ఒక నలంద! ఒక శ్రీపర్వతం!!
బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని ‘బడాగావ్’లో చరిత్ర పునరుజ్జీవనం పొంద నుంది! స్వాతంత్య్రం వచ్చాక నలందపై దృష్టి సారించిన తొలి వ్యక్తి డా.అబ్దుల్ కలామ్. రాష్ట్రపతి హోదాలో నలంద విశ్వ విద్యాలయానికి పునర్ వైభవాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ‘నలంద’ను నిజం చేయవల సినదిగా వివిధ దేశాలకు సూచించారు. ఈ క్రమంలో నిరంతర ప్రయత్నాల ఫలితంగా తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావే శంలో ప్రధాని మన్మోహన్ సమక్షంలో గురు వారం నాడు ఒక అవగాహనా ఒప్పందం (ఎంఒయు) కుదిరింది.
ఆధునిక ప్రపంచ విశ్వవిద్యాలయంగా నలందను సమున్నతంగా రూపొందించడా నికి అంగీకరిస్తూ ఆస్ట్రేలియా-కంబోడి యా-సింగపూర్- బ్రూనీ- న్యూజిలాండ్- లావో-మయన్మార్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘ఎంత ఇచ్చినా ఇవ్వాల నిపించేలా’ మిలియన్ల డాలర్లను విడుదల చేస్తున్నాయి. అంతర్జాతీయ వాస్తు సంస్థలు ఆధునిక నలందా నిర్మాణానికి నమూనాలు రూపొందించనున్నాయి.
ఆధునిక ధర్మపాలుడు అమర్త్యసేన్
నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ నలం ద కులపతిగా తగిన భూమిక నిర్వహించ నున్నారు. అంతర్జాతీయ మేధావులతో పాల కవర్గం ఏర్పడనుంది. గృహస్తుల నుంచి భిక్ష స్వీకరించి ‘ధర్మా’న్ని దానం చేసిన బుద్ధుడు, ఈ ప్రాంత ప్రజల జిజ్ఞాసకు ముగ్ధులై ‘నలం ద’ (ఎంత ఇచ్చినా ఇవ్వాలనిపించే చోటు) అన్నారట! ఆ ప్రత్యేకత రీత్యా 5వ శతాబ్దంలో ‘నలంద’లో ప్రపంచానికి తెలిసిన తొలి వసతి విశ్వవిద్యాలయం ఏర్పడింది. శ్రీహర్షుని కాలంలో భారత్‌ను సందర్శించిన చైనాయా త్రికుడు హుయాన్‌త్సాంగ్ (క్రీ.శ.602-664) యాత్రా రచనలు, నలంద గురించి తెలుసుకు నేందుకు ఉపకరిస్తున్నాయి.
కంచి ధర్మపాలుడు నలంద కులపతి
నలంద ఒక ప్రాచీన విజ్ఞాన అద్భుతం. వివిధ దేశాల నుంచి విచ్చేసిన పదివేల మంది విద్యా ర్థులకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రెండువేల మంది అధ్యాపకులు విద్యాబోధన చేసేవారు. దక్షిణాదిన కంచికి చెందిన ధర్మ పాలుడు నలందలో దిగ్నాగుడి విద్యార్ధి. తదుపరి కాలంలో నలంద కులపతి. ధర్మ పాలుడి శిష్య ప్రముఖుడు శిలాభద్ర ఆధ్వ ర్యంలో ఆయన శిష్యప్రశిష్యులు చైనాకు తరలి వెళ్లి, చైనా భాష నేర్చుకుని ధర్మపాలుడి బౌద్ధ దర్మ వ్యాఖ్యానాలను రచించారు. నేటికీ అవ న్నీ పదిలం. హర్షవర్ధనుడు 25మీటర్ల ఎత్త యిన బుద్ధుని కాంశ్య ప్రతిమను విశ్వవిద్యా లయానికి బహూకరించాడు. కుమారగుప్తుని పాలనలో ‘ఫైన్ ఆర్ట్స్ స్కూల్’ ప్రారంభమైం ది. పదివేలమంది విద్యార్ధులు ఒకేసారి సమా వేశమయ్యేందుకు వీలైన మందిరాలుండేవి. తొమ్మిదంతస్తులున్న మూడు భవనాలలో సారస్వతం విరాజిల్లేది. విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులను పాలకులు ‘గ్రాంట్’ గా ఇచ్చేవారు. 8 శతాబ్దాలు నిరాటంకంగా విద్యాకేంద్రంగా నిలచిన నలందకు క్రమేణా క్షీణదశ కమ్మింది, తాంత్రిక రీతులు, దురా క్రమణలు, దారుణ దహనకాండలు! 13వ శతాబ్దానికి శిథిలాలుగా మిగిలిపోయింది. ఒక సామూహిక, సాంస్కృతిక మతిమరుపు కొన సాగింది. బ్రిటిష్ పాలకులు వలస దేశాల చరి త్రను తెలుసుకోవాలనుకున్నారు. ఆ క్రమం లో 19వ శతాబ్ది నుంచి నలంద పొరలుపొర లుగా ఆవిష్కృతం అవుతోంది.
నలంద-నాగార్జునకొండ
హుయాన్‌త్సాంగ్‌కు పూర్వమే 4వ శతాబ్దంలో శ్రీపర్వతాన్ని (నాగార్జునకొండ) పాహియాన్ సందర్శించారు. ఆచార్య నాగార్జునుడి జీవిత చరిత్రను రచించిన పాహియాన్ నాగార్జును డు నెలకొల్పిన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించాడు. శ్రీపర్వతం కేంద్రంగా రాష్ట్రం లోని మూడు ప్రాంతాల్లో విస్తరించిన నల్లమ ల అడవుల్లోని సమస్త వృక్షజాతులు ఏఏ అనా రోగ్యాలకు ఔషధాలో నిరూపించి, పట్టభద్రు లైన విద్యార్ధులు వివిధ దేశాలకు వైద్యులుగా వెళ్లేవారని ఉల్లేఖనాలున్నాయి. ‘మెడిసినల్ బుద్ధ’గా నాగార్జునుడు వివిధ దేశాలలో నేటికీ ఆరాధనీయుడు. ‘నలంద’ స్ఫూర్తితో ‘శ్రీపర్వ తం వైద్యవిశ్వవిద్యాలయా’నికి చొరవ తీసు కోవాలని ప్రధమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి ఎవరైనా ప్రతిపాదించాలని ఆశిద్దాం.
- పున్నా కృష్ణమూర్తి