మారేడుపల్లి: సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద శనివారం ఓ మహిళ హంగామా సృష్టించింది. హోండా యాక్టివాపై వస్తున్న మహిళ ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో ఆటోడ్రైవర్ ఆటోను పక్కకు నిలిపివేశాడు. పడిపోయిన లేచిన మహిళ.. ఆటో ర్యాష్‌గా నడుపుతావురా.. అంటూ డ్రైవర్ షర్ట్ కాలర్ పట్టుకుని ఎడాపెడా కొట్టింది.
అతడు తన తప్పు లేదంటూ కాళ్లు మొక్కుతూ ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. మా వాళ్లు వస్తున్నారు.. నీ సంగతి చెప్తా.. అంటూ డ్రైవర్‌ను నిలువరించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటో డ్రైవర్ తప్పు లేదని స్థానికంగా ఉన్న వారు మహిళతో వాగ్వాదానికి దిగారు. సడన్ బ్రేక్ వేయటంతోనే యాక్టివా అదుపు తప్పి కింద పడిందని డ్రైవర్‌ను ఎందుకు కొడుతున్నావంటూ ఆమెను నిలదీశారు. డ్రైవర్‌కు మద్దతుగా తాము కూడా పోలీస్‌స్టేషన్‌కు వస్తామని చెప్పడంతో మహిళ అతడిని వదిలేసి వెళ్లిపోయింది. సమాచారం అందించినా పోలీసులు అక్కడికి రాలేదు.
తప్పు చేసి నీదే తప్పని చితక్కొట్టింది!
Published Sat, Jul 30 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
Advertisement
Advertisement