Nalanda
-
గుట్కా లేటుగా ఇచ్చాడని.. చాయ్‌వాలాపై కాల్పులు
నలంద:బీహార్‌లోని నలందలో ఘోరం చోటుచేసుకుంది. మత్తుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు క్షణికావేశంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని నలంద జిల్లాలో టీ దుకాణదారునిపై కాల్పులు జరిపిన ఉదంతం వెలుగుచూసింది. గుట్కా ఇవ్వడంలో ఆలస్యం చేశాడనే కారణంతో దుండగులు ఆ చాయ్‌వాలాపై కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ శబ్దం విని చుట్టుపక్కలవారు టీ దుకాణం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణదారుడిని గాయపడిన స్థితిలో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన నలంద జిల్లాలోని సారే పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రివేళ ముగ్గురు సాయుధ దుండగులు టీ దుకాణానికి వచ్చి, చాయ్‌వాలాను గుట్కా ప్యాకెట్లు కావాలని అడిగారు. అతను వాటిని ఇవ్వడంతో కొంత జాప్యం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ దుండగులు దుర్భాషలాడుతూ, చాయ్‌వాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ దుకాణదారుడి వీపు గుండా దూసుకెళ్లింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దుకాణదారుడిని నరేష్ యాదవ్ కుమారుడు రాకేష్ యాదవ్‌గా గుర్తించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ధర్మేష్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని దర్యాప్తు ప్రారంభించారని, బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ముగ్గురు యువకులు ఈ నేరానికి పాల్పడ్డారని, ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు.ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
జ్ఞానాన్ని దగ్ధం చేయలేరు: ప్రధాని మోదీ
అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని నలంద విశ్వవిద్యాలయ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయంలోని నూతన ప్రాంగణాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలంద కేవలం భారతదేశ పునరుజ్జీవన భూమిక మాత్రమే కాదు. దీనికి ప్రపంచంతోపాటు ఆసియాలోని అనేక దేశాల వారసత్వంతో అనుబంధం ఉందని అన్నారు.నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకున్నాయని, ఆయా స్నేహపూర్వక దేశాలను అభినందిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. నలందలోని ఈ కొత్త క్యాంపస్ భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నదని మోదీ పేర్కొన్నారు. బలమైన మానవ విలువలపై నిలబడే దేశం మనదని, చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం ఎలాగో మనకు తెలుసన్నారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక అమోఘ కథ... నలంద అనంత సత్యానికి నిదర్శనం. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు. కానీ అవే అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.సభలో పాల్గొన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆశీస్సులతో నలంద యూనివర్శిటీ క్యాంపస్ ప్రారంభం కావడం సంతోషించదగిన విషయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారన్నారు. దురదృష్టవశాత్తు ఈ విశ్వవిద్యాలయం 1200 ఏడీలో ధ్వంసమైందన్నారు. 2005 నుంచి తాము బీహార్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ వచ్చినప్పుడు తన నలంద యూనివర్శిటీని పునఃస్థాపన గురించి ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ క్యాంపస్‌ను పరిశీలించారు. #WATCH | Bihar: At the inauguration of the new campus of Nalanda University, Prime Minister Narendra Modi says, " I am happy that I got the opportunity to visit Nalanda within 10 days after swearing in as PM for the 3rd time...Nalanda is not just a name, it is an identity and… pic.twitter.com/jjZL7gWqDW— ANI (@ANI) June 19, 2024 -
నడిరోడ్డుపై కానిస్టేబుళ్ల కొట్లాట
పాట్నా: బిహార్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ముష్టియుద్ధానికి దిగారు. జనం చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా కొట్టుకున్నారు. బిహార్‌లో నలందకు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. లంచం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదంతో వీడియో ప్రారంభం అవుతుంది. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవాలని ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో ఘర్షణ మొదలయ్యింది. నడిరోడ్డుపైనే ఇద్దరు దాదాపు ముష్టి యుద్ధానికి దిగారు. అనంతరం ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనంలో నుంచి లాఠీ తీసుకుని ఫైటింగ్‌కి దిగాడు. ఇక చుట్టుపక్కల చేరిన జనం వారిని హెచ్చరిస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. बिहार पुलिस के जवान आपस में हिसाब-किताब करते हुए, नालंदा का वीडियो. pic.twitter.com/8KWlChndwl — Utkarsh Singh (@UtkarshSingh_) September 18, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. सोशल मीडिया पर नालन्दा जिला अंतर्गत दो पुलिस कर्मियों के बीच विवाद का वायरल विडिओ पर पुलिस अधीक्षक, नालन्दा के द्वारा संज्ञान लेते हुए दोनों पुलिस कर्मियों को पुलिस केंद्र वापस किया गया है और जांच का आदेश दिया गया है।(1/2) . .#BiharPolice #HainTaiyaarHum #Bihar — Bihar Police (@bihar_police) September 18, 2023 ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
బీహార్‌లో హైటెన్షన్.. ఒకరు మృతి, 80 మంది అరెస్ట్
పాట్నా: శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో రాజుకున్న ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నలంద జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు 80 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక, అల్లర్ల కారణంగా బీహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ససారంలో శనివారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రోహ్తాస్లోని ఓ గుడిసెలో బాంబు పేలినట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని అన్నారు. ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. Bihar | It has been found that 6 persons were injured during the handling of illegal explosives at a private property in Rohtas; a team of forensic experts is conducting an investigation at the spot. Two persons arrested: Rohtas Police pic.twitter.com/5CLihSFYmh — ANI (@ANI) April 2, 2023 మరోవైపు, నలందాలోని బీహార్‌షరీఫ్‌లో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పహర్‌పూర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముఖేష్ కుమార్ అనే బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఇక శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగడంతో నలందాలో 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇక, ఆదివారం కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే ఈ అల్లర్ల వల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో అమిత్ షా పర్యటన రద్దయ్యింది. #WATCH | Police personnel deployed in Biharsharif, Nalanda as Section 144 is imposed in the city after a fresh clash erupted last night following violence during Ram Navami festivities#Bihar pic.twitter.com/Th9zffoJFt — ANI (@ANI) April 2, 2023 -
వైరల్: వామ్మో.. అంత మంది అమ్మాయిలా?
Viral News: పాపం.. పరీక్ష హాల్లో అంత మంది అమ్మాయిలను ఒక్కసారిగా చూసేసరికి ఆ కుర్రాడికి ఏం అనిపించిందో ఏమో!. వాళ్ల మధ్యలో తానొక్కడే ఉన్నాడన్న సంగతి తెలిసిన ఆ కుర్రాడు.. ఏకంగా స్పృహ కోల్పోయాడు. బిహార్‌లోని నలందాలో బుధవారం ఈ ఘటన జరిగింది. బీహార్‌లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మనీశ్ శంకర్ ప్రసాద్ (17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజ్ స్టూడెంట్. తొలి పరీక్ష మ్యాథ్‌మెటిక్స్ రాసేందుకు మనీశ్‌ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్, సుందరగడ్లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకొచ్చాడు. అయితే.. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్లోకి వెళ్లాడు. అక్కడ అంతా బాలికలు ఉండేసరికి.. ఆశ్చర్యపోయాడు. అతని చూసి అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘోల్లుమనడంతో.. అర్థంకాని అయోమయంలో ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు మనీశ్. దీంతో అతన్ని సర్దార్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు పరీక్షా నిర్వాహకులు. ‘‘ఒకేసారిగా అంతమంది అమ్మాయిలను చూసి చాలా కంగారుపడ్డాడు. అందుకే స్పృహతప్పిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడని ఆస్పత్రిలో అతని బాగోగులు చూసుకుంటున్న మనీశ్ శంకర్ మేనత్త చెబుతోంది. పూర్తిగా అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో పొరపాటున మనీష్‌కు కేటాయింపు జరిగిందని అక్కడి విద్యాధికారులు చెప్తున్నారు. बिहार बोर्ड की 12वीं की परीक्षा के दौरान हुई अजीबोगरीब घटना | Unseen India pic.twitter.com/5awOkkjK6L — UnSeen India (@USIndia_) February 1, 2023 -
బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై బాంబు దాడి
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మంగళవారం బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభపై ఓ దుండగుడు బాంబు విసిరాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే.. వేదికకు పదిహేను నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పాట్నా భక్తియార్‌పూర్‌లో ఈ మధ్యే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మానసిక స్థితి సరిగా లేని స్థానిక నివాసిగా భావిస్తున్న దుండగుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. -
బిహార్‌లో విషాదం: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి
పట్నా: బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మన్పూర్లో ముగ్గురు వ్యక్తులు, చోటీ పహారీలో ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మరణించారు. ఈ ఘటనపై స్పందించిన నలందా జిల్లా అధికారులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే మరణించిన వారు విషపూరిత రసాయనం తాగినట్లు మృతల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
తలకు తుపాకీ గురి పెట్టి మరీ.. బలవంతంగా పెళ్లి చేశారు
పట్నా: ఇంట్లో పండగ చేసుకోబోతున్నారు.. అందుకని బంధువులను ఆహ్వానించడం కోసం పొరుగురికి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ అతడికి అనుకోని వింత అనుభవం ఎదురయ్యింది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిని బంధించి.. తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించి.. ఏకంగా పెళ్లి చేశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే.. బాధితుడిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ వివరాలు.. (చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..) బిహార్ నలంద జిల్లా, ధనుకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఛథ్ పండుగకు రమ్మని ఆహ్వానించడం కోసం నవంబర్ 11న వదిన వాళ్ల ఊరికి వెళ్లాడు. వారిని కలిసి.. పండుగకు రావాల్సిందిగా ఆహ్వానించి.. ఇంటికి తిరిగి బయలు దేరాడు. అలా వస్తుండగా.. మార్గమధ్యంలో ఆయుధాలు ధరించి ఉన్న కొందరు వ్యక్తులు నితీష్‌ను కిడ్నాప్ చేశారు. సరాసరి పెళ్లి మంటపానికి తీసుకెళ్లి.. అతడిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. ఈ క్రమంలో నితీష్ అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. అతడిని కొట్టారు. అంతటితో ఆగక తుపాకీతో నితీష్ తలకు గురిపెట్టి.. బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారు. (చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’) ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న నితీష్.. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య -
పాము కాటేసిందన్న కోపంతో.. కస కస కొరికాడు.. ఆ తర్వాత..
పట్నా: బిహర్లో ఓ వృద్ధుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. తనను కాటువేసిందన్న కోపంతో ఆ పాము పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దాన్ని పట్టుకుని విచక్షణ రహితంగా కొరికాడు. అంతటితో ఆగకుండా పాముని అక్కడే ఉన్న చెట్టుపై వేలాడ దీశాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. నలంద జిల్లాలోని మాధోపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోని ఆదివారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. వెంటపడి మరీ పామును పట్టుకుని కసితిరా కొరికి చంపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. పాముపట్ల వింతగా ప్రవర్తించిన వృద్ధుని తీరు చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, మహతో ఎవరిమాట పట్టించుకోలేదు. పాముని చంపేశాను...నాకేం కాదు అని మొండిగా ప్రవర్తించాడు. కాగా, రాత్రి మహతో భోజనం చేసి పడుకున్నాడు. ఆ తర్వాత మహతో నిద్రలోనే స్పృహ తప్పిపడిపోయాడు. ఎంత పిలిచిన లేవకపోయేసరికి.. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహతోను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘గర్భంతో ఉందని చూడకుండా ముక్కలు ముక్కలుగా కోశారు’
పట్నా: బిహర్లో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం.. భార్య గర్భంతో ఉందని కూడా చూడకుండా ముక్కలుగా నరికి చంపేసిన అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన నలందా జిల్లాలో జరిగింది. నోనియా బిగ్హా గ్రామానికి చెందిన సంజిత్, కాజల్‌కు గతేడాది జూన్ 27న వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా భారీగానే ఇచ్చారు. ఆ సమయంలో సంజిత్‌కు ఇండియన్ రైల్వేస్‌లో గ్రూప్‌డీ ఉద్యోగం చేస్తుండేవాడు. తాజాగా, అతనికి టీటీఈ గా ప్రమోషన్ వచ్చింది. దీంతో తమకు అదనపు కట్నం కావాలని అత్తింటివారు కొంతకాలంగా కాజల్‌ను వేధించసాగారు. ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసలకు గురిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాజల్ తండ్రి అరవింద్ సింగ్ 80వేల రూపాయలను ఆమె భర్తకు ఇచ్చాడు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. ఆమెను ప్రతి రోజు తీవ్రంగా కొడుతూ మానసిక వేదనకు గురిచేసేవారు. కాగా, గత వారం ఆమెను గర్భవతి అని కూడా చూడకుండా తీవ్రంగా హింసించారు. అంతటితో ఆగకుండా.. ఆమెను బిగ్హా గ్రామంలోని పోలాల్లోకి లాక్కునిపోయారు. అక్కడ ఆమెను ముక్కులు ముక్కలుగా నరికి చంపేశారు. అయితే, జులై 17న చివరిసారిగా తన కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు మంజు దేవి చెప్పారు. కాగా, ఫోన్లో మాట్లాడుతూ.. నాకు చాలా భయంగా ఉందని మా అమ్మాయి చెప్పిందని కన్నీటి పర్యంత మయ్యింది. కొన్ని రోజులుగా కాజల్ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంజిత్ కూడా కజల్ కన్పించడంలేదని చెప్పాడు. దీంతో, యువతి తండ్రి అరవింద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న హిల్సా పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, నోనియా బిగ్హా గ్రామంలోని పోలాల్లో జులై 20న.. కొన్ని శరీర భాగాలు ముక్కలు, ముక్కలుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాటిని కాజల్ శరీర భాగాలుగా అరవింద్ గుర్తించారు. దీంతో, పోలీసులు కజల్ మృతదేహన్ని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, సంజిత్ను, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న హిల్సా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. -
ఆ మసీదు అందరిదీ...
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బిహార్, నలంద జిల్లాలోని మారి గ్రామం. అక్కడ 200 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఉపాధి కోసం ఆ గ్రామంలోని ముస్లిములంతా ఏనాడో వలసవెళ్లిపోయారు. మిగిలింది హిందువులే. ఒక్క ముస్లిం కూడా ఆ గ్రామంలో లేకుండా పోయినప్పటి నుంచి ఆ మసీదు సంరక్షణ బాధ్యతను గ్రామంలోని హిందువులే తీసుకున్నారు. ఆ ప్రార్థన మందిరాన్ని రోజూ శుభ్రంగా ఉడ్వడం... తడిగుడ్డతో తుడవడం దగ్గర్నుంచి పెచ్చులూడిపోతున్న గోడలకు మరమ్మతులు చేయడం.. పెయింటింగ్ వేయడం వంటి అన్ని పనులూ హిందువులే నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. అజా వేళ్లల్లో అజానూ వినిపిస్తున్నారు. ‘‘పెన్‌డ్రైవ్‌లో అజాను రికార్డ్ చేయించి టైమ్‌కి ఆ రికార్డ్‌ను వేస్తున్నాం. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఈ ఊళ్లో అందరికీ ఈ మసీదు పవిత్ర స్థలమే. ఈ ఊళ్లో ఏ హిందువుల ఇంట్లో పెళ్లయినా ఆ కొత్త జంట ముందుగా ఈ మసీదుకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఊరి సంప్రదాయం అది. ఈ చుట్టుపక్కల ఊళ్లల్లో హిందూముస్లింల మధ్య చాలానే గొడవలయ్యాయి. కానీ మా ఊళ్లో ఎలాంటి గొడవలూ జరగలేదు. మేమంతా కలిసిమెలిసే ఉంటూ వస్తున్నాం. ఉంటాం కూడా’’ అని చెప్తాడు ఆ మసీదును చూసుకుంటున్న మారి గ్రామ నివాసి ఒకరు. -
‘ఆ అందమైన మొహం ఇప్పుడు ఎక్కడ’
పట్నా : బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీద విమర్శల వర్షం కురిపించారు. నా మొహం చూసి జనాలు ఓట్లు వేస్తారని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నేడు మొహం చాటేశాడు ఎందుకు అని నితీశ్ కుమార్‌ని ప్రశ్నించారు తేజస్వీ. సీఎం నితీశ్ కుమార్ నియోజకవర్గమైనా నలందలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ యాదవ్. ఈ క్రమంలో ఆయన సీనియర్ రిపోర్టర్ ప్రణయ్ రాయ్‌తో ముచ్చటించారు. నలంద ప్రజలకు నితీశ్ కుమార్ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో నితీశ్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు తేజస్వీ. అంతేకాక గతంలో ‘జనాలు నా మొహం చూసి ఓటు వేస్తారని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడిని చూపించి ఓట్లు వేయమని కోరుతున్నారు. భారత ఆర్మీని, ఒకప్పుడు తాను ఎంతగానో ద్వేషించిన మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు. ఇప్పుడు ఆయన అందమైన మొహం ఎక్కడ’ అని తేజస్వీ ప్రశ్నించారు. ఉగ్రవాదుల మీద దాడుల చేయడం మాత్రమే నిజమైన దేశ భక్తి అనిపించుకోదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి.. వారిని ఆర్థికంగా బలంగా తయారు చేయడం కూడా దేశభక్తే అన్నారు. పేదరికం తొలగించడం.. యువతకు ఉపాధి కల్పించడం వంటి అంశాలన్ని కూడా దేశభక్తి కిందకే వస్తాయన్నారు తేజస్వీ. -
జర్నలిస్టు కొడుకు కళ్లు పీకేసి..
పట్నా : బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. నలందకు చెందిన ఓ జర్నలిస్టు కుమారుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ కేసును విచారించేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. వివరాలు.. అశుతోష్ కుమార్ ఆర్య అనే వ్యక్తి దైనిక్ హిందుస్తాన్ నలంద బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈయన కుమారుడు అశ్విన్ కుమార్(15) మనోవైకల్యంతో బాధపడుతున్నాడు. తన నానమ్మతో కలిసి హర్నత్ అనే గ్రామంలో నివసిస్తున్న అశ్విన్..ఆదివారం మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అశ్విన్ కళ్లు పీకేసీ దారుణంగా హతమార్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం గురించి నలంద ఎస్పీ నీలేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ అతడు ఎలా చనిపోయాడన్న విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజాలు బయటకు వస్తాయి. అయితే కొన్నిసార్లు అశ్విన్ విచిత్రంగా ప్రవర్తించేవాడని అతడి తండ్రి చెప్పారు. ఈ క్రమంలోనే అతడిపై దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నాం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చు’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అశుతోష్ కుమార్ భద్రత కోసం ప్రత్యేకంగా ఓ బాడీగార్డును నియమించినట్లు సిట్ అధికారి ఒకరు వెల్లడించారు. -
చితక్కొట్టి.. బిల్డింగ్ పైనుంచి తోసేశారు..
నలంద (బిహార్) : బిహార్‌లో ఓ వ్యక్తిని చితకబాది, ఏకంగా బిల్డింగ్‌పై నుంచి తోసేశారు. ఓ వ్యక్తిని హత్య చేసి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడయో తీశాడు. కొందరు వ్యక్తులు సమూహంగా ఏర్పడి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసుల ఎదుటే చితక్కొట్టి, వరండాపై నుంచి కిందకి తోసేశారు. ఈ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి పారిపోతున్నాడని తెలిసి, పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చట్టాన్ని చేతులోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదని మూకుమ్మడి దాడులను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని దీపక్ మిశ్రా పేర్కొన్న విషయం తెలిసిందే. -
చితక్కొట్టి.. ఏకంగా బిల్డింగ్ పైనుంచి తోసేశారు!
-
యువతితో అసభ్య ప్రవర్తన..
-
యువతితో అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
పట్నా : ఆడపిల్లలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో నడిరోడ్డుపై కొంతమంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న యువతిని చుట్టుముట్టి అసభ్య సంభాషణలతో ఆమెను అడ్డుకున్నారు. నాలుగు వైపుల నుంచి ఆమెను చుట్టుమట్టి కదలనియకుండా చేశారు. కొంతసేపటికి ఒక వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకుని కిందపడేశాడు. కాగా కథువా, ఉన్నావ్ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను చేస్తున్నప్పటికి మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు తగ్గడం లేదు. ఆ వీడియోలో ఉన్న వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
సాక్షి, నలంద : బిహార్‌లోని నలంద జిల్లా జబల్పూర్లోని ఓ బాణాసంచా దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 25 మందికి గాయాలయ్యాయి. ఫ్యాక్టరీకి సమీపంలోని పలు గృహాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్ధలం నుంచి దాదాపు కిలోమీటర్ వరకూ పొగలు వ్యాపించాయి. పోలీసు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో గాయపడిన వారిని నలంద డీఎం, ఎస్పీలు ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. పేలుడుపై విచారణ కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడి ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఘటనా స్ధలాన్ని సందర్శించింది. -
ఆకతాయిలకు బట్టలిప్పి బూడిద పూసి ఊరేగించారు
-
అమాయకుడిపై ప్రతాపం.. రంగంలోకి ఉన్నతాధికారులు!
-
అమాయకుడిపై ప్రతాపం.. రంగంలోకి ఉన్నతాధికారులు!
నలంద : గ్రామ సర్పంచ్ అయి ఉండి తోటి గ్రామస్తుడిని దారుణంగా అవమానిస్తూ శిక్షించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సర్పంచ్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అసలు వివాదం ఏంటంటే.. బిహార్‌లోని నలంద జిల్లా అజాద్‌పూర్‌లో మహేష్ ఠాకూర్ అనే వ్యక్తి గత బుధవారం గ్రామ సర్పంచ్ దయానంద్ మాంఝీ సన్నిహితుడు సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లాడు. ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఠాకూర్ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తన ఇంట్లోకి వస్తావా నీకెంత ధైర్యమంటూ సురేంద్ర ఈ విషయాన్ని సర్పంచ్ కు చెప్పాడు. ఇంట్లో ఒంటరి మహిళ ఉన్న సమయంలో ఇంట్లోకి ఎవరు అనమతిస్తే లోపలికి వెళ్లాడో ఠాకూర్ చెప్పాలని సర్పంచ్ ముందు సురేంద్ర రెచ్చిపోయాడు. వాస్తవానికి ఆ సమయంలో ఇంట్లో చాలామంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సురేంద్రతో సహా సర్పంచ్ సహా కుటుంబసభ్యులు ఠాకూర్ మీద మండిపడ్డారు. సురేంద్ర పురమాయించడంతో.. సర్పంచ్ విధించిన శిక్ష మేరకు తొలుత కొందరు మహిళలు ఠాకూర్‌ను 25 చెప్పు దెబ్బలు కొట్టారు. ఆపై ఇంటి ముందు ఉమ్మేసి ఆ మట్టిని, చెప్పులను నాకాలని హింసించి మరీ బాధితుడి చేత ఆ పని చేయించారు. విషయం వైరల్ కావడంతో నలంద డీఎం ఎస్ఎం త్యాగరాజన్ స్పందిస్తూ.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం, సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని నలంద ఎస్పీ సుధీర్ కే పొరికా వెల్లడించారు. -
మహిళలతో చెప్పు దెబ్బలు.. అంతటితో ఆగకుండా!
నలంద : సాటి మనిషిని గౌరవించకపోగా వారిని చులకనగా చూడటం నేటికీ చూస్తూనే ఉంటాం. అయితే సాధారణ వ్యక్తులు ఇలా చేస్తేనే మనం తీవ్రంగా వ్యతిరేకించి వారికి హితబోధ చేస్తాం. కానీ బిహార్‌లో ఓ ప్రజాప్రతినిధే సాటి గ్రామస్తుడి పట్ల హీనంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలయ్యారు. నలంద జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు యాభైఏళ్లు పైబడిన వ్యక్తి ఏదో పనిమీద గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఆ వ్యక్తి సర్పంచ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక అది మొదలు సర్పంచ్ సహా కుటుంబసభ్యులు అతడిమీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆ వ్యక్తిని దారుణమైన శిక్ష వేశారు. తలుపు తట్టకుండా లోనికి వస్తావా ఎంతధైర్యం అంటూ బయటకు వెళ్లగొట్టారు. అంతటితో ఆటకుండా కొందరు మహిళలతో చెప్పులతో కొట్టించి దాడిచేశారు. చివరగా ఇంటిముందు ఉన్న మట్టిని, చెప్పులను నాలుకతో నాకాలని హింసించి పంతంతో ఆ వ్యక్తి ఆ పని చేయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ విషయంపై సర్పంచ్ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. -
కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం
హైదరాబాద్: ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించిన నగర బాలికకు నలందా గ్రూప్ నజరానా ప్రకటించింది. ఇక నుంచి ఆ బాలిక విద్యకు సంబంధించిన వ్యయాన్ని తాము చూసుకుంటామని ప్రకటించింది. తొమ్మిదేళ్ల వినీలా మండేలా ఈ ఏడాది జనవరి 12న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఆసియా నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన చిన్నవయస్కురాలు వినీలానే కావడం విశేషం. వినీలా సాధించిన ఘనతను గుర్తించిన నలందా గ్రూప్ శుక్రవారం బాలికను అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా కిలిమంజారో పర్వతారోహణకు సంబంధించిన అనుభవాలను వినీలా పంచుకుంది. సోదరుడు వినీల్ శిక్షణలో ఈ ఫీట్‌ను సాధించినట్లు వెల్లడించింది. -
నలంద కు యునెస్కో గుర్తింపు!
పాట్నాః దక్షిణాసియాలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన నలంద విశ్వవిద్యాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో బీహార్ లోని నలందకు యునెస్కో స్థానం కల్పించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 40వ సమావేశం సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా యునెస్కో ఆసియా డైరెక్టర్ జనరల్ ఇరినా బొకొనాకు భారత సాంస్కృతిక శాఖ కృతజ్ఞతలు తెలిపింది. పాట్నాకు 98 కిలోమీటర్ల దూరంలో నలంద మహావీర విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. బోధ్ గయ లోని మహాబోధి ఆలయం తర్వాత, యునెస్కో గుర్తింపు పొందిన రెండవ చారిత్రక సంపద నలంద. గుప్తుల నేతృత్వంలో ప్రారంభమైన అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరొందిన నలంద.. ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. విజ్ఞాన బోధనలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన నలందా లోని విద్యా సంప్రదాయాల్లో బౌద్ధమతం, సన్యాసం వంటివి కనిపిస్తాయని యునెస్కో తన వెబ్ సైట్ లో పేర్కొంది. క్రీ.శ. 427 నుంచి క్రీ.శ. 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉన్న ఈ విద్యాలయం చరిత్ర ఆధారంగా చూస్తే.. ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాల్లోనూ ఒకటి. బుద్ధుని కాలంలో అత్యంత జనాభా కలిగిన నగరంగా నలందా అభివృద్ధి చెందినప్పటికీ, ఆ తర్వాత చాలా కాలానికి గానీ అదో విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలంద లో మహావీరుడు బసచేసినట్లు చారిత్రక కథనం. మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆఫ్ పారిస్ ఆధారిత అంతర్జాతీయ కౌన్సిల్ లోని నిపుణుల బృందం గత యేడాది నలంద యూనివర్శిటీని సందర్భించింది. ఈ చారిత్రక సంపదకు యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉండటంతో వారు బీహార్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం సాంస్కృతిక శాఖ 200 పేజీల నామినేషన్ పత్రాన్ని వారికి అందించింది. 12 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న నలంద ను పరిశీలించిన జపనీయుల నిపుణుడు మసాయా మట్సు వారసత్వ సంపదగా గుర్తించడంపై సానుకూలంగా నోట్ ఇవ్వడంతో నలందా యునెస్కో ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో చేరిపోయింది. -
నితీశ్ ఇలాకాలో మోదీ ట్రోఫీ!
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇలాకాలో పాగా వేసేందుకు బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందుకు నరేంద్రమోదీ ట్రోఫీని అస్త్రంగా ప్రయోగిస్తున్నది. నితీశ్ సొంత జిల్లా నలందాలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ పార్టీ విజయం సాధిస్తే.. బూత్ స్థాయిలో ఇన్చార్జులకు మోదీ ట్రోఫీని బహుమానంగా ఇవ్వనున్నట్టు ఆశపెట్టింది. ఈ ట్రోఫీ లేదా కప్‌పై ప్రధాని నరేంద్రమోదీ బొమ్మ చిత్రించి ఉంటుంది. ఈ నెల 28న నలంద జిల్లాలో మూడో దశ పోలింగ్ జరుగనుంది. నితీశ్‌ను సొంత జిల్లాలోనే ఓడించి గట్టి దెబ్బతీయాలని భావిస్తున్న బీజేపీ ఇందుకు పార్టీ శ్రేణులకు ఈ తాయిలం ప్రకటించింది. మోదీ ట్రోఫీ ఆశతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఓటర్లను గణనీయంగా కమలం వైపు తిప్పుతారని భావిస్తున్నది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన సీఆర్ పాటిల్ ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. బీహార్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాకర్తల్లో ఒకరిగా ఉన్న సీఆర్ పాటిల్ గుజరాత్‌లోని నవ్సారి నియోజకవర్గం ఎంపీ. తొలిసారి ఆయన తన నియోజకవర్గంలో దుర్గా నవరాత్రి వేడుకలకు కూడా హాజరుకాకుండా.. బీహార్ ఎన్నికల్లో పార్టీ బూత్ స్థాయి వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన దసరా పండుగ వేడుకలో సైతం పాల్గొనకుండా బీహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. 'బూత్ జీతో.. చునావో జీతో' (బూత్ స్థాయిలో గెలువండి, ఎన్నికలు గెలువండి) అన్న బీజేపీ ఎన్నికల ప్రధాన సూత్రంలో భాగంగా కేవలం నలంద జిల్లాకే మోదీ ట్రోఫీ బహుమానాలు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. -
నన్ను మోదీ ప్రభుత్వం వద్దనుకుంటోంది
న్యూఢిల్లీ: నలంద విశ్వవిద్యాలయం అంతర్గత వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని వర్సిటీ చాన్స్‌లర్, ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్ అన్నారు. వర్సిటీ చాన్స్‌లర్‌గా తనను మోదీ ప్రభుత్వం వద్దనుకుంటోందని.. అందుకే చాన్స్‌లర్‌గా తనకు రెండోసారి అవకాశమిచ్చే ఫైల్‌ను నెలరోజులుగా పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. వర్సిటీ హితాన్ని దృష్టిలో పెట్టుకుని తానే రేసు నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీని తొలి నుంచి విమర్శించే వారిలో అమర్త్యసేన్ ఒకరు. బిహార్‌లోని నలంద వర్సిటీ చాన్స్‌లర్‌గా ఉన్న అమర్త్యసేన్ పదవీకాలం జూలైలో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో పర్యాయం ఆయన్ను చాన్స్‌లర్‌గా కొనసాగించాలని వర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుని... కేంద్రానికి ప్రతిపాదన పంపింది. కానీ దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రెండోసారి పోటీ నుంచి తానే స్వయంగా తప్పుకొంటున్నట్లుగా వర్సిటీ పాలకమండలికి అమర్త్యసేన్ శుక్రవారం లేఖ రాశారు. తనను రెండోసారి చాన్స్‌లర్‌గా కొనసాగించాలంటూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్‌ను పక్షం రోజుల కిందే మంత్రిత్వశాఖకు పంపారని, కానీ తనను కొనసాగించడంమోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. అందుకే తన కొనసాగింపునకు సంబంధించిన ఫైలును రాష్ట్రపతి ఆమోదానికి పంపలేదన్నారు. వర్సిటీ విద్యా సంబంధ అంశాల్లో ప్రభుత్వం కల్పించుకుంటోందని ఆరోపించారు. విమర్శించినందుకే ఇలా జరుగుతోందా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మీరు మోదీని విమర్శిస్తారు.. ఆయన మిమ్మల్ని చాన్స్‌లర్‌గా ఉండాలనుకోరు కదా’ అని నా భార్య నన్ను ప్రశ్నించింది. అని తెలిపారు. కాగా, ఆయన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చాన్స్‌లర్‌గా ఆయన కొనసాగింపును అడ్డుకొనే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అమర్త్యసేన్ కొనసాగింపునకు సంబంధించి వర్సిటీ పాలకమండలి సమావేశం తీసుకున్న నిర్ణయాల ఫైలు ఇంకా మంత్రిత్వ శాఖకు అందనే లేదని చెప్పారు. -
ఒక నలంద! ఒక శ్రీపర్వతం!!
బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని ‘బడాగావ్’లో చరిత్ర పునరుజ్జీవనం పొంద నుంది! స్వాతంత్య్రం వచ్చాక నలందపై దృష్టి సారించిన తొలి వ్యక్తి డా.అబ్దుల్ కలామ్. రాష్ట్రపతి హోదాలో నలంద విశ్వ విద్యాలయానికి పునర్ వైభవాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ‘నలంద’ను నిజం చేయవల సినదిగా వివిధ దేశాలకు సూచించారు. ఈ క్రమంలో నిరంతర ప్రయత్నాల ఫలితంగా తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావే శంలో ప్రధాని మన్మోహన్ సమక్షంలో గురు వారం నాడు ఒక అవగాహనా ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. ఆధునిక ప్రపంచ విశ్వవిద్యాలయంగా నలందను సమున్నతంగా రూపొందించడా నికి అంగీకరిస్తూ ఆస్ట్రేలియా-కంబోడి యా-సింగపూర్- బ్రూనీ- న్యూజిలాండ్- లావో-మయన్మార్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘ఎంత ఇచ్చినా ఇవ్వాల నిపించేలా’ మిలియన్ల డాలర్లను విడుదల చేస్తున్నాయి. అంతర్జాతీయ వాస్తు సంస్థలు ఆధునిక నలందా నిర్మాణానికి నమూనాలు రూపొందించనున్నాయి. ఆధునిక ధర్మపాలుడు అమర్త్యసేన్ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ నలం ద కులపతిగా తగిన భూమిక నిర్వహించ నున్నారు. అంతర్జాతీయ మేధావులతో పాల కవర్గం ఏర్పడనుంది. గృహస్తుల నుంచి భిక్ష స్వీకరించి ‘ధర్మా’న్ని దానం చేసిన బుద్ధుడు, ఈ ప్రాంత ప్రజల జిజ్ఞాసకు ముగ్ధులై ‘నలం ద’ (ఎంత ఇచ్చినా ఇవ్వాలనిపించే చోటు) అన్నారట! ఆ ప్రత్యేకత రీత్యా 5వ శతాబ్దంలో ‘నలంద’లో ప్రపంచానికి తెలిసిన తొలి వసతి విశ్వవిద్యాలయం ఏర్పడింది. శ్రీహర్షుని కాలంలో భారత్‌ను సందర్శించిన చైనాయా త్రికుడు హుయాన్‌త్సాంగ్ (క్రీ.శ.602-664) యాత్రా రచనలు, నలంద గురించి తెలుసుకు నేందుకు ఉపకరిస్తున్నాయి. కంచి ధర్మపాలుడు నలంద కులపతి నలంద ఒక ప్రాచీన విజ్ఞాన అద్భుతం. వివిధ దేశాల నుంచి విచ్చేసిన పదివేల మంది విద్యా ర్థులకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రెండువేల మంది అధ్యాపకులు విద్యాబోధన చేసేవారు. దక్షిణాదిన కంచికి చెందిన ధర్మ పాలుడు నలందలో దిగ్నాగుడి విద్యార్ధి. తదుపరి కాలంలో నలంద కులపతి. ధర్మ పాలుడి శిష్య ప్రముఖుడు శిలాభద్ర ఆధ్వ ర్యంలో ఆయన శిష్యప్రశిష్యులు చైనాకు తరలి వెళ్లి, చైనా భాష నేర్చుకుని ధర్మపాలుడి బౌద్ధ దర్మ వ్యాఖ్యానాలను రచించారు. నేటికీ అవ న్నీ పదిలం. హర్షవర్ధనుడు 25మీటర్ల ఎత్త యిన బుద్ధుని కాంశ్య ప్రతిమను విశ్వవిద్యా లయానికి బహూకరించాడు. కుమారగుప్తుని పాలనలో ‘ఫైన్ ఆర్ట్స్ స్కూల్’ ప్రారంభమైం ది. పదివేలమంది విద్యార్ధులు ఒకేసారి సమా వేశమయ్యేందుకు వీలైన మందిరాలుండేవి. తొమ్మిదంతస్తులున్న మూడు భవనాలలో సారస్వతం విరాజిల్లేది. విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులను పాలకులు ‘గ్రాంట్’ గా ఇచ్చేవారు. 8 శతాబ్దాలు నిరాటంకంగా విద్యాకేంద్రంగా నిలచిన నలందకు క్రమేణా క్షీణదశ కమ్మింది, తాంత్రిక రీతులు, దురా క్రమణలు, దారుణ దహనకాండలు! 13వ శతాబ్దానికి శిథిలాలుగా మిగిలిపోయింది. ఒక సామూహిక, సాంస్కృతిక మతిమరుపు కొన సాగింది. బ్రిటిష్ పాలకులు వలస దేశాల చరి త్రను తెలుసుకోవాలనుకున్నారు. ఆ క్రమం లో 19వ శతాబ్ది నుంచి నలంద పొరలుపొర లుగా ఆవిష్కృతం అవుతోంది. నలంద-నాగార్జునకొండ హుయాన్త్సాంగ్కు పూర్వమే 4వ శతాబ్దంలో శ్రీపర్వతాన్ని (నాగార్జునకొండ) పాహియాన్ సందర్శించారు. ఆచార్య నాగార్జునుడి జీవిత చరిత్రను రచించిన పాహియాన్ నాగార్జును డు నెలకొల్పిన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించాడు. శ్రీపర్వతం కేంద్రంగా రాష్ట్రం లోని మూడు ప్రాంతాల్లో విస్తరించిన నల్లమ ల అడవుల్లోని సమస్త వృక్షజాతులు ఏఏ అనా రోగ్యాలకు ఔషధాలో నిరూపించి, పట్టభద్రు లైన విద్యార్ధులు వివిధ దేశాలకు వైద్యులుగా వెళ్లేవారని ఉల్లేఖనాలున్నాయి. ‘మెడిసినల్ బుద్ధ’గా నాగార్జునుడు వివిధ దేశాలలో నేటికీ ఆరాధనీయుడు. ‘నలంద’ స్ఫూర్తితో ‘శ్రీపర్వ తం వైద్యవిశ్వవిద్యాలయా’నికి చొరవ తీసు కోవాలని ప్రధమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి ఎవరైనా ప్రతిపాదించాలని ఆశిద్దాం. - పున్నా కృష్ణమూర్తి