Dalit Man Thrashed With Slippers For Denying Free Chicken In UP - Sakshi
Sakshi News home page

అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..

Published Sun, Aug 13 2023 1:05 PM | Last Updated on Sun, Aug 13 2023 2:13 PM

Dalit Man Thrashed With Slippers For Denying Free Chicken In UP - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్‌వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. 

ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్‌ కేసులో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement