ఓ 40 ఏళ్ల మహిళ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజప్పర్ నగర్లో కుర్తాల్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది.
ముజప్పర్ నగర్: ఓ 40 ఏళ్ల మహిళ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజప్పర్ నగర్లో కుర్తాల్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. ఆమె మృతికి భర్త, అత్తంటివాళ్లే కారణమని సోదరుడు ఆరోపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం పుట్టింటినుంచి తిరిగివచ్చిన పూజాను భర్త, అత్తమామలే దారుణంగా కొట్టి చంపారని వాపోయాడు.
అనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమెకు ఉరేసినట్టు మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు భర్త వికాస్ సహా, ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.