Aruna
-
Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
‘మహిళలు ఐఏయస్ కావడం కష్టం’ అనుకునే ఆ రోజుల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏయస్ సాధించింది. ‘ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడనప్పుడు ఆ ఉద్యోగం చేయడం వృథా’ అనుకొని ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అరుణారాయ్. గ్రామీణ మహిళలతో కలిసి పోయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. తాజా విషయానికి వస్తే... తన జ్ఞాపకాలను ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఉద్యమ ప్రయాణం గురించి...మనం పుట్టి, పెరిగిన వాతావరణం ఏదో రకంగా బలమైన ప్రభావం చూపుతుంది. కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే కుటుంబంలో చెన్నైలో పుట్టి పెరిగింది అరుణ. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది.‘మహిళలు ఐఏఎస్‌కు సెలెక్ట్ కాలేరు’ అని బలంగా అనుకునే కాలంలో తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది. సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. వ్యవస్థీకృతమైన అవినీతికి సంబంధించిన అసంతృప్తి అది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్‌ఫుట్ కాలేజీ)లో చేరింది. రాజస్థాన్‌లోని తిలోనియ గ్రామంలో ఉన్న ‘బేర్‌ఫుట్ కాలేజీ’లో పనిచేయడం అరుణకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాపథంలోకి వచ్చింది.గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం... మొదలైనవి లేని కాలం అది. కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాలేవీ ఎప్పుడూ అరుణకు కష్టంగా అనిపించలేదు. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం అందినప్పటికీ అక్కడికి వెళ్లకపోగా దానికి ప్రత్యామ్నాయంగా రాజస్థాన్‌లో మహిళా మేళ (మహిళల పండగ) నిర్వహించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు, ఈ స్థానిక సదస్సుకు తేడా ఏమిటంటే... మొదటి దానిలో మధ్యతరగతి, ఆ పై తరగతి విద్యాధికులైన మహిళలే ఎక్కువగా పాల్గొనే సదస్సు. ఇక రెండోది పూర్తిగా గ్రామీణ మహిళలు, శ్రామిక మహిళల కోసం నిర్వహించిన సదస్సు. ఈ తరహా పండగ జరగడం దేశంలో మొదటిసారి.‘మహిళ మేళ’ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక–రాజకీయ చర్చలకు వేదిక అయింది. మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి జరిగిన తొలి బహిరంగ చర్చావేదిక అయింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరుణారాయ్ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడింది. ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిస్ట్‌గా మరింత క్రియాశీలంగా పనిచేయడం ్రపారంభించింది.స్థూలంగా చెప్పాలంటే... అరుణా రాయ్ అంటే ఒక నామం కాదు. అనేకానేక ఉద్యమాల సమాహారం. సమాజహితాన్ని కోరుకునే వారికి స్ఫూర్తిదాయక ఉత్తేజం.పేద మహిళల కోసం...‘జ్ఞానం యొక్క ఉద్దేశం జ్ఞానం కాదు. కార్యాచరణ’ అంటాడు అరిస్టాటిల్. జ్ఞానం అనేది బుర్రలో భద్రపరుచుకొని మురిసిపోవడానికి కాదు. ఆ జ్ఞాన ఫలాలను ఆచరణలోకి, పదిమంది ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి మారు మూల పల్లెల వరకు జ్ఞానమార్గంలో పయనించిన అరుణా రాయ్ ఆ జ్ఞానాన్ని పేద మహిళల సంక్షేమం, చైతన్యం కోసం వినియోగించింది. ఉద్యోగ, ఉద్యమ జ్ఞాపకాల ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ ఆమె వ్యక్తిగతం కాదు. సామాజికం. ఉద్యమ బాటలో పయనించడానికి ఉపకరించే ఇంధనం. -
సినిమాల్లోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ?
ముచ్చెర్ల అరుణ.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. తన సినీప్రయాణం మొదలైంది మాత్రం తమిళ సినిమాతోనే! 1980లో కళుక్కుల్ ఈరమ్ అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. అలా రావుగారి ఇంట్లో రౌడీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. బిజినెస్‌మెన్‌తో పెళ్లి ఆమె హీరోయిన్గా నటించిన సీతాకోక చిలుక మూవీ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఈ కథానాయిక 1987లో బిజినెస్మెన్ మోహన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని ఆయన కండీషన్ పెట్టాడట! దానికి ఒప్పుకునే పెళ్లి చేసుకుంది. వీరికి నలుగురు ఆడపిల్లలు. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీకి దూరమైంది. అలా ఆమె సినిమాలకు దూరమై దాదాపు పాతికేళ్లవుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వంటలు చేస్తూ, రీల్స్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఓ నగల దుకాణానికి వెళ్లిన ఆమెకు రీఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై అరుణ మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తాను. నా కూతుర్లు బిజీగా ఉండటంతో నా వీడియోలు తీయడం లేటవుతోంది. వీడియోల కోసం ప్రత్యేకంగా రెడీ అవడం, మేకప్ లాంటివేమీ ఉండదు. ఫోన్లోనే చాలా సహజంగా వీడియోలు చేస్తుంటాను. నాకిది చాలనిపిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అని అరుణ చెప్పుకొచ్చింది. చదవండి: 18 ఏళ్ల వయసులో అలా చెప్పా.. ముద్దు సీన్‌పై అనుపమ రియాక్షన్ -
వివాహానికి హాజరై తిరిగొస్తుండగా..
శ్రీపొట్టి శ్రీరాములు: రోడ్డు ప్రమాదం పెళ్లింట అంతులేని విషాదాన్ని నింపింది. వివరాలు.. కందుకూరు పట్టణంలోని విప్ప గుంటలో నివాసముంటున్న రాయని అరుణ (50), రమణయ్య భార్యాభర్తలు. రమణయ్య సుమారు 20 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోవూరు రోడ్డులో టిఫిన్ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో కుమార్తె స్రవంతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అశేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పాల్వంచలోని వరుడి ఇంట్లో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అరుణతో పాటు కుమారుడు వేణుగోపాల్, మేనల్లుడు వినోద్, అతని భార్య తల్లపనేని దివ్య (30), వారి కుమారుడు మణి, మరో బంధువు గుళ్లాపల్లి శ్రావణి (22) కలిసి కారులో కందుకూరు బయల్దేరారు. వాహనాన్ని వేణుగోపాల్ నడిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరారెడ్డిపాళెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో అరుణ, దివ్య, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్, వినోద్, మణి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అంతలోనే.. అప్పటి వరకు పెళ్లిలో ఆనందంగా గడిపిన వారు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి, బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసి కొత్త పెళ్లి కూతురు స్రవంతి కన్నీరుమున్నీరయ్యారు. దివ్య భర్త వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త, తన ఐదేళ్ల కుమారుడు మణితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. మేనత్త కుమార్తె వివాహం కావడంతో వినోద్ కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితమే కందుకూరొచ్చారు. అయితే ఊహించని ప్రమాదంలో దివ్య మృతి చెందారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి మృతి చెందడం తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మికి మింగుడు పడని ఘటనగా మారింది. శ్రావణి కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. స్రవంతి పెళ్లి కోసమని శ్రావణి కందుకూరు వచ్చారు. ఇక స్రవంతి సొంత అన్న వేణుగోపాల్ కొద్దిరోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. విశ్రాంతి తీసుకోకుండా అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేస్తూ రావడం.. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అటు తల్లిని కోల్పోయి, ఇటు అన్న హాస్పిటల్ పాలవడంతో స్రవంతి రోదన వర్ణానాతీతంగా ఉంది. మృతదేహాలను గుర్రవారంపాళెం సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున బంధువులు చేరుకున్నారు. ఇవి చదవండి: కట్టేసి, కారం చల్లి.. -
ఎంవీఎస్ కాలేజ్ లో ని మార్నింగ్ వాకర్స్ తో డీకే అరుణ ప్రచారం
-
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
ఆక్రమణలు తొలగించినా సీఎం పైనే నెపం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించడం ఈనాడు పత్రికకు అలవాటుగా మారింది. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణదారులకు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబితే ‘సీఎం వస్తున్నారు.. దుకాణాలు తొలగించాల్సిందే’ అంటూ ఈనాడులో వార్త ప్రచురించారు. చిత్తూరు – వేలూరు రోడ్డులో విజయా డెయిరీని ఆనుకుని పది దుకాణాలు వెలిసాయి. నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వ్యాపారులు కూడా ఆ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించారు. దీనిని వక్రీకరిస్తూ ఈనాడులో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు బలవంతంగా దుకాణాలను తీసేయిస్తు న్నారని రాసుకొచ్చారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తే సీఎం పర్యటనకు ఆపాదిస్తూ రాయడం మంచిదికాదని కమిషనర్ అరుణ అన్నారు. -
రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు..
