షాకింగ్‌: భార్యను రీల్స్‌ చేయొద్దన్నందుకు.. అల్లుడిని చంపేసిన అత్తమామలు | Bihar Man In Laws Kill Him After He Objects To Wife Making Insta Reels | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన: భార్యను రీల్స్‌ చేయొద్దన్నందుకు.. అత్తమామల చేతిలో భర్త హతం

Published Mon, Jan 8 2024 7:54 PM | Last Updated on Mon, Jan 8 2024 9:24 PM

Bihar Man In Laws Kill Him After He Objects To Wife Making Insta Reels - Sakshi

బిహార్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయవద్దని చెప్పినందుకు భర్తను అతడి అత్తమామలు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు ఓ భర్త. ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లోని ఫఫౌట్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. 

వివరాలు.. 25 ఏళ్ల మహేశ్వర్‌ కుమార్‌ రాయ్‌కు ఆరేళ్ల క్రితం రాణి కుమారితో వివాహమైంది. వీరికి అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు. మహేశ్వర్‌ కోల్‌కతాలో కూలీగా పనిచేస్తున్నాడు.  రాణికి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం ఇష్టం. పలు వైరల్‌ అయిన రీల్స్‌ను ఆమె కూడా ప్రయత్నిస్తుంటారు. మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 500 రీల్స్‌ను పోస్టు చేశారు.

ఇటీవల భర్త కోల్‌కతా నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యకు రీల్స్‌ చేయడంపై ఆసక్తి ఉన్న విషయాన్ని తెలుసుకొని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి అతడు  తన అత్తమామ ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా భార్య రీల్స్‌ విషయమై గొడవ జరిగింది. అనంతరం పని నిమిత్తం మహేశ్వర్‌ సోదరుడు రుడాల్ అతనికి ఫోన్ చేయగా.. లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన రుడాల్‌, తన కుటుంబంతో కలిసి సోదరుడి అత్తమామల ఇంటికి చేరుకోవడంతో అక్కడ  మహేశ్వర్ రాయ్  మృతిచెందడాన్ని గుర్తించారు. 

అయితే రీల్స్‌ చేయడానికికి అభ్యంతరం చెప్పడంతో కొడుకుని ఉరేసి చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో వారు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌ వైపే అందరి చూపు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement