తాడేపల్లి, సాక్షి: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నేడు. ఈ సందర్భంగా.. కలాంను కొనియాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
‘‘దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు.
దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2024
కలాం 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘‘శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కలాంకు నివాళులర్పించారు.
Remembering Dr. APJ Abdul Kalam, Former President of India, great scientist, and inspiring personality, on his death anniversary. His vision, humility, and unwavering dedication to education and innovation continue to inspire us. Let's honour his legacy by striving for excellence… pic.twitter.com/6u4B1tZsvD
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment