
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని కొండమిట్టలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు.
తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి, యువకులను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
కాగా మృతురాలు చిత్తూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ నాగరాజు కూమార్తెగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతరులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక యువకుడే దాడి చేశాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
చదవండి: 'నేను డేంజర్‌లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో..
Comments
Please login to add a commentAdd a comment