
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది.
వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు.