V.Vijasasai reddy
-
కలాం వర్ధంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నేడు. ఈ సందర్భంగా.. కలాంను కొనియాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు.దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2024కలాం 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘‘శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కలాంకు నివాళులర్పించారు. Remembering Dr. APJ Abdul Kalam, Former President of India, great scientist, and inspiring personality, on his death anniversary. His vision, humility, and unwavering dedication to education and innovation continue to inspire us. Let's honour his legacy by striving for excellence… pic.twitter.com/6u4B1tZsvD— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024 -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
YSRCP: వైఎస్సార్సీపీ 9వ జాబితా విడుదల
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది. అలాగే.. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్(రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్ ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకుని వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్సీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని.. ఒకటిరెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్‌ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన తొమ్మిది జాబితాల వారీగా చూస్తే.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిల జాబితాల్ని వైఎస్సార్సీపీ విడుదల చేసింది . తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 7 స్థానాలకు(4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. ఆరో జాబితాలో 10 స్థానాలకు(4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు).. ఏడో జాబితాలో 2 అసెంబ్లీ స్థానాలకు, ఎనిమిదో జాబితాలో 5 (2 ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు).. తాజాగా తొమ్మిదో జాబితాలో 3 స్థానాలకు(ఒకటి పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను నియమిస్తూ/మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. -
చంద్రబాబుకు ఎంపీ విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్.. మైండ్ బ్లాంక్!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఇది కూడా పెద్ద స్కామేనా అని అంటరాని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు. వేచి చూడండి!’ అని కామెంట్స్ చేశారు. అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ...ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అలాగే, ‘అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్‌ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ తేలికవుతుంది. ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్ ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 దీన్ని తీసుకొచ్చా.. దాన్ని కనిపెట్టా, అది నేనే-ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి మీ వాళ్లను ఉద్దరించడం కాదు. దీన్ని తీసుకొచ్చా...దాన్ని కనిపెట్టా, అది నేనే - ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారు. చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలి. బాబుగారి ఆలోచన దీని చుట్టే తిరుగుతుంది. అంటూ కౌంటరిచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
అగ్రరాజ్యం సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో మరణాలు
ప్రపంచంలో గుండె జబ్బులు, కేన్సర్, పొగతాగడం, మెదడు మందగించడం, మధుమేహం మనుషుల మరణాలకు కారణమౌతున్నట్టే పేదరికం కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చావులకు దారితీస్తోంది. అనేక ఇతర అంశాల వల్ల జనం చనిపోతున్నారనే విషయంపై అమెరికాలో పరిశోధనలు ఇది వరకే జరిగాయి. అలాగే దారిద్య్రం ఈ అత్యంత ధనిక దేశంలో ఎంత మందిని కబళిస్తోందనే అంశంపై కాలిఫోర్నియా యూనివర్సిటీ–రివర్సైడ్ ప్రొఫెసర్ డేవిడ్ బ్రాడీ నేతృత్వంలో తాజాగా పరిశోధన చేశారు. అమెరికాలో దారిద్య్రం చాలా తక్కువ. డెబ్బయి ఎనభై ఏళ్ల క్రితమే సంపన్నదేశంగా అవతరించింది. అయినా, ఇంకా ఇక్కడి ప్రభుత్వం పేదరికాన్ని ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించదు. పొగతాగడానికి మరణాలకు సంబంధం ఉందని గ్రహించనట్టుగా, దారిద్య్రానికి