V. Vijaysai Reddy
-
విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారాయన.న్యూయార్క్(అమెరికా)లోని యూఎన్జీఏ 29వ సెషన్లో పాల్గొనబోయే బృందంలో ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కడం పట్ల ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఐరాస లాంటి గౌరవప్రదమైన వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచ ఆసక్తులలో దేశ భాగస్వామ్యాలను మరింతంగా పెంచే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. నవంబర్ 18 నుంచి 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది. -
'ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు'
తాడేపల్లి, సాక్షి: విజయవాడ వరదల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తన అసమర్థతను ప్రదర్శించుకుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు.కరోనాలాంటి విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎంతో సమర్థవంతంగా పని చేశారని ఏపీ మొత్తం ప్రశంసించింది. అలాంటిది ఇప్పుడు విజయవాడ వరదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా పని చేసింది. టీడీపీ ప్రభుత్వానికి ప్రజల అవసరాలను సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం(సహానుభూతి-ఎంపథీ) ఏమాత్రం లేదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.The mishandling of the #VijayawadaFloods by the TDP-led govt. in AP has made many reminisce about @ysjagan garu’s leadership during his tenure as CM, where he efficiently managed the COVID crisis. The TDP govt. lacks empathy.— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2024ఇదీ చదవండి: నటి కేసు.. టీడీపీ సర్కారు జిత్తులు! -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు: విజయసాయిరెడ్డి
సాక్షి, బాపట్ల: జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని.. కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పర్యవేక్షించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మేదరమెట్ల సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అంచనా ప్రకారం 15 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. సభా ప్రాంగాణాన్ని అవసరమైతే ఇంకో 200 ఎకరాలకు పొడిగిస్తాం. ఇదే ఆఖరి సిద్ధం సభ.. .. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనలో ఏపీలో 87 శాతం కుటుంబాలు సంక్షేమ పథకాలు పొందారు. ఏపీ అభివృద్ధి చెందినది కాబట్టి తలసరి ఆదాయం పెరిగింది. రామాయపట్నం పోర్ట్ ని రికార్డు సమయంలో ముఖ్యమంత్రి పూర్తి చేశారు. పోర్టులు అభివృద్ధి పరిచాం. ఇదంతా అభివృద్ధి కాదా?. విశాఖ ఎయిర్‌పోర్టును కూడా అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి.. తప్పడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొదు. .. టీడీపీ జనసేన 20 ఎకరాలలో సభ పెట్టి 6 లక్షలు వచ్చారని డబ్బాలు కొట్టారు. టీడీపీ బీసీ డిక్లరేషన్ అనేది హాస్యాస్పదం. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు అని గతంలో చంద్రబాబు అన్నారు. కానీ, 75 శాతం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవులిచ్చారు. 2024 ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరం అవుతుంది. ఎటువంటి పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాదు. మా టార్గెట్ 175 సీట్లు కొట్టి తీరుతాం. మేదరమెట్ల సిద్ధం వేదికగా వచ్చే ఏదేళ్లలో చేయబోయే కార్యక్రమాల్ని వివరిస్తాం. రాబోయే కాలంలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’’ అని విజయసాయిరెడ్డి అన్నారాయన. -
చంద్రబాబే స్వయంగా దాన్ని అంగీకరించారు: విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు కింగ్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభివర్ణించారు. సోమవారం పార్లమెంట్ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా చంద్రబాబే అఫిడవిట్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి కుట్రకు పాల్పడ్డారు. ఆయన కింగ్ ఆఫ్ కరప్షన్. స్కిల్ స్కామ్‌లో అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు చూసిన తర్వాతే చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపింది. చంద్రబాబు ఒక వెన్నుపోటు దారుడు. బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకూ వెన్నుపోటు పొడిచాడు అని విజయసాయిరెడ్డి తెలిపారు. -
‘పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!’
ఢిల్లీ: మహానటుడు, దివంతగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట ఇవాళ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కానున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 1/2. పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా! a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు. b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు. c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు. d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం… pic.twitter.com/7oO6E7DiEq — Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023 ఎన్టీఆర్ గారు ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్ గారికి కేవలం 4 కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ళ దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణ గారి వాటాకు వచ్చింది. చంద్రబాబు లేక పురంధ్రీశ్వరి ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా వుంచవచ్చుగా! ఆయన మీద… pic.twitter.com/KosZz6p54a — Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023 ఇక ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యలుతో పాటు చంద్రబాబు అయ్యారు. మరోవైపు తనకు ఆహ్వానం అందించకపోవంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు కూడా. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ సైతం దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: భార్యగా ఎన్టీఆర్ సిసలైన వారసురాల్ని నేను -
ఐదేళ్లలో 370 మిలియన్ డాలర్ల జుట్టు ఎగుమతి
ఢిల్లీ: భారతదేశం నుంచి గడిచిన ఐదు సంవత్సరాల్లో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22 లో 149.07 డాలర్లు, 2022-23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు తెలిపారు. మానవ జుట్టు, జుట్టు ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా జుట్టు (ముడి సరుకు) లభించేది భారతదేశంలోనే అని అన్నారు. అలాగే భారత్ లో లభించే జుట్టు అత్యంత నాణ్యమైనదిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరయ్యేందుకు సంబంధిత పరిశ్రమలతో కలిసి ప్లెక్స్ కౌన్సిల్ చురుకుగా పనిచేస్తోందని, జుట్టుతో విగ్గులు వంటి విలువైన వస్తువులు ఉత్పత్తి చేసేందుకు ఎగుమతిదారులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఇటీవల ప్లెక్స్ కౌన్సిల్ నిర్వహించిన అతిపెద్ద బ్యూటీ షో "కాస్మోప్రోఫ్ వరల్డ్‌వైడ్ బోలోగ్నా 2023"లో ఇండియా నుంచి జుట్టు ఉత్పాదనలు చేసే పరిశ్రమలకు చెందిన 20 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రపంచదేశాల కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. 2024లో నిర్వహించనున్న ప్రదర్శనలో ప్లెక్స్ కౌన్సిల్ ఇదే స్ఫూర్తితో పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా మయన్మార్ ద్వారా చైనాకు భారతీయ జుట్టు అక్రమ రవాణా జరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కస్టమ్స్ శాఖ వద్జ ఎటువంటి కేసులూ నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. -
‘వావీ వరసలు లేని.. నారాయణ.. నారాయణ’
ఢిల్లీ: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు.. ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా నారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ!… — Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2023 పెద్ద మనిషి ముసుగులో పొంగూరు నారాయణ చేస్తున్న తేడా పనుల్ని ఆయన మరదలు ప్రియా వీడియో సాక్షిగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. నారాయణ తనను తీవ్రంగా హింసిస్తున్నారని, అర్ధరాత్రి పూట టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రియా కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో భార్య ఉండగానే తాను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టారని.. తనను టార్చర్ చేసేవారని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ‘డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్లు..’ నారాయణ మరదలి ఆవేదన -
‘ఆయన సిగ్గు, శరం లేని మనిషి’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85కి పెంచితే కేసు వేయించి కొట్టేయించి, మళ్లీ ఇప్పుడు ఎలా తగ్గిస్తారంటూ బీసీ నాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డి తో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బిసి నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి’ అని ట్వీట్ చేశారు. చదవండి : మహిళలకే పెద్ద‘పీఠం’ -
2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : 2024 కల్లా ఏపీలో మూడు ఆసియా ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్( ఏఐఐబీ) ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ థాగూర్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ఈ ప్రశ్నకు కేంద్ర మంతి అనురాగ్ సింగ్ సమాధానం చెప్పారు. రూ.7 వేల కోట్ల నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా, పట్టణాలతో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం పేరుతో ఈ మూడు ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మెత్తం రూ.14,252 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ మూడు ప్రాజెక్టులకు రూ.7000 కోట్ల వరకు నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలిపింది. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టు పనుల కింద ఇప్పటి వరకు రూ.224 కోట్లు, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు పనుల కింద రూ.221కోట్లు, పట్టణాలలో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థ ప్రాజెక్టు కోసం రూ.7 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి థాకూర్ చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టు 2022 నవంబర్ నాటికి, మిగిలిన రెండు ప్రాజెక్టులను 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులను ఫండ్‌లో జమ చేయాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద కేటాయించే నిధులను ఏదైనా పరిశ్రమ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయని పక్షంలో ఆ నిధులను నెల రోజుల వ్యవధిలో ఏదైనా బ్యాంక్‌లో ప్రత్యేకంగా అకౌంట్ తెరచి అందులో జమ చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మూడేళ్లపాటు ఖర్చు చేయకుండా ఆ అకౌంట్లో మిగిలిన సొమ్మును తృతీయ ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లో చట్టబద్దంగా ఏర్పాటు చేసి ఫండ్‌కు బదలాయించాల్సి ఉంటుందని తెలిపారు. -
‘నదుల అనుసంధానానికి నిధులివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో చేపట్టబోయే కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకి తగిన నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఈ అంశంపై ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు, వరదలు భారీగా వచ్చినప్పటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కరువు ముప్పు తప్పేలా లేదని తెలిపారు. గత 52 ఏళ్లుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రతి ఏటా వచ్చే వరద 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు తగ్గిపోతున్నా ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు గోదావరిలో ఏటా 2,780 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కరువు బారిన పడుతున్నాయని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తే తప్ప ప్రతి ఏటా ఈ దుస్థితి అనివార్యమని గ్రహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు తగినంత ఆర్ధిక సాయం చేయాలని నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో జరిగిన భేటీలో కోరిన విషయం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకొని నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
డ్రగ్స్‌కు చరమగీతం పాడాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: మత్తు పదార్ధాలకు విద్యార్థులు బానిసలు కావడం పట్ల వైఎస్సార్ సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియా అంశాన్ని ఆయన బుధవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జర్మనీ, యూకే దేశాల నుంచి మాదక ద్రవ్యాలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ముఠా వెలుగు చూసిన నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు.