అత్తగారి ఇంటి ఎదుట మహిళ ఆందోళన
♦ న్యాయం చేయాలని డిమాండ్
♦ మద్దతు తెలిపిన మహిళా సంఘాలు
నేరేడుచర్ల (హుజూర్‌నగర్) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత తన అత్తగారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ స సంఘటన మంగళవారం మండలంలోని కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఆందోళనకు సూర్యాపేటకు చెందిన మహిళా సంఘాలు మద్దతు పలికారు.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అరుణకు నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బుడిగె నాగరాజుతో 1998లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. పెళ్లయిన కొద్దికాలం వరకు మంచిగానే సాగిన వీరి సంసారంలో విబేధాలు రావడంతో భార్యభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. 2008లో అదనపు కట్నం కోసం వేధిం చాడని నాగరాజుపై అరుణ కేసు పెట్టి కోర్టును ఆశ్రయిం చింది. ఆనాటి నుంచి అరుణ పుట్టింట్లోనే ఉంటోంది.
నాగరాజు పిల్లలిద్దరిని చదివించుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ నేపథ్యంలో అరుణ మంగళవారం తనను ఆదరిచాలని తన పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి ఇంటి ఎ దుట బైఠాయించింది. ఈమె ఆందోళనకు మహిళా సం ఘా ల మద్దతు తెలిపాయి. ఆందోళన జరుగుతున్న సమయంలో తన భర్త అందుబాటులో లేడు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆం దోళన చేస్తున్న మహిళలను స్టేషన్‌కు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలని సూచించడంతో స్టేషన్‌కు తరలివెళ్లారు.