చెరువులో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
చెరువులో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లగొట్టపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అరుణ (30) అనే మహిళ దుస్తులు ఉతుక్కునేందుకు చెరువు దగ్గరకు వెళ్లగా కాలు జారి నీటిలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.