చావుకు కూడా సంబంధం ఉందనే అంశంపై ఇప్పుడిప్పుడే సర్కార్లకు అవగాహన కలుగుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏడాదికి 4,80,000 మంది అమెరికన్లు పొగ తాగడం వల్ల కన్నుమూస్తున్నారు. ఊబకాయంతో 2,80,000 మంది, మితిమీరిన స్థాయిలో మాదకద్రవ్యాలు సేవించి 1,06,000 మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలన్నీ 2021కి సంబంధిచినవి. అమెరికా ప్రజలను వారి ఆయుష్షు నిండకుండానే చంపేస్తున్న కారణాలపై చేస్తున్న తాజా పరిశోధనల వల్ల జనం ప్రాణాలు కాపాడే ప్రచారోద్యమాలకు మేలు జరుగుతోంది. ప్రజారోగ్యంపై అమెరికన్లలో జాగరూకత పెంచడానికి అవి ఉపకరిస్తున్నాయి. అమెరికాలో పేదరికం పూర్తిగా అంతరించలేదనే వాస్తవం సభ్య ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రాడీ నాయకత్వంలో ఓహాయో స్టేట్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ప్రొ.హూయీ జెంగ్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్ డామ్ ప్రొఫెసర్ ఉల్రిచ్ కోహ్లర్ బృందం అమెరికాలో పేదరికం మరణాలు, పర్యవసానాలపై అధ్యయనం చేసింది. గుండె జబ్బులు, కేన్సర్, స్మోకింగ్ తర్వాత జనం ప్రాణాలు తీసే నాలుగో పెద్ద కారణం పేదరికమని ఈ బృందం సర్వేలో తేలింది. తక్కువ ఆదాయాలున్న ప్రజలను పీడించే దారిద్య్రం కారణంగా ఏటా అమెరికాలో 1,83,000 మంది చనిపోతున్నారు. వరుసగా పదేళ్లు దారిద్య్రం బారిన పడడం వల్ల ఏటా 2,95,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దేశంలో పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజారోగ్య సమస్యలు తీవ్రం కావడం, వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి దారిద్య్ర మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా సెన్సస్ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై అమెరికా పాలకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇండియాలోనూ ప్రజల ప్రాణాలు తీస్తున్న దారిద్య్రం భారతదేశంలో కూడా ప్రజలు ఆయుష్షు తీరకుండానే బయటి కారణాల వల్ల ఎలా, ఎంత మంది మరణిస్తున్నారో ఎప్పటి నుంచో అధ్యయనం చేస్తున్నాయి. ప్రత్యేకించి దారిద్య్రం ప్రత్యక్ష ప్రభావం వల్ల ఎంత మంది కన్నుమూస్తున్నారో పరిశోధనలు చేసే ఆనవాయితీ దేశంలో లేదు. పేదరికం వల్ల ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? తగినంత ఆదాయం లేకపోవడంతో ఎంత మంది ఏఏ జబ్బులతో చనిపోతున్నారు? పేదరికం పోషహాకార లోపానికి ఎంత వరకు దారితీస్తోంది? దాని వల్ల ఎంత మంది దేశ ప్రజలు కన్నుమూస్తున్నారు? వంటి అంశాలపై ప్రభుత్వానికి అవగాహన ఉంది. కాని, విడిగా పేదరికం ప్రత్యక్షంగా ఎంత మంది ప్రజల చావుకు కారణమౌతోందని విషయం పరిశోధనాంశంగా మారలేదు. ఇండియాలో పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా దేశంలో దారిద్య్ర రేఖ దిగువ నుంచి కోట్లాది మంది ప్రజలు పైకి వస్తున్నారు. ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టించడం ద్వారా పేదల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. అమెరికా తరహాలో భారత విశ్వవిద్యాలయాలు కూడా ప్రత్యకించి పేదరికం–మరణాలు అనే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు మరింత విజయవంతమౌతాయి. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఆ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
పర్యావరణానికి, ఆరోగ్యానికి, భద్రతలకు పెనుముప్పుగా మారుతున్న ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక మైనింగ్ అక్రమ తరలింపు, దానివల్ల తలెత్తుతున్న పరిణామాలను విజయసాయిరెడ్డి రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏళ్లలో నిర్మాణ రంగం 157 బిలియన్ డాలర్ల(రూ. 10,58,556కోట్ల)కు ఎగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఇసుకకు, ఇతర ఖనిజాలకు భారీగా డిమాండ్ ఏర్పడి అక్రమాలు విపరీతంగా చోటుచేసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. ఇసుక మైనింగ్ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో అక్రమ మైనింగ్ భారీగా ప్రబలుతుందని తెలిపారు. రోజుకు 2000 ట్రక్కుల ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలివెళ్తుందన్నారు. విచక్షణారహితంగా ఇసుకను వెలికితీయడం పర్యావరణ, ఆర్థిక, సామాజిక ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. భూముల సారవంతం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వరదల ముప్పు కూడా అత్యధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.