకు సంబంధించిన అంశం పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టు అయింది. అలా వారు దాన్ని గురించి తప్పుగా మాట్లాడటం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు మన ప్రియమైన ముఖ్యమంత్రి, మన అధికార ప్రతినిధి, అలాగే నిగూఢమైన మన ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ విషయంపై భయకంపిత స్వరంతో మాట్లాడి ఉన్నట్లయితే నేను దానికి ఏమాత్రం భయపడను. బదులుగా ముసి ముసిగా నవ్వుకునేవాడిని. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది!
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది! -
‘జామియా’లో డాక్యుమెంటరీ కలకలం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ప్రకటించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంటరీ ఎందుకొచ్చింది? తిరువనంతపురం: బీబీసీ డాక్యుమెంటరీని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుబట్టారు. ‘జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ తేవడం ఏంటి?’ అని ప్రశ్నించారు. -
బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్!
లండన్: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్ను వేధిస్తున్నాయి. 2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్‌లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు. -
40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్డౌన్ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. (photo cridit BBC) 40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్ స్మిత్(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్ రాన్నోచ్ మూర్ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్ ట్రీగ్‌లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్ మేకర్ లిజ్జీ మెక్కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్లో ‘ట్రైగ్ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు.. డెర్బీషైర్‌కు చెందిన కెన్ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. (photo cridit BBC) 22 వేల మైళ్లు ప్రయాణం... ప్రమాదం కెన్ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్ భూభాగమైన యుకాన్ చేరుకున్నాడు. కెన్ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా.. తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు. (photo cridit BBC) నో గ్యాస్, నో కరెంట్... గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్. గ్యాస్, కరెంట్ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్ పర్సనల్ లోకేటర్ బీకాన్ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్. కాపాడిన జీపీఎస్ పర్సనల్ లోకేటర్.. అయితే 2019లో తొలిసారి కెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్‌మేకర్ లిజ్జీ కెన్ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్ లోకేటర్ టెక్సాస్, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్ కేంద్రానికి ఎస్ఓఎస్ పంపడంతో కెన్ పరిస్థితి గురించి వారికి తెలిసింది. (photo cridit BBC) వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్. చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది... -
మైఖేల్ వాన్‌పై నిషేధం..!
Michael Vaughan Dropped From BBC After Racism Allegations: జాత్యాహంకార ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ వాన్‌పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నిషేధం విధించింది. తమ ఛానల్లో ప్రసారమయ్యే "ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో" నుంచి వాన్‌ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్ మ్యాచ్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో నాటింగ్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీబీసీ చర్యలను వాన్ పూర్తిగా ఖండించాడు. తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. 1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాన్.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాన్ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. వాన్‌పై ఫిర్యాదు చేసిన రఫీక్ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: యార్క్‌షైర్ కౌంటీపై వేటు