సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85కి పెంచితే కేసు వేయించి కొట్టేయించి, మళ్లీ ఇప్పుడు ఎలా తగ్గిస్తారంటూ బీసీ నాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డి తో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బిసి నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి’ అని ట్వీట్ చేశారు.
చదవండి :
మహిళలకే పెద్ద‘పీఠం’
Comments
Please login to add a commentAdd a comment