
సాక్షి, గుంటూరు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కొన్ని సందర్భాలలో కోర్టులో కూడా నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తూ తీర్పులు అనుకూలంగా రావటం బాధాకరమన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు యూటర్న్.. వ్యూహకర్త నియామకం)