
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లవ్ ఎఫైర్లు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ విలువలను మంటగొలిపి మహిళలు, పురుషుల అన్న సంబంధం లేకుండా ఇరువురు చేస్తున్న పనులు యావత్తు కుటుంబం తలెత్తుకోలేని స్థితిని ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని రాట్లం గ్రామంలో 30 ఏళ్ల మహిళ భర్త, అత్తమామాలతో కలిసి ఉంటుంది. ఐతే ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేయమని పిలిచినప్పటికీ ఆమె రానని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఆమె భర్త అత్తమామలు ఆ గ్రామంలో ఉండలేక ఆ ఇంటికి తాళం వేసి మరో ఊరు వెళ్లిపోయారు. ఐతే సదరు మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్త ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ ఇంటికే మకాం మార్చి అక్కడే ఉంటోంది.
ఈ విషయం ఇరుగుపొరుగు వారి సాయంతో తెలుసుకున్న ఆమె భర్త అత్తమామలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో ఆ మహిళ ఇంటి వద్దకు వచ్చి ఆమెను చెట్టుకు కట్టి.. ఘోరంగా కర్రలతో దాడి చేశారు ఆమె భర్త, అత్తమామలు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. సమయానికి పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలికి రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం సదురు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సదరు మహిళ భర్త, అత్తమాహాలు, మరో ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
(చదవండి: ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్..)
Comments
Please login to add a commentAdd a comment