local body electons
-
అక్కడ ‘ఓటు’ ప్రలోభాలపర్వం రూ. లక్షకు..!
సాక్షి, బెంగళూరు: స్థానిక సంస్థల కోటాలో 25 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు పడ్డారు. మందు, విందు, చిందులతో తమవైపు తిప్పుకోవడానికి శ్రమిస్తున్నారు. అనేకమంది అభ్యర్థులు టీపీ, జీపీ సభ్యులైన ఓటర్లకు తోటల్లో ఘుమఘమలాడే వంటకాలతో విందు వినోదాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు కాదు. కాబట్టి వారిపై పార్టీ పర్యవేక్షణ ఉండదు. కొందరు సభ్యులు అన్నిపార్టీల విందులకూ హాజరై మజా చేయడం జరుగుతోంది. అందుకే అభ్యర్థులు విందు, డబ్బులు ఇవ్వడమే కాకుండా తమకే ఓటు వేయాలంటూ ఒట్టు పెట్టించుకుంటున్నారు. ఓటుకు రూ.25 వేల ముడుపు ధనవంతులైన అభ్యర్థులు రిసార్టులు, హోంస్టేలు, తోటల్లో గత నాలుగైదు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తటస్థంగా ఉండే కొందరికి ఏదో రకంగా ప్రలోభానికి గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉన్న ప్రలోభాలపర్వం ఇప్పుడు రూ. లక్షకు చేరుకుంది. ఒక్కో నియోజకవర్గంలో ఓటుకు రూ. 25 వేలు డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు పెరిగిపోతోందని అభ్యర్థులు లోలోపల మథనపడుతున్నట్లు సమాచారం. -
మున్సిపోల్స్‌కు నామినేషన్ల ప్రక్రియ షురూ
-
ఏపీ: మిగిలిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్) పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న కౌంటింగ్ జరపనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ►ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ ►నెల్లూరు కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నిక ►నవంబర్ 15న మున్సిపాలిటీల్లో ఎన్నికలు, 17న ఫలితాలు ►కార్పొరేషన్లలో మిగిలిపోయిన డివిజన్లకు జరగనున్న ఎన్నిక ►7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు జరగనున్న ఎన్నిక ►12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక ►498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌లకు ఎన్నిక ►మిగిలిపోయిన 533 వార్డు మెంబర్లకు జరగనున్న ఎన్నిక ►గ్రామ పంచాయతీల్లో ఈనెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్ ►13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు ఎన్నిక ►13 జిల్లాల్లో మిగిలిపోయిన 16 జడ్పీటీసీలకు ఎన్నిక ►ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 16న ఎన్నికలు, 18న ఫలితాలు ►అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్లు ►పంచాయతీల్లో 14న, మున్సిపాలిటీల్లో 15న, జడ్పీటీసీల్లో 16న ఎన్నిక -
పురపోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన ప్రలోభం!
సాక్షి, నకిరేకల్(నల్లగొండ): జిల్లాలో జరగుతున్న నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగి సింది. దీంతో మైకులు మూగబోయాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు 72 గంటల ముందే గడువు విధించడంతో రెండు రోజుల ముందే మున్సిపాలి టీ ఎన్నికల అభ్యర్థుల ప్ర చా రం పరిసమాప్తమైంది. ఆ యా పార్టీల అభ్యర్థుల దృష్టాంతా ఓట్ల కొనుగోళ్లపైనే కేంద్రీకృతమైంది. నకిరేకల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను 21,382 మంది ఓటర్లు ఉన్నారు. అధికార టీ ఆర్ఎస్ పార్టీ ఒంటరిగా అన్ని వార్డులకు పోటీ చేస్తోంది. వివిధ పా ర్టీలకు చెందిన 93 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి 20, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి 14, సీపీఎం నుంచి ము గ్గురు, టీడీపీ నుంచి ఒకరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 14మంది, ఇండిపెండెంట్లు 25మంది మొత్తం 93 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్, మరికొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా రీతిలో కనిపిస్తోంది. వారం రోజుల పాటు జోరుగా ప్రచారం చేయడంతోపాటు, ఇంటింటికీ అభ్యర్థులు, వారి పార్టీల కార్యకర్తలు తిరి గారు. ఒక్కో వా ర్డును కనీసం నాలు గైదు పర్యాయాలు చుట్టి వచ్చారు. పోలింగ్ ఈనెల 30న జరగనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు సై తం ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ ఓట్లు అ భ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి వార్డులో 900 నుంచి 1200 లోపు ఓట్లు కలిగి ఉన్నాయి. ఇందులో క నీసం అరవై శాతం ఓట్లకు డబ్బులు పంచితే చా ల న్న ఆలోచనలో ఆయా పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు ప్రచారం. కొన్ని వార్డుల్లో కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటరుకు రూ.1500 నుంచి రూ.3వేల వరకు పంచుతున్నట్లు సమాచారం. ఇక పోటీ ఎక్కువగా ఉండి తప్పదు అనుకున్న కొన్ని వార్డుల్లో మాత్రం ఓ టుకు రూ.5 వేల చొప్పున పంచే ఆలోచనలో మ రికొందరున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలు వార్డుల్లో ఇప్పటికే ఓటుకు రూ. 2వేలు పంచినట్లు తెలుస్తోంది. మరొక వార్డులో ఇంటింటికీ కేజీ చికెన్ కూడా పంపిణీ చేశారని తెలుస్తోంది. ఆఖరి రోజున జోరుగా ప్రచారం.. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తరపున మంత్రి జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నకిరేకల్, తుంగతుర్తి, కోదాడ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య రోడ్డుషో, ప్రచార సభలు నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పాల్వాయి రజనీలు ప్రచారంలో పాల్గొన్నారు. మందు... విందు.. నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వార్డుల్లో పురుష ఓటర్లను ఒకే చోటకు చేర్చి సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యంతో మర్యాదలు చేయాల్సి వస్తోందని.. ఎక్కువ ఖర్చు అవుతోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు తమ వెంట తిరిగే వారికి రోజు కూలి మాట్లాడుకొని తిప్పుకున్నారని, ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.350 వరకు ప్రతిరోజు చెల్లించారని సమాచారం. -
‘జగనన్న జయభేరి’ పాట విడుదల
తాడేపల్లిరూరల్(మంగళగిరి): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాటను రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల ఇన్చార్జి మోపిదేవి వెంకటరమణారావు మంగళవారం తాడేపల్లిలో విడుదల చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ రచయిత, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీ నారాయణ ఐదు నిమిషాల నిడివి గల ఈ పాటను రచించి, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
1970లో ఎన్నిక, ఇప్పటికీ పెద్ద దిక్కు ఆయనే!
నాగులుప్పలపాడు: ఐదు దశాబ్దాల క్రితం 1970లో పంచాయతీ బోర్డుకు ఒక యువకుడు ఎన్నికయ్యాడు. వామపక్ష భావజాలం నుంచి వచ్చిన అతడు 17 ఏళ్ల పాటు ఆ గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఈ రోజుకూ గ్రామానికి ‘పెద్ద దిక్కు’గానే కొనసాగుతున్నాడు. అదే ఉత్సాహంతో నేడు మరోసారి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ పర్యాయం ఆయన వయస్సు 80 ఏళ్లు. అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆయనే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కండ్లగుంటకు చెందిన పల్లెర్ల వెంకారెడ్డి. ఇదీ రాజకీయ ప్రస్థానం.. నాడు వామపక్ష భావజాలం బలంగా ఉన్న గ్రామా ల్లో కండ్లగుంట కూడా ఒకటి. అభ్యుదయవాదిగా ప్రజల్లో గుర్తింపు పొందిన వెంకారెడ్డి 1970లో తొలిసారి పంచాయతీ బోర్డుకు ఎన్నికయ్యారు. 1982 వరకు సర్పంచ్ కొనసాగారు. 1983లో మరోసారి సర్పంచ్‌గా ఎన్నియ్యారు. నాడు పంచాయతీ సమితిలో వర్క్స్ కమిటీ చైర్మన్‌గానూ విధులు నిర్వహిం చారు. 1990లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక 2005లో కండ్లగుంట సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తన మద్దతుదారుల ను రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా గెలిపిం చుకు న్నారు. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న వెంకారెడ్డి ఈ పర్యాయం మరోసారి సర్పంచ్‌గా గెలిచి గ్రామ సచివాలయంలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. -
టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: టీడీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం గట్టిషాక్ ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మేనిఫెస్టోపై టీడీపీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా వెంటనే మేనిఫెస్టోను వెనక్కు తీసుకోవాలంటూ టీడీపీకి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. టీడీపీ మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. చదవండి: తొలి విడత: ఇప్పటివరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలు పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయగా... మేనిఫెస్టోపై టీడీపీని ఎస్ఈసీ వివరణ కోరింది. టీడీపీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో మేనిఫెస్టోను రద్దు చేసినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. -
‘వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో సత్తా చాటబోతుంది’
సాక్షి, కర్నూలు : నామినేషన్లు వేసేందుకు దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్, చైర్మన్ ఎన్నిక విషయంలో గట్టి కృషి చేసి భారీ మెజారిటీతో గెలుపొందేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో సత్తా చాటబోతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, ఇతర తోక పార్టీలు ఎన్నికల్లో కనీసం 25 శాతం పంచాయతీలను కైవసం చేసుకునే దమ్ముందా అని మంత్రి సవాల్ విసిరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే రేపటి ఎన్నికల్లో సాధించే విజయానికి నిదర్శనమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. డకోటా ఛానళ్లను వెంటపెట్టుకొని నామినేషన్లకు, ఎన్నికల ప్రక్రియకు టీడీపీ వెళ్ళినా.. తమకేం అభ్యంతరం లేదని తెలిపారు. రికార్డ్ బ్రేక్ చేయడం, ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. -
ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఎస్ఈసీ రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ -
ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటు : కొడాలి నాని
-
ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ప్రజాహితం కాదు: ఏపీ సీఎస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని లేఖలో స్పష్టం చేశారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదన్నారు. చదవండి: రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది.. రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలుని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా కిట్లు దిగొచ్చాయ్ -
