Mopidevi Venkataramana
-
చీకటి వ్యవహారాలు టీడీపీకి కొత్తేమీ కాదుగా..!
రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అనే పదాలకు పెద్దగా విలువ ఉండదన్న సంగతి మరోసారి రుజువైంది. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకట రమణరావు, బీదా మస్తాన్ రావులు జెండా ఫిరాయించేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన పాత పద్దతులకు పదును పెడుతోందని, పదవుల అమ్మకాలు, కొనుగోళ్లు బేరసారాల పర్వం ఆరంభమైందన్న చర్చ మొదలైంది. కానీ ఈ తాజా పర్వంలో కొత్త ట్రెండ్ ఏంటంటే తెలుగుదేశానికి చెందిన కొందరు నేతలు తమకు ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి కావాలనుకుంటే వైఎస్సార్సీపీలో ఆ పదవుల్లో ఉన్న వారిని ప్రలోభపెట్టి నేరుగా బేరం కుదుర్చుకుని రాజీనామాలు చేయిస్తుండటం! వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీకి టీడీపీ నేత ఒకరు రూ.పది కోట్లు ఆశపెట్టి రాజీనామా చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే 40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎంపీలలో విషయంలోనూ ఇదే రకమైన వ్యవహారం నడించిందా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.ఈ బేరసారాలన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొత్తాన్ని శాసిస్తున్న మంత్రి, బాబు గారి పుత్రుడు లోకేశ్ అనుమతితోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావుల రాజీనామాలకు రాజ్యసభ అధ్యక్షుడు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపారు. టీడీపీలో చేరి తరువాత వారికే ఆ పదవులు ఇస్తే బేరసారాల వ్యవహారం నిజం కాదని అనుకోవచ్చు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరినందుకు వేరే ఏదో ఒకటి గిట్టుబాటు అయి ఉంటుందని అంచనా వేయవచ్చు. అలా కాకుండా.. ఈ పదవులకు ఇతరులకు దక్కితే మాత్రం అనుమానాలు రావడం సహజం.వాస్తవానికి టీడీపీ నాయకత్వానికి ఈ రకమైన చీకటి వ్యవహారాలు, కొనుగోళ్లూ కొత్తేమీ కాదు. గతంలోనూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి అసలు ప్రాతినిథ్యమే లేదు. అందుకే వారు ఈ కొనుగోళ్లు, బేరసారాలకు తెరతీశారు. ఇందుకు డబ్బు, పదవులు ఆశపెడుతున్నారు. అయితే ఇది పార్టీ నేరుగా చేస్తున్న పనా? లేక పదవులు ఆశిస్తున్న నేతలతో పార్టీ కొనుగోలు చేయిస్తోందా? అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.రాజీనామా చేసిన ఎంపీల్లో ఒకరైన మోపిదేవి మాత్రం చాలా స్పష్టంగా స్థానిక రాజకీయల్లో ఉండడం కోసమే రాజ్యసభ పదవిని వదులుకుంటున్నట్టు, టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ వాదనలో తర్కమేమిటో ఆయనకే తెలియాలి! అందుకే తామూ ఇదంతా బేరాసారాల వ్యవహారమంటున్నామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.మోపిదేవి స్వస్థలం రేపల్లె. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు అక్కడి ప్రతినిధి. సత్యప్రసాద్‌ను కాదని మోపిదేవికి రేపల్లెలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. మహ అయితే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టవచ్చు. 2026లో నియెజకవర్గాల పునర్విభజన జరిగితే... మోపిదేవి లేదా అయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వవచ్చని కొందరు అంటున్నారు. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, రూ.నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే రూ.40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సరే డబ్బు సంగతి నేరుగా ఎవరు అంగీకరించరు. మొత్తమ్మీద చూస్తే మోపిదేవి పార్టీ మారడం వల్ల స్వస్థలం రేపల్లెలో పరపతి ఏమీ పెరగదు సరికదా.. తగ్గే అవకాశాలే ఎక్కువ. మోపిదేవి వరుసగా రెండుసార్లు ఓడిపోయినా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆయనను గౌరవించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడమే కాకుండా... మంత్రిని కూడా చేశారు. విధాన పరిషత్‌ను రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మోపిదేవితోపాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు నష్టం జరక్కూడదన్న ఆలోచనతో వారిని రాజ్యసభకు పంపించారు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూనే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు జగన్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, పార్టీ కూడా గౌరవంగా చూసిందని, తాను పార్టీకి విధేయుడినని స్పష్టం చేశారు. రాజీనామా చేయనున్నారన్న ప్రచారం చేసిన ఎల్లో మీడియాను తప్పుపట్టారు మోపిదేవి మాత్రం అందరని అశ్చర్య పరుస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మోపిదేవి మొదట మండల అధ్యక్షుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. తరువాతి కాలంలో ఆయన 1999, 2004లలో కూచినపూడి నుంచి, 2009లో రేపల్లె నుంచి గెలుపోంది వైఎస్సార్ కేబినెట్లో మంత్రి అయ్యారు. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ కొనసాగారు.వైఎస్సార్ అనుహ్య మరణం, తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి రావడం.. కాంగ్రెస్ అధిష్టానం అక్రమ కేసులు బనాయించడం జరిగాయి. మోపిదేవిని కూడా కాంగ్రెస్ పార్టీ కేసుల్లో ఇరికించింది. కొంతకాలం జైలు జీవితమూ అనుభవించారు. ఈ విషయాలన్నీ తెలిసిన జగన్ పార్టీలో ఆ తరువాత అధికారం వచ్చిన తరువాత కూడా మోపిదేవికి మంచి ప్రాధన్యత ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో రేపల్లెలో పోటి చేయాలని అనుకున్నా గెలుపు అవకాశం లేదని సర్వేలు తేల్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ మోపిదేవికి టిక్కెట్ ఇవ్వలేదు. అయితే ఆ సంగతిని మోపిదేవి ఇప్పుడు ప్రస్తావించడం ఇప్పుడు సముచితంగా లేదు. ఒక వేళ టిక్కెట్ ఇచ్చిన తరువాత ఓడిపోయి ఉంటే ఏం చేసేవారు?రాజకీయాల్లో విధేయత అన్నది శాశ్వతం కాదు అన్నది ఈయన కూడా రుజువు చేశారు. జగన్ కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు తీవ్రంగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు మోపిదేవిని తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్ పై పెట్టినవి అక్రమ కేసులే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయ్యింది.రాజీనామా చేసిన మరో ఎంపీ బీద మస్తాన్ రావు గతంలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే. కాని రెండు సార్లు వరుసగా ఓడిపోయారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీ వైపు వచ్చేశారు. పార్టీ నాయకత్వం కూడా ఈయనను గుర్తించి ఎంపీ పదవి ఇచ్చింది. మస్తాన్ రావుకు రొయ్యల ఫీడ్ వ్యాపారంతోపాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో తన వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పార్టీ మారుతూండవచ్చని అంటున్నారు.అయితే వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైన వెళతారా అన్నది చూడాలి. ఎల్లో మీడియా అయితే ఇద్దరు ముగ్గురిని మినహాయించి అందరూ పార్టీ వీడతారని ప్రచారం చేసింది ఎల్లో మీడియా. అది వాస్తవం కాదని ఇప్పటికైతే స్పష్టం. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మిగిలిన వారు అందరూ ఖండించారు. ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు పార్టీలు ఫిరాయించినంత మాత్రాన వైఎస్సార్సీపీకి నష్టం జరుగుతుందని అనుకుంటే అది టీడీపీ పొరబాటే అవుతుంది. ఎందుకంటే 2014 - 2019 మధ్యకాలంలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరుల ప్రభావాలను లోనై పార్టీని వీడారు. అయినప్పటికీ జగన్ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని 2019 నాటి ఎన్నికలు రుజువు చేశాయి. ఎంపీలు వెళ్లిపోతే పార్టీ మళ్లీ గెలవలేదని అనుకుంటే.. తాజా ఎన్నికల్లో టీడీపీ కూడా గెలిచి ఉండకూడదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎంపీలు నలుగురు బీజేపీలోకి చేరారు మరి! కాకపోతే వారు చంద్రబాబు అనుమతి తీసుకుని పార్టీ మారారు అన్నది బహిరంగ రహస్యం. పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీ లోకసభ సభ్యులు అరడజను మందిని కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కానీ ఆ తర్వాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ వారికి క్యారెక్టర్ లేదు అంటూనే ఆ పార్టీ వారిని టీడీపీలోకి చేర్చుకుంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని చెబుతున్న ఈయన ఒంగోలు, ఏలూరు కార్పోరేషన్ ఛైర్మన్లను, మరికొన్ని చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నేరుగా పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారో కూడా చెప్పాలి. ఏది ఏమైనా... ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అయారాం.. గయారామ్‌ల వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మోపిదేవి వెంకటరమణ పార్టీ మారడంపై రోజా స్ట్రాంగ్ రియాక్షన్
-
మోపిదేవి గురించి ఒక్కటే చెప్తున్నా.. ఉషశ్రీ చరణ్ అదిరిపోయే కౌంటర్
-
డబ్బు చేతికి అందగానే.. మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా
-
మోపిదేవి పార్టీ మారడంపై అంబటి రాంబాబు రియాక్షన్
-
దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్
-
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
-
టీడీపీపై మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు
-
బాబు, లోకేష్, పవన్ ల అబద్దాలు వినాల్సిన అవసరం లేదు: ఎంపీ మోపిదేవి
-
వృద్దులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ మోపిదేవి
-
'కరువు - చంద్రబాబు' ఇద్దరూ.. కవలలు : మోపిదేవి
గుంటూరు: రైతు పక్షపాతి, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రేపల్లె పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మిచాంగ్ తుఫాన్‌తో పంట దెబ్బతినటంతో రైతులు నష్టపోయారని, రైతాంగాన్ని సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటారని అన్నారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలతో ముందస్తు ఆయా ప్రాంతాలకు అత్యవసర నిధులు మంజూరు చేసి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పంట బాగా దెబ్బతిన్న ప్రాంతాలలో సీఎం జగనన్న పర్యటించి పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారాన్ని సంక్రాంతి పండగ నాటికి అందజేస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. కరువు, చంద్రబాబు కవలలు.. కరువు, చంద్రబాబు నాయుడు కవల పిల్లలు వంటి వారన్న నానుడి ప్రజల్లో ఉందని ఎంపీ చెప్పారు. చంద్రబాబు పాలనా కాలంలో చుక్కనీరు అందక పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. 14 సంవత్సరాల పాలనా కాలంలో చంద్రబాబు రైతుల కోసం సానుకూలంగా ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, నేడు రైతుల కోసం మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే మాట్లాడుతున్నారని, పదవి కోసం పగటి కలలు కంటున్నారన్నారు. సమావేశంలో వైస్‌చైర్మన్ తూనుగుంట్ల కాశీవిశ్వనాథగుప్త, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కొమ్మూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాల్గొన్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. లోకేష్‌కు ఊహించని ఎదురుదెబ్బ! -
విశాఖ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: ఎంపీ మోపీదేవి
-
కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడానికి కారణం కూడా అదే
-
పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా..? చంద్రబాబు తొత్తా: మోపిదేవి
-
బీజేపీ అధ్యక్షురాలివా.. బాబుకు తొత్తువా?
నగరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలివా.. చంద్రబాబుకు తొత్తువా... అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆదివారం బాపట్ల జిల్లా నగరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదల కోసం, భవిష్యత్ కోసం పనిచేస్తున్నారో.. టీడీపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని పురందేశ్వరిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పా ర్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రైతులను, ప్రజల్ని మోసం చేశారంటూ చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి.. నేడు ప్రజలపై టీడీపీ అజెండా రుద్దేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పురందేశ్వరి బీజేపీ నావ ఎక్కి.. టీడీపీ తెడ్డు తిప్పుతున్నారని విమర్శి«ంచారు. ఏ అర్హతతో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని లేఖ రాశారో చెప్పాలన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాటా్లడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో పురందేశ్వరి కూడా ఉన్నారని చెప్పారు. చంద్రబాబును కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. బీజేపీ అధ్యక్షురాలిలా ఆమె వ్యహరించడం లేదన్నారు. అవినీతికి పాల్పడి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళితే ఆయనకు వత్తాసుగా పురందేశ్వరి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. పురందేశ్వరి పదేపదే ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్‌కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
బాబుపై మోపిదేవి సెటైర్లు
-
చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారు: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు హాని చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని, చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారన్నారు. చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్దతి కాదంటూ ఎంపీ మోపిదేవి హితవు పలికారు. ‘‘13 చోట్ల సంతకాలు పెట్టి సీఐడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు. కానీ చంద్రబాబు జైలులో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు. జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నాడు. గతంలో స్టేలతో తప్పించుకుని తిరిగిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు పాపం పండింది జైలుకి వెళ్లారు’’ అని మోపిదేవి వ్యాఖ్యానించారు. చదవండి: నారా లోకేష్‌కి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు -
అవినీతి చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని బాగుచేస్తాడా ?
-
చంద్రబాబు నాయుడు, బాలకృష్ణపై ఎంపీ మోపిదేవి ఫైర్
-
చంద్రబాబు అవినీతికి గట్టి ఆధారాలు
నగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టే జైలుకు వెళ్లాడని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను సానుభూతిగా మార్చుకోవాలని టీడీపీ భావించినా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. బాపట్ల జిల్లా వెలమవారిపాలెం గ్రామంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సీమెన్స్ అనే బోగస్ సంస్థను సృష్టించి, సుమారు రూ.370 కోట్లు తన బినామీ కంపెనీలకు తరలించారనే ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. దీనికి సంబంధించి 2018లోనే జీఎస్టీ నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటం వల్లే చంద్రబాబు రిమాండ్‌కు వెళ్లారన్నారు. అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికి జైలుకు వెళితే టీడీపీ నాయకులు అక్రమంగా చంద్రబాబును జైల్లో పెట్టారనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నాయకులు ఖండిస్తున్నారంటే దొంగను, అవినీతిని సమర్థించినట్టేనన్నారు. కౌంట్ డౌన్ మొదలు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు కట్టిన బిల్డింగ్‌లోనే ఆయన్ను కట్టిపడేశారని ఆయన సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారని మోపిదేవి చెప్పారు. ఆయన కట్టించిన బిల్డింగ్‌కు ముద్దాయిగా వెళ్లారని తెలిపారు. ఎటువంటి తప్పు చేయకపోయినా చంద్రబాబును జైలుకు పంపారని బాలకృష్ణ అనడం హాస్యాస్పదం అన్నారు. తప్పు చేశాడనే విషయం ఆధారాలతో బయటపడిందని, అందుకే న్యాయస్థానం రిమాండ్ విధించిందనే విషయాన్ని బాలకృష్ణ తెలుసుకోవాలన్నారు. చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, సీరియల్‌గా కేసులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణలో జరిగిన అవకతవకల్లో చంద్రబాబు, అప్పుడున్న మంత్రులు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చట్టానికి అందరూ సమానులేనని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు తమ బంధువని టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. న్యాయమూర్తితో తమకు బంధుత్వం లేదని సృష్టం చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691పై ఎంపీ మోపిదేవి పంచులే పంచులు
-
చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకుల కామెంట్స్
-
యాత్రలతో లోకేశ్ అలజడి సృష్టిస్తున్నారు: మోపిదేవి
-
ఉనికికోసం టీడీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు
-
ఉనికి కోసమే టీడీపీ గోబెల్స్ ప్రచారం: మోపిదేవి ఫైర్
సాక్షి, ఢిల్లీ: టీడీపీ గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రంలో ఉనికి కోసం టీడీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ఎంపీ మోపిదేవీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. యువగళం పేరుతో లోకేశ్ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. గత మే 16న అమర్నాథ్ అనే వ్యక్తి హత్యలో రాజకీయ కారణాలు లేవు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలో వారిని కోర్టు ముందు నిలబెట్టాము. బాధిత కుటుంబానికి వెంటనే ఉద్యోగం ఇచ్చాం. అలాగే, వారికి ఇంటి స్థలం కూడా మంజూరు చేశాం. కానీ, ఇప్పుడు నారా లోకేశ్ బాబు.. అమర్నాథ్ తల్లి, చెల్లితో పచ్చి అబద్ధాలు చెప్పించారు. అభం శుభం తెలియని వారిని తమ స్వార్థం కోసం టీడీపీ ఉపయోగించుకుంటోంది. అమర్నాథ్ కుటుంబాన్ని మా ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే బాధితులకు అండగా నిలిచిందన్నారు. నాలుగేళ్లలో బీసీల కోసం ప్రభుత్వం రూ.82వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీసీలను అధికంగా రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌దే. బీసీల కోసం చరిత్రలోనే ఎవరూ చేయనంతగా రాజకీయంగా, సామాజికంగా సీఎం జగన్ చేయూతనిచ్చారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదు. రేపల్లె ఘటనపై లోకేశ్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలను మానుకోవాలి. టీడీపీ మాయ మాటలను బీసీలెవరూ నమ్మరు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా? -
టీడీపీకి కీలక నేత గుడ్‌బై...షాక్ లో చంద్రబాబు
-
టిడిపి డర్టీ పాలిటిక్స్
-
కుటుంబం దుఃఖంలో ఉంటే ఇంత నీచ రాజకీయం చేస్తావా
-
‘బాబూ.. చేతనైతే సాయం చేయ్.. శవాలపై పేలాలు ఏరుకోకు’
సాక్షి, కాకినాడ: విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వారి కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, ఉద్యోగం కూడా ఇస్తామన్నామని తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయించిందన్నారు. చంద్రబాబు శవరాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రతిచోటా రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరాటపడుతోందని విమర్శించారు. బాబూ.. చేతనైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని హితవు పలికారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయటం సబబు కాదని హితవు పలికారు.. చంద్రబాబుకు పనిలేక ఖాళీగా ఉన్నాడని ఎవరు పిలుస్తారా? వెళ్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుయుక్తులన్నీ ఆయన ఉంటున్న అక్రమ ఇంటి నుంచే జరుగుతున్నాయని విమర్శించారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. వారిని పరామర్శించావా బాబూ! 2014 - 2019 మధ్యలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోతే వారింటికి వెళ్లి పరామర్శించావా చంద్రబాబు? వనజాక్షిపై నీ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం వనజాక్షిని పరామర్శించావా? రెండు నెలల క్రితమే టీడీపీ స్థానిక కౌన్సిలర్ హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఖాళీగానే ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించని నేత చంద్రబాబు. చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన చేశారని బోరున ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు. మా కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాలుక కోస్తాం. పవన్‌కు వాస్తవాలు తెలియవు పవన్ లాగా నాకేమీ ప్యాకేజీ డబ్బులు రావటం లేదు. నా కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి అమరనాథ్ కుటుంబానికి ఇచ్చి అండగా నిలిచాను. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివే పవన్‌కు వాస్తవాలు తెలియవు. మత్స్యకారుల జీవితాలను పైకి తీసుకుని రావటానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హార్బర్లు కట్టిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ అప్పటికప్పుడే ఇచ్చే ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి జగన్ వల్లే సాధ్యం. 2024లో కూడా జగనే సీఎం ఖాయం’ అని మోపిదేవి పేర్కొన్నారు. చదవండి: పవన్‌తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో! ఇది సినిమా కాదు, రాజకీయం పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పవన్ సినిమాటిక్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్‌తో హడావిడీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్.. ఇది సినిమా కాదు, రాజకీయం అని హితవు పలికారు. సీఎం అవుతానంటున్న పవన్ భాష సరిగా లేదని, సభ్యత లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. ఏదైనా ఆరోపించామంటే కనీస ఆధారాలు ఉండాలి. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశాడు. పవన్తాను ఎక్కడా కుల రాజకీయం చేయనంటుంటాడు. కులాల ప్రస్తావన లేకుండా పవన్ ఎక్కడైనా మాట్లాడాడా?. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీయే. టీడీపీ ఆవిర్భావంతో కులాల కుంపట్లు ప్రారంభం అయ్యాయి. 80 శాతం కాపులు సీఎం జగన్‌కే మద్దతు తెలుపుతున్నారు. పవన్ చంద్రశేఖర్‌రెడ్డిపై పోటీ చేయాలి. కాకినాడలో పోటీ విషయంపై ద్వారంపూడి సవాల్‌కు ఇవాళైనా పవన్ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి’ అని కన్నబాబు పేర్కొన్నారు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు ‘నాలుగు దశాబ్ధాలుగా ఏపీని పట్టిపీడిస్తున్న శని చంద్రబాబు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో లబ్ది పొందాలని చూస్తున్నాడు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని. వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడుతునఆనడో తనకే తెలియట్లే. చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ మాట్లాడుతున్నాడు. కాపుల పరువు తీసేలా పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దిగజారి మాట్లాడుతున్నాడు. పవన్ వ్యాఖ్యలకు బాధపడే ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో?. పవన్‌కు అపాయం జరిగితే చంద్రబాబుకే సానుభూతి వస్తుంది. చంద్బరాబు నుంచే పవన్‌కు పెను ప్రమాద పొంచి ఉంది. పవన్‌కు మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.’ -మంత్రి కొట్టు సత్యనారాయణ ‘ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఆయన కుటుంబం పట్ల పవన్ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్.. పార్టీని నడింపించాల్సిన విధానం ఇదేనా?. దూషణలు, పరుష పదజాలంతో పవన్ మాట్లాడుతున్నాడు. యువతకు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నావ్?. ద్వారంపూడిపై పవన్ మాట్లాడిన భాష అభ్యంతరం. సీఎం జగన్ వారసత్వంగా రాలేదు. ఒక నాయకత్వ లక్షణంతో ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం గతిని మార్చిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఒక దైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చారు. -ఎంపీ వంగా గీత -
విద్యార్ధి అమరనాథ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి మోపిదేవి
-
అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల: సోదరి రక్షణ కోసం ఎదురెళ్లి దుండగుల చేతిలో హతమైన విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తన అక్కపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే యత్నంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ను నలుగురు కిరాతకంగా తగలబెట్టి కాల్చి చంపిన సంగతి తెలిసిందే. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన పట్ల ఎంపీ మోపిదేవి స్పందించారు. శనివారం ఉదయం ఉప్పలవారిపాలెంకు వెళ్లిన ఆయన అమర్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని, దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అమర్నాథ్ కుటుం సభ్యులకు హామీ ఇచ్చారాయన. అమర్నాథ్ కుటుంబాన్ని అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ మోపిదేవి ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.50 వేలను అందించారాయన. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇదీ చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
వివిధ స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్
-
నారా లోకేష్, బాలకృష్ణకు ఎంపీ మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
-
చిరకాల వాంఛ నెరవేరింది
బాపట్ల: బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, కోలాట నృత్యాలు, నెమలి నృత్య ప్రదర్శన, డప్పు కళాకారులు, వాయిద్య కళాకారుల ప్రదర్శనలు పట్టణ ప్రజలను అబ్బురపరిచాయి. రథంబజారులోని భావనారాయణస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సంబరాలకు అశేష జనం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కుటుంబ సమేతంగా భావనారాయణస్వామికి పొంగలి నివేదించారు. ముందుగా కుంభమేళాతో దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులను అధికారులు సత్కరించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. బాపట్ల జిల్లా ఏర్పాటుతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. నిజాంపట్నం పోర్టు రెండవ దశ విస్తరణ, అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. చీరాల ఓడరేవు నిర్మాణం, తీర ప్రాంతాల అభివృద్ధితో జిల్లా పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. అభివృద్ధికి అవసరమైన సహజ వనరులన్నీ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని అభివర్ణించారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నా రు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారిని స్థితిమంతులుగా చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒకసారి ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ముఖ్యమంత్రి జగన్ మరిచిపోరని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధి వైపు ముందుకు సాగుతోందని అన్నారు. బాపట్లకు త్వరలో కొత్తగా రైల్వేలైన్ రానుందన్నారు. ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యాయని, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బాపట్ల జిల్లా మరింత పురోభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. ప్రజలకు సేవలందించడం, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ప్రజలంతా సహకరించారని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణ కల్పించడానికి పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ చుక్కల భూముల కింద తొమ్మిది వేల ఎకరాల భూములను గుర్తించి హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించా మని తెలిపారు. చీరాల–చిలకలూరిపేట, నిజాంపట్నం–బుడంపాడు వరకు రెండు జాతీయ రహదారులు జిల్లాకు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతితులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్‌బాబు, బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, బుడా వైస్‌చైర్మన్ ఏ.భానుప్రతాప్, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు’
కృష్ణాజిల్లా: చంద్రబాబు నాయుడు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని మోపిదేవి ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రాయితీపై ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మోపిదేవి.. ‘ సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే, చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావటం చంద్రబాబుకు అలవాటు. మామకు వెన్నుపోటు నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వరకు చంద్రబాబుది ఇదే పద్ధతి.చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయం’ అని మోపిదేవి స్పష్టం చేశారు. -
ఎంపీ మోపిదేవి వెంకటరమణతో స్ట్రెయిట్ టాక్
-
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది : మోపిదేవి వెంకటరమణ
-
‘చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు గుంటూరు సభలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి సామాన్యులు బలి అవుతున్నారు. జరిగిన దుర్ఘటనలకు చంద్రబాబుదే బాధ్యత. చంద్రబాబుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇక, మోపిదేవి వెంకటరమణ స్పందిస్తూ.. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. నాడు గోదావరి పుష్కరాల్లో 29 మందని బలితీసుకున్నాడు. మొన్న కందుకూరులో 8 మంది మృతికి కారణమయ్యారు. ప్రభుత్వం ఉపేక్షించేది లేదు.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు.. ఘటనా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. -
తప్పుడుదారిలో స్థలాలు తీసుకోవటం చంద్రబాబుకే చెల్లింది
బాపట్ల: తప్పుడుదారిలో స్థలాలను తీసుకోవటం, సుప్రీంకోర్టు స్టేలో ఉన్న స్థలంలో సైతం పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవటం, దళితులు నివసిస్తున్న భూములను లాక్కుని పార్టీ కార్యాలయం నిర్మించడం చంద్రబాబునాయుడుకే చెల్లుతుందని ఎంపీ, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు ధ్వజమెత్తారు. వాటిని దగ్గరుండి ప్రోత్సహించే ఈనాడు రామోజీరావు కళ్లకు ఆనాడు ఆ తప్పుడు పనులే కనిపించలేదని ఎద్దేవా చేశారు. బాపట్లలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించే విధంగా 21–02–2016వ తేదీన జీవో నంబరు 340 ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవోకు అనుగుణంగా బాపట్లలోని పరిశ్రమలశాఖ నుంచి ఆర్టీసీకి కేటాయించగా వారు నిరుపయోగంగా ఉంచటంతో పలుసార్లు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్న స్థలాన్ని మాత్రమే కేటాయించమని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ, రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకున్న భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిన తరువాతే స్వాధీనం చేసుకుని పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు 1997లో జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఎన్టీఆర్ భవన్ పేరుతో అద్దెకు తీసుకుని ఆయన్ని పరలోకానికి పంపి ఆభూమిని అన్యాక్రాంతం చేశారని గుర్తుచేశారు. మంగళగిరిలో జాతీయరహదారి పక్కనే కోట్లాది రూపాయిల విలువైన భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించుకోగా సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిందని చెప్పారు. స్టేని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు పార్టీ కార్యాలయం నిర్మించుకున్న విషయం రామోజీరావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. గుంటూరులో విలువైన పిచ్చుకులకుంటలో 1,500 గజాలకు మరో 100 గజాలు ఆక్రమించుకుని పార్టీ కార్యాలయం నిర్మించడం, శ్రీకాకుళంలో దళితుల భూములను లాక్కుని పార్టీ కార్యాలయం నిర్మించడం, విశాఖపట్నంలో 2,500 గజాల విలువైన భూమి స్వాధీనం వంటివి ఈనాడుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీపై సీబీసీఐడీ విచారణ జరుగుతుంటే విచారణకు ఎందుకు సహకరించలేదని నిలదీశారు. రికార్డుల్లో తప్పులుండటం వల్లనే సీబీసీఐడీకి రికార్డులు చూపించటంలేదని చెప్పారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఏంజరుగుతుందో గమనించి మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, నాయకుడు చేజర్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు : ఎంపీ మోపిదేవి
-
చంద్రబాబే పెద్ద ఖర్మ అని ప్రజలే అంటున్నారు: ఎంపీ మోపిదేవి
-
మద్యం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల జిల్లా: మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణి చేశారని.. ఆ వేడుకల్లో మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ శవ రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు -
ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: మోపిదేవి వెంకటరమణ
-
బీసీలను జెండాలు మోయడానికే వాడుకున్నారు: మోపిదేవి
-
చంద్రబాబు వల్లే ఖజానా దివాలా..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఖజానా దివాలా తీయడానికి చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దిగజార్చడమే బాబు పని అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారని, అలాచేస్తే టీడీపీ బండారమే బయటపడుతుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం జగన్ ఎంతదూరమైనా వెళతారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మకపాత్ర పోషించాలేగానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు, విభజన హామీలతోపాటు పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఉభయ సభల్లోను పార్టీ ఎంపీలు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నాం. ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ పోలవరం, కడప ఉక్కుపరిశ్రమ, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఇలా అన్ని అంశాలు చర్చిస్తే.. దానిపైనా టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయం. బాబు లాంటి ప్రతిపక్ష నేత దొరకడం ప్రజల దౌర్భాగ్యం. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేనాటికే రాష్ట్ర ఖజానా దివాలా తీసిన విషయం ప్రజలకు తెలిసిందే. బాబు స్వప్రయోజనాల కోసం పాలనను అస్తవ్యస్తం చేస్తే కరోనా సమయంలోను జగన్ సంక్షేమ పథకాలు అందించారు. బాబు చేసిన అప్పుల్ని జగన్ తీరుస్తున్నారు.. చంద్రబాబు ఖజానాను ఖాళీచేసి వెళ్తే.. ఆ అప్పులను ప్రభుత్వం తీరుస్తోంది. ఏపీలో ఏవో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయంటూ కేంద్రానికి టీడీపీ ఎంపీలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. బాబు వెళ్తూవెళ్తూ రూ.100 కోట్లు ఉంచి మిగతా ఖజానా అంతా ఊడ్చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామనడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, భోగాపురం పనులు ముందుకు తీసుకెళ్లడం, దక్షిణ కోస్తా జోన్ తీసుకురావడం.. ఇవన్నీ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడికి ఉత్తరాంధ్రకు చేసిన ద్రోహంలా కనిపిస్తున్నాయి. శ్రీలంక తరహాలో ఏపీ ఆర్థికంగా కుప్పకూలిపోతోందని టీడీపీ, పవన్‌కల్యాణ్ బోగస్ ప్రచారాలు చేస్తున్నారు. ప్యాకేజీల కోసం ప్రత్యేకహోదా తాకట్టుపెట్టిన చంద్రబాబు ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి’ అని వారు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి ఎంపీలు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలి: మోపిదేవి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి.. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.1509 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దశలవారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రం అప్పుల పాలైంది
-
ఆ జీవోపై పవన్‌కు అవగాహన లేదు
కాశీబుగ్గ/రేపల్లె రూరల్: జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. జీవో 217కు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అని ధ్వజమెత్తారు. ఈ జీవోను ఎందుకు తప్పుపడుతున్నారో, దానివల్ల మత్స్యకారులకు జరిగే నష్టం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నరసాపురంలో జరిగింది మత్స్యకార సభ కాదని, సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల సమస్యలపై అవగాహనలేని పవన్సినిమా స్క్రిప్టులు, చంద్రబాబు స్క్రిప్టు చదువుతూ మభ్యపెడుతున్నారని చెప్పారు. మంత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలోను, ఎంపీ గుంటూరు జిల్లా రేపల్లెలోను ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇంతకుముందు ఇన్‌ల్యాండ్ వాటర్ బాడీస్‌లో మత్స్యకారుల పేరుచెప్పి అధికారపార్టీ దోపిడీ చేసేదని, వారికి రూపాయి కూడా దక్కేది కాదని చెప్పారు. మత్స్యకారుల నోటికాడ తిండిని పెట్టుబడిదారులు, దళారులు కొట్టేసి ఏడాదికి రూ.300, రూ.వెయ్యి చేతిలో పెట్టేవారన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు, మత్స్యకార సొసైటీలో ప్రతి సభ్యుడికి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా చూసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 217 జీవో తీసుకొచ్చారని చెప్పారు. ఈ జీవోను పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లామని తెలిపారు. వాస్తవంగా తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయని, వేల ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో ఉండటం లేదని చెప్పారు. దీంతో వాటిపై వచ్చే ఆదాయం దళారీ వ్యవస్థకే చెందుతోందన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి ఆ ఫలసాయాన్ని సొసైటీల ద్వారా మత్స్యకారులకు అందించేందుకు ఈ జీవో ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. దీనిపై అవగాహనలేని పవన్‌కల్యాణ్ ఆ జీవోను చించేశానంటున్నాడని ఎద్దేవా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బతుకులు మార్చేందుకు చేపల అవుట్ లెట్లతో విక్రయాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. ఊరి చివర ఈగల మధ్యలో విక్రయాలు చేసే అవస్థ రాకుండా మత్స్యకార యువకులకు శిక్షణ ఇచ్చి, సబ్సిడీ రుణాలు అందించి అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. యువకులకు ఉపాధి కల్పిస్తుంటే ప్రభుత్వం చేపలు అమ్ముతోందని ఎద్దేవా చేయడం సబబు కాదన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించే వారెవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల గురించి అప్పట్లో చంద్రబాబుకు విన్నవిస్తే.. తొక్కతీస్తామన్నారని, ఆ సమయంలో పవన్ స్పందించలేదని గుర్తుచేశారు. పవన్ అవగాహన లేకుండా 215, 217 జీవోలపై జెట్టి, గంగమ్మ పూజలు, ఫిషింగ్ హార్బర్ అంటూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. -
ముందు కాషాయం వెనక పచ్చ స్క్రిప్ట్
-
'ఆ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును ఏం చేసినా పాపం లేదు'
న్యూఢిల్లీ: చంద్రబాబు సొంత ఎజెండాతోనే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బాబు తన బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలనే ఆలోచనతో వైఎస్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా..?. సీఎం తీసుకున్న నిర్ణయాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇల్లు దక్కకుండా కేసులు వేశారు. సీఎం జగన్ మన ఇల్లు- మన పట్టా ద్వారా న్యాయమైన హక్కు కల్పిస్తామని అంటే దానికి అడ్డుపడ్డారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పేదలపై సామాజిక దాడి చేస్తున్నారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అహంభావానికి నిదర్శనం. కుప్పం ఎన్నికలలో చంద్రబాబును ఛీత్కరించారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని' మోపిదేవి వెంకటరమణ అన్నారు. చదవండి: (రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే పీఆర్సీ: సజ్జల) ప్రజల్ని రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు అమరావతిలో పేదలకు పట్టాలు ఇస్తే జనాభాలో అసమతుల్యత జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన బాబును ఏం చేసినా పాపం లేదు. వైఎస్ జగన్ పవిత్రమైన లక్ష్యంతో పరిపాలన చేస్తున్నారు. బాబు ఇకనైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.. భూముల కోసం రాజధాని పెట్టాలా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే అమరావతి. రాజధానికి 33వేల ఎకరాలు అనవసరం. మూడు వేల ఎకరాలకంటే ఎక్కువ అవసరం లేదు. రైతులను మోసం చేసి ముంచిన ఘనుడు బాబు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విఘాతం కలిగిందని బాబు ఏడుపు. పరిపాలన వికేంద్రీకరణ వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. వికేంద్రీకరణతో మరోసారి రాష్ట్ర విభజన రాదు. ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు చేస్తున్నారు. కార్పొరేషన్లపై రూ.13 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు అప్పుల భారం పెంచారు. దీనిపై వడ్డీలకు వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం, కరోనా వల్ల రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. -
బీసీలు పోరాడి సాధించుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేశ న శంకర్రావు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రెడ్డప్ప, టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రకుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ బీసీల కులగణనతో మాత్రమే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నచిన్న కులాలకు సైతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతికి ఏపీ ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి, వారికి దశదిశ చూపించే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలు బలమైన సామాజికవర్గమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అగ్రకులాల వారిని పల్లకిలో మోసిమోసి బీసీల భుజాలు అరిగిపోయాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి, జనగణన చేపట్టేవరకు ఏమాత్రం విశ్రమించకుండా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
వైఎస్సార్ మరణంలో బాబు కుట్రపై అనుమానాలు..
