ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి కూడా ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో ముగ్గురు భారతీయ మహిళలు. సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కుస్తీ యోధురాలు వినేష్ ఫొగట్ అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ... ఈ ముగ్గురి ఎంపిక ఎందుకో బీబీసీ ఇలా తెలిపింది.
బి.బి.సి బి.బి.సి 2024 సంవత్సరానికి ‘బీబీసీ 100 విమెన్’ లిస్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడపోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి–విద్య, వినోదరంగం–క్రీడారంగం, రాజకీయరంగం, సైన్స్–హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది.
వీరిలో వ్యోమగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పెలికట్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్ అథ్లెట్ బెబాక అండ్రాడె, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టీనా రివెరా గర్జా తదితరులు ఉన్నారు. అలాగే మన దేశం నుంచి అరుణా రాయ్, వినేష్ ఫొగట్, పూజాశర్మలను ఎంపిక చేసింది. ‘ఓర్పు, పోరాట పటిమతో నిలబడి తమ తమ రంగాలలో, సమూహాలలో మార్పు కోసం కృషి చేస్తున్న ధీరలు వీరంతా’ అని బీబీసీ ఈ సందర్భంగా అంది. మన దేశం నుంచి ఎంపికైన ముగ్గురు ఎందుకు ఎంపికయ్యారు?
పూజా శర్మ
Éì ల్లీకి 27 సంవత్సరాల పూజాశర్మ తల ఒంచక న్యాయం వైపు నిలబడి పోరాడటం వల్లే ముందుకు వెళ్లగలరు అని ఈ విధానం వినేష్‡కు ‘చనిపోయిన వ్యక్తిని సగౌరవంగా సాగనంపే సేవ’ చేయాలని తన జీవితంలోని సొంత విషాదం వల్ల గట్టిగా అనిపించింది. ఆమె సోదరుణ్ణి మూడేళ్ల క్రితం ఒక కొట్లాటలో చంపేశారు. ఆ గొడవ వల్ల అతని దహన కార్యక్రమాలకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు పూజాశర్మ తానే పూనుకొని దహన సంస్కారాలు చేసింది.
ఇలాంటి సందర్భాలలోనే పేదరికం వల్ల, ప్రమాదాల వల్ల అనారోగ్యం వల్ల దహన సంస్కారాలకు నోచుకోని అనాథ శవాలను, దిక్కూమొక్కూ లేని శవాలను తానే గౌరవంగా సాగనంపాలని నిర్ణయించుకుంది. వెంటనే ‘బ్రైట్ ది సోలా ఫౌండేషన్’ స్థాపించి ఇప్పటికి వందల శవాలకు దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించింది. ఇందుకు మొదట్లో కొంతమంది నుంచి విమర్శలు ఎదురైనా, ఇది ఆడవాళ్ల పని కాదు అని ఆమెను వారించినా, ఆమె చేసే పనులు సోషల్ మీడియా ద్వారా మద్దతు కూడగట్టుకున్నాయి. సేవారంగంలో ఎంతో మానవీయమైన ఆమె కృషికి నేడు దక్కిన గౌరవం బిబిసి 100లో చేరిక.
అరుణా రాయ్
అరుణా రాయ్ (74) తన జీవితం ఆరంభం నుంచి నేటి వరకూ అట్టడుగు వర్గాల జీవనమార్పు కోసం పోరాడుతూనే ఉన్నారు. ‘పెద్ద ముందంజలు కాదు... ఇరుగు పొరుగువారి చిన్న చిన్న ముందడుగులు అవసరం’ అనే ఆమె తన జీవితమంతా ఆదర్శాల కోసం నిలబడ్డారు. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణ బాల్యం నుంచి ఛాందస భావాలను నిరోధించారు. తన 21 ఏళ్ల వయసులో 1967లో ఐ.ఏ.ఎస్ పరీక్ష రాసి ఎంపికయ్యారు. ఆ రోజుల్లో ఐ.ఏ.ఎస్ రాసే మహిళలే లేరు దేశంలో. 1967లో 10 మాత్రమే ఎంపికైతే వారిలో ఒకరు అరుణ.
తమిళనాడులో కలెక్టర్‌గా పని చేసిన అరుణ గ్రామాలు బాగుపడాలంటే తన ఉద్యోగం పనికిరాదని అట్టడుగు వర్గాల చైతన్యం ముఖ్యమని, వారి ఆర్థిక స్వావలంబన తప్పదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త సంజిత్ రాయ్‌తో కలిసి ‘బేర్‌ఫుట్ కాలేజ్’ స్థాపించి గ్రామీణుల కోసం పని చేశారు. ‘మజ్దూర్ కిసాన్ సంఘటన్’,‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ వీటన్నింటిలో ఆమెవి కీలక బాధ్యతలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉనికిలోకి రావడానికి అరుణ కూడా ఒక కారణం. చైతన్యవంతమైన సమాజం, స్త్రీల హక్కుల కోసం ఆమె చేస్తున్న ఎడతెగని కృషే ఆమెను బీబీసీ 100 విమెన్‌కు చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment