
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు. దీంతో మామ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న కొవ్వురు డీఎస్పీ వీఎస్ వర్మ, సీఐ వైవీ రమణ..సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అల్లుడి దాడిలో మృతిచెందిన మామను రాయంకుల శ్రీరాకృష్ణగా, గాయాలైన అత్త బేబీ(61)గా గుర్తించారు. అల్లుడిని దొమ్మేరుకు చెందిన నందిగం గోపి(42)గా తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
చదవండి: విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు..
Comments
Please login to add a commentAdd a comment