పొన్నపల్లి (రేపల్లె): వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడేలా టీడీపీ అధినేత వ్యాఖ్యలున్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని గుర్తుచేశారు. గుంటూరు జిల్లా పొన్నపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ ‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే.. వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా.. అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందన్నారు. ఏ ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్‌పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి: సీఎం గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు!.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు) -
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
సాక్షి,అమరావతి: మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ మరింత మే లు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులతో పాటు యావత్తు బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మోపిదేవి మాట్లాడారు. తోకలు కత్తిరిస్తాననలేదా? టీడీపీ, బీజేపీలు మత్స్యకారులకు అనుకూలమా? లేక దళారులకు అనుకూలమా? అని మోపిదేవి ప్రశ్నించారు. మత్స్యకారుల నోరు కొట్టి దళారులకు దోచిపెట్టాలన్నదే మీ విధానమా? అని నిలదీశారు. మత్స్యకారులకు రూ.15 వేలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాల గగ్గోలు ఎందుకన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా మత్స్యకారుల బట్టలూడదీస్తానని, తోకలు కత్తిరిస్తానని విశాఖలో బెదిరించినప్పుడు బీజేపీ నేతల నోరు ఎందుకు పెగలలేదని ప్రశ్నించారు. మత్స్యకారుల సంక్షేమానికి ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. వంద హెక్టార్లకు మించిన చెరువుల నిర్వహణ పేరుకు మాత్రమే మత్స్యకార సొసైటీల పరిధిలో ఉందని, పెత్తనం అంతా దళారులదేనన్నారు. ఈ దుస్థితిని మార్చేందుకు 217 జీవో ద్వారా నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 27 చెరువులను బహిరంగ వేలం ద్వారా ఇస్తే ప్రతిపక్షాలు ఎందుకు రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాయటాన్ని తప్పుబట్టారు. మత్స్యకార సొసైటీల సభ్యులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాల్సిందేనని, వ్యతిరేకించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆక్వాకు సబ్సిడీలు... అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, ఉప కులాలైన మత్స్యకార వర్గాలు, చెరువుల మీద ఆధారపడి జీవించే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆక్వా రంగంపై ఆధారపడి జీవించేవారికి పవర్ టారిఫ్ కింద సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. ఆక్వా ఉత్పత్తులను పెంచేందుకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తున్నామని తెలిపారు. -
‘మత్స్యకారులకు ఆదాయం రావడం టీడీపీకి ఇష్టం లేదా?’
సాక్షి, తాడేపల్లి: చెరువులపై ఆధారపడి జీవించే వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం ఆశించిందని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల ద్వారా చెరువుల నిర్వహణ చేపట్టామని, అందుకోసం వందల ఎకరాలు పైబడిన చెరువలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో చెరువులపై ఆధారపడి జీవించే వారి కోసం జీవో 217 తీసుకొచ్చామని తెలిపారు. 100 హెక్టర్స్ పైనున్న 28 చెరువులను దీని కిందకు తీసుకొచ్చాన్నారు. వాటిని అధ్యయనం చేసి సొసైటీ సభ్యులకు కనీసం రూ.15000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను ఆ జీవో కింద తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారని ప్రతిపక్షం గ్లోబల్ ప్రచారం చేస్తోందని మోపిదేవి మండిపడ్డారు. ఇది నెల్లూరు జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది అని జీవోలో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. అక్కడ అమలు చేసి మంచి ఫలితాలు వస్తే అప్పుడు ఆలోచించాలని భావించామని చెప్పారు. మత్సకారులకు ఆదాయం రావడం సంతోషమా కాదా అనేది టీడీపీ వారు చెప్పాలని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఏపీలో మత్స్యకారులకు అనేక పథకాలు పెట్టామని అన్నారు. లబ్ధిదారుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. డీజిల్ టీడీపీ హయాంలో రూ. 6 సబ్సిడీ ఉంటే తాము రూ. 9 చేశామని, ఎవరైనా మత్స్యకారుడు దురదృష్ట వశాత్తు చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ కూడా వచ్చేది కాదని, ఇప్పుడు వెంటనే 10 లక్షలు అందిస్తున్నామని మోపిదేవి తెలిపారు. ప్రతి జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించారని తెలిపారు. ఫేజ్ 1 కింద 5 హార్బర్లు పనులు జరుగుతున్నాయని, ఫేజ్ 2 కింద కూడా మిగతావి ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో మెరైన్ యూనివర్సిటీకి స్థలం కూడా కేటాయించారని తెలిపారు. -
జీఓ నెంబర్ 217పై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారు
-
రేపల్లె టౌన్ లో భారీ బైక్ ర్యాలీ
-
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయో.. రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఈరోజు వరకు పూర్తిగా న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. ఓబీసీ బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ నామమాత్రం బడ్జెట్ అని విమర్శించారు. అదే ఏపీలో సీఎం జగన్ బీసీల అభివృద్ధి కోసం 30 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే..మరి 29 రాష్ట్రాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. సుమారు 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ లోక్‌సభ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
‘నౌకాయానం రంగంలో.. ఏపీ ప్రతిపాదనలను ఆమోదించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: నౌకాయానం, ఓడరేవులు సంబంధిత రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కేంద్రాన్ని కోరారు. నౌకాయానానికి సహకారిగా ఉండే సముద్ర ఉపకరణాల బిల్లు–2021పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నౌకాయాన ఉపకరణాల అభివృద్ధి, నిర్వహణ, యాజమాన్యానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశమని, లైట్‌హౌస్ యాక్ట్–1929 చట్టాన్ని దీని ద్వారా తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. ఏపీకి సంబంధించి 2015లో గుర్తించిన లైట్‌హౌస్‌ల అభివృద్ధిలో పురోగతిలేదని నివేదించారు. దేశ వాణిజ్యం పరిణామాత్మకంగా 95 శాతం, విలువ పరంగా 70 శాతం సముద్రయానం ద్వారానే జరుగుతోందని.. 2019–20లో భారత ఓడరేవులు 1.2 బిలియన్ మెట్రిక్ టన్నుల మేర సరుకు రవాణాకు వీలు కల్పించాయన్నారు. -
ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
సాక్షి, ఢిల్లీ: మెరైన్ ఎయిడ్స్ అండ్ నావిగేషన్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు. విభజన చట్టం మేరకు ఈ పోర్టు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఉన్న ఆరు లైట్ హౌస్ లను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. -
మెరైన్ బిల్లుపై అభిప్రాయం వ్యక్తం చేసిన ఎంపీ మోపిదేవి
-
విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నాళ్ళు తాము కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని వేచి చూశామని.. ఇక ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించామన్నారు. ఇచ్చిన డోసుల కంటే అత్యధిక మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను అనేక మార్గాల్లో ప్రభుత్వం ఆదుకుందని వివరించారు. టీడీపీ ఎంపీ.. రాజ్యసభలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మోపిదేవి దుయ్యబట్టారు. -
సామాజిక న్యాయంలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అందించాలన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇందులో భాగంగా మంత్రివర్గ కూర్పు మొదలు నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. శనివారం ఆమె విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలతో కలసి 137 నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎస్సీలకు ఒకట్రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కేవని, వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఐదు మంది ఎస్సీలకు స్థానం కల్పించారని చెప్పారు. సామాజిక న్యాయం ఎలా సాధించాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంత్రి చెల్లబోయిన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల వారి చేతుల్లో రాజకీయ అధికారం ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. తొలిసారిగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్‌దే అని పేర్కొన్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. పేదరికాన్ని జయించాలన్న లక్ష్యంతో చేస్తున్న ఈ యజ్ఞంలో అందరం భాగస్వాములం కావాలన్నారు. చరిత్రాత్మక నిర్ణయం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న వర్గాలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. దానికి పూర్తి భిన్నంగా అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఒక గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకోసం పరిపాలన పరంగా, వ్యవస్థ పరంగా, సంస్థాగతంగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. – మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు సమ సమాజ స్థాపనే సీఎం లక్ష్యం సమ సమాజ స్థాపన కోసం సమాజంలో అందరూ సమాన స్థాయిలో ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. తనను నమ్మిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపునిస్తూ ప్రజా సంక్షేమ పాలనలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. సీఎం నిర్ణయాలతో దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తోంది. – నందిగం సురేష్, ఎంపీ ఆచరణలోకి అంబేడ్కర్, పూలే ఆశయాలు అణగారిన వర్గాల సామాజిక స్థితిగతులను మెరుగు పరచాలన్న బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలు ఆంధ్రప్రదేశ్‌లో విరాజిల్లుతున్నాయి. ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకున్న సామాజిక న్యాయం, పేద ప్రజల అభివృద్ధి అన్నవి ప్రస్తుతం రాష్ట్రంలో ఆచరణాత్మకంగా చూస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు మార్చి, వారికి రాజకీయంగా సామాజికంగా గౌరవం కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారు బాట పరుస్తున్నారు. – మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతతో సుపరిపాలన సాగిస్తున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి ద్వారా సామాజిక న్యాయం, మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు కలిపి రాబోయే మూడేళ్లలోనే 15 ఏళ్ల అభివృద్ధిని సాధించడం ముఖ్యమంత్రి లక్ష్యం. ఎన్నికల ముందు బీసీ డిక్లేరేషన్‌లో, పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులకు చైర్పర్సన్లను ఆయనే స్వయంగా ఎంపిక చేశారు. కొన్ని పదవులకు సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించిన 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఎంపికయ్యారు. గతంలో మాదిరిగా నామినేటెడ్ పదవులు కేవలం అలంకార ప్రాయం కాదు. రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన మహాయజ్ఞంలో కీలకంగా ఉండే బాధ్యతాయుతమైన పదవులు. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట: మోపిదేవి
సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు సీఎం జగన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అదే విధంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని మోపిదేవి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. అన్ని రకాల సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి సుపరిపాలనను అందిస్తున్నారని మోపిదేవి అన్నారు. చదవండి: అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం: మంత్రి బొత్స -
దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్
రేపల్లె: గ్రామాల అభివృద్ధికి ఎంతో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్ష నాయకుని హోదాలో బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం పరిషత్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మోపిదేవి మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని, కరోనా విపత్తును బూచిగా చూపి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరగకుండా అడ్డుకున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఆయనకు మతి భ్రమించిందన్నారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని ఎన్నికలు నిర్వహిస్తుంటే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజల ఛీత్కారాలు తప్పవని గ్రహించి కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడి కుట్ర రాజకీయాలను గమనించి ఏమాత్రం అజాగ్రత్తగా లేకుండా గ్రామాల్లోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల అభ్యర్థుల విజయాన్ని కానుకగా అందించాలన్నారు. -
‘ఆ నిర్ణయాలే వైఎస్సార్ సీపీ విజయానికి కారణం’
సాక్షి, గుంటూరు : గుంటూరు, విజయవాడ ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన తీర్పునిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపీదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రేపల్లెలో ప్రజలకు ఇచ్చిన హామీలను సంవత్సరంలో పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. రేపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాయని అన్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. గుంటూరులో చంద్రబాబు మాట్లాడిన మాటలకు ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అయితే ఇచ్చిన మాటను నెరవేరకపోవడంతో చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్ -
వైస్ జగన్ నాయకత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు: మోపి దేవి
-
ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ పాలనను ఆశీర్వదించారు : ఎం పి మోపిదేవి వెంకటరమణ
-
‘జగనన్న జయభేరి’ పాట విడుదల
తాడేపల్లిరూరల్(మంగళగిరి): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాటను రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల ఇన్చార్జి మోపిదేవి వెంకటరమణారావు మంగళవారం తాడేపల్లిలో విడుదల చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ రచయిత, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీ నారాయణ ఐదు నిమిషాల నిడివి గల ఈ పాటను రచించి, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం..
సాక్షి, గుంటూరు: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కొన్ని సందర్భాలలో కోర్టులో కూడా నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తూ తీర్పులు అనుకూలంగా రావటం బాధాకరమన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు యూటర్న్.. వ్యూహకర్త నియామకం) -
సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు..
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చారని కొనియాడారు. పేదల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. కొన్ని దృష్ట శక్తులు అదే పనిగా అడ్డుతగులుతున్నాయని ఆయన ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు చేయలేని అభివృద్ధిని, సీఎం జగన్మోహన్రెడ్డి కేవలం పద్దెనిమిది నెలల్లోనే చేసి చూపించారని ఆయన ప్రశంశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు అండ్ కో మోకాలడ్డుతున్నా, సీఎం జగన్మోహన్రెడ్డి ఉక్కుసంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేకపోయిన దేవినేని ఉమ.. ఇళ్ల పట్టాల పంపిణీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో రావడం అసాధ్యమని తెలుసుకున్న చంద్రబాబు.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తూ, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సామినేని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు, రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. చంద్రబాబు ఎండ్ కో మత విద్వేశాలు రెచ్చగొట్టడంలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది: మోపిదేవి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలై పాతిక రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొని ఉందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. 31 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు ,అవసరాలు అవపోసన పట్టి ముఖ్యమంత్రి.. వాటిని పరిష్కరించేందుకు కంకణం కట్టుకున్నారని ఆకాశానికెత్తారు . ఖజానా ఖాళీ అవుతున్నా పేదల అవసరాలు తీర్చే విషయంలో సీఎం జగన్ వెనకడుగు వేయడం లేదని ఆయన ప్రశంశించారు. అంబేడ్కర్ ఆశయాల సాధన, సామాజిక వర్గాల సమతుల్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర పతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి తన ఉనికిని కాపాడుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆరోపించారు. -
డీజీపికి లేఖ వీర్రాజు స్థాయికి సరికాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం రుజువు కావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో ఆందోళన మొదలైందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ, బీజేపీలు కుట్రలకు పాల్పడ్డాయని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, చంద్రబాబు వెన్నులో వణుకు పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. దాడులకు సంబంధించిన తొమ్మిది కేసుల్లో 21 మంది టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని, వారిలో 15 మందిని అరెస్టు చేశామని ఇటీవల రాష్ట్ర డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయాలపై జరిగిన దాడుల కేసులపై మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన రాష్ట్ర డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రమేయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన డీజీపీని చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. డీజీపీనే బెదిరించేలా సోము వీర్రాజు లేఖ రాశారని, ఇది అతని స్థాయికి సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. నిజాలను నిగ్గుతేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేనానికీ ఆయన చురకలంటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తమదేనని, మానవత్వమే తమ సీఎం జగన్మోహన్రెడ్డి మతం, అభిమతమని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇంతకన్నా నిదర్శనం లేదు సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలోకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి 3వ స్థానం లభించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కుటిల బుద్ధితో దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం చేయించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారం కేసులో అరెస్టయిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని ఎంపీ మోపిదేవి ఎద్దేవా చేశారు. -
ఆలయాలు కూల్చే సంస్కృతి చంద్రబాబుదే
సాక్షి, అమరావతి: చంద్రబాబుది దేన్నైనా కూల్చే సంస్కృతి అయితే సీఎం జగన్‌ది ప్రజల అభీష్టం మేరకు తిరిగి నిలబెట్టే సంస్కృతి అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. వెన్నుపోట్లు, గుడుల కూల్చివేతల సంస్కృతి ముమ్మాటికీ బాబుదే అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు పట్టింపులు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎంకు కుల, మత రాజకీయాలు అంటగట్టడం దారుణం అని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే 90 శాతానికి పైగా నెరవేర్చారని చెప్పారు. 3,648 కిలోమీటర్ల వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలనే మార్చివేసిం దన్నారు. అంతకు ముందు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్‌తో కలసి పాదయాత్ర చేసిన పలువురు పార్టీ నేతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నిమ్మగడ్డది మొదటి నుంచీ ఏకపక్ష ధోరణే ► ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ది మొదటి నుంచి ఏకపక్ష ధోరణే అని మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుపట్టారు. -
కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సీఎం ఏ పథకం ప్రవేశపెట్టిన.. ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం. అందుకే తొలిరోజు నుండి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న చంద్రబాబుకి దేవుడు తగిన బుద్ధి చెప్తారని’’ మంత్రి గుమ్మనూరు జయరామ్’’ అన్నారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే) ఆ చావులకు కారణం చంద్రబాబే: మోపిదేవి గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడచిన 18 నెలల్లో ఎక్కడ కూడా ఒక ఆలయాన్ని కూల్చిన ఘటన లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ‘‘కూల్చే సంస్కృతి టీడీపీది. నిలబెట్టే సంస్కృతి వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. పుష్కరాలు లాంటి పవిత్రమైన కార్యక్రమాలను కూడా స్వార్థానికి వాడుకుని 29 మందికి చావుకు చంద్రబాబు కారణమయ్యారు. పుష్కరాల పేరుతో 43 పురాతన దేవాలయాలు కూల్చిన సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వానిదని’’ దుయ్యబట్టారు. (చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్) ఎంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టడం మానుకోవాలని మోపిదేవి హితవు పలికారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఘటనకు కారణం ఎవరో త్వరలోనే తెలుస్తోందని, తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. టిడ్కో పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ: టీడీపీ నేతలు టిడ్కో పేరుతో 12,000 మంది దగ్గర డబ్బులు దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సోమవారం ఆయన సత్యనారాయణ పురం 47వ డివిజన్లలో 50 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. గత టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల పేరుతో ఫొటో స్టాట్ వేల రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు డబ్బులు ఇచ్చామని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని మల్లాది విష్ణు వివరించారు. -
‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు. ‘‘ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నది ఒక్క జగన్ ప్రభుత్వమే. గుడిసెలు లేని రాష్ట్రం కావాలన్నదే మహానేత దివంగత వైఎస్సార్ ఆలోచన. పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ దేశంలో చరిత్రగా నిలిచిపోతుంది. ప్రతి మహిళను లక్షాధికారి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆయన గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని’’ సుచరిత పేర్కొన్నారు. (చదవండి: లోకేష్‌ను హెచ్చరించిన మంత్రి కొడాలి) కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ: శ్రీరంగనాథరాజు కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ పేరేచర్లలో ఏర్పాటు చేశామన్నారు. పేరేచర్లలో 18,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిపక్ష నేత కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని ధ్వజమెత్తారు. పేరేచర్ల లేఅవుట్‌ను మోడల్ లేఆవుట్గా తీర్చిదిద్దుతామని, రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు.(చదవండి: రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు) ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు: మోపిదేవి నవరత్నాల్లో ప్రధానమైన పథకం ఇళ్ల పట్టాల పంపిణీ అని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలను వైఎస్ జగన్ చూశారని, ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన అని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల ద్వారా ఆస్తి హక్కు కల్పిస్తున్నామని, ఏడాదిన్నర కాలంలోనే అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు.. కులమతాల పేరుతో గొడవ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మోపిదేవి ధ్వజమెత్తారు. -
ఆ నిర్ణయం దేశానికే ఆదర్శం..
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశానికే దిశా నిర్దేశమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు కన్వెన్షన్ హాల్లో జరిగిన చాత్తాద శ్రీవైష్ణవ వెల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ వారి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. (చదవండి: రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన) ‘‘రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉండగా వాటిలో కేవలం నాలుగైదు కులాలే మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా మనుగడ సాగిస్తున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్రలో బీసీ కుల సంఘాల నాయకుల సమస్యలు విని వారి స్థితిగతులు తెలుసుకున్నారు. బీసీ కులంలోని అట్టడుగు వర్గాలకు కూడా ఆర్థిక, రాజకీయంగా సమన్యాయం కల్పించేందుకు 139 కులాలని కలుపుకుంటూ 56 కార్పొరేషన్లు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశంలోనే పలు రాష్ట్రాలు ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాయని’’ మోపిదేవి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’) మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ మోపిదేవి తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీ మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. చేపలు వేటాడే విధానంలో చిన్న చిన్న సమస్యలున్నాయి. ఐలా వలలతో వేటాడొద్దని ముందే చెప్పాం. అవగాహన లేకపోవడంతో ఐలా వలలు వాడుతున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి
సాక్షి, అమరావతి: అంబేద్కర్ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంటకరమణ, ఎంపీ నందిగాం సురేష్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచిందని తెలిపారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చూపిన రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విలువల్ని ప్రపంచం అంతా స్మరించుకుంటున్నారని తెలిపారు. మన దేశానికి భరతమాత ముద్దు బిడ్డ అంబేద్కర్అని తెలిపారు. ఎవరు ఆడిగారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కి లేఖ రాశారని సూటిగా ప్రశ్నించారు. ఆయన పరిధి ఏమిటో తెలుసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు లాయర్ల సలహా తీసుకోమని ఆయన గవర్నర్‌కి చెప్పటం ఏమిటని మండిపడ్డారు. గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎలాచేయాలనే దానిపై విచక్షణాధికారం ఉంటుందని తెలిపారు. రమేష్ కుమార్‌ను సలహా ఇవ్వమని గవర్నర్ ఆడిగారా అని ప్రశ్నించారు. చట్ట సభల్లో తీసుకున్న నిర్ణయాలకు నీకేమి సంబంధం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయనపై ఎలా విశ్వాసం ఉంటుందని, ప్రతిపక్షం మౌత్ పీస్‌లా మారిపోయారని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధి ఏమిటో తెలుసుకుని పని చేయాలని హితవు పలికారు. -
సొంత జాగీరుగా వాడుకున్న చంద్రబాబు
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17నెలల్లోనే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టారని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ అన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. సాంబశివ రావుపేటలో గుంటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90శాతం పైగా కేవలం అధికారంలోకి వచ్చిన 15నెలల లోపు అమలు చేశామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదని, చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని సొంత జాగీరుగా వాడుకుని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ కేవలం 17నెలల్లోని గాడిలో పెట్టారని గుర్తుచేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1.40లక్షలకు పైగా లబ్ధి పొందాలని మహిళలు చెబుతున్నారని ఆయన తెలిపారు. సీంఎ జగన్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావుతో పాటు ఎమ్మెల్యే ముస్తఫా, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి తరాలకు సీఎం జగన్ ఆదర్శం
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వ స్కూళ్లను మోడల్ పాఠశాలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చిదిద్దుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పేదలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అమ్మవడి పధకం వంటి పధకం ఎక్కడలేదని ప్రశంసించారు. దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్య మంత్రులు రాష్ట్రాలను పరిపాలించారు కానీ, బీసీల ఎదుగుదలకు దోహదపడలేదన్నారు. ఏపీలో ఒక్క వైఎస్ జగన్‌కి మాత్రమే సాధ్యపడిందని తెలిపారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గొప్ప విద్యా ప్రణాళికలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కి దక్కుతుందని తెలిపారు. రేపటి తరాలు, పాలకులకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన పాలనలో ప్రజలు తల ఎత్తుకొని జీవిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సాహసోపేతమైన, జాతీయ స్థాయి నేతలే సీఎం జగన్‌ను అభినందిస్తున్నారని అన్నారు. ఆయన అణగారిన వర్గాల వారికి, జీవన విధానాన్ని మార్చిన నాయకుడని కొనియాడారు. మంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ.. రాజమండ్రి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ బీసీ అంటే బ్యాక్ వార్డ్ కాదని బ్యాక్‌బోన్ అని నిరూపించారని తెలిపారు. వైఎస్సార్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన తనకు సీటు అడగగానే జగనన్న చిలకలూరిపేట నుంచి అవకాశం ఇచ్చారని తెలిపారు.టీడీపీ నాయకుల తీరు చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్లుగా ఉందన్నారు. బీసీలంతా తమ వైపే ఉన్నారని చెప్పుకునే టీడీపీ బీసీ కులాలతో ఆడుకుని వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసిందని మండిపడ్డారు. -
ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం తగదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ)తో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీ ముగిసింది. మొత్తం 19 పార్టీలకు గాను 11 పార్టీలు హాజరయ్యాయి. ఇక ఎస్ఈసీ సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరు కాలేదు. ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం కుదరదని పార్టీలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. టీడీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించాయి. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ‘గతంలో కరోనా లేకపోయినా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సమావేశాలు పెట్టడం సరికాదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశాల నిర్వహణతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టుంది. ప్రైవేట్ హోటల్లో బీజేపీ-టీడీపీ నేతలను కలిసినప్పుడే నమ్మకం కోల్పోయారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు’ అని తెలిపారు. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం) నవతరం పార్టీ నేతల అరెస్ట్ ఇక ఈసీ సమావేశానికి ఆహ్వానించక పోవడంపై నవతరం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డకు వినతిపత్రం ఇచ్చేందుకు నవతరం పార్టీ నేతలు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. -
‘బీసీల అభివృద్ధికి పాటుపడే నాయకుడు సీఎం జగన్’
సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
అధికారంలో ఉంటే బీసీలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు బీసీలను వెన్నుపోటు పొడవడం, వారి వెన్నెముక విరిచేయడం.. అధికారం పోయాక బీసీలే మాకు వెన్నెముక అని మాట్లాడటం టీడీపీ అధినేత చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ధ్వజమెత్తారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని ఒక ప్రముఖ పత్రికలో కథనం రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► అధికారంలో లేనప్పుడు జెండాలు మోయడానికి, జిందాబాద్ కొట్టడానికి చంద్రబాబుకు కనిపించేది బీసీలే. తమది బీసీల పార్టీ అని జపం చేయడం తప్పితే వారికి చంద్రబాబు చేసింది శూన్యం. ► బీసీలకు భరోసా కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సుమారు 57 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 741 మందికి పదవులు ఇస్తున్నారు. ► నాలుగు రాజ్యసభ పదవుల్లో రెండింటిని, ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్లో ఒకటి బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడైనా కార్యకర్త స్థాయి వారికి రాజ్యసభ పదవి ఇచ్చారా? ► చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? వైఎస్ జగన్ పాలనలో ఎన్ని లక్షల కుటుంబాలు బాగు పడ్డాయో చర్చకు మేం సిద్ధం. -
చంద్రబాబు ఏం చేశారు?
-
‘వాడుకుని వదిలేయడం ఆయన నైజం’
సాక్షి, తాడేపల్లి: మనుషులను వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని.. అధికారంలో లేనప్పుడు మాత్రమే బీసీలు చంద్రబాబుకు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. ‘‘రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక్క పథకాన్ని కూడా బీసీలకు చంద్రబాబు అమలు చేయలేదు. బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు) బీసీల సామాజిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. 57 బీసీ కార్పొరేషన్లు సీఎం జగన్ ఏర్పాటు చేశారని, 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే 2 సీట్లు బీసీలకు సీఎం జగన్ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 5 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సీఎం జగన్ తన పరిపాలనలో భాగస్వామ్యం చేశారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఏనాడైనా బాబు రాజ్యసభ పదవి ఇచ్చారా? అని మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. (చదవండి: హర్షకుమార్కు సవాల్ విసిరిన నందిగం సురేష్) -
ఘనంగా జాషువా జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 125వ గుర్రం జాషువా జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జాషువా విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఆదిమూలపు సురేష్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కులరాజకీయాలు చేస్తున్నాయి ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. 'గుంటూరులో గుర్రం జాషువా కళాప్రాంగణం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే జాషువా కళా ప్రాంగణ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సమాజ హితం కోసం జాషువా ఎన్నో రచనలు చేశారు. జాషువా సమాధిని స్మృతి వనంగా అభివృద్ధి చేస్తాం.జాషువా ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాలు కులాలను అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేస్తున్నాయి' అని పేర్కొన్నారు. దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని మంత్రి తిప్పికొట్టారు. తమది దళితులను గౌరవించే ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత 14 ఏళ్లలో చంద్రబాబు ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసునన్నారు. దళిత సమాజికి వర్గానికి పెద్దపీట వేస్తూ సుచరితకు హోం మంత్రి పదవి ఇచ్చిన ప్రభుత్వం తమదని, దళితుల అభ్యున్నతికి, సమనత్వానికి వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. నవ సమాజంలో అణగారిన వర్గాలు ఏ విధంగా చైతన్యం కావాలో తెలిపిన వ్యక్తి జాషువా అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుకే పరిమితం కాకూడదని సీఎం జగన్ పోరాడుతున్నారని తెలిపారు. దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు కొత్త రాజకీయం తెర మీదకు తెస్తున్నారని, వారి కుల రాజకీయాలు చెల్లవని వ్యాఖ్యానించారు. (బాబు ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్ సమావేశం) -
మత కలహాలు సృష్టించి..
-
‘ఆ దాడులు వెనుక కుట్ర కోణం’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మత కలహాలు సృష్టించి.. రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శనివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. -
‘అమిత్ షా సానుకూలంగా స్పందించారు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశంపై ఆంధ్రజ్యోతి అవాస్తవ కథనాలు రాస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్ అమిత్ షాతో చర్చించారని, ఈ భేటీ సానుకూలంగా జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, ఏపీ విభజన జట్టంలోని అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని పేర్కొన్నారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం వాస్తవాలను వక్రీకరించి, అసత్యాలు ప్రచారం చేస్తోందని, ఇలాంటి రాతల వల్ల పత్రిక ప్రజల్లో పలుచన కావడం ఖాయమని చురకలు అంటించారు. (చదవండి: అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ ) ఇక అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. జడ్జీల ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానంపై ఉందన్నారు. ఈ పరిణామాలపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా అర్థంకావడం లేదని వాపోయారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారు: మోపిదేవి న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల భేటీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ వికృతంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం అమిత్ షా అపాయింట్మెంట్ కోరి ఢిల్లీకి వచ్చారన్నారు. అమరావతి భూ కుంభకోణం, జడ్జీల వ్యవహారం, ఫైబర్ నెట్వర్క్ తదితర అంశాలను ప్రస్తావించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను ఆయన వివరించారన్నారు. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని తెలిపారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని మోపిదేవి వెంకటరమణ చురకలు అంటించారు. ఇక మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగిందన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను సాధించుకునే దిశగా ముందుకెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. -
రాజ్యసభ: అమరావతి అక్రమాలపై విచారణ జరగాలి
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో మాట్లాడుతూ.. 'అమరావతిలో చంద్రబాబు నాయుడు ధనవంతులకే స్థలాలిచ్చారు. అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాలు సైతం అడ్డుకోవడం సరికాదు. పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన నివాసం ఉండడానికి అనర్హులా..?. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు ఇదేనా..?. అందుకే ఆ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. అంతర్వేదిలో దేవుడి రథం విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. (సీఎం జగన్‌పై వాసుపల్లి గణేశ్ ప్రశంసలు ) అంతర్వేది ఆలయం శిథిలావస్థలో ఉంటే దాన్ని మాజీ సీఎం వైఎస్సార్ అభివృద్ధి చేశారు. మా సీఎం దృష్టిలో అందరూ సమానమే. బడుగు వర్గాలకు చెందిన మేమిద్దరం ఇక్కడ ఎంపీలుగా నిలబడ్డమే అందుకు నిదర్శనం. కొందరు విబేధాలు రెచ్చగొట్టేందుకు ఎవరో కొందరు చేసిన పనిని సీఎంకు ఆపాదించడం దురదృష్టకరం. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరుతున్నాం. న్యాయమూర్తులపై నిందారోపణలున్నాయి. కాబట్టి కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని పిల్లి సుభాస్ చంద్రబోస్ అన్నారు. (స్టేలతో బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు) సమగ్ర న్యాయ విచారణ జరగాలి- మోపిదేవి వెంకటరమణ అమరావతి అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా బడుగు బలహీనవర్గాల, పేదల భూములు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ('మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం') నిష్పక్షపాత దర్యాప్తు ఉండాలి- అయోధ్య రామిరెడ్డి రాష్ట్రంలో అన్ని దర్యాప్తులకు మోకాలడ్డుతున్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సిట్, సబ్ కమిటీ ఏర్పాటైంది. అమరావతిలో అవకతవకలు జరిగాయని ఈ కమిటీ ద్వారా వెల్లడైంది. దీనిపైన న్యాయవిచారణ జరగాల్సిందే. నిష్పక్షపాత దర్యాప్తు తప్పనిసరిగా ఉండాలి. -
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
-
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫిషింగ్ హార్బర్లకు ఫిషరీస్, ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎఫ్ఐడీఎఫ్)లోను బదులుగా తగిన గ్రాంట్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేంద్రాన్ని కోరారు. శనివారం ఆయన రాజ్యసభ జీరోఅవర్‌లో మాట్లాడారు. అనుమతులు జారీ చేసిన మూడు ఫిషింగ్ హార్బర్లకు లోను బదులు గ్రాంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, మిగిలినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావముంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. (రాజ్యసభలో విశాఖ వాణి) ఏపీకి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లు నిజాంపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ. 379.17 కోట్లు, మచిలీపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ.285.609 కోట్లు, ఉప్పాడ అంచనా వ్యయం రూ. 350.44కోట్లకు భారత ప్రభుత్వ వాటా క్రింద ఒక్కొక్కదానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. అంటే రూ.450కోట్లు ఎఫ్ఐడీఎఫ్ రుణంగా కాకుండా, మొత్తం గ్రాంటు రూపంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిదిగా ఎంపీ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. (ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు) -
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అడ్డంకులు: మోపిదేవి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాభివృద్ధికి ఎదురవుతున్న అన్ని అడ్డంకులు ఈ వినాయక చవితితో తొలగి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆశీల్మెట్టలోని సంపత్ వినాయక ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువస్తున్న ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ప్రతి పక్ష నేత చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. (ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన ప్రమాదం) గణపతి ఆలయాలకు తగ్గిన రద్దీ కోవిడ్ కారణంగా విశాఖ లోని గణపతి ఆలయాలకు రద్దీ తగ్గింది. ప్రతి ఏటా వినాయక చవితి రోజున భక్తుల రద్దీ ని తలపించే ప్రధాన దేవాలయం ఆశీల్ మెట్ట సంపత్ ఆలయనికి కూడా భక్తుల సంఖ్య తగ్గింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను నిర్ణీత సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. (వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే) -
ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఎంపీ మోపిదేవితో పాటు ఆయన కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఢీకొన్నాయి. అదే సమయంలో వెనకనే వచ్చిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి వాహనంలో ఎంపీ మోపిదేవి, ఆయన కుటుంబసభ్యులు విశాఖ బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగస్ట్ 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్ రాజ్యసభకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే వీరిద్దరూ రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ గురువారం షెడ్యూల్ విడుదల విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగష్టు 6న విడుదలకానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగష్టు 13 కాగా, 24న పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల వారిద్దరు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ సీపీ సభ్యుల్లో ముగ్గురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్షర క్రమం ప్రకారం తొలుత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణం చేయగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి.. వారితో పాటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలసి ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఇది ఒక రికార్డు: మిథున్‌రెడ్డి మరీ వెనుకబడిన తరగతి (ఎంబీసీ)కి చెందినవారు ప్రప్రథమంగా రాజ్యసభలో అడుగుపెట్టడం రికార్డు అని, వైఎస్సార్ సీపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాజ్యసభలో ఒక్క సభ్యుడితో మొదలైన వైఎస్సార్ సీపీ ప్రస్థానం ఈరోజు ఆరుకి పెరిగింది. ఈ పరిణామం రాష్ట్రానికి మరింత మేలు చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ చలువతో బీసీల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటగా రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల పరిమళ్ నత్వానీ ప్రమాణ స్వీకారం చేయలేదు. వచ్చే వారం ఆయనకు సమయం ఇవ్వాలని పార్టీ ద్వారా రాజ్యసభ చైర్మన్‌ను కోరాం..’ అని తెలిపారు. బోస్, మోపిదేవి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు(కుడి నుంచి ఎడమకు) కలలోనూ ఊహించలేదు – సుభాష్ చంద్రబోస్ ‘మోస్ట్ బ్యాక్వర్డ్ తరగతులకు చెందిన నాకు, మోపిదేవికి పార్లమెంట్ సభ్యులుగా అవకాశం దక్కడం అరుదు. కలలో కూడా ఊహించనిది జరిగింది. ఇలాంటి మహత్తర అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మాపై గురుతరమైన బాధ్యత ఉంది. విభజన హామీలన్నీ ఇంకా అమలు కాలేదు. కోవిడ్ కారణంగా ఆర్థిక ఇక్కట్లలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సి ఉంది. ప్రధాని ఈ దిశగా సాయం చేస్తారని ఆశిస్తున్నాం..’ అని బోస్ అన్నారు. నాలుగు రంగాలపై దృష్టి : ఆళ్ల ‘ముఖ్యమంత్రి జగన్ మాపై ఎంతో నమ్మకంతో పెద్దల సభకు ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగమించేందుకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి ప్రాధామ్యాలకు అనుగుణంగా పనిచేస్తాం..’ అని ఆళ్ల చెప్పారు. అరుదైన ఘటన: మోపిదేవి ‘నా రాజకీయ జీవితంలో ఇది మరువలేనిఘటన. విశాల రాజకీయ దృక్పథంతో పరిణితి చెందిన నేతలను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ విధానాలకు అనుగుణంగా పనిచేస్తాం. అత్యంత వెనకబడిన కులాలకు చెందిన ఇద్దరికి రాజ్యసభలో ప్రవేశించే అవకాశం కల్పించడం ఏపీ చరిత్రలోనూ, ప్రాంతీయ పార్టీల ప్రస్థానంలో ఒక అరుదైన ఘటన. బీసీ సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు..’ అని మోపిదేవి పేర్కొన్నారు. -
ఇది జీవితంలో మరిచిపోలేని రోజు
-
ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమ, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారుని రాజ్యసభ ఎంపీ మోపిదేవీ వెంకటరమణ అన్నారు. ఏడాది కాలంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో సీఎం వైఎస్ జగన్ నాలుగో స్థానంలోకి వెళ్లడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిందని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. ‘ఇది మా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఇద్దరు బీసీలకు రాజ్యసభ చోటు కల్పించడం అరుదైన విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టం మేరకు రైతులకు రెండున్నర రెట్లు ధర చెల్లిస్తున్నాం. సేకరించిన భూమిని ఇల్లు లేని పేదలకు ఇస్తున్నాం. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఇళ్ల స్థలాల పంపిణీపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో పస లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసి చూపిస్తారా?’అని ప్రశ్నించారు. ఇక వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. (కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం) -
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున సభలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
ఆ రెండు శాఖలూ సీఎం వద్దే
సాక్షి, అమరావతి: రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి పదవికి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామాలు చేయడంతో ఆ రెండు శాఖలు సీఎం పరిధిలోకి వెళ్లినట్లు సీఎస్ నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంత్రులిద్దరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో వాటిని నోటిఫై చేస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు. -
ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వీరిద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 22న పిల్లి సుభాష్‌చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.(కరోనా నివారణకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు) -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
-
మంత్రివర్గ విస్తరణ 22న?
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. -
టీడీపీ బీసీలను వాడుకుంది: మోపిదేవి
సాక్షి, తిరుమల: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పాలనలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విషయంలో అనవసరంగా కులం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పేరుకే బీసీ, ఆయన జీవన విధానం అగ్రవర్ణాలకంటే ఎక్కువగా ఉంటుందన్నారు. అచ్చెన్న నిజాయితీపరుడైతే విచారణకు ధైర్యంగా సహకరించేవారని అన్నారు. (పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి) ఎవ్వరినీ అణచి వేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదని మోపిదేవి స్పష్టం చేశారు. బీసీలను వాడుకుంది టీడీపీ అని దుయ్యబట్టారు. బీసీలకు టీడీపీ ఏం చేసిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఏడాది కాలంలో ఉత్తమ సీఎంల జాబితాలో చోటు దక్కిచుకోవడం సీఎం వైఎస్ జగన్ పరిపాలనకు నిదర్శనం అని మోపిదేవి గుర్తుచేశారు. (విపక్షం ఈర్ష్యతో బురద జల్లుతోంది) -
శ్రీవారిని దర్శించుకున్న తమ్మినేని,మోపిదేవి
-
నిమ్మగడ్డ వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలోనే సంక్షేమ పథకాల అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలను పొందుతున్నారని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీలో ప్రవేశపెట్టిన సచివాలయ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. తొలి ఏడాది పాలనలోనే సీఎం వైఎస్ జగన్ దేశంలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారని ప్రశంసించారు. ఇవన్నీ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బాబు కక్ష సాధింపు అని ఎలా అంటారని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారని నిలదీశారు. (అవినీతిపరుడిని అరెస్ట్ చేస్తే.. బీసీ కార్డా?) గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాల వల్లే ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా ఎందుకు బేటీ అయ్యారో చెప్పాలి. ప్రభుత్వంపై కుట్రలు పన్నే ప్రతిపక్ష నేతలతో జరిపిన మంత్రాంగమేంటో నిమ్మగడ్డ చెప్పాలి. తన తల్లిని కూడా కలవనీయటం లేదంటూ నిమ్మగడ్డ ప్రభుత్వంపై బురద జల్లాలని ఎలా చూస్తారు? ఆయన వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. అతడిని ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం తిరస్కరించిదంటే తాను చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం ఏంటి?" అని మంత్రి ప్రశ్నించారు. (నిమ్మగడ్డ నోరు ఎందుకు విప్పరు?) -
‘ఆ కుట్రల్లో నిమ్మగడ్డ బలి పశువు కావొద్దు’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆక్వా, మత్స్యశాఖ రంగాలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతోందని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 34.76 కోట్ల రూపాయల వ్యయంతో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. దేశంలోనే రెండో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఏర్పాటు చేశారన్నారు. క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుతో ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకు రావచ్చన్నారు. (త్వరలో వారికి కూడా కాపునేస్తం తరహా పథకం ) నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు, పారిశ్రామికంగా కోస్తా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. దేశంలో యాబై శాతం పైగా ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎగుమతులవుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో సరైన నిర్ణయాలతో ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆక్వాతో పాటు మత్స్య సంపద అభివృద్దికి మూడు వేల కోట్లతో మేజర్ పోర్ట్‌ల అభివృద్ధి జరుగుతందని, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి పరిపాలనకు ఆటంకం కల్గించే దిశగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నరని మండిపడ్డారు. (ఆ హక్కు రాష్ట్రానికి లేదు.. జూన్ నుంచి పూర్తి పింఛన్లు) చంద్రబాబు కుట్రల్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బలి పశువు కావద్దని సూచించారు. ఎన్నికల కమిషనర్‌కు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పరిపాలనా సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగో స్థానం కైవసం చేసుకున్నారని మంత్రి మోపిదేవి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. (వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్) -
ఆక్వా రైతుకు ‘అథారిటీ’
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను తగ్గించడంతోపాటు కరోనా సమయంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ (డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసింది. నాణ్యమైన సీడ్,ఫీడ్ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చూడటం అథారిటీ ప్రధాన లక్ష్యం రైతులు, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తూ వారి ప్రయోజనాలను అథారిటీ పరిరక్షిస్తుంది. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారుల దోపిడీ నుంచి రైతుల్ని కాపాడే రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆక్వా రంగం అభివృద్ధికి రైతులు, వ్యాపారులతో సామరస్య పూర్వకంగానే వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పరిధి దాటిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అథారిటీ ఏమాత్రం వెనుకాడదు. ఈ మేరకు మత్స్య, పశు సంవర్థ్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో ప్రాధికార సంస్థ ఏర్పాటై విస్తారమైన కోస్తా తీరాన్ని అభివృద్ధికి ఆలవాలంగా, ఉపాధికి నెలవుగా తీర్చిదిద్దనుంది. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే ఆక్వా అసిస్టెంట్లు సాగుదారులకు అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సీడ్, ఫీడ్, సాంకేతిక సలహాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమస్యలను పరిష్కరించే ‘అథారిటీ’.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ రూ.3.86 నుంచి ఏకంగా రూ.1.50కి తగ్గించిన ముఖ్యమంత్రి జగన్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. మత్స్యకార భరోసా, మరపడవల నిర్వాహకులకు డీజిల్ రాయితీ, చేపల వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు లాంటి పలు కార్యక్రమాలను తొలి ఏడాదిలోనే పూర్తి చేశారు. లాక్డౌన్ సమయంలో ఆక్వా వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేశారు. గత ప్రభుత్వాలేవీ ఆక్వా వ్యాపారుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధైర్యం చేయకపోవడంతో విపత్తులోనూ అదే రీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆక్వా రైతులు ఈ అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తేవడంతో రొయ్యలకు ధరలను నిర్ణయించి అధికారుల పర్యవేక్షణలో తక్షణమే కొనుగోళ్లు జరిగేలా చేశారు. వ్యాపారులు, ఎగుమతిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి సమస్యలనూ పరిష్కరించి విదేశాలకు ఆక్వా ఎగుమతులు జరిగేలా చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్ధ లేకపోవడంతో సీఎం జగన్ పలుదఫాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా చర్చలు జరిపారు. ఆక్వా రంగం ఇంకా అసంఘటితంగా ఉన్నందున సమస్యలు తలెత్తినట్లు గుర్తించి చట్టం తేవాలని నిర్ణయించారు. ఈ రంగానికి చెందిన వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని బిల్లు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు, మంత్రి మోపిదేవి తీర ప్రాంతాల జిల్లాల్లో పర్యటించి అన్ని రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. సీడ్, ఫీడ్‌పై నియంత్రణ లేకపోవడంతో.. ► రాష్ట్రంలో మత్స్యసాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నా వ్యవస్థీకృత విధానాలు లేకపోవడంతో ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆక్వా సాగులో కీలకమైన సీడ్, ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ లోపించింది. మంచి రేటు వచ్చే వరకు రైతులు కోల్డ్‌స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. ► చేపలకు పెద్దగా విదేశీ ఎగుమతులు లేకపోవడంతో పూర్తిగా ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కరోనా విపత్తుతో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పరిస్థితిని నివారించి రాష్ట్రంలో చేపల వినియోగం, మార్కెట్ల విస్తరణకు చర్యలు చేపట్టడం అవసరం. ► రొయ్యల సాగుపై సరైన నియంత్రణ లేనందున నాణ్యతా లోపంతో విదేశీ ఎగుమతులు తరచూ తిరస్కరణకు గురవుతున్నాయి. సరైన ధర కూడా లభించడం లేదు. ► ఇవన్నీ పరిశీలించిన అనంతరం ఆక్వా సాగు, అనుబంధ రంగాల్లో సుíస్థిరత సాధించేందుకు ఒక చట్టం అవసరమని ప్రభుత్వం భావించింది. అథారిటీ విధులు ఇవీ ► రాష్ట్రంలో 2019–20లో 41.75 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరిగింది. 26.50 లక్షల మందికి ఈ రంగం ద్వారా ఉపాధి లభిస్తోంది. శాస్త్రీయ విధానాల ద్వారా దిగుబడిని మరింత పెంచేందుకు చట్టం అవకాశాలను కల్పిస్తుంది. ► ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ ఇతర ఇన్పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందనుంది. ► విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆక్వా ఉత్పత్తుల నిల్వకు మౌలిక సదుపాయాలు కల్పించడం, కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడం. ఆక్వా రైతులు, అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు. ► ఆక్వా ల్యాబ్‌ల ద్వారా సీడ్, ఫీడ్ నాణ్యతా పరీక్షలు చేపట్టి వ్యాధి నివారణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తుంది. సాగులో మంచి యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా విదేశీ ఎగుమతులు, ఇతర రాష్ట్రాలకు మత్స్య సంపద చేరవేసేలా చర్యలు. ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం. అథారిటీ అధికారాలు ► రాష్ట్రంలో చేపల పెంపకం సామర్ధ్యం, సమస్యలు తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించడం ► ఆక్వా సాగుకు సంబంధించి అన్ని అంశాలపై చట్టాలు తయారు చేయడం, నియమ నిబంధనలు, విధి విధానాలు రూపొందించి అమలు చేయడం. జిల్లా, డివిజన్, ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ► ప్రాధికార సంస్ధ విధుల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు పొందడం ► లాబ్‌ల అనుసంధాన వ్యవస్థ, ఆక్వా టెక్నీషియన్లు, సంస్థలను ఏర్పాటు చేయడం ► దాణా, చేపలు, రొయ్య పిల్లలపై నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం వ్యాపార సంస్ధలు, హేచరీస్ల్లో తనిఖీలు, ఆడిట్లు చేయడం. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన సంస్ధలపై పెనాల్టీలు విధించడం. ► అనధికారిక చేపల పెంపకం, ప్రాసెసింగ్, పంపిణీ, అమ్మకం యూనిట్లను క్రమబద్ధీకరించడం ► వ్యవసాయ ఉత్పాదక భూములను చేపల పెంపకం చెరువులుగా మార్పిడి చేయడాన్ని నియంత్రించడం ► స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపి చేపలు, సముద్ర ఉత్పత్తులకు రేటు నిర్ణయించడం ► శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్థికి చర్యలు తీసుకోవడం ► సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి రైతులకు అందించడం. ► చేపపిల్లలు, దాణా, ఆక్వా ఉత్పత్తులు, ఔషధాలు, ఇతర సేవలపై చార్జీలను విధించి వసూలు చేయడం ► విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేపట్టడటం. విపత్తులోనూ విదేశాలకు విక్రయాలు కేంద్రం లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి ఆక్వా సాగుదారులను ఆదుకునేందుకు విదేశాలకు రొయ్యలు ఎగుమతి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విదేశీ ఎగుమతులకు సానుకూల పరిస్థితులు కల్పించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 8 జిల్లాల్లో 74,101 మెట్రిక్ టన్నులకుపైగా రొయ్యలను సేకరించగా విదేశాలకు 70,578 టన్నులు ఎగుమతి అయ్యాయి. విపత్తుకు ముందు సేకరించిన 96,536 టన్నులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లలో సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ వాటా 36.11 శాతంగా ఉంది. ఏటా ఈ వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది. 2019–20లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రాష్ట్రానికి రూ.17,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. సేవలన్నీ ఒకే చట్రంలోకి.. ► రాష్ట్రంలో 30 శాతం మత్స్య ఉత్పత్తుల వినియోగం జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం. మంచి పోషక పదార్ధాలు కలిగిన ఆక్వా ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం. ► సరళీకృత విధానాలను అనుసరిస్తూ ఆక్వా రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం. ఆక్వా అభివృద్ధికి అవసరమైన అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రైతులు, అనుబంధ సంస్ధలకు మేలైన సేవలు అందించడం. ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటెలిజెన్స్ సేవలు అందించడం. ► జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో సాంకేతిక విజ్ఞానం బదిలీని ప్రోత్సహించడం. రైతులకు అండగా ఆక్వా అసిస్టెంట్లు ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న721 మంది మత్స్యశాఖ సహాయకులు (ఆక్వా అసిస్టెంట్లు) ఆక్వా రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్, ఇతర సాంకేతిక సలహాలను కూడా అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 794 ఆక్వా అసిస్టెంట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగా 721 పోస్టులు భర్తీ అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఆక్వా రంగం బలోపేతానికే చట్టం ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడానికే చట్టాన్ని తెచ్చాం. మాది స్నేహపూర్వక ప్రభుత్వం.అయితే రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వెనుకాడం. ఆక్వా అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో మంచి ఫలితాలనిస్తాయి. చట్టం పరిధిలోకి సముద్ర ఉత్పత్తుల వేటను కొనసాగించే మరపడవల నిర్వాహకులను కూడా చేర్చాం. ఫిష్‌ల్యాండ్ సెంటర్లు, హార్బర్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నాం. మత్స్యకారుల అభ్యున్నతికి పలు పథకాలు అందుబాటులోకి తెచ్చాం. – మోపిదేవి వెంకట రమణారావు (మత్స్య శాఖ మంత్రి) అన్ని వర్గాలకు ఉపయోగం... విపత్తుల సమయంలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అధికారులు నిర్ణయించిన రేటుకు ఎగుమతిదారులు పంటను కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. ఎగుమతిదారులు, హేచరీస్, కోల్డు స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకుల సమస్యల పరిష్కారం, అభివృద్దికి చర్యలు తీసుకునేలా చట్టంలో విధివిధానాలున్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో నాణ్యమైన రొయ్యల్ని ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యం ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌రాజు (రొయ్య రైతుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు) రెండు వారాల్లో విధివిధానాలు... ఆక్వా చట్టంపై రెండు వారాల్లో విధి విధానాలు రూపొందిస్తాం. బిల్లు తయారు చేసే సమయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. సాగుకు సంబంధించిన అన్నివర్గాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాం. సీడ్, ఫీడ్‌లో నాణ్యత పాటించని సంస్ధలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాగు లైసెన్సులను రెండు వారాల్లోనే మంజూరు చేస్తాం. విపత్తుల సమయంలో రైతులు నష్టపోకుండా ఆక్వా వ్యాపారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు జరిపి రేటు నిర్ణయిస్తాం. ప్రభుత్వం సీడ్, ఫీడ్‌ను అభివృద్ది చేసి రైతులకు సరఫరా చేస్తుంది. – కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్ -
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు వేశారు. కాగా ముఖ్యమంత్రి తన ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం జగన్ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరఫున వర్ల రామయ్య బరిలో ఉన్నారు. (ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం) -
బోనస్ పేరుతో బురిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపల రైతుల పాలిట ‘బోనస్’ విధానం వారి ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చేపల అమ్మకాల సమయంలో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్ల వరకు నష్టపోతున్నారు. రైతుల నుంచి చేపలను కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు 5 శాతం బోనస్ విధానాన్ని అనుసరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యను కూడా పరిష్కరించి తమను ఆదుకోవాలని చేపల రైతులు కోరుతున్నారు. ఈ ‘బోనస్’ దందాను మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గత నెలలో రైతులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. విషయాన్ని సీఎంకు వివరించి, మరోసారి రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఐదు శాతం బోనస్ అంటే: రైతు నుంచి చేపలు కొనుగోలు చేసిన సమయంలో ఎన్ని కిలోలు కొంటే ఆ మొత్తానికి ధర చెల్లించాలి. కానీ బోనస్ పేరుతో అదనంగా మరో అయిదు కిలోలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు 100 కిలోలు కొంటూ 105 కిలోల చేపలను తీసుకుని, 100 కిలోలకే ధర చెల్లిస్తున్నారు. ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోందని అదనంగా తీసుకుంటున్న అయిదు కిలోల విలువను ఇతర రాష్ట్రాల్లోని బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అలా చేయకపోతే అక్కడి మార్కెట్లలో ధర రానీయకుండా చేస్తారని అంటున్నారు. ఈ దందాతో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్లు నష్టపోతున్నారు. అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. రైతులు ఎంత నష్టపోతున్నారంటే: ► ఏటా 16 లక్షల టన్నుల చేపల దిగుబడి అవుతోంది. ► వ్యాపారులు కొనుగోలు సమయంలో అయిదు శాతం అదనంగా తూకం వేసుకుని దానికి ధర చెల్లించట్లేదు. ఇలా మొత్తం 80 వేల టన్నులు నష్టపోతున్నారు. ► చెరువులు వద్ద చేపల ధర కిలో రూ.60 నుంచి రూ.100లోపు ఉంటుంది. కనిష్టంగా రూ. 60గా అంచనా వేసినా.. బోనస్ దందాతో రూ.480 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నారు. వాస్తవాలు తెలుసుకుని త్వరలో మరో సమావేశం: మోపిదేవి ‘బోనస్’పై వాస్తవాలు తెలుసుకుంటాం. రాష్ట్ర దిగుబడిలో 90 శాతం చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు, రైతులు ఇరు వర్గాలకు ప్రయోజనాలు కాపాడేలా వారితో త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం. -
ఆక్వా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఏడీఏ (ఏపీస్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ) బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి సంబంధించిన ప్రాధికార సంస్థ బిల్లును మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా, దేశ ఎగుమతుల్లో 50 శాతం రాష్ట్రం నుంచి అవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయించాం. ► ఆక్వా రంగానికి ప్రధానమైన విద్యుత్ యూనిట్ రేటు గతంలో రూ. 3.50 ఉండగా, దాన్ని రూ. 1.50 తగ్గించాం. ► 9 జిల్లాల్లో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రూ. 3,200 కోట్లతో నిర్మించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ► ఆక్వా రంగంలో తీసుకున్న నిర్ణయాలతో 18 లక్షల మంది నిరుద్యోగ యువకులకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగాను ఉపాధి లభిస్తోంది. ► వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ రంగం అసంఘటిత రంగంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రంగంలో ఉన్నవారికి భరోసా కల్పిస్తున్నాయి. ► వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆక్వారైతుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించారు. ఆక్వా ప్రాధికార సంస్థతో ప్రయోజనాలు ఇవే ► చేపలు, రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలను సృష్టించడం ► ఆక్వా పెంపకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫోరం ఏర్పాటు ► ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటిలిజెన్స్ సేవలు. చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులపై నిఘా, నియంత్రణ చర్యలు ► సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు తనిఖీలు..ఆడిట్లు ► సీడ్ హేచరీస్, ఫీడ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు, ప్రాసెసింగ్ చేసే ఎగుమతిదారులూ భాగస్వాములను చేయడం ► ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు. క్వాలిటీ మెటిరియల్ అందించి రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడం ► ఆక్వా ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ► అసంఘటిత రంగంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం జగన్ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాలు ఇవే ► కోవిడ్ సమయంలో 1.10 లక్షల మందికి రూ. 10 వేలు చొప్పున సాయం. ► డీజిల్ సబ్సీడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి వేటకు వెళ్లిన రోజునే స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లో జమచేయడం ► చేపల వేట నిషేధం సమయంలో ఇచ్చే రూ.4వేల పరిహారాన్ని రూ.10వేలకు పెంచడం. చనిపోయిన వ్యక్తులకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడం ► తూర్పు గోదావరి జిల్లాలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ కోసం చేపల వేటపై నిషేధం విధించిన సమయంలో వాళ్లు ఇస్తానన్న పరిహారం చెల్లించకపోతే ఏపీ ప్రభుత్వమే రూ.80 కోట్లు చెల్లించడం ► సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులు అరెస్టు చేస్తే.. వారిని నాలుగు మాసాల్లోనే విడిపించి స్వరాష్ట్రానికి తీసుకురావడం ► ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు తగ్గించి రూ.720 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడం. మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం – 1994 సవరణ బిల్లు ► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం – 2005 సవరణ బిల్లు.. రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణ బిల్లు (జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం మేరకు) ► ఏపీ ఆబ్కారీ చట్టం –1968 సవరణ బిల్లు ► ఏపీ మద్య నిషేధ చట్టం –1995 సవరణ బిల్లు ► పురపాలక కార్పొరేషన్ల చట్టం – 1955, ఏపీ పురపాలికల చట్టం – 1965 సవరణ బిల్లు. ► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్ట సవరణ బిల్లు ► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు. రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకాల్లో మార్పులు చేస్తూ బిల్లు -
కుల రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటు
రేపల్లె: అడ్డగోలు దోపిడీతో దొరికిపోయిన టీడీపీ నేతల అరెస్ట్‌లతో చంద్రబాబు కుల రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో రూ.కోట్లు దోపిడీ చేసినట్టు సాక్ష్యాధారాలతో నిరూపణ అయిందని తెలిపారు. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తే బీసీ కార్డును బయటకు తీయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఆయన ఆదివారం రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ► జేసీ ట్రావెల్స్‌పై అధికార యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటే.. కక్ష సాధింపు అంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్న తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు. ► బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని గతంలో సీఎం అయిన చంద్రబాబు.. ఏనాడూ వారికి న్యాయం చేసింది లేదు. బీసీ వర్గాలకు ఆదరణ పేరుతో నాసిరకం పరికరాలను అందించి అక్రమ మార్గంలో కోట్లు దండుకున్నారు. ► సీఎం జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్న తీరుచూసి ఓర్వలేక విమర్శించడం విపక్ష నేతలు మానుకోవాలి. -
అవినీతిపరుడిని అరెస్ట్ చేస్తే.. బీసీ కార్డా?
రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు అన్నారు. పైగా కుల రాజకీయాలు చేయటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రభుత్వం బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అవినీతి చేసిన అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధమని వారు చంద్రబాబును, టీడీపీ నేతలను ప్రశ్నించారు. పదిమంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి పుట్టలు బయట పడుతున్నాయని అన్నారు. అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలు..అడ్డదారిలో ప్రయాణం చేసిన విధివిధానాలపై ఏసీబీ పలు కోణాల్లో అవినీతిపై దర్యాప్తు చేసిందని, ఆధారాలు లభించిన తర్వాతే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంది టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే దానికి అచ్చెన్నాయుడు ఉదంతమే నిదర్శనం. త్వరలో టీడీపీ హయాంలో వివిధ శాఖల్లో అవినీతి చేసిన మంత్రులు కూడా బయటపడతారు. అవినీతి చేసినందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో పని చేసే కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదు. టెలీసర్వీస్, ఆర్íసీ, నాన్ ఆర్íసీ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. మందులు సరఫరా చేసిన కంపెనీల బకాయిలున్నాయి. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందని తెలిసింది. – గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఆయన అక్రమాలు చేస్తే నేను రాజీనామా చేయాలా? అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడితే నన్ను రాజీనామా చేయమనటం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసులో కూడా దళితులపై దాడి అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు చేస్తే బీసీలపై దాడి అనడమేంటి? ఇలా కుల రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. రూ.లక్ష విలువ చేసే సోఫాని రూ.10 లక్షలకి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ఈఎస్ఐ స్కాంలో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులుంటాయి. – సుచరిత, హోంమంత్రి కుంభకోణంలో కుల ప్రస్తావన ఎందుకు? టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రత్యేకించి అక్రమ మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తుంది. ప్రభుత్వ సంపాదన ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్దహస్తులు ఇంకొకరు లేనేలేరు. ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి బయటపడుతోంది. నువ్వు రూ.పది తిను.. దాంట్లో నా వాట నాకివ్వు అనే భాగస్వామ్య విధానం చంద్రబాబు జమానాలో నడిచింది. దానికి బీసీకార్డును వాడాల్సిన అవసరమేముంది. – మోపిదేవి వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి ఆయన అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డెక్కాలి? అచ్చెన్నాయుడు అవినీతికి బీసీలకు ఏం సంబంధం? అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబే. బాబు పాలనలోని ప్రతి అవినీతిపైనా విచారణ జరిపిస్తాం. అచ్చెన్నాయుడు అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డు మీదకు రావాలి. గతంలో బీసీ ఎమ్మెల్యే అయిన నన్ను టార్గెట్ చేయలేదా? – అనిల్‌కుమార్‌యాదవ్, మంత్రి సిగ్గు లేకుండా విమర్శలా? ఆధారాలతో దొరికాడు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబును, లోకేశ్‌ని లోపలేయించేవారు. త్వరలో చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై సీబీఐ విచారణజరుగుతుంది. – ఆర్కే రోజా, నగరి ఎమ్మెల్యే చట్టం తన పని తాను చేసుకుపోతుంది .. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే, ఓర్వలేని ఓ ఆంబోతు, ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మాగాంధీనా, లేక పూలేనా? ఈఎస్ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలి? స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములే. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర ఎంత అనేది ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు ఓ అంబేడ్కర్, ఓ పూలేలా అవతరించారు. – శంకరనారాయణ, రాష్ట్ర మంత్రి చట్ట ప్రకారమే.. అచ్చెన్నాయుడు అరెస్ట్ చట్ట ప్రకారం జరిగింది. ఈఎస్ఐలో భారీ కుంభకోణం, రూ.కోట్ల అవినీతిపై విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. చట్టం ముందు అందరూ సమానులే. కులాలతో సంబంధం లేదు. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు.. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీలను అణగదొక్కుతున్నారనడం సిగ్గుచేటు. అయిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్ట్ చేసినప్పుడే జనం హర్షిస్తారు. – బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే కుంభకోణం సూత్రధారి అచ్చెం ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ప్రధాన సూత్రధారుడని ఏసీబీ విచారణలో తేలింది. పేదల వైద్యానికి చెందాల్సిన సొమ్మును తిన్న వ్యక్తిని వెనకేసుకొస్తున్న బాబు పచ్చి దుర్మార్గుడు. –కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే కులాన్ని ఆపాదించడం తగదు ప్రతి దానికి చంద్రబాబు కులం రంగు పులమటం తగదు. చేసిన తప్పు నుంచి తప్పించుకొనేందుకు బీసీ ప్రస్తావన చంద్రబాబు తెస్తున్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారు. బీసీలకు చంద్రబాబు శనిలా దాపురించారు. – కె.పార్థసారథి, ఎమ్మెల్యే -
‘అవినీతిలో టీడీపీ నేతలు సిద్ధహస్తులు’
సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనంతా అవినీతిమయంగా సాగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్ధహస్తులు లేరన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతున్నారు. అచ్చెంన్నాయుడు అవినీతిని ఆధారాలతో సహా సేకరించిన తర్వాతే ఏసీబీ అధికారులు తమ విధులు నిర్వహిస్తూ.. చట్ట ప్రకారం వెళ్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డును వాడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు. ఇది టీడీపీ నైజమని.. కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారని నిర్ధారణ అయ్యింది కాబట్టే అరెస్ట్ చేశారని.. దానికి బీసీ కార్డును వాడాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. మధ్యలో కుల ప్రస్తావన తీసుకురావడం సరైనది కాదన్నారు. ఈ ఒక్క ఘటనతోనే అయిపోలేదని.. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టను బయటకు తీసేందుకు సీబీఐ విచారణ జరిపించాలని నిన్నటి క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు.(అచ్చెన్న అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం?) తప్పుచేశారు కాబట్టే అరెస్ట్: అనిల్‌కుమార్ యాదవ్ అచ్చెన్నాయుడు అవినీతికి, బీసీలకు ఏం సంబంధం అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారనే ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలను 30 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన ప్రతి పనిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరిగితే వారికి శిక్ష తప్పదన్నారు. తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదు: ఆర్కే రోజా విజయవాడ: అచ్చెన్నాయుడు అవినీతి ఆధారాలతో దొరికాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ స్కాం జరిగిందని విజిలెన్స్, ఏసీబీ విచారణలో తేలిందన్నారు. త్వరలోనే చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుందన్నారు. అడ్డగోలుగా దోచుకున్న తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదన్నారు. తన అవినీతి బయటపడుతుందనే కారణంతో చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వలేదన్నారు. అరెస్ట్‌లు చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.. కర్నూలు: గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారని.. అందుకే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు హయాంలో రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. అవినీతిని బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అచ్చెన్నాయుడు టెలీ సర్వీస్, ఆర్సీ నాన్ ఆర్సీ ద్వారా అవినీతికి పాలడ్డారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని జయరాం పేర్కొన్నారు. చట్టం ముందు అంతా సమానమే: ఇక్బాల్ అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను సమర్థిస్తున్నానని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని.. కోట్ల రూపాయల అవినీతి పై విజిలెన్స్ ఆధారాలు సేకరించిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టానికి కులాలు, మతాలతో సంబంధంలేదని చెప్పారు. ఏసీబీ విచారణకు టీడీపీ సహకరించాలని ఇక్బాల్ కోరారు. అచ్చెన్న అరెస్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం గుంటూరు: అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.10 వేల కోట్లు చొప్పున కేటాయిస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని, మత్స్యకారులను తాట తీస్తామంటూ బీసీలను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని విడదల రజని అన్నారు. -
మత్స్య సంపద పెంచేందుకే వీటి ఏర్పాటు: మంత్రి
సాక్షి, నెల్లూరు: కేంద్రం సహకారంతో జువ్వలదిన్నె వద్ద రూ. 280 కోట్లతో ఫిషింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెంచి మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి) తీరంలోని 9 జిల్లాల్లో మత్స్య సంసపదను పెంచేందుకే ఈ సెంటర్లను ఏర్పాటు అని ఆయన తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. మత్స్య, ఆక్వా రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఫిషింగ్ హర్భర్‌కు అనుబంధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాజ్యోతిగా మారారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.40వేల కోట్లకు పైగా ఖర్చుచేశారని తెలిపారు. ‘‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. దేశానికే ఆదర్శప్రాయ సీఎంగా నిలిచారు. రాష్ట్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని’ ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. సీఎం వైఎస్ జగన్ చేస్తోన్న సంక్షేమ పాలనను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని..ఆయనపై విమర్శలు చేసేందుకే మహానాడు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. మహానాడు వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పన్నులు పెంచామని దుష్ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతలు దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మోపిదేవి ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే సంస్కృతి చంద్రబాబుదేనని నిప్పులు చెరిగారు. మహానాడులో తీర్మానాలను చూస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు.(చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: అవంతి శ్రీనివాస్) చెత్త వార్తలు రాయొద్దు.. రాష్ట్రం దివాళా అంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. చెత్త వార్తలు రాయొద్దని.. ప్రజలకు పనికొచ్చే వార్తలు రాయాలని ఆయన హితవు పలికారు. రెండున్నర లక్షల కోట్లు చంద్రబాబు అప్పులు చేశారని.. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టింది ఆయనేనని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పాలనపై ప్రజాక్షేత్రంలో టీడీపీతో చర్చకు సిద్ధమని మంత్రి మోపిదేవి సవాల్ విసిరారు. తమతో చర్చించేందుకు సిద్ధమా.. కాదా అనేదానిపై టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ధర 3.5 పైసలు నుంచి 4.85 పైసలకు పెంచుతూ పీపీఏలను చంద్రబాబు కుదుర్చుకున్నారన్నారు. ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. (ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్) రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.. కరోనా నియంత్రణకు సీఎం జగన్ చర్యలను దేశమంతా మెచ్చుకుందన్నారు. ప్రచార్భాటానికి దూరంగా కరోనాపై చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే టీటీడీ ఆస్తులను అమ్మాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని.. గతంలో జరిగిన వాస్తవాలను సుబ్రహ్మణ్యం స్వామి బయట పెట్టారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించింది చంద్రబాబేనని.. వాటి గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. కులం,మతం,పార్టీలు చూడకుండా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మోపిదేవి పేర్కొన్నారు. చంద్రబాబువి నీచరాజకీయాలు రైతులకు కులాలు అంటగట్టే నీచ రాజకీయానికి చంద్రబాబు పూనుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే రైతుల ముసుగులో టీడీపీ నాయకులతో చంద్రబాబు కేసులు వేయించారని గుర్తు చేశారు. ఎప్పుడెప్పుడు సీఎం పదవి వస్తుందా అంటూ బాలకృష్ణ కలలు కుంటున్నారని.. తన బావను ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బాలకృష్ణ భ్రమలో బతుకుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. -
సీఎం జగన్ ఏడాది పాలన..సంక్షేమ పాలన
-
వాలంటీర్ వ్యవస్థ సేవలు వెలకట్టలేనివి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన పరిపాలనకు స్వీకారం చుట్టారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని మోపిదేవి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో 46 వేల కోట్లు ఖర్చు చేసి 3 లక్షల మంది లబ్దిదారులకు వివిధ పథకాలు అందించామని ఆయన అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) అదే విధంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ఏడాదిలో 3 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామని ఆమె చెప్పారు. కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ సేవలు వెల కట్టలేనివని మంత్రి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చామని మేకతోటి సుచరిత అన్నారు. (సీఎం జగన్ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’) ఏడాది పరిపాలనను ప్రజా పరిశీలనలో పెట్టిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పరిపాలనలో రాజకీయాలు ఉండవని సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. -
ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడింది
సాక్షి, గుంటూరు: కోవిడ్-19 నివారణ చర్యలు చేపట్టడంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కరోనా ప్రభావంతో అన్ని రకాల వ్యవస్థలు స్థంభించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ యోజన' కింద రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మందికి ప్రభుత్వం నగదు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ప్రారంభం నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పంట వేసిన నాటి నుంచి దాన్ని అమ్మేవరకు సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన మాటపై ప్రభుత్వం నిలబడిందని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లను కేటాయించిన ఘనత సీఎం జగన్‌ది అని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను కేంద్ర బృందం సైతం అభినందించిందన్నారు. (‘రైతు భరోసా’ నగదు జమ) టీడీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది "నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మడం సహజమే. ఇదేమీ కొత్తకాదు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సమంజసం కాదు. గత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూములను అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. సదావర్తి భూముల విషయంలో టిడిపి దిగజారుడుతో వ్యవహరించింది. చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుని సింగపూర్ సంస్థలకు అప్పగించారు. అభివృద్ది పేరుతో భూములను అమ్మడం అనే అంశం పై టీడీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భూముల విషయంలో గత ప్రభుత్వ అవినీతి తవ్విన కొద్ది బయటపడుతుంది" అని మోపిదేవి వెంకటరమణ అన్నారు. (‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్) -
ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు నిర్ణయిస్తున్న విధంగానే రొయ్యలు, చేపలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించనుందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు. మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులు సాగు ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందన్నారు. ఇదే తరహాలో రొయ్యలు, చేపలకు మద్దతు ధరను ప్రకటించనుందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. త్వరలో ఆక్వా అథారిటీ ► రొయ్యలు, చేపల ధరలు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాం. ఆక్వా ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పిస్తాం. ► చేపలు, రొయ్యల పెంపకాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తాం. ఆక్వా అథారిటీ ఏర్పాటు చేస్తాం. ఇది పొగాకు బోర్డు తరహాలోనే ఉంటుంది. ► లాక్‌డౌన్‌తో ఆక్వా రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడంతో రైతులు లబ్ధి పొందారు. ఎమ్మెల్యేలతో సమీక్ష చేపల రైతులు, చేపల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మంత్రి మోపిదేవి సమీక్ష జరిపారు. వ్యాపారులు ప్రతి క్వింటాల్‌కు 5 కేజీలు అదనంగా చేపలను కాటా వేస్తున్నారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని రైతులు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మోపిదేవి చెప్పారు. ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, సింహాద్రి కృష్ణప్రసాద్, పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. భారీగా పంటల సేకరణ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పంటల సేకరణ జరిపిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రూ.1400 కోట్ల విలువ చేసే కందులు, శనగలు, మొక్కజొన్న, పసుపు పంటలను కొనుగోలు చేసిందన్నారు. టమాటా, అరటి, బత్తాయి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుందన్నారు. -
‘అప్పుడు గుర్తుకు రాలేదా బాబూ..’
సాక్షి, విజయవాడ: దేశంలోనే ఆక్వా ఉత్పత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలన్ని అస్తవ్యస్తమయ్యాయని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుందని తెలిపారు. ఆక్వా ఉత్తత్తి చేసే రైతులందరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించిన అనుమతులు లేకపోవడంతో ఆక్వా మెరైన్ ఎక్స్‌ఫోర్ట్ ఇండియా ఛైర్మన్‌ను పిలిపించి మాట్లాడారని తెలిపారు. (అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించాలి) త్వరలో ఆక్వా ఆథారిటీ ఏర్పాటు.. గిట్టుబాటు ధరను కల్పించిన ముఖ్యమంత్రికి ఆక్వా రైతులు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్వా, ఫిషరీష్ రోజుకు 250 లారీలు ద్వారా ఎగుమతులు అయ్యేవని.. అవి 50 లారీలకు ఎగుమతులు పడిపోయాయని వివరించారు. సీఎం చొరవ చూపి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్కెట్లు తెరిపించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆక్వా, ఫిష్ కల్చర్, మెరైన్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆక్వా ఆథారిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. (కరోనా: 17 వేల మంది ఖైదీల విడుదల) అప్పుడు రానివి.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా..? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి ధ్వజమెత్తారు. కాకినాడలో భూసేకరణ చేసే చోట చంద్రబాబు టిట్కో ద్వారా ఇళ్లు నిర్మించారని.. అప్పుడు గుర్తుకు రాని మడ అడవులు ఆయనకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలపై టీడీపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. -
ఆక్వా రైతుపై మరో పిడుగు
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులపై మేత రూపంలో మరో పిడుగు పడింది. బహుళ జాతి సంస్థలు వారం రోజుల క్రితం అమాంతం ఫీడ్ ధరలు పెంచేశాయి. కేజీకి రూ.6 వరకు ధర పెరగడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడుతోంది. సీజన్ ప్రారంభానికి ముందే ధరలను పెంచేసిన కంపెనీలు.. మేత కొనుగోళ్లు ఊపందుకున్న తరువాత ఇంకా పెంచేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీడ్ ధరను నియంత్రించినా.. ► సీజన్ ఆరంభంలో రొయ్య పిల్ల (సీడ్) రూపంలో ఆక్వా రైతులకు సమస్య ఎదురైంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని హేచరీలు, రైతులతో సమావేశం నిర్వహించి ఒక్కో రొయ్య పిల్లకు 30 నుంచి 35 పైసల్లోపు ధర నిర్ణయించింది. ► ఇందుకు విరుద్ధంగా అమ్మకాలు జరిపే హేచరీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించడంతో హేచరీల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సీడ్ విక్రయిస్తున్నారు. ► అయితే, బహుళ జాతి సంస్థలు ఫీడ్ ధరలు ఉన్నట్టుండి పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం ► రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో 26 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలకు కలిపి 10 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం అవుతుంది. ► మేతను ఉత్పత్తి చేసే సంస్థల్లో 70 శాతం థాయ్‌లాండ్‌కు చెందిన బహుళ జాతి కంపెనీలు, 30 శాతం స్థానిక కంపెనీలు ఉన్నాయి. రైతుల్లో ఎక్కువ మంది బహుళ జాతి కంపెనీల మేతనే కొనుగోలు చేస్తున్నారు. ► రైతులపై భారం తగ్గించేందుకు మేత కంపెనీలతో సంప్రదింపులు జరిపి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పీఆర్ మోహన్‌రాజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తగ్గించేవిధంగా సంప్రదింపులు ఫీడ్ ధరల తగ్గించే దిశగా బహుళ జాతి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నాలుగేళ్లుగా ధరలు పెంచలేదని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల వివరణ ఇందుకు విరుద్ధంగా ఉంది. రెండువర్గాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ధరలపై నిర్ణయం తీసుకుంటాం. ఆక్వా రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. – మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర పశు, మత్స్య శాఖ మంత్రి -
వారిని రాష్ట్రానికి తీసుకొస్తాం: మంత్రి మోపిదేవి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని కాసిమేడ్ ప్రాంతంలో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆందోళన పడొద్దని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వారిని స్వస్థలాలకు చేరుస్తామని పేర్కొన్నారు. రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. (ఏపీలో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు) గుజరాత్లో చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు. వారి కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు. (విదేశాంగమంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ) -
మత్స్యకారులకి మహర్ధశ
సాక్షి, అమరావతి: రాష్ట్ర మత్స్యకారులెవరూ ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదని.. రెండున్నర, మూడేళ్ల వ్యవధిలో ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ,అధికారులు హాజరయ్యారు. 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది. మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. గుండాయిపాలెం(ప్రకాశం), అంతర్వేది,ఓడలరేవు (తూర్పుగోదావరి)కు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని.. ఇప్పుడు దాదాపు రూ.3 వేల కోట్ల ఖర్చు చేసి 8 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ కట్టబోతున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలతో మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం – మేజర్ ఫిషింగ్ హార్బర్, శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో– ఫిష్ ల్యాండ్ నిర్మాణం. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్ ఫిషింగ్ హార్బర్, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో – మేజర్ ఫిషింగ్ హార్బర్ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం – మేజర్ ఫిషింగ్ హార్బర్ కృష్ణాజిల్లా మచిలీపట్నం – మేజర్ ఫిషింగ్ హార్బర్ గుంటూరు జిల్లా నిజాంపట్నంల – మేజర్ ఫిషింగ్ హార్బర్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం – మేజర్ షిఫింగ్ హార్బర్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె – మేజర్ ఫిషింగ్ హార్బర్ -
వారందరినీ రాష్ట్రానికి తీసుకొస్తాం : మంత్రి మోపిదేవి
సాక్షి, అమరావతి : గుజరాత్లో చిక్కుకున్న 4 వేల మంది మత్స్యకారులను త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 65 బస్సుల్లో వారందరినీ రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరినీ ప్రభుత్వమే సొంత గ్రామాలను తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల గురించి సీఎం జగన్ జగన్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎంలతో మాట్లాడారని, వారి అనుమతితో అందరికి రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సొంత గ్రామాలను చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీఎం జగన్ ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే గుజరాత్‌కు 54 బస్సులు బయల్దేరాయని, మరో కొద్ది గంటల్లో మిగిలిన బస్సులు కూడా వెళ్తాయని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న అందరినీ క్వారంటైన్‌కు తరలించి గడువు ముగిసిన తర్వాతనే ఇళ్లకు పంపిస్తామని పేర్కొన్నారు. -
కరోనా టెస్టులు: దేశంలోనే ప్రథమ స్థానం..
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా సమాచారం గురించి వివరాలు అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని.. గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక కోవిడ్-19 పరీక్షల నిర్వహణలో అధిక సగటు నమోదుతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సగటు 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే దేశంలో మరణాల రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే.. ఏపీలో 2.46 శాతం అని వెల్లడించారు. ఇక ఈ కేసులన్నీ కూడా కంటైన్మెంట్ జోన్లనుంచే వస్తున్నాయని స్పష్టం చేశారు. అదే విధంగా శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్‌లు సిద్ధం అవుతున్నాయని... విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ల్యాబ్‌ల ఏర్పాటుపై కూడా దృష్టిపెడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు స్పందించిన అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు.(ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు) వ్యవసాయం అనుబంధ రంగాలపై సమీక్ష రాష్ట్రంలోని వివిధ పంటల మార్కెటింగ్, ధరలు అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మొక్కజొన్న, శెనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చించారు. బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా? మన రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా? అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి? వాటి ధరలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి వివరాలతో రావాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎక్కడ రైతులకు ఇబ్బందులు వచ్చినా.. అక్కడ జోక్యం చేసుకుని రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అగ్రి ప్రాసెసింగ్‌లో సమస్యలు చాలా వరకు తొలగిపోయాయన్న అధికారులు... ఫాంగేట్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు స్టెబిలైజ్ అవుతుందని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్యపిల్లల కొరతపై సమావేశంలో చర్చకు రాగా.. ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చిక్కుకుపోయాం.. ఆదుకోండి
సాక్షి, ముంబై: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ముంబైకి సమీపంలో చిక్కుకుపోయి నానా అగచాట్లుపడుతున్నారు. థాణే జిల్లా లోని ఉత్తన్ తీరప్రాంతంలో ఉన్న వీరంతా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సుమారు నాలుగు నెలల కిందట కళింగపట్నం, కపాసుకుద్ది, ఇద్దివానిపాలెం, కళింగపట్నం కుసుకుంపురం తదితర ప్రాంతాల నుంచి సుమా రు 200 మంది ముంబైకి సమీపంలోని ఉత్తన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనుల్లేవని, లాక్డౌన్ కారణంగా ఇంటికొచ్చే అవకాశమూ లేకుండాపోయిందని ఆందోళన చెందుతున్నారు. తమలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని.. మందులు కూడా లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారు పడుతున్న వెతలను ‘సాక్షి’తో చెప్పుకున్నారు. మమ్మల్ని ఇంటికి చేర్చండి.. మమ్మల్ని ఎలాగైనా మా గ్రామాలకు చేర్చండి. ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. మా కుటుంబ సభ్యులు కూడా∙ఆందోళనలో ఉన్నారు. – ఇద్ది దుర్యోదన్ ఒక పూటే తింటున్నాం.. ఇక్కడ పనులు కూడా లేకపోవ డంతో ఒక పూటే తింటున్నాం. ఒక నెల పాటు బాగానే ఉన్నా.. లాక్డౌన్ పొడిగించడంతో కష్టాలు మొదలయ్యాయి. – మద్దు మోహన్‌రావు ఏపీకి తీసుకొస్తాం.. ముంబైలో చిక్కుకున్న మత్స్య కారులను ఏపీకి తెచ్చే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ముంబై సమీపంలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్య కారులనూ రాష్ట్రానికి తీసుకొస్తాం. – మంత్రి మోపిదేవి వెంకటరమణారావు -
కరోనా కేసుల వ్యాప్తి వెనుక టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ నాయకత్వం, కార్యకర్తలు కుట్ర చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆరోపించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తికి స్లీపర్ సెల్స్‌ను ప్రవేశపెడుతున్నారని, ఏ విధమైన ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఇటీవల పెరుగుతున్న కరోనా కేసుల వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారనే అనుమానం తమకు ఉందన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారన్నారు. విపత్కర పరిస్థితుల్లో టీడీపీ రాజకీయ కోణంలో విమర్శలు చేస్తోందన్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారాన్ని కూడా రాజకీయం చేశారని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారని, ఆయన రావడం వల్లే రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని టీడీపీ ఆరోపణలు చేయడం హేయమన్నారు. ఏ విధమైన కరోనా లక్షణాలు లేని వ్యక్తిపై విమర్శలు చేయడం చంద్రబాబు చిల్లర రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. -
సీఎం జగన్ ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైంది
-
సముద్ర మార్గం ద్వారా తీసుకురావడానికి...
-
విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో ఫోన్లో మాట్లాడారు. గుజరాత్లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన గురువారం గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అలాగే మత్స్యకారులను తరలించేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా పొట్టకూటి కోసం వలస వెళ్లి గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని సీఎం జగన్ ఈ నెల 21న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విజయ్ రూపానీ తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మత్స్యకారులుని రాష్ట్రానికి రప్పిస్తాం విజయవాడ: గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి రప్పిస్తామని మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైందన్నారు. గుజరాత్లో ఉన్న 5000 మంది మత్స్యకారులను ప్రత్యేక బోటులలో రప్పిస్తున్నట్లు చెప్పారు. సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. -
రెడ్‌జోన్ ప్రాంతాల్లో నాలుగో విడత సర్వే
సాక్షి, అమరావతి బ్యూరో: రెడ్ జోన్ ప్రాంతాల్లో నాలుగో విడత ఇంటింటి సర్వే చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈ సర్వేలో ఒక డాక్టర్ ఉంటారని, ఎవరికైనా కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేస్తామని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లో హోం మంత్రి మేకతోటి సుచరిత, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యే మద్దాళి గిరి, కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్‌లతో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ జిల్లాల్లో ఎక్కువ టెస్టులు చేసేందుకు వీలుగా క్లియా మిషన్లు పంపాం. వాటితో రోజుకు దాదాపు వెయ్యికిపైగా టెస్టులు చేయవచ్చు. ► రెడ్జోన్లలో ఫీవర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం. క్వారంటైన్ సెంటర్లపై ఉన్న అపోహలు తొలగించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ► రెడ్జోన్లలో సూపర్ శానిటేషన్ జరిపిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులతోపాటు కోవిడ్ సేవల్లో పాల్గొంటున్న వారందరికీ భద్రతా పరికరాలు అందజేస్తున్నాం. ► రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు: మోపిదేవి ► ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ మాజీ సీఎం చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. తనకు అవకాశం ఇస్తే కరోనాను చాపచుట్టేస్తానని చెప్పడం హాస్యాస్పదం. ఆయన సామర్థ్యం తెలిసే ప్రజలు పక్కన పెట్టారు. ► రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి: హోం మంత్రి సుచరిత ► ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు విధాలుగా కృషి చేస్తోంది. ► డ్వాక్రా మహిళల వడ్డీ మాఫీ కోసం రూ. 1,100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. -
అక్వా రైతులను సైతం ప్రభుత్వం ఆదుకుంటుంది
-
చంద్రబాబు సామర్థ్యం చూశారు కాబట్టే..
సాక్షి, గుంటూరు : కరోనా వైరస్‌పై తనను సలహాలు అడగడం లేదనే ధోరణితో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడారని, ఆయన సామర్థ్యం చూశారు కాబట్టే ప్రజలు టీడీపీని చాపలో చుట్టి పక్కన పడేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. కరోనా నివారణ కోసమే కాకుండా ప్రజల భద్రతపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో నష్ణపోయిన రైతును ఒక్కరినైనా చంద్రబాబు చూపిస్తారా అని ప్రశ్నించారు. ప్రతీ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకుంటోందని, స్విట్జర్లాండ్‌కు మామిడి ఎగుమతులను కూడా ప్రారంభించామని చెప్పారు. ( సీఎం గారూ.. నా భర్త చివరి కోరిక నెరవేర్చండి ) ఆక్వా రైతులను సైతం ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. ఇన్ని రకాల చర్యలు తీసుకుంటూ చంద్రబాబులాగా హైటెక్ ప్రచారాలకు ముఖ్యమంత్రి పోలేదన్నారు. సీఎం జగన్ తీసుకున్న చర్యల పై ఎప్పుడైనా చర్చించడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి కష్టకాలంలో ముఖ్యమంత్రి పరిపాలనను స్వాగతించాలి కానీ, రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ( కరోనాపై పోరులో మరో చీకటి కోణం ) ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : హోంమంత్రి సుచరిత కరోనానుండి బయటపడేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత కోరారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా కరోనా నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. -
ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలి
-
‘అందరికి ఒకే న్యాయం.. ఎవరికి మినహాయింపు లేదు’
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే 14 రోజులు క్వారంటైన్లో ఉండి రావాల్సిందేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. శనివారం ఆయన మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా తగిన సలహాలు ఇవ్వకుండా హైదరాబాద్‌లో కూర్చొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార యంత్రాంగం తలమునకలై పనిచేస్తున్నారన్నారు. రైతులకు నష్ట్రం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఆక్వా రంగానికి కనీస ధర నిర్ణయించామన్నారు. ఆక్వా ఫిషరీస్ రంగాలపై వచ్చిన నష్ట్రాలపై రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక అందజేస్తామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. -
‘బాబు.. ఇక్కడికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి ’
సాక్షి, గుంటూరు : స్వీయ నియంత్రణ ద్వారానే కరోనావైరస్ను నియంత్రించగలమని, ప్రజలు అది అర్థం చేసుకొని లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంచి సహకరించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు, వైద్య, రెవెన్యూ ఇలా అన్ని శాఖలు కరోనా కట్టడిడి అహర్నిశలు కష్టపడుతున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు కావాల్సింది రాజకీయమే కానీ, ప్రజల బాగోగులతో ఆయనకు పనిలేదని విమర్శించారు. ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోయి.. హైదరాబాద్‌లో ఉండి వాలంటీర్లపై తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను చైతన్య పరచడంలో వాలంటీర్లు కీలక పాత్ర పొషిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఇక్కడి వచ్చి ప్రజల్లో తిరిగితే వాస్తవాలు ఏంటో తెలుస్తాయన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. నిరుపేదలకు రేషన్, రూ. వెయ్యి సాయం చేశామని గుర్తుచేశారు. -
ప్రభుత్వ ఆంక్షలను ప్రజలు కచ్చితంగా పాటించాలి
-
'ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'
సాక్షి, అమరావతి : కరోనా ప్రభావం ఆక్వారంగంపై పడకుండా చూస్తున్నామని, అనవసరంగా దళారుల మాటలు నమ్మి ఆక్వా రైతులెవరు మోసపోవద్దని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఎగుమతిదారులతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఆక్వా ఉత్పత్తులకు ధరలు కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆక్వాజోన్లలో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మోపిదేవి తెలిపారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం రాజకీయ విమర్శలు చేయడం దారుణమని తెలిపారు. గ్రామస్థాయిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీపుకుంటున్నామన్నారు. హార్వెస్టింగ్ యంత్రాలకు, కూలీలకు ఇబ్బందులు కలిగించొద్దని ఆదేశాలిచ్చామన్నారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లొద్దని కన్నబాబు తెలిపారు. -
ఆక్వా రైతుల్లో ఆత్మస్థయిర్యం కల్పించాం
-
‘ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్’
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు కరోనా నివారణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు అభద్రతాభావంతో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తులపై ధరలను నిర్ణయించిందన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లలో వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచవాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ‘వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. రైతులు పండించిన పంటలు, ఆక్వా రంగం ఉత్పత్తులకు నష్టం రాకుండ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమెరికా వంటి దేశాలు కరోనా వలన కుదేలైపోయాయి. కరోనా వైరస్ వలన గ్రామాలు కొన్ని కట్టుబాట్లు చేసుకోవడం వలన రైతులకు కొనుగోలుదారులు కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అటు వంటి గ్యాప్ లేకుండా, రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలపై ఎమ్పెడ్ కంపెనీ ప్రతినిధులు తో సీఎం సంప్రదింపులు జరిపారు’ అని మోపిదేవి తెలిపారు. ఆ రంగానికి మంచి భవిష్యత్ ఎగుమతులుపై చైనా ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తుంది. 2830 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు నాలుగు రోజుల్లో ఎగుమతి చేశాము. సోమవారం నుంచి ఫీల్డ్ కు వెళ్లి ఎక్సపోర్ట్స్ మీద ఒత్తిడి తెచ్చి వాస్తవ ధరకే కొనుగోళ్లు జరిగేలా చూస్తాము. ఆక్వా ఉత్పత్తులు కు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది. ధరలు తగ్గిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తాము. మిడిల్ మ్యాన్ వ్యవస్థ చాలా ప్రమాదకరమైనది. దళారి వ్యవస్థ లేకుండా చేస్తున్నాము. ఆక్వా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. రైతుల్లో అభద్రతా భావం వద్దు. పాజిటివ్ కేసులు పెరగడం వలనే నిత్యావసర కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితే సమయంలో సడలింపు ఇస్తాము. గ్రామాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతుంది. పట్టణాల్లో కొంత మార్పు రావాల్సి ఉంది’ అంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ వివరించారు. చదవండి: నోట్లతో ముక్కు తుడుచుకున్న వ్యక్తి అరెస్టు 'కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలి' -
ఆక్వా రంగానికి మంచి భవిష్యత్ ఉంది
-
మంత్రి మోపిదేవితో స్పెషల్ డిబేట్
-
ఆక్వా ఉత్పత్తులకు ముందే ధరల నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఆ ఉత్పత్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయించారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. వీటి ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వీటి ధరలను ప్రకటించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్ణయం తీసుకోలేదని, ఇదే మొదటిసారని వెల్లడించారు. ఆక్వా, పౌల్ట్రీ, పాడి రంగాలపై తీసుకున్న నిర్ణయాలను శనివారం సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు. సమీక్షలో వ్యవసాయశాఖ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖర్, ఎంపెడా జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మోపిదేవి తెలిపిన వివరాలివీ.. - ఈనెల 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. - కరోనా వైరస్ కారణంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. - రాష్ట్రంలోని మొత్తం ఆక్వా ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. - రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని కలిగిస్తున్న ఈ రంగ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. - ఎగుమతులకు ఆటంకం కలగకుండా చూస్తాం. ఐదారు రోజులుగా ఆక్వా రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సమీక్షిస్తున్నాం. - కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎగుమతిదారులను సీఎం అభినందించారు. - కరోనా పేరు చెప్పి దళారులు రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. వీరిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఎంపెడాకు అప్పగిస్తున్నాం. - ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన ఎక్స్‌పోర్టు ఇన్స్పెక్షన్ అథారిటీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. - మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌ను ప్రతీ జిల్లాకు నోడల్ అధికారిగా నియమించాం. - విదేశాల నుంచి మేత తయారీకి సంబంధించిన ముడిపదార్థాల దిగుమతికి వీరు సహకరిస్తారు. - చికెన్, గుడ్లు మార్కెట్ల్లో అమ్ముకోడానికి రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నాం. - సీఎం సహాయ నిధికి పౌల్ట్రీ రంగం రూ.60 లక్షలు అందజేసింది. -
ఆక్వా, పౌల్ట్రీ రంగాల ఉత్పత్తులకు..
-
అడకత్తెరలో ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. లాక్డౌన్.. ఆక్వా ఫీడ్ సరఫరా, రవాణాకు తీవ్ర ఆటంకంగా నిలిచింది. ఆక్వా ఫీడ్, మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల రవాణా, పంపిణీ లేక చేపలు, రొయ్యల చెరువుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రవాణాకు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ వైరస్ భయంతో యువకులు తమ ఊళ్లలోకి లారీలను అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. - గ్రామాల్లో గుండా వాహనాలను అనుమతించకపోవడంతో రొయ్యలు పట్టేందుకు, వాటి తలలు తీసేందుకు కూలీలు కరవయ్యారు. ఫలితంగా రొయ్యల కంపెనీల యజమానులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఆక్వా పంట అంతా చెరువుల్లోనే ఉండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. - గతంలో రొయ్యలు తీసుకువెళ్లేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు, రొయ్యల కంపెనీల యజమానులు లారీలను పంపేవారు. ఇప్పుడు సరకును తమ కంపెనీల వద్దకే తెమ్మంటున్నారు. అయితే.. గ్రామాల్లోని ప్రజలు, పోలీసులు ఇందుకు అంగీకరించడం లేదు. - తయారీకి అవసరమైన ముడిపదార్థాలు, మైదా, సోయా, చేప మాంసం, విటమిన్లు వేర్వేరు ప్రాంతాల నుంచి రావాల్సి ఉండడంతో లారీలు రాక మేత తయారీ ఆగిపోయింది. దీంతో చేపలు, రొయ్యలు మేత కోసం అల్లాడుతున్నాయి. రొయ్యల కౌంట్, చేపల బరువు తగ్గిపోతున్నాయి. - హేచరీలు ఉత్పత్తి చేసిన రొయ్య పిల్లలను బయటకు పోనివ్వకపోవడంతో యజమానులు వాటిని సముద్రం పాల్జేస్తున్నారు. రైతులు కోరుతున్నదేమిటంటే.. - సీఎం చొరవ చూపి గ్రామ వలంటీర్ల ద్వారా చేపలు, రొయ్యల రవాణా, మేతల పంపిణీకి చర్యలు చేపట్టాలి. - మేతలు, ముడి పదార్థాలు, కూలీలు, ట్రాలీలను ఊళ్లలోని రహదారుల గుండా చేపల చెరువుల వద్దకు వచ్చేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఆక్వా సంఘాల రైతులతో నేడు సీఎం సమావేశం మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. వైరస్ ఇతర ఇబ్బందులు లేకపోతే తమ పంటను రైతులు హార్వెస్ట్ చేయొద్దని సూచించారు. ఆక్వా రైతు సంఘాల నాయకులతో శనివారం సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారని, వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. పతనమవుతున్న వనామీ ధర! - రాష్ట్రంలో దాదాపు ఏటా 80 లక్షల హెక్టార్లలో వనామీ సాగు జరుగుతోంది. - నాలుగు నెలల కాల వ్యవధిలో ఈ పంటను సాగు చేయడానికి రైతులు ఎకరానికి రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేస్తారు. - అన్నీ సవ్యంగా ఉంటే రైతులు ఎకరాకు ఆరేడు లక్షల రూపాయల వరకు లాభాన్ని పొందుతారు. - అదే వనామీ నేడు రైతులకు రెండు లక్షలకుపైగా నష్టాన్ని కలిగిస్తోంది. ‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ మాదిరిగా వనామీ రేటు పతనానికి కోవిడ్ వైరస్, రొయ్యలకు సంక్రమిస్తోన్న వైట్‌స్పాట్ వ్యాధి, ప్రాసెసింగ్ ప్లాంట్ల మూసివేత, ఎగుమతులు లేకపోవడం వంటివి కారణమవుతున్నాయి. - కార్మికుల కొరత, ఎగుమతులు లేకపోవడంతో ప్రాసెసింగ్ ప్లాంట్లను నిర్వాహకులు మూసివేశారు. - దీంతో రొయ్యలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వైట్‌స్పాట్, ఇతర వైరస్లు సోకిన రొయ్యల్ని అమ్ముకోవడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలకు 100 కౌంట్ రొయ్యను రూ.100లోపే అమ్మేస్తున్నారు.