slippers
-
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్
భావ్‌నగర్: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్‌పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
ఔనా..! స్లిప్పర్స్‌కు లక్ష!
మీరు విన్నది నిజమే! మన రెగ్యులర్‌గా ఉపయోగించే స్లిప్పర్స్ సౌదీలో అక్షరాలా లక్షకు పైమాటే! కువైట్, చుట్టుపక్కల న్యూస్ పంచుకునే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు ఒక స్టోర్‌లో రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేసింది. ‘అత్యాధునికమైనవి’గా ‘చెప్పు’ కుంటున్న ఈ స్ల్లిప్పర్స్ ధర 4,590 సౌదీ రియాల్స్ పలుకుతోంది. ఇది మన రూ΄ాయలలో లక్షా రెండువేలకు పైగానే! ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో సహా వివిధ రంగులలో ఉన్న స్లిప్పర్స్ జతలను ఓ ఉద్యోగి గ్లాస్ కేస్‌లోంచి తీసి వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తికి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు... ‘ఇవి మా కుటుంబం వాడే బాత్రూమ్ చెప్పులు’ అని, ‘ఇండియాలో వీటిని టాయిలెట్ ΄ాదరక్షలుగా ఉపయోగిస్తారనీ కామెంట్ చేస్తున్నారు. -
చెప్పుల దండతో ఎన్నికల ప్రచారానికి..
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్‌లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్‌లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్‌కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. అలీఘర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. #WATCH | Aligarh, UP: Independent candidate from Aligarh Pandit Keshav Dev has been allotted 'slippers' as the election symbol. After which, he was seen carrying out the election campaign wearing a garland of 7 slippers around his neck. (08.04) pic.twitter.com/V0Hm8JYRmC — ANI (@ANI) April 8, 2024 -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
గ్రామ సర్పంచ్ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
వెంబడించి వేధించడంతో..పోకిరిని చెప్పుతో..
కాలేజీ నుంచి హాస్టల్‌కి వెళ్తున్న విద్యార్థిని ఓ వ్యక్తి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. ఓపిక నశించిన ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని హాస్టల్ నుంచి కాలేజికి వెళ్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె అందరి ముందే అతడి చెంప చెల్లుమనిపించింది. తన కాలికి ఉన్న చెప్పుతో అతడి ముఖంపై ఎడాపెడా వాయించి తన కోపం తీర్చుకుంది. ఇక ఆ యువకుడు చేసేదేం లేక చూస్తు కూర్చున్నాడు. తనను వదిలేయమని ప్రాథేయపడ్డాడు. అయితే స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నజీర్‌గా గుర్తించారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..) -
అల్లుడు బైక్ అడిగినందుకు చెప్పుదెబ్బలతో సాగనంపిన మామ
-
అలియా చెప్పులు మోసిన రణ్‌బీర్..నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ క్యూట్ కపుల్లో రణబీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. ఈ జంట ఏ పని చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని, కామెంట్స్‌ని పట్టించుకోకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. సినిమాల వరకే స్టార్స్‌లా ప్రవర్తిస్తారు కానీ.. నిజ జీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు. తాజాగా ఈ జంట, ముఖ్యంగా రణ్‌బీర్ ట్రోల్స్‌కి గురవుతున్నారు. దానికి కారణంగా రణబీర్.. అలియా చెప్పులను మోయడమే. భార్య చెప్పులను భర్త మోస్తే తప్పేంటని అనుకుంటున్నారా?... అయితే పూర్తి కథనం చదవండి. గత గురువారం (ఏప్రిల్ 21) ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులంతా ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఇక రణ్‌బీర్, అలియాభట్ జంట కూడా కాస్త ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే క్రమంలో అలియా తన చెప్పులను గుమ్మం ముందు విడిచి వెళ్లింది. వెనకే వచ్చిన రణ్‌బీర్ ఆ చెప్పులను చేతులతో పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టాడు. (చదవండి: నగ్న వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్ ఫైర్) ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ట్రోలింగ్‌కు కారణం ఏంటంటే.. రణ్‌బీర్ ఆ చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు పెట్టడమే. భార్య చెప్పులు మోయడం తప్పుకాదు.. కానీ వాటిని గుడిముందు పెట్టడం ఏంటి? అలియా ఆలోచించే ఆ చెప్పులను మెట్ల ముందు వదిలింది. కానీ రణ్‌బీర్ మాత్రం తెలివితక్కువ పని చేశాడు. పైగా అతను చెప్పులతో లోపలికి వెళ్లాడు’ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’
బెంగళూరు: రోడ్లు, బస్సులు, రైళ్లల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు, యువతులు మహిళలు అనే తేడా లేకుండా పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఓ మహిళ మందుబాబును ఊరికే వదలకుండా అందరి ముందే బడిత పూజ చేసింది. ధార్వాడ్ జిల్లాలో ఫుల్‌గా తాగిన ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న మహిళలను అడ్డగించి వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అంతేగాక వారి ఫోన్ నెంబర్లు అడుగుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ మహిళ అతడిని పట్టుకొని ఏకంగా చెప్పుతో కొట్టింది. నడి రోడ్డుపై కూర్చొబెట్టి అతడి తల, ముఖంపై దాడి చేసింది. అందరూ చూస్తుండగానే అతడి ముఖాన్ని పచ్చడి చేసింది. చట్టు పక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. మహిళ పిచ్చి పిచ్చిగా కొడుతున్నా.. సదరు వ్యక్తి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL — Imran Khan (@KeypadGuerilla) December 30, 2022 -
వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే!
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఫన్నీ, సందేశాత్మకం, డ్యాన్స్, జంతువులు.. ఇలా చాలా రకాలైనవి ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఓ బిల్డింగ్ సమీపంలో కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు మధ్య వయసు ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ బద్ద శత్రువుల కంటే దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ చితకొట్టుకున్నారు. ఇంతలో ముసలాయన తన చెప్పు తీసి ఎదుటి వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నింస్తుండగా మరో వ్యక్తి సైతం చెప్పుతో దాడి చేశాడు. ఇలా కాసేపు వీరిద్దరూ చెప్పులతో ముఖాలను వాయించుకున్నారు.ఎవరూ తగ్గకుండా సాగిన వీరి పోరాటం చివరికి హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది -
మెడికల్ చెకప్‌కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): పెద్దల కాలంలో కిర్రు చెప్పులు రకరకాల రంగుల్లో తయారు చేయించి వేసుకొని వీధుల్లో తిరుగుతుంటే కిర్ కిర్ మంటూ వచ్చే శబ్దం అదో హోదాగా భావించేవారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, అమ్మవారి కొలుపులు, ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇలాంటి చెప్పులు వాడేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలు వాడే పాదరక్షల విషయంలో పెను మార్పులు చేటు చేసుకున్నాయి. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. కానీ నేటికి అలనాటి కిర్రు చెప్పులపై మోజు తీరని కొందరు పల్లెవాసులు వాటిని వాడుతుండటం విశేషం. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఎల్లమ్మ కొలుపుల వేడుకల్లో రెట్టపల్లి గ్రామానికి చెందిన నాలి పెద్దన్న కిర్రు చెప్పులతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. రూ.3 వేలు ఖర్చుపెట్టి చెప్పులు తయారు చేయించానని సాక్షితో ముచ్చటించారు. -
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..
సాక్షి ముంబై: సాతారా జిల్లాకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడైన ఓ గొర్రెల కాపరి చెప్పులు ఇప్పుడు వార్తల్లోకెక్కాయి. ఈయన కాళ్లకు వేసుకునే చెప్పులు ఎనిమిది కిలోల బరువుతోపాటు నాగుపాము పడగ రూపంలోని ప్రత్యేక డిజైన్‌లో, బంగారు రంగులో ఉండటంతో ఈ చెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో ఉన్న ఈ చెప్పులు రూ. 31 వేల విలువ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాదరక్షలు హల్చల్ చేస్తున్నాయి. సాతారా జిల్లా మాణ్ తాలూకాలోని జాంభుళణీ గ్రామంలో వృత్తి రీత్యా గొర్రెల కాపరి అయిన కెరాప్పా కోకరే ఈ చెప్పులు తయారు చేయించుకున్నారు. పొలాల్లో, కాలిబాటల్లో అత్యధిక సమయం గడిపే ఆయన వేషధారణ సైతం ప్రత్యేకంగా ఉంది. ధోతీ, చొక్కా, నెత్తిపై పసుపు రంగులో ఉండే పంచెతో కట్టిన తలపాగా (పగిడి)తోపాటు గ్రామీణ వస్త్రధారణతో ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పరిసరాల్లో జరిగే ‘గాజీ’ నృత్య ప్రదర్శనలో కెరప్పా కోకరే ఈ చెప్పలు వేసుకుని చిందులు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చెప్పులను ఆయన ప్రత్యేకంగా ఆక్లూజ్లో తయారు చేయించుకున్నారు. కెరప్పా కొకరే ధరించే ఈ చెప్పులలో 100 ఎల్ఈడీ లైట్లు, గోండాలు, 100 గజ్జెలు, నట్‌బోల్టులు, గాజు బిళ్లలు, బ్యాటరీ తదితరాలున్నాయి. చదవండి: ('ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర') ముఖ్యంగా బంగారు రంగులో ఉండే ఈ చెప్పులు, ఉదయం, రాత్రి సమయాల్లో వైవిధ్యంగా కనిపిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చెప్పుల కారణంగా కోకరే కెరప్పా తన గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చర్చల్లోకెక్కారు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే కోకరే కొరప్పాకు చెప్పులతోపాటు ప్రత్యేక వేషధారణ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన 60 ఏళ్ల వయసులో కూడా చెప్పులు, వేషధారణ అంతా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. స్వగ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కార్యక్రమాలలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గాజి నృత్య ప్రదర్శనలో తనదైన నృత్యరీతిలో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది కిలోల బరువుతో, రూ. 31 వేల విలువైన ప్రత్యేక పాదరక్షలతో ఓ సెలబ్రిటీ అయిపోయారు. -
మొసలిని చెప్పుతో తరిమి కొట్టిన మహిళ.. వైరల్ వీడియో
నీటిలో, నేల మీద జీవించే జీవుల్లో మొసలి ఒకటి. మొసలికి నీటిలో అమితమైన బలం ఉంటుంది. పెద్ద ఎనుగును కూడా ఈడ్చి పడేస్తుంది. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. నేల మీద మొసలి జీవించలగలదు కానీ బలం అంతగా ఉండదు. అయితే నదిలో ఉన్న మొసలి ఒడ్డున ఉన్న కుక్క పిల్లను తినేయాలని చూస్తుంది. ఇంతలో ఓ మహిళ తన చెప్పు తీసి మొసలిని బెదిరించేసరికి తోకముడిచి వెనక్కి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రెడ్ షుల్ట్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా? ఈ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నద వద్ద నిలబడి ఉంది. ఈ నదిలో చాలా మొసళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కా గా మహిళ కుక్క అక్కడక్కడే తిరుగుతూ ఉండగా దాన్ని చూసిన మొసలి వేగంగా ఒడ్డు వద్దకు వస్తుంది. అలా వస్తున్న మొసలిని చూసిన మహిళ ఇసుమంత కూడా భయపడకుండా దాన్ని అలాగే చూస్తూ నిల్చుంటుంది. ఆ మొసలి దగ్గరి దాక వచ్చాక మహిళ తన కాలుకు ఉన్న చెప్పును చూపించి బెదిరిస్తుంది. దీంతో ఆ మొసలి భయపడిందో ఏమో గానీ వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయింది. చదవండి: రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!! Everyone knows what it means when mom takes the shoe off. 😏😂🐊🥿 pic.twitter.com/CXD94m6PVz — Fred Schultz (@fred035schultz) November 9, 2021 అన్నట్టు ఇది ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతమైన. కాకాడు నేషనల్ పార్కులో జరిగింది. ఈ వీడియోలోని మహిళ చేసిన ఫన్ నెటిజన్లను ఆకర్షిస్తుంది. దీంతో ట్విట్టర్లో మీమ్స్ సృష్టిస్తున్నారు. ఎలాంటి సమస్యకైనా చెప్పు ఉంటే చాలు... పరిష్కారం దొరుకుతుంది. డేరింగ్ లేడి. భర్త ఆలస్యంగా ఇంటికి రావడం, పిల్లలు నటించడం, కుక్కను బెదిరించడం ఇలా ప్రతి దానిలో చెప్పునే ఉపయోగిస్తాం’. అంటూ రకరకాల మీమ్స్ వేస్తున్నారు. -
ఉమా భారతి: అధికారులున్నది చెప్పులు మోయడానికే!
భోపాల్: ప్రభుత్వాధికారులున్నది నాయకుల చెప్పులు మోయడానికేనంటూ కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘అధికారుల గురించి మీకేమీ తెలియదు. వారున్నది మా స్లిప్పర్లు మోయడానికే’ అని ఉమ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఉమా స్పందించారు. ఓబీసీ నేతలతో పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాఖ్యలు చేశానని , నిజానికి తాను అధికారులను వెనుకేసుకొచ్చానని సమర్ధించుకున్నారు. నిజాయతీ ఉన్న అధికారులు బలమైన నాయకులకు మద్దతుగా ఉంటారన్నారు. అయితే తన భావన మంచిదైనా, వాడిన భాష బాగోనందున విచారిస్తున్నానని వివరించారు. -
‘చెప్పు’కుంటే.. కష్టాలే..
ప్రతి సంవత్సరం జూన్, జూలైలో చెప్పులకు గిరాకీ ఎక్కువగా ఉండేది.. స్కూలు పిల్లలు షూస్ కోసం.. వర్షాకాలం కావడంతో వాటర్ ప్రూఫ్ స్లిప్పర్లకు డిమాండ్ ఉండేది.. కరోనా కారణంగా స్కూళ్లు లేవు. లక్షల సంఖ్యలో ప్రజలు ఊళ్లకు వెళ్లారు. దీంతో రోడ్ల పక్కన చెప్పుల దుకాణాలు నడుపుకునేచిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ముప్పే.. ఆటాడు‘కుంటే’.. బ్యాట్, బాల్ పట్టి.. వికెట్లు పెట్టి.. ఓ పట్టుపట్టి చాలా రోజులైంది.. అందమైన మైదానంపిలుస్తుంటే క్రికెట్ ఆడాల్సిందే అని మనసులో ఉందా.. కాస్త ఆగాల్సిందే.. అది మైదానం అనుకుని వెళ్తే మునగాల్సిందే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోనిఉషా ముళ్లపూడి ఆస్పత్రి వెనుకవైపు ఉంది ఈ కుంట. నిత్యం జల్లులు కురుస్తుండటంతో నీటిపై నాచు పేరుకుపోయి ఇలా అందంగా కనిపిస్తోంది. -
వ్యర్థాలతో పాదరక్షలు
పాదాలకు అందమైన నాణ్యమైన ఫ్యాషనబుల్ చెప్పులు, షూస్‌ను అందరూ ఇష్టపడతారు. అందుకే డబ్బు కాస్త ఎక్కువైనా ఖర్చుకు వెనకాడరు. రాజస్థాన్‌కు చెందిన మేఘా రావత్ వాడి పడేసిన వస్తువులతో అందమైన చెప్పులను తయారుచేస్తోంది. . ఫ్యాషనబుల్‌గా ఉండేవి, నాణ్యమైన, సరసమైన ధరలలో లభించే పాదరక్షల తయారీని ప్రారంభించడమే కాకుండా వాటికో బ్రాండ్‌ను క్రియేట్ చేసింది మేఘారావత్. ఇవి పూర్తిగా రీసైక్లింగ్ వస్తువులతో తయారు చేసినవి. వనరుల విలువ తెలుసుకున్నప్పుడు మేఘా రావత్ చాలా చిన్నది. 28 ఏళ్ల మేఘా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెరిగారు. ‘నా చిన్నతనంలో నీళ్లు, కరెంట్ సరఫరా సరిగా ఉండేది కాదు. నా తమ్ముడు, నేను స్కూల్ నుంచి వచ్చాక ఇంటి పనులకు నీళ్ల కోసం దగ్గరలోని కాలువకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. వాడి పడేసిన సీసాలను దీపానికి ఉపయోగించేది అమ్మ’ అని గుర్తు చేసుకుంటుంది మేఘ. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. తల్లి స్థానిక పాఠశాలలో టీచర్. తక్కువ వస్తువులతో ఎలా జీవించాలో నేర్పేది తల్లి. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం అలవాటు చేసింది. వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం సాధ్యమైనంతవరకు ప్రయత్నించేవారు. ‘మా అమ్మ తన పాత చీరలతో నాకు గౌన్లు కుట్టేది. అవి చిరిగాక దిండు కవర్లుగా, టేబుల్ క్లాత్‌గా, దుమ్ము దులపడానికి ఉపయోగించే డస్టర్లుగా వాటిని చూసేదాన్ని’ అని మేఘా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. స్క్రాప్‌తో స్ట్రాప్స్ మేఘా 2014లో కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పై చదువుల కోసం తను ఉంటున్న పట్టణం నుండి నగరానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలామంది ఏవీ ఆలోచించకుండా వస్తువులను కొనడం గమనించేది. ‘వాటిని వాళ్లు ఎంతోకాలం వాడరు. కొంత కాలానికి వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. వాటన్నిటి అసలు ఖర్చు మాత్రమే కాదు, ప్రకృతికి జరిగే నష్టాన్ని కూడా అదే టైమ్‌లో అంచనా వేసుకునేదాన్ని’ అని చెబుతారు మేఘా. ఆ ఆలోచనతోనే మేఘా 2015లో రీ సైక్లింగ్ మెటీరియల్‌తో ఫుట్‌వేర్‌ను డిజైన్ చేయడం కనుక్కుంది. దానికి ‘కురియో’ అని నామకరణం చేసింది. దీనికి ముందు మేఘా ముంబయ్‌లోని ఒక ఐటి సంస్థ, ఎక్స్పోర్ట్ కంపెనీలలో పనిచేసింది. అక్కడ తనకా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వడం లేదని అర్థమయ్యాక పర్యావరణ స్పృహ కలిగిన పాదరక్షలను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటి తయారీలో నైపుణ్యం కలిగిన 200 మంది చేతివృత్తులవారిని, మహిళలను ఎన్జీవోల సాయంతో నియమించుకుంది. టైర్లతో చెప్పుల అడుగు భాగం ‘చిన్నప్పటి నుండి సొంతంగా రకరకాల వస్తువులను తయారు చేయడం సరదాగా చేసేదాన్ని. మా అమ్మ టైలరింగ్ పనిచేస్తుంటే నేను పాత పేపర్లతో కటింగ్ నేర్చుకునేదాన్ని. క్లాత్ ముక్కలతో రకరకాల బొమ్మలను తయారుచేసేదాన్ని. రీ సైకిల్ ద్వారా కొత్తవస్తువును తయారు చేసినప్పుడల్లా చాలా ఆనందించేదాన్ని. అదే ఈ చెప్పుల తయారీకి పురికొల్పింది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడంతో బాధ్యత పెరిగింది. ఏ పని చేసినా పర్యావరణ స్పృహతో చేయాలనే ఆలోచన కలిగింది’ అంటుంది మేఘా. కురియో బ్రాండ్ ద్వారా పాదరక్షలు, కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్లు, ఫ్రిజ్ మాగ్నెట్స్, పర్సులు, కోస్టర్స్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తుంది మేఘా. వీటిలో బాగా పేరొందినవి కొల్హాపురీ చెప్పులు. అలాగే కవర్ బూట్లు. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు పూర్తిగా చేనేత దారుల నుండి సేకరించిన బట్టతో, టైలరింగ్ యూనిట్ల నుండి సేకరించిన వ్యర్థ వస్త్ర పదార్థాలను ఉపయోగిస్తారు. దానికి తోడు పాదరక్షల అడుగు భాగానికి రీసైకిల్ టైర్లను వాడుతారు. వ్యర్థాల కోసం నెట్వర్క్ ‘కొని వాడిన నాణ్యమైన బట్టలను దేశంలోని వివిధ మూలల నుండి సేకరిస్తాం. ఇవి సహజమైన రంగులు, చేతితో నేసిన క్లాత్స్ అయి ఉంటాయి. వాటిలో ‘ఖాదీ, అజ్రఖ్, కలాంకారి, ఇండీ ఫాబ్రిక్స్ మొదలైనవి. దీనికి స్థానిక చేతివృత్తులు, చేనేత కార్మికులూ సహకరిస్తారు. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమైనా ఉన్నాయా అంటే రీసైక్లింగ్ పదార్థాల కోసం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే. ఇందుకు సమయం, అనుభవం చాలా అవసరం ఉంటుంది..’ అని వివరిస్తుంది మేఘా. కాలుష్యకారకాలలో అతిపెద్దది ఫ్యాషన్ ప్రపంచం. మేఘా చేసే రీ సైక్లింగ్ ఉత్పత్తులు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తున్నాయి. ఈ రీ సైక్లింగ్ తయారీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి రాగలిగితే పర్యావరణ నష్టాన్ని బాగా తగ్గించవచ్చు. -
వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తూ.. బిడ్డను, తనను నిర్లక్ష్యం చేసిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పులతో కొట్టిందో భార్య. వివరాలు.. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు.. సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్‌కు కరీంనగర్ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా అనూషకు కూడా 2013లో కోలా రవికాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనూష, భర్త రవికాంత్‌ను వదిలిపెట్టి.. లక్ష్మణ్‌తో కలిసి కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మణ్, అనూషల సంబంధం గురించి సౌజన్యకు తెలిసి నిలదీసింది. లక్ష్మణ్, అనూష కలిసి దిగిన ఫోటోలను పెద్దమనుషుల ముందు పెట్టి నిలదీయగా.. అవి గతంలో దిగిన ఫోటోలని.. ప్రసుత్తం తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నాడు లక్ష్మణ్. కొద్ది రోజుల పాటు బుద్ధిగానే ఉన్న లక్ష్మణ్.. తిరిగి అనూషతో తన సంబంధాన్ని కొనసాగించడం ప్రాంరభించాడు. ఈ క్రమంలో సౌజన్య గురువారం లక్ష్మణ్, అనూషలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. చెప్పుతీసుకుని చితకబాదింది. -
చెప్పుల్లో దాచాడు.. చిక్కుల్లో పడ్డాడు
తిరువనంతపురం : సుమారు ఏడు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కన్నూరు అంతర్జాతీయ విమాన్రాశయ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కన్నూరు జిల్లా థాయథేరు ప్రాంతానికి చెందిన అజయ్ వలియబల్లథ్ అనే వ్యక్తి దోహా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన చెప్పుల్లో గంజాయి దాచి రహస్యంగా తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో రూ. 7 లక్షల విలువ చేసే గంజాయి బయటపడింది. అజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం అతన్ని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు. -
చెన్నైలో చెప్పులు లేకుండా తిరుగుతున్న నటుడు
కర్ణాటక, యశవంతపుర: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటున్న నటుడు హుచ్చ వెంకట్ కాళ్లకు చెప్పులు లేకుండా చెన్నై వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాల్లో పంచింగ్ డైలాగులు వేసే హుచ్చ వెంకట్ చెన్నై వీధుల్లో అలా తిరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం ‘దురహంకారి హుచ్చ వెంకట్’ అనే సినిమా ప్రోమోను విడుదల చేశారు. సినిమాను తీస్తున్నట్లు మాధ్యమాలకు విడుదల చేశారు. చెన్నై చిత్రాలు ఈ సినిమా షూటింగ్లో భాగమా, లేదా అనేది తెలియాల్సి ఉంది. -
పాదరక్షల్లో విదేశీ కరెన్సీ
అన్నానగర్: చెన్నై నుంచి గురువారం దుబాయ్‌కి పాదరక్షల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి యత్నించిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే విమానంలో నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులకు గురువారం రహస్య సమాచారం అందింది. అనంతరం అధికారులు విమానాశ్రయంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో దుబాయ్‌కి వెళ్లడానికి చెన్నైకి చెందిన 35 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతన్ని అనుమానంతో అధికారులు నిలిపి విచారణ చేశారు. పొంతన లేని సమాధానాలు తెలపడంతో అతని లగేజీలను పరిశీలించగా ఏమీ లభించలేదు. అనంతరం ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా అతను ధరించిన పాదరక్షల్లో రూ.13.50లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మదురై విమానాశ్రయంలో కరెన్సీ పట్టివేత:యువకుడు అరెస్టు మదురై విమానాశ్రయంలో గురువారం రూ.43.50 లక్షల విలువైన ఇండియన్, విదేశీ కరెన్సీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి యువకుడిని అరెస్టు చేశారు. వివరాలు.. మదురై నుంచి సింగపూర్‌కు వెళ్లే విమానంలో హవాలా నగదు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గురువారం మదురై విమానాశ్రయ సహాయ కమిషనర్ వెంకటేష్‌బాబుకి సమాచారం అందింది. వెంటనే విమానాశ్రయ అధికారులు విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను పరిశీలన చేశారు. అప్పుడు పెద్ద సూట్‌కేసుతో వచ్చిన ఓ యువకుడిని అనుమానంతో విచారించారు. అతను తూత్తుకుడి నారాయణన్ వీధికి చెందిన పార్వతినాథన్ (29) అని తెలిసింది. అతని సూట్‌కేసులో కట్టలు కట్టలుగా రూ.45.50 లక్షల ఇండియన్, విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అధికారులు నగదుని స్వాధీనం చేసుకుని పార్వతినాథన్ను అరెస్టు చేశారు. -
వావ్.. బాటిల్‌ని ఇలా కూడా వాడొచ్చా?!
చాలా సార్లు మనం పనికి రాని చెత్తగా భావించి పడేసిన వస్తువులే అద్భుతమైన కళాఖండాలుగా రూపుదిద్దుకోవడం చూస్తూనే ఉంటాం. మనకు పనికి రాని వస్తువు మరొకరికి ‘పని’ చూపించడం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. ఇలాంటి ఆవిష్కరణలు మనం కూడా చేయగలం. కాకపోతే దానికి కావల్సిందల్లా కాస్తంతా సృజనాత్మకత. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాకు రూపమే ఇక్కడ ఫోటోలో ఉన్న చెప్పులు. వీటిని తయారు చేసిన వస్తువులు చూస్తే నిజంగానే మతి పోతుంది. మనం తాగి పారేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఇలా చెప్పులుగా మార్చిన వైనానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ ఖాళీ బాటిళ్లకు ప్లాస్టిక్ స్ట్రాప్స్ జత చేసింది. ఇంకేముంది.. నిమిషాల్లో పనికి రాని బాటిళ్లు కాస్తా పాదరక్షలుగా మారాయి. ఇలా తయారు చేసిన తన ఈ కొత్త జాండల్స్(సాండల్స్ కాదు)ని అమ్మకానికి పెట్టింది. ధర కూడా చాలా చీప్ కేవలం రూ. 1400 అంటే ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టింది. వీటిని చూసిన నెటిజన్ల సదరు మహిళ ఐడియాను మెచ్చుకోవడమే కాక ‘వీటిని కేవలం నీటిలో నడిచేందుకే వాడాలి’, ‘ఇవి కాస్తా జారి పోయేలా ఉన్నాయి.. కార్ టైర్‌తో చేసినవి ఐతే బాగుంటాయం’టూ కామెంట్ చేస్తున్నారు. -
వెరైటీ ప్రచారం: ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా
సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు. ఒక వేళ మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు. -
దొంగ మెడలో చెప్పుల దండ
బరంపురం (ఒరిస్సా) : గంజాం జిల్లా పురుషోత్తంపురంలో దొంగను పట్టుకొని గ్రామస్తులు చితక బాది దొంగ మెడలో చెప్పుల దండవేసి గ్రామమంతా ఊరేగించారు. పోలీసులు అందించిన సమాచా రం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పురుషోత్తం పురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రణజూలి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలో చోరీకి యత్నిస్తూ గ్రామస్తులకు ఓ దొంగ చిక్కా డు. దీంతో గ్రామస్తులు దొంగను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిరు ఉపాయం.. తొలగిస్తుంది అపాయం
ముత్తారం: ఎంతటి అపాయాన్ని అయినా చిన్నపాటి ఉపాయంతో తొలగించుకోవచ్చునని, ఉపాయం ఉంటే ఊళ్లు ఏలచ్చని కవులు చెప్పినట్లు..విద్యుత్ స్తంభాలు ఎక్కే క్రమంలో జరిగే అపాయాలను చిరు ఉపాయంతో తప్పిస్తున్నాడు తాత్కాలిక విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే రామగిరి మండలం నాగేపల్లి గ్రామ పంచాయతీ విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న కుమార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిచ్చెన ఉపయోగించేవాడు. విద్యుత్ స్తంభం పై భాగానికి వెళ్లాలంటే కాళ్లతోనే ఎక్కాల్సిన పరిస్థితి. దీంతో పలుమార్లు జారిపడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం దొడ్డుకు సరిపడా ఇనుప రాడ్లతో క్లిప్స్ తయారు చేయించి, వాటిని చెప్పులకు బిగించాడు. కాళ్లకు చెప్పులు తొడుక్కొని ఇనుప రాడ్లు, క్లిప్పుల మధ్య విద్యుత్ స్తంభం ఉండడం వల్ల జారిపోకుండా ఉండి సునాయసంగా స్తంభాన్ని ఎక్కుస్తున్నాడు. ఉపాయం చిన్నదే అయిన్పటికీ ఎన్నో అపాయాల నుంచి కాపాడుతోందని కుమార్ చెప్తున్నాడు. కుమార్ పనితనాన్ని అందరూ శభాష్ అంటూ అభినందిస్తున్నారు.