in laws
-
షాకింగ్: భార్యను రీల్స్ చేయొద్దన్నందుకు.. అల్లుడిని చంపేసిన అత్తమామలు
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయవద్దని చెప్పినందుకు భర్తను అతడి అత్తమామలు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు ఓ భర్త. ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లోని ఫఫౌట్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. 25 ఏళ్ల మహేశ్వర్ కుమార్ రాయ్‌కు ఆరేళ్ల క్రితం రాణి కుమారితో వివాహమైంది. వీరికి అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు. మహేశ్వర్ కోల్‌కతాలో కూలీగా పనిచేస్తున్నాడు. రాణికి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ఇష్టం. పలు వైరల్ అయిన రీల్స్‌ను ఆమె కూడా ప్రయత్నిస్తుంటారు. మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 500 రీల్స్‌ను పోస్టు చేశారు. ఇటీవల భర్త కోల్‌కతా నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యకు రీల్స్ చేయడంపై ఆసక్తి ఉన్న విషయాన్ని తెలుసుకొని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి అతడు తన అత్తమామ ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా భార్య రీల్స్ విషయమై గొడవ జరిగింది. అనంతరం పని నిమిత్తం మహేశ్వర్ సోదరుడు రుడాల్ అతనికి ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన రుడాల్, తన కుటుంబంతో కలిసి సోదరుడి అత్తమామల ఇంటికి చేరుకోవడంతో అక్కడ మహేశ్వర్ రాయ్ మృతిచెందడాన్ని గుర్తించారు. అయితే రీల్స్ చేయడానికికి అభ్యంతరం చెప్పడంతో కొడుకుని ఉరేసి చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో వారు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు! -
విడాకులు తీసుకున్న కూతుర్ని మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి
అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. కానీ సమాజం, చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఏదైనా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోమ్మని సలహా ఇస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అత్తింట్లో కూతురి కష్టాలు చూడలేక విడాకులు తీసుకుంటానన్న ఆమె నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా దీన్ని ఒక వేడుకలా నిర్వహించి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లంటే నూరేళ్ల పండుగ. కానీ అందరి జీవితాల్లో అది నిజం కాదు. పెళ్లితో మరింత అందంగా మారిపోతుందనుకున్న జీవితం తలకిందులైతే? ఆ బాధ వర్ణణాతీతం.మరోవైపు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించిన ఆ తండ్రికి అత్తగారింట్లో కూతురు ఆనందంగా లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు. అయితే అప్పటికే భర్తతో ఇక కలిసి ఉండలేనంటూ కూతురు తీసుకున్న విడాకుల నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా ఘనంగా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. వివాహం సమయంలో నిర్వహించిన ఊరేగింపు మాదిరిగానే బ్యాండు బాజాలు, టపాసుల చప్పుళ్ల మధ్య ఆమెకు స్వాగతం పలికారు. బాణసంచా సందడి మధ్య ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..రాంచీలో కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు.ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అతడు అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని,అంతేకాకుండా అతడికి ముందే వివాహం అయినట్లు తెలిసి షాక్ అయ్యామని ప్రేమ్ గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దల సమక్షంలో అతడితోనే బంధం కొనసాగించాలని కూతురికి సర్దిచెప్పామని, అయినా అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భర్త నుంచి విడిపోవాలని తన కూతురు నిర్ణయం తీసుకుందని, దీన్ని తాము కూడా అంగీకరించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే సాక్షిని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చేందుకు బరాత్ మాదిరిగా ఊరేగింపు చేశామని అన్నారు. ప్రస్తుతం విడాకుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
హిమాచల్‌లో దారుణం.. కోడలి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి
హిమాచల్ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో ఆగస్టు 31 జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసుంది. అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అత్తమామలతో సహా అయిదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహామైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన ఇంటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాగానే అత్తమామలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకుంటున్నామని హమీర్పూర్ ఎస్పీ ఆకృతి శర్మ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, కేసును విచారిస్తున్న అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపారు. ఈ కేసులో బాధిత మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నామని, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఈ అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది. శాంతిభద్రతలు పూర్తిగా స్తంభించాయని హిమాచల్ బీజేపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు. ఎలాంటి భయం లేకుండా సంఘ వ్యతిరేకులు నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. मुख्यमंत्री सुखविंदर सुक्खू जी के गृह जिला में मानवता शर्मसार।#जनता_विरोधी_कांग्रेस_सरकार #कांग्रेस_का_कुप्रशासन#Congress #bhoranj#Hamirpur #cmsukkhu #himachal #himachalpradesh pic.twitter.com/g1jQvi0cYk — BJP Himachal Pradesh (@BJP4Himachal) September 15, 2023 -
అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది. శశికళను మామ దేవేందర్‌రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్‌రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్‌కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
కొవ్వూరులో దారుణం.. సిలిండర్‌తో అత్తమామలపై అల్లుడి దాడి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు. దీంతో మామ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కొవ్వురు డీఎస్పీ వీఎస్ వర్మ, సీఐ వైవీ రమణ..సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అల్లుడి దాడిలో మృతిచెందిన మామను రాయంకుల శ్రీరాకృష్ణగా, గాయాలైన అత్త బేబీ(61)గా గుర్తించారు. అల్లుడిని దొమ్మేరుకు చెందిన నందిగం గోపి(42)గా తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు.. -
మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లవ్ ఎఫైర్లు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ విలువలను మంటగొలిపి మహిళలు, పురుషుల అన్న సంబంధం లేకుండా ఇరువురు చేస్తున్న పనులు యావత్తు కుటుంబం తలెత్తుకోలేని స్థితిని ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని రాట్లం గ్రామంలో 30 ఏళ్ల మహిళ భర్త, అత్తమామాలతో కలిసి ఉంటుంది. ఐతే ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేయమని పిలిచినప్పటికీ ఆమె రానని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఆమె భర్త అత్తమామలు ఆ గ్రామంలో ఉండలేక ఆ ఇంటికి తాళం వేసి మరో ఊరు వెళ్లిపోయారు. ఐతే సదరు మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్త ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ ఇంటికే మకాం మార్చి అక్కడే ఉంటోంది. ఈ విషయం ఇరుగుపొరుగు వారి సాయంతో తెలుసుకున్న ఆమె భర్త అత్తమామలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో ఆ మహిళ ఇంటి వద్దకు వచ్చి ఆమెను చెట్టుకు కట్టి.. ఘోరంగా కర్రలతో దాడి చేశారు ఆమె భర్త, అత్తమామలు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. సమయానికి పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలికి రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం సదురు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సదరు మహిళ భర్త, అత్తమాహాలు, మరో ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్..) -
‘ఇండియాలోని అత్తమామలు ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు’
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం చాలా మంది విదేశాలకు వెళుతుంటారు. మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో అక్కడే స్థిరపడుతుంటారు. కష్టమైనా సరే పుట్టిన ఊరు,కుటుంబానికి దూరంగా జీవిస్తుంటారు. భారత్ నుంచి కూడా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు పయనమవుతుంటారు. ఎవరైనా విదేశాల్లో ఉంటున్నారనగానే లక్షలు, కోట్లలో డబ్బులు సంపాదిస్తుంటారనే ముందుగా అందరూ అనుకుంటారు. కానీ అందరి పరిస్థితి అలా ఉండదు. అక్కడికి వెళ్లి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జామ్‌లు చేస్తుంటారు. ఈ కష్టాలన్నీ ఊర్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియవు. తాజాగా ఓ కెనడియన్ మహిళ కథ వింటే మీకే అర్థమవుతుంది. కెనడాకు చెందిన మహిళ ఇండియన్ వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. మరికొన్ని వారాల్లో ఆ మహిళ తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది ఈ జంట. ఇంకా బిడ్డ పుట్టాక ఖర్చులు పెరుగుతాయి. ఈ క్రమంలో ఇండియాలో నివసిస్తున్న తమ అత్త మామలు ఐఫోన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆ మహిళ వాపోయింది. ఈ మేరకు తన ఇబ్బందికరమైన సరిస్థితిని రెడిస్ట్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. ‘నేను కెనడియన్ మరియు నా భర్త భారతీయుడు. మేము కెనడాలో నివసిస్తున్నాము. అతని కుటుంబం భారతదేశంలో ఉంది. మేము మా మొదటి బిడ్డను కొన్ని వారాల్లో స్వాగతిస్తాము. కెనడాలో నివసిస్తున్నందున మేము ధనవంతులమని నా భర్త కుటుంబం ఆలోచిస్తుంది. నిజానికి మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మా దగ్గర వాళ్లు అనుకుంటున్నంతా డబ్బులు లేవు. అంతేగాక త్వరలో బిడ్డ వస్తుండటంతో ఖర్చులు కూడా తగ్గించాం. కానీ వాళ్లు అది అర్థం చేసుకోవడం లేదు. మా అత్త మామలు వారికి 2 ఐఫోన్లను బహుమతిగా ఇవ్వాలని అడిగారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేని సమయంలో నా భర్త కూడా వారికి కొనిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది తెలిసి నేను షాకయ్యా. పిల్లలు పుట్టే ముందు ఇలాంటి పెద్ద బహుమతులు అడగటం సాధారణమేనా. అత్తమామల పట్ల వారి సంస్కృతి, సంప్రదాయాలు నాకు పెద్దగా తెలీవు. ఇవి చాలా సున్నితంగా విషయాలని నేను భావిస్తున్నాను. నా సమస్యేంటో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ’ అంటూ తన బాధలను చెప్పుకొచ్చింది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భారీగా స్పందింస్తున్నారు. ‘అమ్మా, నాన్న మీకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మీ మనవడే. ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది’ అంటూ ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. మరొకరు ‘మీ భర్తకు ఐఫోన్ ఇవ్వాలని అంత ఆసక్తిగా ఉంటే సెకండ్ హ్యండ్‌లో కొని ఇవ్వమనండి. అప్పుడైనా కొంత డబ్బు ఆదా అవుతుంది. ’ అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశారు. ‘ఇక్కడ సమస్య ఏంటంటే మీ భర్త తన తల్లిదండ్రులకు మీ ఆర్థిక పరిస్థితి గురించి సరిగా కమ్యూనికేట్ చేయకపోవడం. తన ఆర్థిక స్థితి సరిగా లేదని, ప్రస్తుత సమయంలో ఈ పని చేయలేనని చెప్పమనండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే భారతీయ తల్లిదండ్రులు, సాధారణంగా తమ పిల్లలను విదేశాలకు పంపేటప్పుడు వారు అప్పులు చేయడంతో సహా చాలా త్యాగం చేస్తారని తెలుసుకోండి’ అని తెలిపారు. నెటిజన్ల సలహాలు, కామెంట్లపై స్పందించిన సదరు మహిళ.. వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఐఫోన్లకు బదులు కొంత తక్కువ ఖరీదైన ఫోన్లు వారికి నచ్చినవి కొనుగోలు చేసేందుకు అత్తమామలు అంగీకరించారని తెలిపింది. అలాగే చాలా మంది సూచించిన విధంగా వాటిని భారతదేశానికి పంపుతున్నట్లు పేర్కొంది. -
ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా..
తల్లి.. తండ్రి.. ఈ లోకంలో కనిపించే ప్రత్యక్ష దైవాలు. నవమాసాలు మోసి, ప్రాణం పోయే నొప్పులను పంటి బిగువన భరించి జన్మనిచ్చేది తల్లి అయితే.. బిడ్డ ముసిముసి నవ్వులకు మురిసిపోతూ.. బుడి బుడి అడుగుల్లో సంతోషం వెతుక్కుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకునేది తండ్రి. రక్తం పంచిన వీరిద్దరినీ మించిన బంధం మరొకటి ఉండదు..కష్ట మొచ్చినా, నష్టమొచ్చినా కడుపులో దాచుకొనే నేస్తాలూ ఈ ఇద్దరే. అమ్మ లేనిదే ముద్ద దిగదు.. నాన్న లేనిదే కాలం గడవదు.. పిల్లలకు వీళ్లే రెండు కళ్లు. తాము తినకపోయినా పిల్లల కడుపు నిండితే చాలనుకునే తల్లిదండ్రులు.. కాస్త వయస్సు పైబడితే చాలు, అదే పిల్లలకు చేదవుతున్నారు. తమ బతుకు వారి రక్తమాంసాలనే విషయం మరిచి.. చచ్చినప్పుడు వెంట రాని డబ్బు కోసం కాటికి కాలు చాచిన ఎండు కట్టెలను వీధిన పడేస్తున్న ఘటన కడు దయనీయం. పుట్టినప్పుడు.. పెరుగుతున్నప్పడు.. అమ్మానాన్నలపై ఎనలేని ప్రేమ. పెరిగే కొద్దీ, ఓ తోడు ఇంటికి చేరగానే ఆ బంధం క్రమంగా బరువవుతోంది. ఈ రోజు వాళ్లు.. రేపు మనం అనే విషయాన్ని మరిచి, కళ్లను కమ్మేసిన కరెన్సీ పొరలు మానవ సంబంధాలను కనుమరుగు చేస్తున్నాయి. మట్టినే నమ్ముకున్న ఓ రైతు, రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఓ ఇంటి వాళ్లను చేసి ఉన్నంతలో పంచిపెట్టాడు. ఇక్కడే.. అన్నదమ్ములు, తోడి కోడళ్ల మధ్య అగ్గి రాజుకుంది. ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకొని.. చివరకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇంట్లోకి రావద్దంటూ గెంటేయడం మానవత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రగిరి: మండల పరిధిలోని కొటాల గ్రామానికి చెందిన చెంగల్‌రామ నాయుడు(86), నాగభూషణమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు యోగానంద తిరుపతిలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపనీలో జూనియర్ అసిస్టెంట్‌గా.. చిన్న కుమారుడు దేవరాజులు టీటీడీకి చెందిన సాంస్కృతిక విభాగంలో నెల్లూరులో పనిచేస్తున్నారు. ఇటీవల కొటాల గ్రామంలోని సర్వే నంబర్ 445లోని చెంగల్‌రామ నాయుడుకు చెందిన వ్యవసాయ భూమిలో 54 సెంట్లను యోగానందకు, 15 సెంట్లను దేవరాజులకు రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే 20 ఏళ్ల క్రితం చెంగల్‌రామ నాయుడు నిర్మించిన ఇంట్లో భార్యతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యోగనంద పాత ఇంటిని మరింత సౌకర్యవంతంగా కట్టుకోవడానికి బ్యాంకు లోను అవసరమని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నాగభూషణమ్మ, తమ్ముడు దేవరాజు సంతకాలు లేకుండా వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పంపకాల్లో అన్యాయమని.. సోమవారం రాత్రి యోగానంద ఇంట్లో ఉండగా అతని భార్య విశ్వేశ్వరి(వేద) వృద్ధులు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారంటూ గొడవకు దిగింది. మేము కోరిన మేరకు ఆస్తి పంపకాలు చేయలేదని, అడిగిన మేరకు రాసివ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. వృద్ధాప్యం కారణంగా తాను ఎక్కడికీ రాలేనని, నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిల్లో ఉన్నామని కోడలితో కన్నీరు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి పరిష్కరించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా తిట్ల దండకం అందుకుంది. అంతటిలో ఆగకుండా తీవ్ర ఆగ్రహంతో ఇల్లు తన భర్త యోగానంద పేరిట ఉందంటూ వృద్ధులను బయటకు గెంటేసి తాళం వేసింది. బంధువుల ఇంట్లో ఆశ్రయం కోడలు ఇంట్లో నుంచి గెంటేయడంతో రాత్రి వేళ వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. నడవలేని స్థితిలోని భార్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ పెద్దలు కోడలికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవడంతో చివరకు బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎంతో గుట్టుగా సంసారం నెట్టుకొచ్చినా, ఇద్దరు కొడుకులు ఉండి మరో ఇంట్లో ఉండాల్సి రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు. విధిలేక పోలీసుస్టేషన్‌కు.. ఆ రాత్రి కన్నీళ్లతో గడిచిపోయింది. ఇక బంధువులకు భారం కాలేక, న్యాయం జరుగుతుందనే ఆశతో అతి కష్టం మీద పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. కొడుకు, కోడలికి సర్దిచెప్పి న్యాయం చేయాలని చంద్రగిరి ఎస్ఐ వంశీధర్‌ను వేడుకున్నారు. కనీసం పోలీసుస్టేషన్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధుల వద్దకే వెళ్లి ఎస్ఐ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎట్టకేలకు ఓ చిన్న గది ఒక రాత్రి బంధువుల ఇంట్లో తల దాచుకొని, మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన వృద్ధ దంపతులకు కాస్త ఊరట కల్పించేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. యోగానంద, అతని భార్య విశ్వేశ్వరితో చర్చించి, గట్టిగానే హెచ్చరించారు. కుమారుడి స్వాధీనంలోని ఇంట్లోనే వృథాగా ఉన్న ఓ గదిలో వృద్ధ దంపతులు ఉండేందుకు అతి కష్టం మీద ఒప్పించారు. కనీస సౌకర్యాలు లేని ఆ గదిని చూసి నాగభూషణమ్మ ఈ వయస్సులో తమకు ఇదేమి ఖర్మ అంటూ కన్నీరుమున్నీరైంది. అల్లారు ముద్దుగా పెంచినా.. ఇద్దరూ కొడుకులే కావడంతో జీవిత చరమాంకంలో ఎలాంటి లోటు ఉండదనుకున్నాం. ఈ వయస్సులో ఆస్తి పంపకాల వద్ద పెద్ద కొడుకు, కోడలు చేస్తున్న అరాచకం కన్నీరు పెట్టిస్తోంది. నా భార్యకు ఇటీవల ఆపరేషన్ జరగడంతో కనీసం కూర్చోలేని పరిస్థితి. కష్టపడి ఇల్లు కట్టి, కొడుక్కు ఉద్యోగం తీయిస్తే నిలువ నీడ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఈ వయస్సులో మాకు ఇంకేమీ వద్దు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే చాలు. – చెంగల్‌రామ నాయుడు మమ్మల్ని మోసం చేశారు 2006లో మా మామ చెంగల్‌రామ నాయుడు ఆస్తి భాగపరిష్కారంలో నన్ను, నా భర్తను మోసం చేసి మా మరిదికి అనుకూలంగా వ్యవహరించారు. మెయిన్ రోడ్డులోని పొలం కాకుండా మాకు లోపలి భాగం ఇచ్చారు. అడిగితే అదేం లేదని, మీకు మెయిన్ రోడ్డులోనే ఉంటుందని చెప్పడంతో అప్పట్లో సంతకాలు చేశాం. ఇప్పుడు మా మరిది ఆ స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయమై అత్తమామలను సోమవారం రాత్రి ప్రశ్నిస్తే పత్రాలు ఎలా ఉంటే అలా చేసుకోండని అంటున్నారు. 2003లో అత్తమామలు ఉంటున్న ఇంటిని మాకు రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే మా ఇంటికి మాకు ఇమ్మంటున్నా. – విశ్వేశ్వరి, యోగానంద భార్య, కొటాల -