‘ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలన్ని కాంగ్రెస్ హయాంలో నెలకొల్పినేవని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆరున్నర ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయకుండా మాటలకే పరిమితం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే జూమ్ ద్వారా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కమ్ ఠాగూర్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తుందని తెలిపారు. చదవండి: ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. అందుకోసం 8639721075 నెంబర్‌కు వాట్సప్ చేయగలరని సూచించారు. లేదా speakuphyderabad@gmail.Com చేయవచ్చని తెలిపారు. వారం, పది రోజుల పాటు వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వరద బాధితులకు ఇచ్చే పరిహారం పూర్తిగా అవినీతిమయం అయ్యిందని, నిజమైన బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. వరద పరిహారం పై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
నిమ్మగడ్డ రమేష్‌తో సీఎస్ నీలం సాహ్ని భేటీ
సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో సీఎస్ సాహ్ని ఆయనతో భేటీ అయి ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు తెలియజేశారు. ఈ భేటీలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చదవండి : టీడీపీ డిమాండ్ హాస్యాస్పదంగా ఉంది: అంబటి) ‘కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోంది. దేశంలోనే అత్యత్తమంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం. కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అధికారులు, ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. 11వేల మందికిపైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.అయినా సమర్థవంతంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తాం. వాయిదా పడ్డ ఎన్నికల నిర్వహణపై తెలియజేస్తాం.‘ అని ఎస్ఈసీకి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. (చదవండి : ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం) -
ఎన్నికల కమిషన్ సీరియస్
-
నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ విషయంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆధారాలు ధ్వంసం చేసినట్టు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబ మూర్తి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారు. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం. ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు. లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తెలియదన్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పినట్టు లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.(‘లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు’) ఆధారాలు ట్యాంపర్ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. కేంద్రంకు రాసిన లేఖ 221 నంబర్‌తోనే, అశోక్‌బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌కు కూడా ఉందని పేర్కొన్నారు. -
లేఖ రాయకపోతే ఎందుకు మౌనం..
సాక్షి, ఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేఖ తాను రాయలేదని ఏఎన్ఐకి ఈసీ రమేష్ చెప్పారని తెలిపారు. టీడీపీ నేతలు మాత్రం ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశాడని వకాల్తా పుచ్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై చాలా అనుమానాలు వస్తున్నాయని, దీని వెనకాల ఏ కుట్ర జరిగిందో బయటకు రావాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అందరూ కాపాడుకోవాలని తెలిపారు. ఈసీ రమేష్‌కుమార్ స్పందించటం లేదంటే.. ఏదో తప్పు జరిగిందని అనుమానం వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హింస జరిగిందని ఈసీ లేఖ రాశారు. అలా అయితే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు అని జీవీఎల్ సూటిగా ప్రశ్నించారు.(‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’) ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి గౌరవించి సుప్రీంకోర్టు సైతం వాయిదా విషయంలో జోక్యం చేసుకోలేదని జీవీఎల్ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను రాజకీయం కోసం దుర్వినియోగం చేయకూడదాన్నారు. లేఖ రాయకపోతే మౌనంగా ఈసీ రమేష్‌కుమార్ ఎందుకు ఉంటున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. మాట్లాడకుండా ఉండడం రాజ్యాంగ సంస్థకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జీవీఎల్ నరసింహారావు అన్నారు. -
‘ఆయన మానసిక పరిస్థితి సరిగాలేదు..తప్పించాలి’
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమర్ చంద్రబాబు నాయుడు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రమేష్ కుమార్ మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు హాని ఉందంటూ ఎన్నికల కమిషనర్ రమేష్ కేంద్రానికి లేఖ రాయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. లేఖలోని అంశాలను చూశాక రమేషే రాశారన్న అనుమానం కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు లేఖ రాసినట్లు ఉందని ఆరోపించారు. ఈ నెల 15వ తేదిన నిమ్మగడ్డ చెప్పిన మాటలకు.. లేఖలో రాసిన అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. (చదవండి : ఈసీ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్) ‘ కరోనా వైరస్ విజృంభిస్తే గ్రామ స్థాయిలో బలమైన యంత్రాంగం ఉండాలి. పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడే ఎన్నికలు పూర్తి చేసి .. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులను నియమించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ ప్రభుత్వమైనా ఏకగ్రీవాలవైపే మొగ్గు చూపుతుంది. ఏకగ్రీవాలు కావాలనే ప్రోత్సహకాలు కూడా ఇస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే మా పార్టీ స్వీప్ చేసిందో.. అక్కడే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయి. సీఎం జగన్‌పై నమ్మకంతో ప్రజలను తిరుగులేని విజయం అందిస్తున్నారు. అభ్యర్థులు దొరక్క ఎన్నికల ముందే చంద్రబాబు అస్త్రసన్యాసం చేశారు. ఓడిపోతామనే భయంతో ఈసీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించారు. ఈసీ ఏకపక్ష నిర్ణయం తప్పని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టే సామర్థ్యం మాకు ఉంది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. (చదవండి : ‘ఆ లేఖ బాబు ఆఫీసులో తయారు చేశారు!’) -
ఈసీ లేఖ వ్యవహారంపై సర్కార్ సీరియస్
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరుతో వెలువడిన లేఖ వ్యవహారంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఈసీ పేరుతో కేంద్ర హోంశాఖకు తానే స్వయంగా లేఖ రాసినట్లు రమేష్ కుమార్ ఇప్పటికీ చెప్పకపోవడంతో.. ఈ అంశాన్ని రాజకీయ కుట్రగా ప్రభుత్వం భావిస్తోంది. లేఖ వ్యవహారంపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నా.. రమేష్ స్పందించకపోవడంతో ఆయన మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈసీ లేఖను సోషల్ మీడియా వేదికగా టీడీపీ విపరీతంగా ప్రచారం చేయడంతో ఇది ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు కుట్రగానే ప్రభుత్వం భావిస్తోంది. (తీర్పు తర్వాత ఆకాశ రామన్న లేఖ!) ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు ఈసీకి అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. వాయిదాపై ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంతో ఏంటని న్యాయస్థానం నిలదీసింది. దీంతో కుట్రపూరితంగా టీడీపీతో రమేష్ కుమార్ కుమ్మకై ఈ లేఖను తెరపైకి తచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఖపై ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషన్ ప్రతినిధి స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. దీంతో తాజా లేఖపై విచారణ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. రమేష్ కుమార్ ఎందుకు స్పందిచలేదు.. ఈ నేపథ్యంలోనే ఈసీ లేఖపై మంత్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రమేష్ కుమార్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తంచేశారు. లేఖపై రమేష్ కుమార్ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ఆయన వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈసీ లేఖపై రమేష్ వెంటనే స్పందించాలని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆయన లేఖ రాసి ఉండకపోతే దానిపై విచారణ జరపాలని డీజీపీ కోరాలని అన్నారు. లేఖ వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అవంతి మండిపడ్డారు. (ఎన్నికల కోడ్ ఎత్తివేత) పోలీసులుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఎన్నికల కమిషనర్ పేరుతో లేఖ విడుదలైందని, అది తప్పుడు లేఖ అయితే రమేష్ కుమార్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మౌనం దేనికి సంకేతమని అన్నారు. లేఖతో ఆయనకు ఏం సంబంధంలేకపోతే.. బాధ్యత గల అధికారిగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
‘లేఖ వాస్తవమా? కాదా? ఆయనే స్పష్టం చేయాలి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పేరు మీద సర్క్యులేట్ అవుతున్న లేఖపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబుతో పాటు కె.పార్థసారథి, జోగి రమేశ్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాద భాష మాట్లాడుతున్నారని అంబటి నిప్పులు చెరిగారు. (రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి) ఎన్నికలు వాయిదా వేసే ముందు ఈసీ ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించిందని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన దుయ్యబాట్టారు. ఈసీని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. కరోనా వైరస్ గురించి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ లేఖ ఉందని ఆయన ఆగ్రహించారు. చంద్రబాబు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలనే ఈ లేఖలో రాశారని అంబటి మండిపడ్డారు. (ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి: వెల్లంపల్లి) ఈ లేఖను టీడీపీ కార్యాలయం నుంచి ఐదు టీవీ చానల్స్ ప్రతినిధులకు ఇచ్చారని అంబటి అన్నారు. ఎవరెవరికి ఈ లేఖలు అందాయో తమకు స్పష్టంగా తెలుసని అంబటి తెలిపారు. ఈ లేఖ నిమ్మగడ్డ రమేష్ ఈ-మెయిల్ నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చేరిందన్నారు. ఈ లేఖ వాస్తవమా? కాదా? అనేది నిమ్మగడ్డ రమేషే స్పష్టం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతుంటే, ఇది వాస్తవమా? కాదా? అని చెప్పే బాధ్యత నిమ్మగడ్డ రమేష్‌కు లేదా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్న బాబుకు నిమ్మగడ్డ రమేష్ వత్తాసు పలుకుతున్నారనే భావన తమకు కలుగుతుందని అంబటి రాంబాబు మండిపడ్డారు. -
రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడంలో ఎలక్షన్ కమిషన్ తన పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని, దీంతో ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఎన్నికల వాయిదా రాజకీయ కోణంలో జరిగినట్లు బట్టబయలయిందన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది అతిక్రమణ, తప్పు అని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలని, సంక్షేమ పథకాల కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మంచి పరిణామమని అంబటి రాంబాబు అన్నారు. (అందుకే టీడీపీని వీడాను: శమంతకమణి) ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, సుప్రీంకోర్టు స్పష్టంగా తన తీర్పులో చెప్పిందని అంబటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే చారిత్రాత్మక తీర్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని అంబటి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు స్తంభింప చేయాలనే కుట్ర చేశారని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై ఈసీ సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక చంద్రబాబు ఉన్నారని అంబటి మండిపడ్డారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’) కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, అదేవిధంగా ఎస్ఈసీలో కూడా ముగ్గురు సభ్యులు ఉండేలా సంస్కరణలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలని అడుగుతున్న చంద్రబాబు, అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టమని అడుగుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరుతారని, బాబు అడిగేవన్ని జరగవని అంబటి అన్నారు. చట్టం, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంబటి రాంబాబు తెలిపారు. (ఎన్నికలంటే విపక్షాలకు భయమెందుకు) -
నిమ్మగడ్డ రమేష్ కరోనా కంటే ప్రమాదకరం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ప్రతిపక్ష టీడీపీకి మేలుచేకూర్చేందుకే ఎన్నికలను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌పై తమకు గౌరవం ఉందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదో లేదో ప్రజలే తేలుస్తారని అన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యాంగ విలువలను కాలరాశారని పేర్కొన్నారు. కరోనా వైరస్ కంటే నిమ్మగడ్డ రమేష్ ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిపారు. (కరోనాకు ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?) ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ‘ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని, సంబంధిత సెక్రటరీలను సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం దారుణం. ఏ అధికారి అయినా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటుపడాలి. రాజ్యాంగాన్ని, పోలీసులను, అధికారులను ఎవరినీ సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకున్నారు. నైతికత ఉంటే రమేష్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలి. నిమ్మగడ్డ రమేష్ అని పిలవడం కన్నా.. నారావారి గబ్బిలం అని పిలిస్తే బెటర్. ఆర్టికల్ 243కే ప్రకారం విపత్తుల సమయంలో మాత్రమే ఎన్నికలు వాయిదా వేయాలి’ అని అన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారు.. కాగా ఇదే విషయంపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ హవా కనిపిస్తోంది. అధికారం ఉన్నా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కమిషన్ వ్యవస్థను నిమ్మగడ్డ రమేష్ కుమార్ భ్రష్టు పట్టించారు. చంద్రబాబు హయాంలోనే రమేష్ నియమితులైయ్యారు. అందుకే ఆయన రుణం తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో కరోనా వుంటే ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించారా ? మీరు చెప్పినట్టు అరు వారాల తర్వాత కరోనా అదుపులోకి వస్తుందని అంచనాలు వేశారు.. మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?. ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదు’ అని అన్నారు. విజయాన్ని మాత్రం ఆపలేరు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీదే విజయమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ‘కేంద్రం నుంచి రావాల్సిన 5 వేల కోట్లు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నారు, ఎన్నికల వాయిదా అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎవరు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు పంపిణీ వద్దని మరుసటి రోజు కరోనా కారణం చూపించారు. ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయగలిగారు..కానీ విజయం మాత్రం వైఎస్సార్సీపీదే. చంద్రబాబు కుట్రలను మేధావులు ఖండించాలి’ అని వ్యాఖ్యానించారు. -
‘టీడీపీకి మరోసారి చెంపదెబ్బ తప్పదు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. టీడీపీకి మరోమారు చెంపదెబ్బ తప్పదని విమర్శించారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు కనుమరుగవడం ఖాయమన్నారు. 58 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని చెప్పారు. (అభ్యర్థులు లేకే చంద్రబాబు డ్రామాలు) బాబుకు బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలకు అన్యాయం చేయడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విమర్శించే అర్హత మాజీ మంత్రి దేవినేని ఉమాకు లేదని దుయ్యబట్టారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలు గుండాయిజం మానుకోవాలని సోమినాయుడు హితవు పలికారు. (టీడీపీకి హైకోర్టులో చుక్కెదురు) -
టీడీపీలో గందరగోళం..
ప్రలోభాలు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ప్రజలు పూర్తి స్వేచ్ఛతో ఓటు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ప్రతిపక్ష టీడీపీ తూట్లు పొడవడానికి సిద్ధమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు సమాయత్తమవుతోంది.అందు కోసం అభ్యర్థులను ఖరారు చేయకుండా.. ఆర్థిక బలం ఉన్న వారికే సీటు ఖరారు చేయడానికి బేరసారాలు సాగిస్తున్నారు. వార్డుల్లో డబ్బులు వెదజల్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినాయకత్వం మల్లగుల్లాలుపడుతోంది. ప్రజా బలాన్ని పక్కనపెట్టి ఆర్థిక బలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని నిర్ణయించింది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ.. టీడీపీ తమ అభ్యర్థులను ఖారారు చేయలేని పరిస్థితి నెలకొంది. పార్టీ తరఫున బీ ఫారం కావాలంటే రూ.కోటికిపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కరాఖండిగా చెబుతోంది. దీంతో టీడీపీ ఆశావహులు తెల్లముఖం వేయాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల కార్యాలయాలే అభ్యర్థుల కొనుగోలు కేంద్రాలుగా మారిపోయిన వైనం పార్టీ శ్రేణుల్లో చర్చనీయంశంగా మారింది. దేశంలో గందరగోళం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ.. టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో పారీ్టలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైసీపీ బీ ఫారాలతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేయడం ప్రతిపక్ష పార్టీ ఆశావహులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ టీడీపీ అధినాయకత్వం తమ కార్పొరేటర్ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థులు అప్పుడే ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే.. తేదేపా ఆశావహులు పార్టీ బీ ఫారాల కోసం ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేషన్ల దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నంతో గడువు ముగియడంతో తేదేపా ఆశావహులందరితో నామినేషన్లు వేయించడంతో అభ్యర్థులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. ఆర్థిక బలాలపై ఆరా ఆయా పార్టీల అభ్యర్థులకు బీ ఫారాలు సమర్పించడానికి ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో నామినేషన్లు వేసిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల కార్యాలయాలకు పిలిపించి అభ్యర్థుల ఆర్థిక బలంపై ఆరా తీస్తున్నారు. కోటి ఉంటేనే బీఫారం! నామినేషన్లు వేసిన అభ్యర్థులను టీడీపీ ఎమ్మెల్యేలు తమ కార్యాలయాలను పిలిపించి వారి బలాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. వార్డులో అభ్యర్థుల ప్రజా బలం కంటే ఆర్థికంగా బలమైన వారికే బీ ఫారాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారని ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీని గట్టిగా ఢీకొట్టాలంటే.. భారీగా ఖర్చు చేయాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఒక్కో వార్డుకు రూ.కోటికి పైగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్న అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో రూ.కోటికి పైగా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వడబోతకు టీడీపీ ఎమ్మెల్యేల కార్యాలయాలే వేదికగా మారాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. శుక్రవారం రాత్రి వరకు ఆశావహులతో నాయకులు ఎన్నికల ఖర్చు అంశంపై చర్చ జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నామినేషన్లు వేసిన వారిని ఒక్కొక్కరిని పిలిచి ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలరని స్వయంగా ఎమ్మెల్యేలే అడుగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యధికంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది పేర్లను ఖరారు చేసినప్పటికీ.. శని, ఆదివారాల్లో తుది జాబితా వెల్లడించాలని అధినాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ రేసులో పీలా, గండి? టీడీపీ నుంచి మేయర్ అభ్యరి్థగా పీలా శ్రీనివాస్, గండి బాబ్జిలు రేసులో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మేయర్ స్థానానికి ముందు నలుగురు అభ్యర్థుల పేర్లు వినిపించాయి. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, తిప్పలగురుమూర్తి రెడ్డి, గండి బాబ్జి, అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్ సోదరుడు పీలా శ్రీనివాస్ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలించింది. అయితే ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఈ విషయంపై గురువారం నిర్వహించిన సమావేశంలో మేయర్ అభ్యర్థి రూ.25 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే అంతమొత్తంలో తాము ఖర్చు చేయలేమని నలుగురు వెనకడుగు వేయడంతో కనీసం రూ.15 కోట్లు అయినా సర్ధుబాటు చేసుకోవాల్సి ఉంటుందని చర్చకు వచ్చినట్టు తెలిసింది. దానికి కూడా పల్లా శ్రీనివాస్, తిప్పల గురుమూర్తి రెడ్డి అంగీకరించలేదు. దీంతో పీలా శ్రీనివాస్‌పై అధినాయకులు మొగ్గు చూపించారు. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పీలా శ్రీనివాస్, గండి బాబ్జిల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గండి బాబ్జి పేరును ప్రతిపాదించడం పట్ల పెందుర్తి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ఇతర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా గండి బాబ్జి పేరును పరిశీలిస్తుండడం పట్ల ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పారీ్టలో చర్చజరుగుతోంది. -
వలసలతో టీడీపీ కుదేలు..
