గ్రామ సర్పంచ్ అయి ఉండి తోటి గ్రామస్తుడిని దారుణంగా అవమానిస్తూ శిక్షించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సర్పంచ్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.