నాన్న నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో! కన్నీటి పర్యంతమవుతున్న తండ్రి
మహిళలను వరకట్నం కోసమో లేక ఆడపిల్లలు పుట్టారనో వేధించే అత్తమామాలు కోకొల్లలు. భర్త కూడా తన తల్లిదండ్రులకే వంతపాడుతూ వేధిస్తుంటే ఇక ఆ మహిళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అది కూడా విదేశాల్లో ఎక్కడో ఉండి ఈ బాధలు అనుభవిస్తుంటే ఇక ఆ మహిళలు పరిస్థితి మరితం ఘెరంగా ఉంటుంది. సదరు బాధిత మహిళలు దిక్కుతోచని నిస్సహయ స్థితిలో వేధింపులకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం అలానే న్యూయార్క్‌లో ఉంటున్న ఒక భారతీయ మహిళ ఇలానే చేయండంతో ఆమె తల్లిదండ్రులు కూతురు మృతదేహం కోసం ఆవేదనగా నిరీక్షిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...యూపీలోని బిజ్నోర్కి చెందిన 30 ఏళ్ల మన్దీప్ కౌర్ 2015లో రంజోద్ బీర్ సింగ్ సంధును వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. ఐతే కొన్నాళ్లు సంతోషంగానే గడిచింది వారి కాపురం. ఎప్పుడైతే తనకు ఇద్దరు కూతుళ్ల పుట్టారో అప్పటి నుంచి ఆమెకు కష్టాలు అధికమయ్యాయి. ఏదో ఒక రోజు మారతాడనే ఆశతో ఆ వేధింపులను భరిస్తూ వచ్చింది. ఆ వేధింపులు తగ్గకపోక మరింత తీవ్రమవ్వడంతో ...ఆమె తన భర్త అత్త మామ వేధిస్తున్నారంటూ తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకోవడమే గాక తనను హింసిస్తున్న వీడియోలను కూడా పంపించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనను కాపాడమంటూ వేడుకున్నాడు. దీంతో ఆమె మారతాడనుకుని కేసు పెట్టడానికి వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నుంచి ఆమెను మరింతగా అత్తమామ, భర్త కలిసి హింసించడం ప్రారంభించారు. ఇక వారి వేధింపులు తాళ్లలేక ఆమె ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ నాన్న నన్ను క్షమించండి. నన్ను చచ్చిపోమని భర్త, అత్తమామ పదేపదే అంటున్నారు. ఇక తన వల్ల కాదంటూ మన్దీప్ ఆత్యహత్య చేసుకుని చనిపోతున్నట్లు వీడియోలో తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు తమ అల్లుడు తమ కూతురిని ఎలా వేధించేవాడో వివరిస్తూ... పలు వీడియోలు పంపించిందని చెప్పుకొచ్చారు. మారతాడని ఓపిక పట్టానని ఒకానొక సమయంలో పోలీసులను కూడా సంప్రదించానని చెప్పుకొచ్చాడు. తన కూతురు మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సహాయం చేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆమె తండ్రి. ఈ మేరకు వేధింపులు, గృహహింసకు గురవుతున్న సిక్కు మహిళల కోసం పనిచేస్తున్న ది కౌర్ మూవ్మెంట్ అనే సంస్థ బాధిత మహిళ సెల్ఫీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నామంటూ ప్రశ్నిస్తూ..ట్వీట్ చేశారు. There are collosal problems in our family & social structure which we conveniently ignore or deny to accept. #DomesticViolence against women is one such serious problem. Suicide by Mandeep Kaur a NRI Punjabi woman is a wake up call to accept the problem and fix it accordingly. pic.twitter.com/F8WpkiLCZY — Gurshamshir Singh (@gurshamshir) August 5, 2022 (చదవండి: సుప్రీం ముందు రేప్ బాధితురాలి సూసైడ్ ఘటన.. సంచలన కేసులో అతుల్ రాయ్‌కు ఊరట) -
‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన ఖాజా మోయియుద్దీన్ అన్సారీ ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) వివాహం రెండేళ్ల క్రితం మహ్మద్ సుల్తాన్ పటేల్‌తో జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో భర్త వేధించసాగాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ సుల్తాన్‌తో పాటు అతని తల్లి కూడా వేధించారు. వేధింపులు తట్టుకోలేక ఫిర్దోస్ తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ సుల్తాన్ షాహిన్‌నగర్ వచ్చి తరచూ భార్యతో గొడవపడి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి సుల్తాన్ భార్యను ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి వెళ్లాడు. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఫిర్దోస్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గన్‌తో బెదిరించేవాడు.. తన మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వరాదంటూ.. తాను అనుభవించిన నరకాన్ని ఫిర్దోస్ డైరీలో రాసింది. గన్‌తో బెదిరించి చిత్రహింసలకు గురిచేశాడని రాశారు. ఎన్నో హత్యలు చేశానని, ఎవరికీ భయపడనని అంటూ కొట్టేవాడని పేర్కొన్నారు. -
వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య సహించలేక..
మండ్య(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కుటుంబ కలహాలను తాళలేక డెత్‌నోట్ రాసి బిడ్డతో కలసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మాజీ జడ్పీ సభ్యుడు దొరెస్వామి– సునంద దంపతుల కుమార్తె బిందు, నాగమంగల కుంభార వీధి నివాసి నవీన్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చదవండి: బీచ్‌లో లైంగిక దాడి.. ఆ వీడియోని పదే పదే చూపిస్తూ.. మొదట్లో దంపతులు అన్యోన్యంగా మెలిగే వారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు బిందును అత్త, మామ, ఆడపడుచులు వేధించడం మొదలైంది. ఇక భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక సహించలేక బిందు తన పది నెలల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా తరచూ ఫోన్లో గొడవపడుతూ ఉండేవారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన బిందు శిశువుకు ఉరి వేసి తరువాత తానూ అదే వైరుతో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తన చావుకు భర్త నవీన్, అత్త, మామ, ఆడపడుచు కారణమని పేర్కొంది. నాగమంగల పోలీసులు పరిశీలించి ఇరువురి మృతదేహాలను పట్టణంలోని ప్రజా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బిందు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వని భర్త
సాక్షి,నర్సీపట్నం: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో చేసేది లేక పార్వతి అనే మహిళ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద బొడ్డేపల్లిలోని తన అత్తవారి ఇంటి వద్ద బుధవారం బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది. రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పని చేస్తున్నాడు. పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నా కాపురానికి తీసుకురాకుండా అత్త, మామలు అడ్డుపడుతున్నారు. ఆడపిల్లల పుట్టిందని, తల్లిపేరు మీద ఉన్న భూమి రాయించుకు రాలేదని కాపురానికి తీసుకురాలేదని పార్వతి తెలిపింది. నెల రోజుల్లో కాపురానికి తీసుకెళ్తానని రావికమతం పోలీసు స్టేషన్లో అంగీకరించిన భర్త ఆ తరువాత పట్టించుకోలేదని వాపోయింది. దీంతో మానసిక వేదనతో తన తల్లి ఇటీవల మృతి చెందిందని, తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తోబుట్టువు వద్ద తలదాచుకుంటున్నానని ఆమె చెప్పింది. బంధువులను వెంట పెట్టుకుని భర్త ఇంటికి వచ్చానని, ఇంటి వద్ద ఉన్న అత్త, మామలు తనను లోపలికి రానివ్వకుండా తలుపులు వేసుకుని బయటకు వెళ్లిపోయారని తెలిపింది. దీంతో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించినట్టు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు, భర్త తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన టౌన్ ఎస్ఐ లక్ష్మణ్‌రావు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...
వివాహా ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు పెద్దవారు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ముఖ్యంగా ఆడపిల్లను పంపే ఇంటి వారు కాస్త స్థితిమంతులు అయితే బాగుండు అనుకుంటారు. అందుకే తమ స్తోమతకు మించి.. అప్పు చేసి మరి మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్న కుటుంబానికి ఆడపిల్లను వివాహం చేసి పంపిస్తారు. ఇలా తేలుసుకోవడం మంచిదే. అయితే దేని గురించి అయిన అడగడానికి ఓ పద్దతి ఉంటుంది. కాదని హద్దు మీరి ప్రవర్తిస్తే.. అసలుకే మోసం వస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబోయే అల్లుడి జీతం ఎంతో తెలుసుకోవడం కోసం.. ఓ అత్తమామ.. అతడి దగ్గర నుంచి మొబైల్ లాక్కుని.. ఓ గదిలో బంధించి టార్చర్ పెట్టారట. ఆగ్రహించిన సదరు వ్యక్తి వివాహం క్యాన్సిల్ చేద్దామనుకున్నాడట. కానీ చివరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. రెడిట్‌లో పోస్ట్ చేసిన ఈ కథనం వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. ఏంటి అనే వివరాలు లేవు. కానీ పోస్ట్ ప్రకారం.. ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం పెళ్లి కుదిరింది.ఆ తర్వాత అతడి కొత్తగా జాబ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి కాబోయే అత్తమామ అల్లుడికి ఎంత జీతం వస్తుందో తెలుసుకోవాలని భావించారు. అతడిని పిలిచి ప్రైవేట్‌గా మాట్లాడాలనుకున్నారు. ఓ రోజు అతడికి కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. బాధితుడు ఇంటికి వెళ్లే సరికే అతడి కాబోయే భార్య ఇంట్లో లేదు.. అత్త, మామ మాత్రమే ఉన్నారు. గెస్ట్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అతడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్, బైక్ కీ తీసుకుని దాచిపెట్టారు. ఆ తర్వాత అతడి గొత్త ఉద్యోగం గురించి చర్చించసాగారు. బాధితుడు మాట్లాడుతూ.. ‘‘నా కాబోయే మావ కొత్త ఉద్యోగంలో జీతం ఎంత వస్తుందని ప్రశ్నించారు. నాకు చెప్పడం ఇష్టం లేక దాటవేసే ప్రయత్నం చేశాను. కానీ వారు ‘‘నీకు మా కుమార్తెను ఇస్తున్నాను.. నీ సంపాదన ఎంతో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. కచ్చితంగా చెప్పి తీరాల్సిందే’’ అని డిమాండ్ చేయసాగారు. నేను బాగానే సంపాదిస్తున్నాను.. మీ కుమార్తెను బాగా చూసుకుంటాను అని వారికి హామీ ఇచ్చాను. కానీ వారు నా మాట వినలేదు. నా అత్త ‘‘డబ్బులు చాలా ముఖ్యం. నువ్వు కుటుంబాన్ని పోషించగలవో లేదో తెలియాలి కదా.. ఎంత సంపాదిస్తున్నావో చెప్పాల్సిందే’’ అని డిమాండ్ చేశారు’’ అని తెలిపాడు. ‘‘వాళ్లు ఎంతకి ఆ టాపిక్ మార్చకపోవడంతో నేను అక్కడి నుంచి బయటకు వెళ్లిపోదామని భావించాను. బాత్రూంకి వెళ్తాను అని చెప్పి.. బయటకు వెళ్లే ప్రయత్నం చేశాను. నేను లేవగానే నా కాబోయే అత్త గారు నన్ను బంధించమని గట్టిగా అరిచారు. ఇక మావ నన్ను గదిలో పెట్టి లాక్ చేశారు. మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశాను. ఇంతలో నా కాబోయే భార్య వచ్చింది. ఇది గమనించి ఆమె తల్లిదండ్రులు డోర్ తెరిచి ఏడ్వడం ప్రారంభించారు. ఇక నా ఫియాన్సీ జరిగిన విషయం ఏంటో తెలియకుండా.. నేను తన తల్లిదండ్రులను అవమానించి తనను కూడా బాధపెట్టానని ఆరోపించిది. వారికి క్షమాపణలు చెప్పమని కోరింది’’ అన్నాడు. ‘‘వారి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి కుటుంబానికి అల్లుడిని అయితే ఇక నా జీవితం ఎలా ఉంటుందో తల్చుకుంటేనే భయమేసింది. కానీ నా తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే నా భార్య చాలా మంచిది. తను నన్ను చాలా ప్రేమిస్తుంది. ఇక అత్తమామల వల్ల ఇప్పటికి అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి’’ అని తెలిపాడు. చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను! షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ.. -
ట్రెండ్ సెట్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
కోల్‌కతా : పెళ్లి తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లే ఘట్టం ప్రతీ అమ్మాయి జీవితంలో ఎంతో మరుపురానిది. అయితే ఈ సాంప్రదాయాన్ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకుంది ఓ వధువు. కోల్‌కతాకు చెందిన స్నేహ సింఘీ(28) అనే యంగ్ బిజినెస్ ఉమెన్...ఇటీవలె సౌగత్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే అందరి అమ్మాయిల్లానే అప్పగింతల కార్యక్రమంలో తల్లిదండ్రులను విడిచి వెళ్లేటప్పుడు ఎంతో భావోధ్వేగానికి లోనైంది. వారికి బై..బై చెబుతూ అక్కడి నుంచి కదిలింది. వరుడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా కారు నడుపుతూ అత్తారింటికి బయల్దేరింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, కొద్ది గంటల్లోనే ఇది వైరల్‌గా మారింది. పెళ్లి దుస్తుల్లోనే స్టీరింగ్ పట్టుకున్న వధువు స్నేహను పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెళ్లికూతురు ట్రెండ్ సెట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీయడంపై వధువు స్నేహ సింఘీ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నేనే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ అత్తారింటికి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. పెళ్లికి నెల కిందట సౌగత్‌ను అడగితే,అతను ఈ ఐడియా చాలా బావుందని చెప్పాడు. అంతేకాకుండా సౌగత్ తల్లి కూడా ఇందుకు వెంటనే అంగీకరించింది. దీంతో నా కల నెలవేరింది. అని స్నేహ సంతోషం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1) చదవండి : తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి.. ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
అత్తమామలను హతమార్చిన కోడలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాను కట్టడిచేయడానికి లాక్డౌన్ అమలవుతున్న సమయంలో పశ్చిమ ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతులు నిన్న (శుక్రవారం) హత్యకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు చావ్లాలోని పోలీసు కంట్రోల్ రూంకి ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైనట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పశ్చిమ ఢిల్లీలోని దుర్గా విహార్, ఫేజ్- 2 లో ఉన్న ఓ ఇంట్లో ఒకే మంచం మీద వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించాయి. వారి ముఖం మీద గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వృద్ధ దంపతులు రాజ్ సింగ్ (61), ఓంవతి (58)గా పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతుల కోడలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్థారించారు. కాగా అత్తమామలకు, కోడలు కవితకు మధ్య ఆస్తి వివాదం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా కవిత.. తన భర్త సతీష్ సింగ్ ముందే అత్తమామలను హతమార్చినట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్యలో సతీష్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితురాలు కవితతో పాటు సతీష్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మామ చితి వద్దే కుప్పకూలిన అల్లుడు
సాక్షి, సిద్దిపేట: ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి వక్రికరించింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థకు గురైన అల్లుడు చితి వద్దే కుప్పకూలాడు. దీంతో రెండు ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ ఘటన గురువారం నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన పండగ నారాయణ (65) సింగరేణి బొగ్గు గనిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఉపాధి కోసం సిద్దిపేటలో ప్రైవేట్ జాబ్ చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అస్వస్థకు గురై నారాయణ మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం బుద్దిపడగలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అతని అల్లుడు(కూతురు భర్త) తుపాకుల శ్రీధర్‌బాబు (36) చితి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమణించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్‌బాబు మృతి చెందినట్లు తెలిపారు. సిద్దిపేటలకు చెందిన శ్రీధర్‌బాబు డ్రైవర్‌గా పని చేస్తుండగా అతని భార్య సుజాత ప్రైవేట్ స్కూల్లో పని చేస్తోంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు లతిక, కీర్తికలున్నారు. బుధవారం సుమోలో ముంబాయికి కిరాయకు వెళ్తుండగా అతని మామయ్య నారాయణ వార్త తెలియడంతో బుధవారం రాత్రి శ్రీధర్‌బాబు ఇంటికి చేరుకొని అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాటు చేశాడు. మామ మృతదేహాన్ని చితిపై ఉంచి కుటుంబ సభ్యులతో కలసి చితి చుట్టూ తిరుగుతుండగా ఉన్నట్లుండి శ్రీధర్‌బాబు కిందపడిపోయాడు. ఒకేసారి తండ్రి, భర్త మరణించడంతో విలపిస్తున్న సుజాతను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ హృదయవిదారక ఘటనను అందరిని కలిచివేసింది. -
చచ్చినట్లు నాటకమాడి.. భార్య, అత్తమామలను..
లక్నో : భార్య, అత్తమామలపై ప్రతీకారం తీర్చుకోవటానికి చచ్చినట్లు నాటకమాడాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాకు చెందిన పన్నెలాల్ యాదవ్‌ను కొన్ని సంవత్సరాల క్రితం భార్య , అత్తమామలు వేధింపుల కేసుకింద జైలులో పెట్టించారు. కొద్ది రోజుల తర్వాత ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకుని అతన్ని బయటకు రప్పించారు. అప్పటి నుంచి భార్య, అత్తమామలపై క్షక్ష్య పెంచుకున్న యాదవ్ ప్రతీకారంతో రగిలిపోయాడు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యాదవ్‌కు ఓ ఉపాయం తట్టింది. తాను చనిపోయినట్లు నాటకమాడి భార్య కుటుంబాన్ని హత్య కేసులో ఇరికించాలని అనుకున్నాడు. 2016 అక్టోబర్ నెలలో అత్తమామలను కలవటానికి వారి ఇంటికి వెళుతున్నానని చెప్పి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. నెలలు గడుస్తున్నా యాదవ్ ఆచూకీ లభించకపోయే సరికి అతని కుటుంబ సభ్యులు భార్య, అత్తమామలే చంపి, శవాన్ని కనపడకుండా చేసుంటారని భావించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోకపోవటంతో యాదవ్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతని భార్య, అత్తమామలపై హత్య, ఆధారాలను చెరిపివేశారన్న కారణాలతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ముంబైలోని మీరా రోడ్లో ఓ వ్యక్తిని రెండు సంవత్సరాలుగా మారు వేశాలతో తిరుగుతున్నాడన్న అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆవ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన పన్నెలాల్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్య కుటుంబాన్ని ఇరికించాలనే.. యాదవ్ తన కుటుంబం సహాయంతో నాటక మాడాడని తేలింది. భార్య కుటుంబాన్ని ఇరికించాలని చూసిన యాదవ్‌ను అతని కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మహిళ హత్య; ఐదుగురిపై కేసు నమోదు
ముజప్పర్ నగర్: ఓ 40 ఏళ్ల మహిళ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజప్పర్ నగర్లో కుర్తాల్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. ఆమె మృతికి భర్త, అత్తంటివాళ్లే కారణమని సోదరుడు ఆరోపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం పుట్టింటినుంచి తిరిగివచ్చిన పూజాను భర్త, అత్తమామలే దారుణంగా కొట్టి చంపారని వాపోయాడు. అనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమెకు ఉరేసినట్టు మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు భర్త వికాస్ సహా, ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.