చంద్రబాబుకు ఎంపీ విజయసాయి స్ట్రాంగ్‌ కౌంటర్‌.. మైండ్‌ బ్లాంక్‌! | YSRCP MP Vijayasai Reddy Strong Political Counter To Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఎంపీ విజయసాయి స్ట్రాంగ్‌ కౌంటర్‌.. మైండ్‌ బ్లాంక్‌!

Published Tue, Sep 5 2023 9:01 PM | Last Updated on Tue, Sep 5 2023 9:01 PM

YSRCP MP Vijayasai Reddy Strong Political Counter To Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఇది కూడా పెద్ద స్కామేనా అని అంటరాని ఎద్దేవా చేశారు. 

కాగా, చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు. వేచి చూడండి!’ అని కామెంట్స్‌ చేశారు. 

అలాగే, ‘అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త  తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్‌ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ తేలికవుతుంది.


 
దీన్ని తీసుకొచ్చా.. దాన్ని కనిపెట్టా, అది నేనే-ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా  తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి మీ వాళ్లను ఉద్దరించడం కాదు.

అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారు. చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో  ఉండాలి. బాబుగారి ఆలోచన దీని చుట్టే తిరుగుతుంది. అంటూ కౌంటరిచ్చారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement