thrashed
-
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్
భావ్‌నగర్: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్‌పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
నడిరోడ్డుపై దళిత మహిళను లాఠీతో చితకబాదిన పోలీసు
పాట్నా: బిహార్‌లో నడిరోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విపక్ష బీజేపీ మండిపడింది. బిహార్‌లో నేరస్థులను వదిలేసి సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. సితామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసులో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో రక్షించిన బాలిక కోసం ఇద్దరు మహిళలు పోటీ పడ్డారు. తమ బాలికేనని ఇరువురు గొడవకు దిగారు. పోలీసులు విడిపించినా గొడవ ఆపలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తప్పుబడుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు -
దారుణం.. యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రతో దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతానానికి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ యువకుడిపై అమానుషంగా దాడి చేశారు. ఈ దారణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాహరాన్‌పూర్‌లో ఇనుపా రాండ్లు దొంగలించాడన్న అనుమానంతో ఓ యువకుడిని స్థంబానికి కట్టేసి కొంత మంది దాడి చేశారు. Warning: Disturbing video In UP's Saharanpur, a man suspected of theft was tied to a pole and brutally flogged using a stick by accused identified as Amit Sharma. pic.twitter.com/NXSJIVLO70 — Piyush Rai (@Benarasiyaa) December 6, 2023 అందులో ఓ వ్యక్తి అమానవీయంగా కర్రతో విచక్షణ రహితంగా యువకుడిని చితకబాదాడు. విషయం తెలుసుకున్న సాదర్ బజార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిపై దాడి చేసిన ఏడుగురు వ్యక్తును అదుపులోకి తీసుకొని.. పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాధిత యువకుడిని స్థానికంగా ఉండే అమిత్ శర్మగా పోలీసులు గుర్తించారు. -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళా పైలట్‌తోపాటు ఆమె భర్తపై కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై చితకబాదారు. 10 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడ్డారు. పైలట్ యూనిఫాంలో ఉన్న మహిళ, ఆమె భర్తను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా పైలట్ దంపతులు గత రెండు నెలల క్రితం ఓ మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అంతేగాక ఆమెను వేధిస్తూ దారుణంగా కొట్టేవారు. ఈ విషయం తాజాగా బాలిక బంధువుకు తెలియడంతో ఆమె మిగతా బంధువులను, ఇరుగుపొరుగు వారిని పైలట్ నివాసం వద్దకు తీసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. గొడవ పెరిగడంతో మహిళ జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాకొచ్చి కొట్టారు. ఆమె భర్తపై కూడా దాడి చేశారు. తనను క్షమించాలని మహిళా పైలట్ వేడుకున్నా వినిపించుకోకుండా చితకబాదారు.చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పైలట్ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె ముఖం, కళ్ల మీద దాడి చేసిన గాయాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన బంధువు ద్వారా ఉద్యోగంలో చేరిందని, ఆమె కూడా సమీపంలోని ఇంట్లో పని చేస్తుందని పేర్కొన్నారు. కాగా నిందితురాలైన మహిళా ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు, తన భర్త మరో ప్రైవేటు విమానయాన సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. చదవండి: తండ్రితో గొడవ.. పిల్లలను చంపడానికి కారుతో గుద్దించేశాడు.. #WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi's Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her. The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z — ANI (@ANI) July 19, 2023 -
మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట వెలుగుచూసింది. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను మరవకమునుపే ఈ ఘటన బయటకు వచ్చింది. కదులుతున్న వాహనంలో ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అరికాళ్లు నాకించారు. వ్యక్తిగత వైరం నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కదులుతున్న వాహనంలో గోలూ గుర్జర్ అనే వ్యక్తి మరో వ్యక్తిని పదేపదే కొట్టడం, దూషిస్తూ అతడితో బలవంతంగా అరికాళ్లు నాకించడం ఉన్నాయి. అతడు చెప్పినట్లుగానే గోలూ గుర్జర్‌ను బాధితుడు పొగిడాడు. మరో వీడియో క్లిప్‌లో గోలూ గుర్జర్ చెప్పుతో బాధితుడి మొహంపై కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు గోలూ గుర్జర్, సుదీప్ గుర్జర్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బాధితుడు దబ్రా పట్టణానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. బాధితుడు మొహ్సిన్ ఖాన్ మే 21వ తేదీన గోలూ గుర్జర్‌ను కొట్టాడని గ్వాలియర్ పోలీసుఅధికారి రాజేశ్ చందేల్ చెప్పారు. దాడిపై గోలూ డబ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. కక్ష గట్టిన గోలూ గుర్జర్ తన వారితో కలిసి జూన్ 30న ఖాన్‌ను నిర్బంధించి, దాడికి దిగినట్లు చెప్పారు. -
గాల్వాన్ అమర జవాన్ తండ్రికి అవమానం.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు
రెండేళ్ల కిత్రం గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన బిహార్ సైనికుడు జై కిషోర్ సింగ్ తండ్రికి అవమానకర ఘటన ఎదురైంది. ప్రభుత్వ స్థలంలో కొడుకు కోసం స్మారకాన్ని నిర్మించినందుకు సింగ్ తండ్రిపై బిహార్ పోలీసులు అమానుషంగా ప్రవరించారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలేం జరిగిందంటే.. వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలోనే సింగ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్లో దీని చుట్టూ గోడ కట్టారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.. అంతేగాక పోలీసులు సింగ్‌ను కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భూమితోపాటు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని నిర్మించారని చెబుతూ.. హరినాథ్ రామ్ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్డిపిఓ మహువా తెలిపారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మీలో పనిచేస్తున్న అమరవీరుడు సైనికుడి సోదరుడు నంద కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్ స్టేషన్లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని వాపోయారు. Galwan valley martyr’s father being dragged by @bihar_police @yadavtejashwi @NitishKumar @SpVaishali pic.twitter.com/oJjUnqtQET — Anish Singh (@anishsingh21) February 26, 2023 -
వృద్ధుడని కనికరం లేకుండా రెచ్చిపోయిన మహిళా పోలీసులు
వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్ కిషోర్ పాండే అనే వృద్ధ టీచర్ కైమూర్ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. పోని ఆ సైకిల్ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. (చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది) -
ప్రియురాలిని చావబాదిన ఘటన: నిందితుడి అరెస్టు, ఇల్లు ధ్వసం
భోపాల్: ఒక యువకుడు యువతిని దారుణం కొడుతున్న వీడియో నెట్టింట హల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు వ్యక్తిని అరెస్టు చేయడమే గాక అతడి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఒక యువతని దారుణంగా కొడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారభించారు. దారుణానికి పాల్పడిన వ్యక్తిన పంకజ్ త్రిపాఠిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఆ యువతిపై దాడి చేసినట్లు వివరించాడు. పోలీసులు నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. అతడి జీవనాధారం డ్రైవింగ్. అందువల్ల అధికారులు అతడి డ్రైవింగ్ లైసెన్సు కూడా క్యాన్సిల్ చేశారు. సకాలంలో అతడిపై చర్యలు తీసుకోని స్థానిక పోలీసులను సైతం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి ఇంటిన కూల్చిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Bulldozer action by MP govt, Arrested Boy from Rewa who brutally beaten and filmed his girlfriend asking for marry her. pic.twitter.com/lmeazFV14S — Political Kida (@PoliticalKida) December 25, 2022 (చదవండి: షాకింగ్ వీడియో: నువ్వేం మనిషివిరా అయ్యా..! ప్రియురాలిని ఘోరంగా చావబాదాడు, కారణం ఏంటంటే..) -
మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు
మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... దర్బాయి గ్రామంలోని బద్కుహి చౌకీ ప్రాంతంలో నివశిస్తున్న వినేద్ అనే ప్రబుద్ధుడు తన తల్లిని స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు రూ. 25 వేలు ఇమ్మని అడిగాడు. ఐతే అతడి తల్లి రూ. 15 వేలు మాత్రమే ఇచ్చింది. దీంతో వినోద్ కోపేద్రకంతో కన్నతల్లి అని కూడా లేకుండా కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తన కొడుకుకి తన నుంచి తన భర్త నుంచి డబ్బు తీసుకుంటుంటాడని కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు) -
మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లవ్ ఎఫైర్లు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ విలువలను మంటగొలిపి మహిళలు, పురుషుల అన్న సంబంధం లేకుండా ఇరువురు చేస్తున్న పనులు యావత్తు కుటుంబం తలెత్తుకోలేని స్థితిని ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని రాట్లం గ్రామంలో 30 ఏళ్ల మహిళ భర్త, అత్తమామాలతో కలిసి ఉంటుంది. ఐతే ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేయమని పిలిచినప్పటికీ ఆమె రానని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఆమె భర్త అత్తమామలు ఆ గ్రామంలో ఉండలేక ఆ ఇంటికి తాళం వేసి మరో ఊరు వెళ్లిపోయారు. ఐతే సదరు మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్త ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ ఇంటికే మకాం మార్చి అక్కడే ఉంటోంది. ఈ విషయం ఇరుగుపొరుగు వారి సాయంతో తెలుసుకున్న ఆమె భర్త అత్తమామలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో ఆ మహిళ ఇంటి వద్దకు వచ్చి ఆమెను చెట్టుకు కట్టి.. ఘోరంగా కర్రలతో దాడి చేశారు ఆమె భర్త, అత్తమామలు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. సమయానికి పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలికి రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం సదురు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సదరు మహిళ భర్త, అత్తమాహాలు, మరో ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్..) -
జీతం అడిగినందుకు ఉద్యోగిపై యజమాని దాడి
అగర్తలా: తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిపై యజమాని విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ సాలరీ ఇవ్వమన్నందుకు ఇనుప రాడ్డు, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలా నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సూరజిత్ త్రిపుర అనే వ్యక్తి మఫ్టీ అనే బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ దుకాణం యజమాని సాహా.. గత అక్టోబర్‌కు సంబంధించి సూరజిత్‌కు జీతం ఇవ్వలేదు. ఈ క్రమంలో తనకు పెండింగ్ సాలరీ ఇవ్వాలని సూరజిత్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సాహా.. అక్కడే పని చేసే మరో వ్యక్తి సాయంతో సూరజిత్‌పై ఇనుప రాడ్, బెల్టుతో దాడి చేశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. బాధితుడు సూరజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పశ్చిమ అగర్తలా పోలీసులు. ఈ వీడియోను ట్రైబల్ పార్టీ టిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ మానిక్యా ట్విటర్లో షేర్ చేశారు. దుకాణం యజమాని తీరుపై మండిపడ్డారు. యజమానికిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. కారు దిగొచ్చి వెనక్కి నెట్టిన కేంద్ర మంత్రి -
అసభ్యంగా కామెంట్లు.. అపరకాళిలా మారి చెప్పుతో కొట్టింది
న్యూఢిల్లీ: రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఓ మహిళ ఒక వ్యక్తిని కిందపడేసి చెప్పుతో చితకొట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రోడ్డుపై వెళ్తున్న ఆమె పట్ల సదరు వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అపరకాళిలా మారి అతని పై దాడి చేసింది. రహదారిపై ఉన్నవారంతా చూస్తుండగానే కిందపడేసి చెప్పుతో చితక బాదేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దర్నీ అడ్డుకుని పోలీస్టేషన్‌కి తరలించారు. ఈ మేరకు పోలీస్ అధికారి అనూప్ సింగ్ సదరు వ్యక్తులను విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. मुरादाबाद ➡महिला ने शोहदे की बीच सड़क जमकर पिटाई की ➡महिला ने शोहदे को बीच सड़क पर चप्पलों से पीटा ➡पिटाई होते देख मौके पर लगी लोगों की काफी भीड़ ➡15 मिनट तक शोहदे की पिटाई का हाईवोल्टेज ड्रामा।#Moradabad pic.twitter.com/XxJII5IOS3 — भारत समाचार (@bstvlive) August 27, 2022 (చదవండి: బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం) -
అరెస్టు చేసే క్రమంలో నిందితుడి పై దాడి: వీడియో వైరల్
Man making threats to an employee: అమెరికాలోని ఒక నిందితుడిని అరెస్టు చేయడంతో ముగ్గురు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సస్పెన్షన్‌కి గురయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని అర్కాన్సాస్‌లోని క్రాఫోర్ట్ కౌంటీలో జరిగింది. అసలేం జరిగిందంటే....అర్కాన్సాస్లో కిరాణా స్టోర్‌లోని ఒక ఉద్యోగిపై ఒక అపరిచిత వ్యక్తి బెదిరింపుల పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే అధికారులు స్పదించారు. ఈ క్రమంలో ముగ్గురు అధికారులు సదరు దుకాణం వద్ద అపరిచిత వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక మహిళ రికార్డు చేస్తుండడంతో ఆమెను రికార్డు చేయొద్దు అంటూ అధికారులు బెదిరించారు కూడా. ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్రాఫోర్డ్ కౌంటీ మేయర్ జిమ్మి దమంటే ఈ ఘటన పై అధికారులను దర్యాప్తు చేయమని ఆదేశించడమే కాకుండా బాధ్యలైన సదరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ ముగ్గురు అధికారుల్లో ఇద్దరు క్రాఫోర్డ్ కౌంటీ కార్యాలయంలోని డిప్యూటీలు కాగా, మూడవ వ్యక్తి మల్బరీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడుని అధికారులు రాండాల్ వోర్సెస్టర్గా గుర్తించారు. ఆ నిందితుడు స్టోర్‌లో పనిచేసే ఉద్యోగిపై ఉమ్మివేసి తల నరికేస్తానని బెదిరించాడని అన్నారు. తొలుత ముగ్గురు అధికారలు నెమ్మదిగా చెప్పి చూశారు, కానీ అతను వారిపై కూడా దాడి చేయడంతో అతనిని ఆపే క్రమంలో అధికారులు ఇలా ప్రవర్తించినట్లు వెల్లడించారు. సదరు నిందితుడు వోర్సెస్టర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తదనంతరం అర్కాన్సాస్‌లోని వాన్ బ్యూరెన్లోని క్రాఫోర్డ్ కౌంటీ జైలుకి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పై అర్కాన్సాస్ గవర్నర్ కూడా స్పందించడమే కాకుండా తక్షణమే విచారణ జరుపుతామని పేర్కొన్నారు. @4029news this was in Mulberry... pic.twitter.com/QHwrIeUfKw — Sports&Sh!tPodcast™️ (@JosephPodcast) August 21, 2022 (చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?) -
భార్యను ఏడు గంటల పాటు చెట్టుకి కట్టి...చిత్రహింసలకు గురి చేసి...
చిన్న అనుమానం తలెత్తిన భార్యలపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. వాస్తవం తెలుసుకునేందుకు యత్నించకుండా ఇరు జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మహిళల భద్రతకై ఎన్ని చట్టాలను ప్రభుత్వ యంత్రాంగం తీసుకువచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయలేక పోతున్నాం. ఇక్కడొక వ్యక్తి అలానే కట్టుకున్న భార్య పై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే....రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త, భర్త తరుపు ఇతర బంధువులు ఆమెను చెట్టుకి కట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ మహిళ దెబ్బలకి తాళలేక కేకలుపెడతూనే ఉంది. అసలేం జరిగిందంటే ఆమెను తన స్నేహితుడితో ఉండటం చూసిన సదరు వ్యక్తి ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీజేపీ నేతలు రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల ఎక్కుపెట్టారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) రాజస్తాన్ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ ) -
అసభ్య ప్రవర్తన?.. ట్రాఫిక్ ఎస్సైను చితకబాదేశారు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతంలో.. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తుండగా స్థానిక ట్రాఫిక్ ఎస్సైతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఉన్నట్లుండి జనాలంతా కలిసి ఆ ఎస్సైను చితకబాదేశారు. ఘటనకు కారణం ఏంటన్నదానిపై అధికారిక స్పష్టత లేకుంది. కానీ, ఓ యువతి సదరు ట్రాఫిక్ ఎస్సై కాలర్ పట్టుకుని మరీ రెండు చెంపలను చెడామడా వాయించడం ఆధారంగా.. ఆ యువతితో ఎస్సై అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సదరు యువతితో పాటు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు సైతం అతనిపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ట్రాఫిక్ ఎస్సైను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ట్రాఫిక్ ఉల్లంఘించిన సదరు యువతి.. ఆ ట్రాఫిక్ ఎస్సై తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. యువతి, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, చుట్టూ చేరిన కొందరు ఆ ట్రాఫిక్ ఎస్సైను ఉతికి ఆరేశారు. అయితే పక్కనే వైట్ డ్రెస్‌లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కొందరు ఆ ట్రాఫిక్ ఎస్సైను రక్షించే ప్రయత్నం చేశారు. COP ASSAULTED IN DELHI A traffic cop was assaulted in public in South #Delhi's Sangam Vihar. The cop was later dragged by his collar and slapped. @nagar_pulkit reports. pic.twitter.com/FY2Sn9JYyr — Mirror Now (@MirrorNow) June 8, 2022 #WATCH | Delhi: A man and two girls misbehaved with and manhandled Police and Traffic Police personnel. They were stopped as they were triple riding on a motorcycle that was coming from the wrong side and had no front number plate. (Source: Viral video, verified by Police) pic.twitter.com/1ZwP2iBI0N — ANI (@ANI) June 8, 2022 -
దళితులపై దాష్టీకం.. గుంజీలు తీయించి, ఉమ్మి నాకించి అవమానం
దేశంలో దళితులపై భౌతిక దాడులు జరుగుతునే ఉన్నాయి. ఇంకా గ్రామల్లో పెద్ద మనుషులు వారిపై దాష్టీకానికి తెగపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు ఓటు వేయలేదనే కోపంతో ఇద్దరు దళితులను దారుణంగా వేధించాడు. పైశాచింకంగా గుంజీలు తీయించి.. రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లో ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు సదరు దళితులు ఓటు వేయలేదని బల్వంత్ సింగ్ అనే వ్యక్తి వారిపై దాడికి దిగాడు. ఓటు వేయాలని వారికి డబ్బులు ఇచ్చానని, వారు ఓటువేకపోవటంతో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయానని దూషించాడు. వారిద్దని రోడ్డు మీదకు లాక్కొచ్చి.. ఓటు వేయనందుకు శిక్షగా గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా అవమానపరచాలని బలంవంతంగా రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బల్వంత్ సింగ్ అరెస్టు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. #Casteism A Dalit man made to do sit-ups, lick spit. A candidate for the post of Panchayat head, Balwant Singh, has been accused of blaming the Dalit community for his loss & beating up two people from the community as they allegedly did not vote for him.. pic.twitter.com/6102KQzeJZ — The Dalit Voice (@ambedkariteIND) December 13, 2021 -
కూతురు ప్రియుడితో కనిపించడంతో రోడ్డుపైనే..
యువతీయువకులు సాధారణంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించరు. కానీ, తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం తెలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారుతాయి. అటువంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలో ఓ తండ్రికి తన కుమార్తె మరో యువకునితో కనిపించింది. దీంతో కోపం తట్టుకోలేని ఆ తండ్రి రోడ్డు మీద బహిరంగా ఇద్దరిని పట్టుకొని ప్యాంట్‌కు ఉన్న బెల్టు తీసి చావబాదాడు. తన కుమార్తె ఆ యువకునితో తిరుగుతూ తప్పుడుగా ప్రవర్తిస్తోందని భావించాడా తండ్రి. అందుకే ఆగ్రహం తట్టుకోలేక ఇద్దరిపై దాడి చేశాడు. ఈ ఘటనను అక్కడ ఉన్న స్థానికులు వీడియోలో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. యువతి తండ్రిపై యువకుడు స్థానిక తిమర్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన దర్యాపు చేస్తున్నామని తెలిపారు. -
భార్యను వేధించొద్దన్నందుకు ఇనుప రాడ్‌తో దాడి
లక్నో: ప్రభుత్వాలు మహిళలు, యువతుల పట్ల వేధింపుల నిరోధానికి ఎన్ని కఠిన చట్టాలు చేసిన కొందరు యువకులలో మార్పు రావండం లేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురౌతున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీరట్‌లోని లిసారి గేట్ ప్రాంతంలో బాధిత మహిళ, తన భర్తతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో లిసారి ప్రాంతానికి చెందిన యువకుడు సదరు వివాహితను ప్రతిరోజు అనుసరించేవాడు. అంతటితో ఆగకుండా తన ఫోన్ నంబర్ ఇవ్వాలని విసిగించేవాడు. మొదట ఆ వివాహిత యువకుడిని పట్టించుకునేది కాదు. అయితే, క్రమక్రమంగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో నిన్న (గురువారం) బాధిత యువతి తన ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. అదును కోసం ఎదురుచూస్తున్న యువకుడు ఆమెను వెంబడించాడు. అంతటితో ఆగకుండా ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందే అని అసభ్యపదజాలంతో దూశించాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సదరు వివాహిత.. ఇంటికి వెళ్లి తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది. కాగా, భర్తతో కలిసి యువకుడి ఇంటికి వెళ్లి అతడిని గట్టిగా నిలదీశారు. అప్పటికే అతని ఇంట్లో మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. దీంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే స్నేహితులతో కలిసి అక్కడే ఉన్న ఇనుపరాడ్‌తో వివాహిత భర్తపై దాడిచేశాడు. అతను ఇంటి నుంచి బైటకు పరిగెత్తిన వెంబడించి మరీ గాయపర్చాడు. తీవ్రగాయాలపాలైన వివాహిత భర్త కిందపడిపోయాడు. కాగా, వివాహిత అరుపులు విన్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు వెంటనే బాధితుడిని మీరట్‌లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు నిందితులను గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: రమ్య హత్య కేసు: ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.. -
జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి పైశాచికత్వం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో 19 ఏళ్ల యువతిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కర్రలతో చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన సొంత తండ్రి, సోదరులే యువతిపై అమానుష దాడికి పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగుచూశాయి. వివరాలు.. గిరిజన తెగకు చెందిన ఒక యువతి మూడు నెలల క్రితం ఇంట్లోవాళ్లకు చెప్పకుండా తమ బంధువుల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి యువతి తండ్రి, సోదరులు ఆమెపై కోపంతో రగిలిపోతున్నారు. కాగా సదరు యువతి తన వాళ్లను చూసేందుకు జూన్ 28న తన సొంతూరుకు వచ్చింది. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న తండ్రి ఊరి పొలిమేరలోనే అడ్డుకొని దాడికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా కన్నకూతురనే జాలి లేకుండా ఆమె జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టేశాడు. అనంతరం యువతి సోదరులు ఆమెను కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన ఫోన్లో బంధించాడు. ఆ వీడియోలో యువతిని చితకబాదుతుంటే నవ్వుతూ చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు.ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఆమె తండ్రితో పాటు సోదరులను అరెస్ట్ చేశారు. -
అమానవీయం.. మంచినీళ్లు అడిగినందుకు
గాంధీనగర్: మంచినీళ్లు అడిగినందుకు ఓ కోవిడ్ పేషెంట్‌ని నర్సింగ్ సిబ్బంది చితకబాదిన వీడియో నిన్నటి నుంచి అన్ని మీడియా చానెళ్లలో ప్రసారం అవుతుంది. ఈ సంఘటన పది రోజుల క్రితం చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితుడు మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు.. ప్రభాకర్ పాటిల్ అనే వ్యక్తి రాజ్‌కోట్ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షల అనంతరం అతడి కిడ్నీలో నీరు చేరిందని ఆపరేషన్ చేయాలని తెలిపారు వైద్యులు. దాంతో ప్రభాకర్ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాడు. సమస్య తీరిపోయింది అనుకుంటుండగా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దాంతో వైద్యులు అతడికి కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ప్రభాకర్ సెపప్టెంబర్ 8న రాజ్‌కోట్ కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. (చదవండి: ‘ఆ సమయంలో నా బలం, ధైర్యం మీరే’) ఈ క్రమంలో తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా నర్సింగ్ సిబ్బందిని కోరాడు. దాంతో వారు ప్రభాకర్‌పై దాడి చేశారు. మీడియాలో తెగ వైరలయిన ఈ వీడియోలో నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు కలిసి ప్రభాకర్ మీద దాడి చేయడం చూడవచ్చు. అతడిని కిందపడేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి ప్రభాకర్‌పై కూర్చుని ఉండగా.. మరొకరు అతడిని చెంప మీద కొట్టారు. కామ్‌గా ఉండమని ఆదేశించారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరో విచారకరమైన విషయం ఏంటంటే.. ప్రభాకర్ ఈ నెల 12న మరణించాడు. దీని గురించి అతడి సోదరుడు విలాస్ పాటిల్ మాటట్లాడుతూ.. ‘గత శనివారం నా సోదరుడు మరణించాడు. అంతకు ముందే సిబ్బంది తనని దారుణంగా కొట్టారు. మరణించిన అనంతరం తన మృతదేహాన్ని కూడా మాకు అప్పగించలేదు. ప్రోటోకాల్ ప్రకారం తనకి అంత్యక్రియలు చేయలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, అమానవీయ ప్రవర్తన కారణంగానే తను మరణించాడు. ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని’ విలాస్ పాటిల్ డిమాండ్ చేశాడు. (చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా) ఇక దీని గురించి ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. సదరు రోగి మెంటల్ కండీషన్ సరిగా లేదు. వైద్యం చేయడానికి సహకరించడం లేదు. ఈ క్రమంలో తనకు లేదా ఇదరులకు గాయాలు కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే తనని అడ్డుకున్నాం తప్ప కొట్టడం, తోయ్యడం వంటివి చేయలేదు అన్నారు. -
వైరల్: జనాలపై విచక్షణారహితంగా దాడి
లక్నో: మాస్క్ డ్రైవ్ చెకింగ్‌లో భాగంగా ఓ సీనియర్ ఉద్యోగి, అతడి బృందం జనాలపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దాంతో సదరు సీనియర్ అధికారిపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరగింది. వివరాలు.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌదరి, అతని బృందం మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులను ఒక దుకాణం నుంచి బలవంతంగా బయటకు నెట్టి, కర్రలతో కొట్లారు. ఆ వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే.. కొట్టడానికి గల కారణం తెలపాల్సిందిగా హోం గార్డులను కోరారు. కానీ వారు ఇదేమి పట్టించుకోకుండా వ్యక్తుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారులు బల్లియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌద్రేను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అధికారులు అతడిని విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం) -
ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు
వడోదర : 16 ఏళ్ల గిరిజన యువతి ప్రియుడితో పారిపోయి తమ పరువు తీసిందన్న కారణంతో ఆమెను తన కన్నతండ్రి ఎదుటే విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లా బిల్వంత్ గ్రామంలో మే 21న చోటుచేసుకుంది. వివరాలు.. బిల్వంత్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన యువతి అదే ఊరికి చెందిన ఒక యువకుడితో మధ్యప్రదేశ్‌లోని తన బంధువుల ఇంటికి పారిపోయింది. అనంతరం కొద్ది రోజులకు తిరిగివచ్చిన యువతిని ఆ ఊరి గ్రామస్తులు ఊరి బయటే అడ్డుకున్నారు. తక్కువ కులంలో పుట్టడమే గాక యువకుడితో పారిపోయి కులం పరువు తీశావంటూ తాడుతో కట్టేసి ముగ్గురు గ్రామస్తులు ఆమెను విచక్షణారహితంగా చితకబాదారు. ఒకరు చితకబాదుతుంటే మరొకరు వీడియో తీశారు. మొదట ఆ యువతిని ఇద్దరు పట్టుకోగా మరొకరు కట్టెతో యువతి శరీరంపై విచక్షణారహితంగా కొట్టాడు. తర్వాత యువతిని కింద పడేసి కాలి బూట్లతో ముఖం మీద, వీపు మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ దాడికి పాల్పడ్డారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..) ఈ ఘటన జరుగుతున్నంతసేపు అక్కడే ఉన్న తండ్రి తన కూతురిని చావగొడుతున్నా ఏం చేయలేక చూస్తు ఉండిపోయాడు. కాగా మే21 న ఈ ఘటన జరిగినా యువతిని చావగొట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు యువతి తండ్రితో రంగాపూర్ పోలీస్ స్టేషన్లొ అధికారిక ఫిర్యాదును నమోదు చేయించారు. యువతిని చితకబాదిన వారిలో దేశింగ్ రత్వా, భిప్ల ధనుక్, ఉడేలియా ధనుక్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై మైనర్‌పై విచక్షణరహిత దాడికి పాల్పడినందుకు ఫోక్సో చట్టంతో పాటు మరో 16 క్రిమినల్ కేసులు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు యువతిని చితకబాదుతున్న సమయంలో ప్రేక్షకపాత్ర వహించిన 13 మందిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వీడియో కోసం -
తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..
హరిద్వార్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొందరు తలకిందులుగా చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగుచూసింది. చెట్టుకు తలకిందులుగా వ్యక్తిని వేలాడదీసిన ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గత వారంలోనూ మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణలపై ఓ టీనేజర్‌ను దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన బాధితుడు మరణించిన సంగతి తెలిసిందే. స్ధానికులు అతడిని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకువచ్చి మూక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తమ స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారని, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆ తర్వాత కేసు నమోదు చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
నెల జీతం అడిగిన పాపానికి యువతిపై దాడి
-
పైప్‌కు కట్టేసి.. దారుణంగా హింసించి
డెహ్రడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నేపంతో సీనియర్లు ఓ విద్యార్థిని కొట్టి చంపారనే వార్త డెహ్రడూన్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు సదరు విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే ఖననం చేసింది. స్థానిక మీడియా ప్రోద్బలంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకెళ్తుండగా బాధితుడు దగ్గర్లోని కిరాణ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఉపాధ్యాయులకు తెలిపాడు. దాంతో ఔటింగ్ క్యాన్సల్ అయ్యింది. బాధితుడి వల్లే ఇలా జరిగిందని భావించిన సీనియర్ విద్యార్థులు అతన్ని ఒక క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. బాధితుడి కాళ్లు చేతులను ఓ పైప్‌కి కట్టి బ్యాట్, స్టంప్స్ తీసుకోని విపరీతంగా కొట్టారు. అంతేకాక సదరు విద్యార్థి బట్టలు తొలగించి చల్లని నీటిలో ముంచారు. అంతటితో ఊరుకోక కుర్కురే చిప్స్‌ని, బిస్కెట్లని టాయిలెట్ వాటర్‌లో ముంచి తినమని బలవంతం చేశారు. దెబ్బల ధాటికి తట్టుకోలేక సదరు విద్యార్థి చేసిన ఆక్రందనలు పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థులు కానీ.. ఉపాధ్యాయులు కానీ వినిపించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సదరు విద్యార్థి ఒంటరిగా అదే గదిలో పడి ఉన్నాడు. సాయంకాలం వార్డెన్ ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కితే ప్రమాదం అని భావించిన పాఠశాల యాజమాన్యం సదరు బాలుడి మృతదేహాన్ని పాఠశాలలోనే ఖననం చేసింది. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫుడ్ పాయిజన్ వల్ల మీ అబ్బాయి చనిపోయాడని తెలిపారు. కానీ స్థానిక మీడియా విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేయడం.. యాజమాన్యం కూడా బయటి వారిని లోపలికి అనుమతించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో వారు పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరు ఇంటర్ విద్యార్థులతో పాటు ముగ్గురు పాఠశాల సిబ్బందిని, వార్డెన్ని కూడా అరెస్ట్ చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య
సాక్షి, ముంబై : బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ తోడ్సమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెండో భార్యతో కలిసి ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రాజు నారాయణ మొదటి భార్యతో తల్లి కూడా రోడ్డుపైనే ఆయనను చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజు నారాయణ తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన అక్కడికి చేరుకున్నారు. వారిని వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం ఈ ఘటనపై స్పందించిన రైతు నాయకుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ.. ‘ ఓ ప్రజాప్రతినిధి ఇలా సిగ్గులేకుండా మరో మహిళతో ఉంటూ తన భార్యకు అన్యాయం చేస్తున్నారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్చనకు, ఆమె ఇద్దరు పిల్లలకు 48 గంటల్లోగా న్యాయం చేయాలి. లేనిపక్షంలో శనివారం ఇక్కడి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. ఇక బీజేపీ ట్రైబల్ వింగ్ చీఫ్ అంకిత్ మాట్లాడుతూ రాజు నారాయణ తన మొదటి భార్యకు న్యాయం చేయకపోతే ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో వేదిక పంచుకోనివ్వమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా వ్యతిరేకత మూటగట్టుకుంటే రాజు నారాయణ వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా పొందలేరని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ విషయం గురించి పోలీసు అధికారి డీఎస్ తెంబరే మాట్లాడుతూ.. ఘటన జరిగిన తర్వాత ఇరువర్గాలు పోలీసు స్టేషనుకు వచ్చాయని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
పట్టపగలు అందరూ చూస్తుండగానే.. కర్రలతో దాడి
-
ముసుగులు ధరించి దాడి.. వీడియో వైరల్ !
మథుర: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని కొంతమంది ముసుగులు ధరించి కర్రలతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి.. ‘ కొద్దికాలంగా ఓ వ్యక్తి నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి. గత హోలీ వేడుకల సమయంలో అతనిపై నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అందుచేతనే వారు ఈ దారుణానికి దిగారు’ అని బాధితుడు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి అరెస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ దాడిపై నెటిజన్లు మండిపడ్డారు. ఎన్కౌంటర్ చేసే పోలీసుల ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. వావ్.. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్ అడర్ అభివృద్ది చెందిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. -
అమానుషం.. కొడుకు పెట్టే హింస భరించలేక...
జైపూర్ : వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు చేయటం ఆ కొడుకు భారమైపోయింది. అమానుషానికి తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కన్న కొడుకు పెట్టే హింసను కొన్ని రోజులు భరించిన తల్లి చివరకు ప్రాణాలు వదిలింది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జోగేంద్ర చౌదరి స్థానికంగా ఓ స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . తండ్రి చనిపోవటంతో తల్లి కొడుకు జోగేంద్ర వద్దకు చేరింది. అయితే వయో భారం, పైగా ఈ మధ్యే పక్షవాతం సోకటంతో ఆమె సొంతగా పనులు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంట్లో వాళ్ల సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలో జోగేంద్రకు.. అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తల్లిని హింసించటం ప్రారంభించాడు. ఆ బాధలను భరించలేక తొమ్మిది రోజుల క్రితం ఆ కన్నతల్లి కన్నుమూసింది. అయితే ఆమె మనవడు మాత్రం జోగేంద్ర ఓరోజు తల్లిని హింసిస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయి చివరకు విషయం పోలీసుల దాకా చేరటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అమానుషం.. కొడుకు పెట్టే హింస భరించలేక...
-
తప్పు చేసి నీదే తప్పని చితక్కొట్టింది!
మారేడుపల్లి: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద శనివారం ఓ మహిళ హంగామా సృష్టించింది. హోండా యాక్టివాపై వస్తున్న మహిళ ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో ఆటోడ్రైవర్ ఆటోను పక్కకు నిలిపివేశాడు. పడిపోయిన లేచిన మహిళ.. ఆటో ర్యాష్‌గా నడుపుతావురా.. అంటూ డ్రైవర్ షర్ట్ కాలర్ పట్టుకుని ఎడాపెడా కొట్టింది. అతడు తన తప్పు లేదంటూ కాళ్లు మొక్కుతూ ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. మా వాళ్లు వస్తున్నారు.. నీ సంగతి చెప్తా.. అంటూ డ్రైవర్‌ను నిలువరించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటో డ్రైవర్ తప్పు లేదని స్థానికంగా ఉన్న వారు మహిళతో వాగ్వాదానికి దిగారు. సడన్ బ్రేక్ వేయటంతోనే యాక్టివా అదుపు తప్పి కింద పడిందని డ్రైవర్‌ను ఎందుకు కొడుతున్నావంటూ ఆమెను నిలదీశారు. డ్రైవర్‌కు మద్దతుగా తాము కూడా పోలీస్‌స్టేషన్‌కు వస్తామని చెప్పడంతో మహిళ అతడిని వదిలేసి వెళ్లిపోయింది. సమాచారం అందించినా పోలీసులు అక్కడికి రాలేదు. -
బైక్ ఓవర్ టేక్ చేశాడని
-
నైజీరియన్‌పై దాడి, విదేశాంగ శాఖ సీరియస్
హైదరాబాద్: జాతి విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే వాదనల నేపథ్యంలో నగరంలో నైజీరియాకు చెందిన ఓ యువకుడిపై దాడి జరిగింది. పార్కింగ్ కు ఖాళీ లేకుండా వాహనాన్ని అడ్డుపెట్టాడనే నెపంతో ఓ హైదరాబాదీ...నైజీరియన్ ను ఇనుపరాడ్డుతో చితక్కొట్టిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన విదేశాంగ మంత్రిత్వ శాఖ కేసుకు సంబంధించిన వివరాలను తమకు పంపాలని హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసింది. బుధవారం జరిగిన ఈ దాడిలో నైజీరియా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశీయులపై ఇటువంటి దారుణాలకు ఒడిగడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ హెచ్చరించారు. ఈ విషయంపై ఆఫ్రికా రాయబారితో చర్చించినట్లు వివరించారు. ఆఫ్రికా జాతీయులపై దాడులు జాతి విద్వేషాలకి చెందినవి కావని చెప్పినట్లు తెలిపారు. వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలనీ ముఖ్యంగా కాంగో లాంటి ప్రాంతాల్లో నివసించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో ఫ్రెంచ్ టీచర్ ఒలివర్ హత్యకు వ్యతిరేకంగా కాంగో వాసులు నినాదాలు చేస్తుండటంతో ఆయన అక్కడి భారతీయులకు భద్రతపై జాగ్రత్తపడాలని సూచించారు. ఒలివర్ హత్యకేసును విచారించిన పోలీసులు ఒలివర్ కు దుండగులకు మధ్య ఆటోలో గొడవ జరిగినట్లు గుర్తించారు. -
దేశ రాజధానిలో దారుణం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన దుండగులు 16 ఏళ్ల బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఇందరపురిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మద్యం మత్తులో బాలుడి బట్టలు విప్పించి దారుణంగా కొట్టారని డీసీపీ(నైరుతి) సురేందర్ కుమార్ తెలిపారు. అకారణంగా కొట్టినందుకు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అయితే బాధితుడిపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాలుడి కాళ్లుచేతులు కట్టేసి కొట్టినట్టు వీడియోలో కనబడుతోంది. అతడు కొట్టొద్దని వేడుకుంటున్నా వినకుండా హింసించారు. ఈ వీడియోను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాలుడిపై లైంగిక దాడి జరిగిందని అతడి బంధువులు ఆరోపించారని, ఈ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. -
ఇంటిపని చేయని అమ్మాయిలందరిని..
జింద్: ఇంటిపని చేయలేదని విద్యార్థినులను చితక బాదిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులకు తీవ్ర గాయాలవడంతో వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఆ టీచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జింద్ జిల్లాలోని లిజ్వానా అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో చదువుతున్న ఏడో తరగతి అమ్మాయిలు హోం వర్క్ పూర్తి చేయలేదని కారణంతో క్లాస్ ఉపాధ్యాయురాలు వారిని కర్రతతో చితక్కొట్టడమే కాకుండా బెంచిలపై నిల్చోబెట్టింది. దీంతో ఆ పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పిల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. -
మహిళపై దౌర్జన్యం..ముగ్గురు అరెస్ట్!
పూనెః యువతిపై దాడికి దిగిన ఐదుగురు యువకుల్లో ఎట్టకేలకు పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తనపై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వారం రోజులుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించేందుకు, ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది రోజులక్రితం జరిగిన ఘటనలో పూనేకు చెందిన 22 ఏళ్ళ మహిళా అడ్వర్ టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారు. కారులో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమ కుటుంబాల్లోని మహిళలు, బాలికలు ఎవ్వరూ కురచ దుస్తులు వేసుకోకూడదని, పర పురుషులతో కలసి ప్రయాణించకూడదని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేసేందుకు వారం రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. అయితే ఏ ఒక్కరూ ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించని ముగ్గురు పోలీసులపై కూడ తాము చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ రష్మి సుక్లా తెలిపారు. మే 1వ తేదీన ఇద్దరు మగ కొలీగ్స్ తో కలసి కారులో వెడుతున్నబాధితురాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో మరో కారులో వెడుతున్న ఐదుగురు యువకులు ఆమెపై వేధింపులకు దిగారు. కారును చుట్టుముట్టి, తెరచి ఉన్న విండోనుంచి ఉమ్ము వేయడమే కాక, డోర్ తెరచి ఆమెను బలవంతంగా కారు నుంచి బయటకు లాగి, ఆమె అపార్ట్ మెంట్ కు ముందే తీవ్రంగా కొట్టి అక్కడినుంచి జారుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, సహాయంకోసం తన బంధువులకు, మిత్రులకు ఫోన్ చేస్తున్న ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. నీ ఇల్లు అడ్రస్ తెలిసిందని, తర్వాత నీ సంగతి చూస్కుంటామని, నువ్వు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని, తమకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అయితే ఇంత జరిగినా ఘటనలో ఎటువంటి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ దొరకక పోవడం విశేషం. -
పిల్లలపై దాడి, నగ్నంగా ఊరేగింపు
జైపూర్ : రాజస్థాన్ లో ముగ్గురు దళిత బాలురను నగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోటార్ సైకిల్ దొంగిలించాడనే ఆరోపణలతో వీరిపై అగ్రకులానికి చెందిన వ్యక్తులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. చిత్తోర్ ఘడ్ లోని బస్సీ గ్రామంలో ఈ భయంకరమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మరోవైపు నిందితులపై ఎలాంటి చర్య చేపట్టని పోలీసులు, బాధితులపై కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించడం వివాదాన్ని రేపింది. వివరాల్లోకి వెళితే అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు పిల్లలను మండుటెండలో ఓ చెట్టుకు కట్టేసి, విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో వారి ప్రకోపం చల్లారలేదు. 42 డిగ్రీల ఎండలో నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. బాధతో బాధితులు హాహాకారాలు చేసినా, వదిలిపెట్టమని వేడుకున్నా కనికరించలేదు. వారి ఆగడాలతో చుట్టూ ఉన్న ప్రజలు కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. సుమారు గంటసేపు ఈ తతంగం నడిచింది. ఒక గంట తర్వాత వచ్చిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...పిల్లలను విడిపించి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బైక్ దొంగతనం కేసులో బాలురను అరెస్టు చేశారు. విచారణ సమయంలో బైక్ దొంగిలించినట్టుగా అంగీకరించారని, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి గజ్ సింగ్ తెలిపారు. అటు దాడి ఘటనలో అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి..
ఉత్తరప్రదేశ్‌లోని దబౌలి గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. భూవివాదంలో పోలీసులకు ఫిర్యాదుచేశారనే అక్కసుతో ఓ దళిత బాలుడిని దారుణంగా అవమానించారు. అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడనే ఆగ్రహంతో అతడికి గుండుకొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పారు. స్థానిక ఇటుకబట్టీ యజమాని, మరో ఇద్దరు ఉద్యోగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే ఇటుకబట్టీ నిర్వహించే స్థలానికి పక్కనే ఉన్న బాధితుల పూర్వీకుల భూమిని కబ్జా చేయడానికి వీరేంద్ర ప్రయత్నించడంతో వివాదం రాజుకుంది. తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాడంటూ దళిత బాలుని తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సదరు యజమాని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీ యజమాని వీరేంద్ర కుమార్ మిశ్రాతో పాటు మిగిలిన ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీస్ అధికారి తెలిపారు. -
ఇంట్లో పనిచేయలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్
గుంటూరు (పెదనందిపాడు): తన ఇంట్లో పనులు చేయటం లేదని ఓ వ్యాయామోపాధ్యాయుడు విద్యార్థినిని చితకబాదిన సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, అబ్బినేనిగుంటపాలెంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని చౌటురి శ్రావణి మాకినేని రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తన ఇంట్లో పనులు చేయాలంటూ వ్యాయామోపాధ్యాయుడు గోపి విద్యార్థిని శ్రావణిని తరచూ వేధిస్తున్నాడు. అయితే శ్రావణి పనులు చేయటానికి వెళ్లకపోవటంతో ఆగ్రహం చెందిన వ్యాయామోపాధ్యాయుడు చెప్పిన మాట వినవా అంటూ.. బెత్తంతో ఇంటి చుట్టూ తిప్పించి మరీ కొట్టాడు. అనంతరం నొప్పులు తగ్గటానికి మందు బిళ్లలు ఇచ్చి ఇంటికి పంపించాడు. అయితే శ్రావణికి జ్వరం వచ్చి శుక్రవారం పాఠశాలకు వెళ్లలేదు. విద్యార్థిని బాధ పడుతున్నట్టు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా, శ్రావణి కంట తడిపెట్టి జరిగిన విషయాన్ని వివరించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని బెదిరించాడని విద్యార్థిని విలపిస్తూ చెప్పింది. తన ఇంట్లో పనులు చేయకపోతే ఏదోక నెపంతో కొడుతున్నాడని విద్యార్థిని తెలిపింది. గతంలో ఇలా పలువురు విద్యార్థినులను కొట్టగా వారు బడి మానేశారని వివరించింది. హెచ్ఎంకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విద్యార్థిని తండ్రి వాపోయారు. గతంలో 9 తరగతి విద్యార్థిని వుల్లంగుల విజయలక్ష్మిని డస్ట్ ఎత్తలేదని బెత్తతంలో మోకాలి పైభాగాన కొట్టాడని, దీంతో ఆ విద్యార్థిని నడవలేకయిందని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా వారిని చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు గోపి గోడ దూకి పారిపోయాడని వారు చెప్పారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాయల సుబ్బారావును వివరణ కోరగా.. విద్యార్థుల చేత లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నానని, వ్యాయామ ఉపాధ్యాయుడు అందుబాటులో లేడని, ఆతను రాగానే మోమో అందజేస్తానని, ఈ విషయాన్ని విధ్యాశాఖ ఉన్నాతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. ఇక నుంచి పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తానని హెచ్ఎం హమీ ఇవ్వడంతో వారు వెనుతిరిగి వెళ్లారు. -
సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడి
బీహార్ సీఎం జీనత్రాం మాంఝీ మనవడు అమిత్ మాంఝీపై కొందరు మద్యం వ్యాపారులు దాడి చేశారు. బుధవారం రాత్రి మధుబన్ జిల్లా రాణిపూర్‌లో పర్యటించిన అమిత్‌పై స్థానిక మద్యం వ్యాపారులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ప్రస్తుతం ఆయన సదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా,తమపై తరచూ పోలీసులు దాడులు జరుపడానికి సీఎం మనవడు అమిత్ మాంఝీనే కారణమని మద్యం వ్యాపారులు భావించడం వల్లే ఈ దాడి జరిగినట్లు తెలిసింది. -
ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి
ఇండోర్: అనుమతి లేకుండా తన సైకిల్ తొక్కిందని ఏఎస్ఐ వేధించడంతో ఆత్మాహుతికి యత్నించిన పదకొండేళ్ల బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. రెండు రోజుల పాటు మత్యువుతో పోరాడిన బాలిక చివరకు తనువు చాలించింది. ఈ ఘటన ఇండోర్‌లో జరిగింది. గతనెల 29న స్థానిక సికింద్రాబాద్ కాలనీలో ఉంటున్న ఏఎస్ఐ ప్రకాష్ జరోలియాకు చెందిన సైకిల్‌ను యాస్మిన్ నడిపింది. తన అనుమతి లేకుండా యాస్మిన్ సైకిల్ నడపడంతో కోపోద్రిక్తుడైన జరోలియా ఆ బాలికను కొట్టడంతోపాటు, బాలిక, ఆమె తల్లిదండ్రులపై సైకిల్ దొంగతనం కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులతో భయపడ్డ యాస్మిన్ తన ఇంటిలో ఆత్మాహుతికి యత్నించింది. వంద శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.