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అబ్దుల్ కలాం వంటి వారికి సైతం సలహాలు ఇచ్చానంటూ గొప్పలు.. అంతర్జాతీయ స్థాయి రాజధాని పేరుతో సింగపూర్ గ్రాఫిక్స్.. ఇవేవీ చంద్రబాబును కాపాడలేకపోయాయి. అంతులేని అవినీతితోపాటు ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో ప్రజలు అసహ్యించుకున్నారు. 9 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటర్లు దూరమైతే.. ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయానికి నాయకులు సైతం పార్టీని వీడే దుస్థితి దాపురించింది. పోటీకి నిలబెట్టడానికి ఆపసోపాలు పడే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజావ్యతిరేక విధానాలతో టీడీపీ ఖాళీ అయిపోతోంది. ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి వలసపోతున్నారు. ఊహకందని విధంగా వందలాది మంది మాజీలు టీడీపీని విడిచిపెట్టేస్తున్నారు. పూర్వ ఎమ్మెల్యే, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నీటి సంఘం అధ్యక్షులు... ఇలా ఎందరెందరో వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. ఆ పార్టీలో చేరుతున్న వారిని లెక్క కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ శ్రేణులు డీలాపడిపోయాయి. ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ మీసాల లక్ష్మి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు దూబ ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జి.రామారావు, పొందూరు మాజీ జెడ్పీటీసీ లొలుగు శ్రీరాములునాయుడు, సారవకోట మాజీ జెడ్పీటీసీ జగన్నాథం దొర, ఇచ్ఛాపురం మాజీ జెడ్పీటీసీ డక్కత నూకయ్యరెడ్డి, లావేరు మాజీ వైస్ ఎంపీపీ మేరం సోమిబాబు, సంతకవిటి మాజీ వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరి, ఎచ్చెర్ల పీఏసీఎస్ అధ్యక్షుడు పి.సాయిరాం, పలాస టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్‌ఖాన్, పలాస నియోజకవర్గ టీడీపీ నేత వంకా నాగేశ్వరరావు, పలాస 12వ వార్డు మాజీ కౌన్సిలర్ బళ్ల రేవతి, పాలకొండ మాజీ కౌన్సిలర్లు బాసూరు కాంతారావు... ఇలా చెప్పుకుంటూపోతే వందల సంఖ్యలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లైతే లెక్క పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా వేలాదిమందితో కలిసి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు కొనసాగుతున్న వలసల ప్రవాహం.. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న వారు సైతం ఆ పార్టీని విడిచిపెట్టేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు ఛీత్కరించుకున్న తర్వాత ఇంకా కొనసాగడం అనవసరమని భావిస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి పార్టీ మారుతున్న నాయకుల సందడి కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఆ పారీ్టలో ఎందరు మిగులుతారో చెప్పలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందుకనే నామినేషన్ల ఉపసంహరణ తేదీ చివరి వరకు బరిలో ఉన్న అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడానికి ఆ పార్టీ అగ్రనేతలు భయపడుతున్నారు. ఈ రోజు దగ్గరకొచ్చిన నాయకుడు రేపు కని్పంచకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ లేని పారీ్టలో కాలం వెళ్లదీయడం కన్న సంక్షేమ, అభివృద్ధి, చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం మంచిదని, ఆ పారీ్టకి మద్దతు పలకడం సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడమే ఈ పరిణామానికి కారణం. టీడీపీని ప్రభావితం చేస్తున్న అనేక అంశాలు టీడీపీ నేతలను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు జన్మభూమి కమిటీ సభ్యుల అరాచకాలు, ఆగడాలు ఇంకా వారి కళ్లల్లో మెదులుతున్నాయి. ప్రజల్లో మొదట వ్యతిరేకత రావడానికి జన్మభూమి కమిటీలే కారణమని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇక నీరు చెట్టు నిధులు, ఉపాధి హామీ నిధులు, ఇసుక, సీసీ రోడ్ల నిధులు... ఇలా నిధులున్న ప్రతి పథకాన్ని కళ్ల ముందే పార్టీ నేతలు మింగేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంతర్మథనం చెందుతున్నారు. ఇక, తిత్లీ తుఫాన్ పరిహారంలో అక్రమాలు, ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో విఫలం చెందడం, పూర్తిగా నిర్లక్ష్యం వహించడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు సరికదా కాసుల కోసం అంచనాలు పెంచుకుని పోవడం, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ సాయం... గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోకపోవడం వలన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడిందని.... ఇప్పట్లో ప్రజలు మరిచిపోయేలా లేరనే అభిప్రాయంతో అధిక సంఖ్యలో పార్టీ మారిపోతున్నారు. వాటికి తోడు ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు, బీసీలకు కలి్పస్తున్న ప్రాధాన్యత, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు, చేనేత, మత్స్యకారులకు అందిస్తున్న చేయూత ఇలా ప్రతి ఒక్కటీ నేరుగా లబి్ధదారుల వద్దకే రావడం, వలంటీర్ల ద్వారా అందిస్తుండటంతో కరుడు గట్టిన టీడీపీ శ్రేణులు సైతం వైఎస్సార్సీపీకి ఆకర్షితులవుతున్నారు. పోటీకి సైతం వెనుకంజ నేతల ఒత్తిళ్లతో కొంతమంది నామినేషన్లు వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కన్పిస్తున్న ప్రజా వ్యతిరేకతతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. అందుకనే కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చూస్తున్నారు. శనివారం నాటికి ఉపసంహరణలపై క్లారిటీ రానుంది. దాంతో బరిలో ఉన్నదెవరో? విరమించుకున్నదెవరో తేలిపోనుంది. చెప్పాలంటే ఎన్నికలకు ముందే ఆ పార్టీ శ్రేణులు డీలాపడిపోయి చేతులెత్తేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. -
అభివృద్ధిలో ‘స్థానిక’ పాలనే కీలకం
పార్వతీపురం: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక పాలన కీలకం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిధులు చక్కగా సది్వనియోగం అయితే... ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి సూచిక అన్న నినాదం అందరికీ తెలిసిందే. గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావల్సిందేనని అందరూ అంగీకరించాల్సిన విషయం. స్థానిక సంస్థల ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసంఘం నిధులు విడుదలై గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 5వేల కోట్లవరకు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి గత 18నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణం. నిధులు సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలో నిలిచేవారిలో కొందరికి విధులు, అధికారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సహజమే. ఓటర్లు కూడా తాము ఎన్నుకున్న నాయకుడు నెరవేర్చాల్సిన బాధ్యత, ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. ఎంపీటీసీలు ఏంచేయాలి... విధులు, అధికారాలు.. జెడ్పీటీసీలు పరిస్థితి తదితర అంశాలను తెలుసుకుందాం. జెడ్పీటీసీల ఆవశ్యకత ఇలా... జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ చట్టం పక్కాగా అమలై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే జిల్లా పరిషత్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందే. జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. ఏ తీర్మాణాలు ఆమోదించాలన్నా మెజార్టీ సభ్యులు తప్పనిసరి. ఆమోదించే కార్యక్రమాలు సక్రమంగా నిర్వíర్తించే బాధ్యత సభ్యులపై ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకెళ్లాలి. మండల పరిధిలో జిల్లా ప్రాదేశిక సభ్యులను ఆయా మండల ప్రజలు నేరుగా ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని ఎన్నికకాబడిన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. జెడ్పీటీసీలు మండలంలోని ప్రజల్ని సమన్వయపరచి అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యులవుతారు. జిల్లాపరిషత్ నిర్వహణలో లోపాలు, అలసత్వం, నిధుల దుర్వినియోగంపై జెడ్పీ చైర్మన్, సీఈఓల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 15 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి జెడ్పీ పరిపాలనపై సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సీఈఓ ప్రతీ మూడు నెలలకు ఒకమారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక నివేదికపై చర్చిస్తారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ అధికారిక ఉత్సవాలకు, కార్యక్రమాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా అహ్వానించాలి. నియోజకవర్గ ఆర్థిక సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జెడ్పీ పాఠశాలల స్థితిగతుల మెరుగుకు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందించవచ్చు. నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎంపీటీసీల అధికారాలు.. విధులు ఎంపీటీసీలు మండల పరిషత్‌లో ఓటు హక్కును వినియోగించుకుని మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీలకు సంబంధిత ప్రాదేశిక సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపీపీ పదవి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీలు అధ్యక్షుడ్ని, ఉపాధ్యాక్షుడిని ఎన్నుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో మండలాభివృద్ధిలో ఎంపీటీసీలే కీలకం అవుతారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు తొలిమూడు సమావేశాలలోపు ప్రమాణ స్వీకారం చేయాలి. లేనిపక్షంలో వారి సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో పాటు వరుస మూడు సమావేశాలకు గైర్హాజరైన సభ్యత్వం పోతుంది. ఆయా పరిధి గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ శాశ్వత అహ్వానితుడవుతారు. పాలకవర్గంలో మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీ అభివృద్ధిపై సూచనలు, సలహాల మేరకు పరిమితమవుతాడే తప్ప నిర్ణయాధికారం మాత్రం ఉండదు. వారి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల విద్యాప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల దురి్వనియోగం అయితే ప్రశ్నించే అధికారం ఉంటుంది.