
తాడేపల్లిరూరల్(మంగళగిరి): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాటను రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల ఇన్‌చార్జి మోపిదేవి వెంకటరమణారావు మంగళవారం తాడేపల్లిలో విడుదల చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ రచయిత, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీ నారాయణ ఐదు నిమిషాల నిడివి గల ఈ పాటను రచించి, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.