సాక్షి,బళ్లారి: ఇంటి ఆడచులా భావించి తనను గెలిపించాలని కేఆర్పీపీ బళ్లారి నగర అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజైన సోమవారం ఆమె నగరంలో పలు వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. నా పేరు గాలి లక్ష్మీ అరుణ, ఈవీఎంలో నా క్రమ సంఖ్య–8, ఇది అష్టలక్ష్మీలకు సంకేతం, తనను గెలిపిస్తే ప్రతి ఇంటా సమస్యలు తీర్చేందుకు అష్టలక్ష్మీల ఆశీర్వాదం ఉంటుందని ఓటర్లకు సూచించారు. 30 సంవత్సరాల క్రితం గాలి జనార్దనరెడ్డి సతీమణీగా బళ్లారికి వచ్చానని, ఇంటికి పరిమితమైన తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఎమ్మెల్యే కావాలనుకుంటే భర్త గాలి జనార్దనరెడ్డి ప్రోత్సాహంతో ఎప్పుడో అసెంబ్లీలోకి కాలుపెట్టే భాగ్యం కలిగేదన్నారు. రాజకీయ కుట్రతో తన భర్తను 12 సంవత్సరాలు వనవాసం చేయించారని, ఆయన ఆశయ సాధనలు, బళ్లారి ప్రజల కన్నీరు తుడిచేందుకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అనివార్యమైందన్నారు. తమ కుటుంబానికి భగవంతుడు అన్ని ఐశ్యర్యాలు ఇచ్చారన్నారు. ఒక రూపాయి కూడా ప్రజాధనాన్ని తాము తీసుకోకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మీ ఆశీస్సులు అందించి ఫుట్‌బాల్ గుర్తుకు ఓటెసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో కేఆర్పీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వీ. శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రహ్మణీ, కార్పొరేటర్లు కే.ఎస్ ఆశోక్,కోనంకి తిలక్, మాజీ మేయర్ వెంకటరమణ, నాయులు సంజయ్ బెటగేరి పాల్గొన్నారు. -
కర్ణాటకలో కొత్త పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి..
-
టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన
మధురవాడ (భీమిలి) : తెలుగుదేశం పార్టీలోని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, ఆ విషయాన్ని పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ వెల్లడించారు. విశాఖలోని మధురవాడకు చెందిన తాను పదేళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నానన్నారు. బీసీ మహిళా నాయకురాలినైన తనకే ఈ పరిస్థితి ఎదురైందని, టీడీపీలో మహిళలకే కాదు.. మహిళా నాయకురాళ్లకు కూడా రక్షణ కరువైందని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చురుగ్గా ఉంటున్న తనను కర్నూలుకు చెందిన నేత ఏడాది నుంచి లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆ నేత లైంగిక వేధింపులు తాళలేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు మరికొందరు ముఖ్య నాయకులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. పైగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, ఇతర నేతలు తనను వేధిస్తున్న వ్యక్తికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో ఈ నేతల వైఖరితో మనస్తాపం చెంది రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అరుణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అరుణ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించినట్టు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్‌గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్‌లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
రోడ్డు మీద 500లకు బిర్యానీ మొమోలను అమ్ముతూ.. అంచెలంచెలుగా ఎదిగి!
చిన్నప్పుడు అమ్మ అమ్మమ్మ, బామ్మల దగ్గర నేర్చుకున్న ఎన్నో విషయాలను జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు చాలామంది. వారి దగ్గర నేర్చుకున్న విషయం ఎంత చిన్నదైనా, దానికి ఎంతో విలువనిస్తారు. ఇలా చిన్ననాటి బామ్మల వంటకాలను దగ్గర నుంచి చూసిన అరుణా టిర్కీ.. ఆ వంటకాలతో ఏకంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. కనీస అవగాహన లేని వ్యాపారంలో అడుగుపెట్టినా అందులో చక్కగా రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. జార్ఖండ్‌లో పన్నెండు మంది సంతానం ఉన్న అతిపెద్ద గిరిజన కుటుంబంలో పుట్టింది అరుణా టిర్కీ. తల్లిదండ్రులతో పద్నాలుగు మంది ఉన్న కుటుంబం. తల్లిదండ్రులు టీచర్లుగా పనిచేసేవారు. ఉన్నత విద్య వరకు బాగానే చదివించారు. వారి ప్రోత్సాహంతోనే నెట్ రాసిన తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. రూరల్ డెవలప్మెంట్ చదివిన ఆరుణ ఆదివాసీల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులో ఉద్యోగిగా చేరి కొన్నేళ్లపాటు గిరిజనలు అభివృద్ధికోసం పాటుపడింది. కొడుకు కోసం ఉద్యోగం వదిలి... ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కులాంతర వివాహం చేసుకుంది అరుణ. ఈ పెళ్లి ఇష్టంలేని తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తరువాత చేరదీశారు.పెళ్లైన ఏడాదికే అరుణకు బాబు పుట్టాడు. దీంతో బాబుని చూసుకునేందుకు తన ఉద్యోగం వదిలేసి పూర్తిసమయాన్ని కొడుకుకి కేటాయించింది. రెండేళ్లు వచ్చిన పిల్లలందరిలా కొడుకు ప్రవర్తించేవాడు కాదు. ‘అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్’ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాధనంతటినీ కడుపులో దాచుకుని తన కొడుకు సమస్యను తగ్గించేందుకు ఆదివాసీ ఆహార పదార్థాలను మాత్రమే తినిపించేది. దీంతో ఆరు నెలల్లోనే అతని ప్రవర్తన సాధారణ స్థితికి చేరింది. ఆర్థిక ఇబ్బందులతో.. కొడుకు ఆరోగ్యంగా బావున్నాడు అనుకున్న కొద్దిరోజులకే అరుణకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అరుణ ఉద్యోగం మానేయడం, భర్త ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడంతో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఏం చేయాలా... అని ఆలోచిస్తోన్న సమయంలో... బిర్యానీ, మొమోలు విక్రయిస్తే బావుంటుందన్న ఆలోచన వచ్చింది అరుణకు. పుట్టిల్లు, అత్తారింట్లో ఎక్కువమందికి వండిపెట్టిన అనుభవంతో రోజుకి మూడు గంటలపాటు రోడ్డు మీద రూ.500లకు బిర్యానీ మొమోలను విక్రయించేది. ఈ పనిచేయడం ఇష్టంలేని కుటుంబ సభ్యులు ఆమెకు సాయం చేయకపోగా, నిరుత్సాహపరిచేవారు. అయినా అరుణ తాను అనుకున్నది చేసుకుంటూ పోయేది. వెరీ టేస్టీ.. అరుణ బిర్యానీకి మంచి ఆదరణ లభించడంతో.. ‘అజం ఎంబా’ అనే పేరుతో ఐదువేల రూపాయల పెట్టుబడితో 2016లో రాంచీలో రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఆదివాసీ భాషలో అజం ఎంబా అంటే ‘వెరీ టేస్టీ’ అని అర్థం. ఎక్కువగా ఆదివాసీలు తినే ఆహార పదార్థాలను విక్రయించడంతో అతికొద్ది కాలంలోనే రెస్టారెంట్‌కు మంచిపేరు వచ్చింది. గిరిజనేతరులు సైతం ఇక్కడి ఆహార పదార్థాలను రుచి చూడడానికి ఆసక్తి చూపడంతో రెస్టారెంట్ బాగా నడుస్తోంది. సంప్రదాయ ఇంటి భోజనం సంప్రదాయ వంటకాలు మదువ రోటి, దుస్కా, ఖుక్డీ, రుగాడ, బ్యాంబూ కర్రీ, పితా, ట్వీజర్ గ్రీన్స్, పుత్కల్ గ్రీన్స్, డాకాక్షాన్, సూప్ వంటి గిరిజన వంటకాలను ఆకు వేసి వడ్డించడం, ఇంట్లో తిన్నట్లుగా చాపమీద భోజనం చేయడం కస్టమర్లను బాగా ఆకర్షించాయి. వీటితోపాటు గిరిజన సంగీతం ఎంతో వినసొంపుగా వినిపించడం, కాలానికి తగ్గట్టుగా వంటకాలు అందించడం ఇక్కడి ప్రత్యేకం. గిరిజనుల మార్కెట్ నుంచి కూరగాయల సేకరణ, రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగులంతా ఆదివాసీ మహిళలు కావడం విశేషం. నైపుణ్యం గల చెఫ్‌లు లేకపోయినప్పటికీ స్థానిక గిరిజన మహిళా ఉద్యోగులతో ఈ రెస్టారెంట్ నడుస్తోంది. నలభై మంది కూర్చుని తినగల అంజా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఆహారాన్ని ఆర్డర్ల మీద అందిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ దొరకదు కాబట్టి.. ‘‘ నేను చిన్నప్పటి నుంచి గిరిజన సంస్కృతి సంప్రదాయాలు చూసి పెరిగాను. చిన్నప్పుడు మా బామ్మల దగ్గర గిరిజన వంటకాలు చేయడం నేర్చుకున్నాను. హోటల్ పెట్టాలనుకున్నప్పుడు ఏమేం ఆహార పదార్థాలు విక్రయించాలని ఆలోచిస్తున్నప్పుడు... ‘ఇక్కడ ప్రస్తుతమంతా ఫాస్ట్‌ఫుడ్స్‌వైపే ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించే గిరిజన ఆహార పదార్థాలు విక్రయిస్తే బావుంటుంది’ అనిపించింది. నా కొడుకు ఆరోగ్య సమస్య కూడా ఈ ఆహార పదార్థాలతోనే నయం అయింది. అందుకే సంప్రదాయ ఆహారపదార్థాలను విక్రయించాలని నిర్ణయించుకున్నాను. రొటీన్‌కు భిన్నంగా ఉండే చిరుతిళ్లకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందన్న నమ్మకంతో ఈ వ్యాపారంలో దిగాను. అనుకున్నట్టుగానే రెస్టారెంట్ బాగా నడుస్తోంది. ఒకపక్క గిరిజన సంప్రదాయక వంటకాలను ప్రోత్సహిస్తూనే, స్థానిక ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ – అరుణా టిర్కీ -
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా? ఈ ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడేం చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్‌నైట్ స్టార్డడమ్ సంపాదించుకుంది అరుణ. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. చటంబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తాచాటింది. అయితే హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే బిజినెస్‌మ్యాన్ మోహన్గుప్తను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికి నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇందులో వంటలు, హెల్తీ లైఫ్, వర్కవుట్స్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్‌లోకి రావడంతోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) -
టీఆర్ఎస్లోకి బీజేపీ ఎంపీటీసీ అరుణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో నందిపేట బీజేపీ ఎంపీటీసీ అరుణ చావన్ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. అరుణతో పాటు బీజేపీ నేతలకు కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నంది పేట జెడ్పీటీసీ యమున ముత్యం, ఎంపీటీసి మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం పాల్గొన్నారు. -
కేసీఆర్ వైఫల్యంతోనే పాలమూరుపై ఎన్జీటీ స్టే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించడానికి సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. పాలమూరుపై ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ
సాక్షి, రాజమండ్రి : మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ చలపతి భార్య అరుణను అంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెదబైలు దళానికి చెందిన సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఆమెను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక గతవారం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ కూడా ఉన్నట్లు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే అరుణ ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. కానీ ఆ వార్తలు అవాస్తమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆరుణ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. విశాఖ మన్యంలో కూంబింగ్ కొనసాగుతోంది: డీజీపీ సాక్షి, అమరావతి : విశాఖ మన్యంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్ భవాని గాయాలతో పోలీసులకి పట్టుబడినట్లు తెలిపారు. మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ మెంబర్ జగన్ భార్య భవాని అని, పెదబైలు ఏరియా కమిటీ మెంబర్‌గా భవానీ పనిచేస్తోందన్నారు. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో ఆమె పనిచేసిందన్నారు. భవానిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు డీజీపీ వివరించారు. -
అగ్రనేత అరుణ ఎక్కడ?
సాక్షి, సీలేరు (పాడేరు): ఏవోబీలోని మహిళా మావోయిస్టుల విభాగంలో అరుణ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు అరుణ ఎవరు, ఉద్యమంలో ఆమె బాధ్యత ఏమిటీ, అరుణ కోసం ఏడాదిగా పోలీసు బలగాలు ఎందుకు గాలింపు చేపడుతున్నాయి అన్న ప్రశ్నలు ఏవోబీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో ఆమె ఉందని ప్రచారం కూడా సాగింది. అయితే ఎదురుకాల్పుల్లో ఆమె లేకపోవడంతో పోలీసు బలగాలు అరుణకోసం జల్లెడపడుతున్నాయి. పెందుర్తి మండలం సుజాతనగర్‌కు చెందిన అరుణ, ఆమె కుటుంబం కూడా మావోయిస్టుల ఉద్యమం నుంచి ఉన్నారు. అరుణ చిన్న వయసులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైంది. ఏడాది క్రితం గూడెం మండలం మర్రిపాకల ఎన్కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత ఆజాద్ సొంత చెల్లెలు ఈమె. అరుణ ఫొటో రాంగుడ ఎన్కౌంటర్లో లభ్యమైన ల్యాబ్‌ట్యాప్‌లో కనిపించింది. ఆమె పేరు తప్ప ఆమె ఎలా ఉంటుందనేది అప్పుడే వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ అయిన చలపతి భార్య అరుణ. ప్రస్తుతం అరుణ పార్టీలో కీలక పదవిలో ఉంది. చలపతి భార్య కావడం, తూర్పు మల్కన్‌గిరి డివిజన్ కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఏకే47 తుపాకీ వాడుతున్నట్లు మాజీ మావోయిస్టుల ద్వారా తెలిసింది. అలాగే ఆమెకు ఆరుగురు అంగరక్షకులు కూడా ఉన్నట్లు సమాచారం. కిడారి, సోమ హత్యల ఘటన నుంచి.. రాంగుడ ఎదురుకాల్పుల నుంచి అరుణ బయట ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అందరి మావోయిస్టుల్లాగే పోలీసులు చూసే వారు. కానీ ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అప్పటి నుంచి ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం ఏడాదిగా.. మాజీ ఎమ్మెల్యేల హత్య సంఘటనల నుంచి అరుణ కోసం బలగాలు అడవిలో తిరగని రోజు లేదు. ఎప్పుడు దొరుకుతుందా అని తుపాకీలు ఎక్కుపెట్టి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టుల్లో తొలుత ఆమె ఉందని ప్రచారం జరిగింది. ఆమె లేకపోవడాన్ని గుర్తించిన పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. గాలికొండ ఏరియా కార్యదర్శి హరి గూడెం మండలం గునుకురాయి ప్రాంతానికి చెందిన వాడు. అయితే ఇటీవల అరుణ ఆడియో టేపు రిలీజ్ చేసినపుడు అగ్రనేత నవీన్‌తో పాటు హరి కూడా లొంగిపోయాడని, తిరిగి ఉద్యమంలోకి ఎలా వచ్చాడని చెప్పింది. కానీ మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో హరి కూడా ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం హరి పార్టీలో ఉన్నాడా?.. బయట ఉన్నాడా? అనేది ప్రశ్నగానే మిగిలింది. పత్రికలకు అబద్ధం చెప్పను ప్రస్తుతం జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. దీనిపై చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్‌ను వివరణ కోరగా ప్రతికలకు అవాస్తవాలు చెప్పడం లేదని, అరుణ మా దగ్గర లేదని, ఎదురుకాల్పుల్లో 15 మంది ఉన్నారని, వీరిలో ఐదుగురు చనిపోయారని మిగిలిన వారు తప్పించుకున్నారన్నారు. అందులో అరుణ ఉందో లేదో బలగాలు కూడా చూడలేదని వివరణ ఇచ్చారు. తమకు ఎవరైనా దొరికితే అప్పుడు అరుణ ఉందో లేదో తెలుస్తుందన్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదని ఏఎస్పీ చెప్పారు. – సతీష్‌కుమార్, చింతపల్లి ఏఎస్పీ -
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఆమె మృతిపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా గతంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన నేత కిడారి సర్వేశ్వరరావు ఎన్కౌంటర్లో అరుణ క్రియాశీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య కిడారి హత్యకు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావించారు. ఆ తరువాత ఆమెపై అనేకసార్లు ఎదురుకాల్పులు జరిపినప్పటికి అరుణ తప్పించుకున్నారు. అయితే తాజాగా ధారకొండలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెంది ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. కాగా తాజా ఘటనతో విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూ ఉండటంతో.. ఏవోబీలో అధికారలు హై అలర్ట్ ప్రకటించారు. చదవండి: విశాఖలో భారీ ఎన్కౌంటర్ -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
వంచించాడు... యాసిడ్‌తో దాడి చేశా!
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : నన్ను పెళ్లి చేసుకుంటానని వంచించాడు.. ఏడాది పాటు నాతో సాన్నిహిత్యంగా మెలిగి తరువాత వదలించుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న నా భర్త ఏడుకొండలను నా చేతే డాక్టర్ ఆదర్శ్ చంపించాడు.. అంటూ తిరుపతి కోర్డు ఆవరణలో డాక్టర్ ఆదర్శ్‌పై యాసిడ్ దాడిచేసిన నర్సు అరుణ (35) వెల్లడించింది. యాసిడ్ దాడి అనంతరం ఆమె పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యాహ్నం కోలుకున్న తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌పై యాసిడ్ దాడికి కారణాలను ఆమె మాటల్లోనే.. ‘‘రెండేళ్ల క్రితం డాక్టర్ ఆదర్శ్‌తో పరిచయమైంది. తిరుపతిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అతనితో పాటు నర్సుగా పనిచేశాను. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురంలో నివాసం ఉంటున్నాను. నా భర్త అనారోగ్యానికి తోడు కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకుని డాక్టర్ ఆదర్శ్ నాకు దగ్గరయ్యాడు. తోడుగా ఉంటానని.. తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. అనారోగ్యంతో ఉన్న నా భర్త తాగుడుకు బానిస కావడంతో నాచేతనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేలా చేశాడు. ఏడాది పాటు నాతో లివింగ్ రిలేషన్ పెట్టుకుని మోసం చేశాడు. అప్పట్లో ఆదర్శ్‌పై ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆదర్శ్ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో వాయిదాకు వస్తాడని తెలుసుకున్నా.. అతన్ని నడిరోడ్డులో చెప్పుతో కొట్టి యాసిడ్ తాగి చనిపోవాలనుకున్నా.. అయితే డాక్టర్ ఆదర్శ్ నన్ను చూసి పరుగెత్తాడు. దీంతో యాసిడ్‌తో దాడి చేయాల్సి వచ్చింది. ఆ తరువాత నేను పురుగుల మందు తాగాను..’’ ఆదర్శ్‌ను శిక్షించాలి డాక్టర్ ఆదర్శ్ నాలాగా మరో ఐదుగురిని మోసం చేసినట్లు తెలిసింది. అటువంటి వ్యక్తిని నడిరోడ్డులో నిలబెట్టాలి. అప్పుడే నాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. పోలీసులు ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి శిక్షించాలి. కోలుకుంటోంది అరుణ పురుగుల మందు తాగడంతో అపస్మార స్థితిలోకి వెళ్లిందని, ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందివ్వడంతో కోలుకుంటోందని రుయా ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతోందని చెప్పారు. -
ఊపిరి ఆడక కువైట్‌లో మహిళ మృతి
కడప కార్పొరేషన్ : రైల్వేకోడూరు నియోజకవర్గం టీ కమ్మలపల్లెకు చెందిన పంట అరుణమ్మ కువైట్‌లో మృతి చెందిందని వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలాయాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన రమణమ్మ చలికి తట్టుకోలేక ఎలక్ట్రానిక్ హీటర్ వేసుకోవడంతో ఊపిరి ఆడక ఈనెల 3న చనిపోయిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలం పంపించేందుకు అంబేడ్కర్ సేవా సమితి ద్వారా ఇమ్మిగ్రేషన్, భారత రాయబార కార్యాలయంలో పనులన్ని పూర్తి చేసి ఎయిర్ ఇండియా ప్లైట్‌లో ఈనెల 26న పంపించారు. చెన్నై నుంచి టీ కమ్మపల్లె వరకు రాజంపేట మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అరుణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ నాయకులు నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
చలపతే.. యాక్షన్ దళపతి!
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు.. కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధుల సాక్షిగానే... ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్‌పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్‌లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా? స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి.